26 Mar 2023
నిఖత్ జరీన్ గోల్డన్ పంచ్.. రెండోసారి టైటిల్ కైవసం
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్‌లతో దుమ్ములేపింది. ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి టైటిల్ ను ముద్దాడింది.
దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం
భారతదేశంలో గత 24 గంటల్లో 1,890 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది.
రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు
రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హుత వేటు వేడయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా 'సత్యాగ్రహ' దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి 36 ఉపగ్రహాలను మోసుకెళ్లే భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరిలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. వివిధ పాత్రల్లో కనిపించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.
25 Mar 2023
బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని కర్ణాటక ప్రజలు నిర్ణయించినట్లు ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. కర్ణాటకలోని దావణగెరెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం!
ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఏడాది దాటినా ఉక్రెయిన్‌ను రష్యా దళాలు స్వాధీనం చేసుకోలేకపోయాయి. ఈ క్రమంలో త్వరలో మాస్టర్ ప్లాన్‌తో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రష్యా భావిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న చర్చ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. 2019లో టీడీపీ అధికారం కోల్పోయినపుడు ఈ చర్చ ఎక్కువగా జరిగింది.
జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి కుదుళ్ళను బలంగా చేసే కొబ్బరి పాలు
కొబ్బరి పాలు అనగానే ఇదెక్కడ దొరుకుతుందోనన్న అభిప్రాయానికి వచ్చేయకండి. ఈ పాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా కొబ్బరితోనే. ముందుగా, కొబ్బరి పాల వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్
ఎల్‌బీ నగర్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఎల్‌బీ నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీ రామారావు శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ.32 కోట్లతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది.
సూర్యకుమార్‌కు అవకాశమిస్తే.. ప్రపంచకప్‌లో దుమ్మురేపుతాడు : యూవీ
టీ20ల్లో ప్రత్యర్థి బౌలర్లకు టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చుక్కలు చూపిస్తాడు. అయితే వన్డేల్లో మాత్రం విఫలమవుతూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్
తైవానీస్ టెక్ దిగ్గజం ASUS తన ROG ఫోన్ 7, ఫోన్ 7 అల్టిమేట్‌లను ఏప్రిల్ 13న గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేస్తుంది. త్వరలో భారతదేశానికి కూడా వస్తుంది.
త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, జర్మన్ మార్క్ వోక్స్‌వ్యాగన్ టైగన్‌ను MY-2024 అప్‌గ్రేడ్‌లతో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2021లో లాంచ్ అయిన వోక్స్‌వ్యాగన్ టైగన్ భారతదేశం-నిర్దిష్ట MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించబడిన మొదటి కారు.
శ్రీలంకను చిత్తును చేసిన న్యూజిలాండ్
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు భారీ నమోదు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ షిప్లే 5 వికెట్లతో విజృంభించాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్
మెడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌లకు ఈ కొనుగోలు మొదటి అడుగు.
విజయం వచ్చాక జాగ్రత్తగా ఉండకపోతే అపజయమే మిగులుతుంది
విజయం వచ్చాక నీ చుట్టూ చాలామంది చేరతారు. నిన్ను ఆకాశానికెత్తేస్తూ పొగడ్తలతో ముంచెత్తుతారు. నీకన్నా తీస్ మార్ ఖాన్ ఎవ్వరూ లేరని, రారని అంటుంటారు.
రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..?
తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆప్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. టీ20ల్లో పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్తాన్ విజయం సాధించడం ఇదే తొలిసారి. అయితే మ్యాచ్‌లో ఓడిపోయిన పాక్.. రెండో టీ20ల్లోనే ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది
స్వదేశీ బైక్‌మేకర్ బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ 220F తిరిగి ప్రవేశపెట్టింది. ఆ ధర దగ్గర ఐకానిక్ మోటార్‌సైకిల్ క్వార్టర్-లీటర్ స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్‌లో TVS అపాచీ RTR 200 4Vతో పోటీపడుతుంది.
తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిజాం కాలం నాటి నాణేలు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉపాధిహామీ కూలీలు తమ పనిలో భాగంగా తవ్వకాలు చేపట్టగా చిన్న మట్టి కుండలో పురాతన 27 వెండి నాణేలను గుర్తించారు.
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఒకసారి ప్లే చేయగల ఆడియో సందేశాలను పంపచ్చు. ఈ సదుపాయం ఇంకా అభివృద్ధిలో ఉంది, త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి తీసుకురానుంది.
మళ్ళీ థియేటర్లలోకి వస్తున్న ఇష్క్ సినిమా
ఇప్పుడంతా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల పర్వం నడుస్తోంది. అప్పట్లో హిట్ అయిన సినిమాలను ప్రేక్షకుల కోసం మళ్ళీ థియేటర్ లోకి తీసుకొస్తున్నారు. ఈ రిలీజ్ ల జాబితాలోకి యంగ్ హీరో నితిన్ కూడా చేరిపోయాడు.
దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?
క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది.
WPL: ఫైనల్‌లో ఢిల్లీ, ముంబై ఇండియన్స్.. గెలుపు ఎవరిదో..!
ఉమెన్స్ ప్రీమిమర్ లీగ్‌లో చివరి దశకు చేరుకుంది. తొలి కప్పును ఎలాగైనా కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాలని ఢిల్లీ, ముంబై జట్లు భావిస్తున్నాయి.
రావణాసుర ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే, ముహర్తం ఫిక్స్ చేసిన చిత్రబృందం
రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర చిత్ర ట్రైలర్ వచ్చేస్తోంది. సుధీర్ వర్మ దర్శకాత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్, మార్చ్ 28వ తేదీన సాయంత్రం 4:05గంటలకు రిలీజ్ కానుందని చిత్రబృందం ప్రకటించింది.
2023 MotoGP రేసును ఎక్కడ చూడాలో తెలుసుకుందాం
2023 MotoGP సీజన్ ఈ వారాంతంలో పోర్చుగీస్ GPతో ప్రారంభమవుతుంది. భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ థ్రిల్లింగ్ ప్రీమియర్-క్లాస్ ఛాంపియన్‌షిప్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఫ్యాషన్: మండు వేసవిలో కాళ్లకు సూట్ అయ్యే ఫుట్ వేర్
ఎండాకాలం వచ్చేసింది. పొద్దున్న ఏడింటికే ఎండ వేడి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి టైమ్ లో మనం వేసుకునే బట్టలు, తొడుక్కునే చెప్పుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
హెన్రీ షిఫ్లీ దెబ్బకు తోకముడిచిన శ్రీలంక
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ షిప్లే విశ్వరూపం ప్రదర్శించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో శ్రీలంక బ్యాటర్లను దెబ్బ కొట్టాడు.
శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ
పరువు నష్టం కేసులో సూరుత్ కోర్టు తీర్పు, లోక్‌సభలో అనర్హత వేటు, అధికార బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం నిప్పులు చెరిగారు. ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ
వినియోగదారులకు సురక్షితమైన సోషల్ మీడియా అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో, భారతదేశంలో ట్విటర్‌కు గట్టి పోటీనిస్తున్న కూ కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.
'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్నదని, 'సబ్ కా ప్రయాస్' ద్వారా ప్రతి ఒక్కరి కృషి ద్వారానే అది సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అరుదైన ఘనతను సాధించిన అఫ్గాన్ బౌలర్
టీ20ల్లో ఆప్ఘనిస్తాన్ బౌలర్ ముబీర్ ఉర్ రెహ్మాన్ అరుదైన ఘనతను సాధించారు. శుక్రవారం షార్జా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.
దసరా ప్రమోషన్స్: రావణాసురుడుతో ముచ్చట, బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు
నేచురల్ స్టార్ నాని, దసరా మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఇండియా మొత్తం దసరా ను ప్రమోట్ చేయడానికి తిరుగుతూనే ఉన్నాడు.
మొదటి వన్డేలో విజృంభించిన చమిక కరుణరత్నే
న్యూజిలాండ్ జరిగిన తొలి వన్డేలో రైట్ ఆర్మ్ పేసర్ చమిక కరణరత్నే బౌలింగ్‌లో విజృంభించాడు. కరుణరత్నే తొమ్మిది ఓవర్లలో 4/43తో చెలరేగాడు. దీంతో న్యూజిలాండ్ 49.3 ఓవర్లకు 274 పరుగులు చేసి ఆలౌటైంది.
రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు
ప్రస్తుతానికి, రిలయన్స్ జియో భారతదేశంలో మూడు రీఛార్జ్ ప్యాక్‌లను అందిస్తోంది, ఇది వినియోగదారులకు వివిధ కాల వ్యవధిలో రోజుకు 3GB డేటాను అందిస్తుంది. ప్యాక్‌లకు 14-84 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కొనుగోలుదారులకు JioTVతో సహా జియో సూట్ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తాయి.
శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ
శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం ప్రవాస భారతీయులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కాన్సులేట్ భవనం వెలుపల గుమిగూడి భారత్‌కు సంఘీభావంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.
ఇంటర్నేషనల్ వాఫిల్ డే 2023: నోరూరించే వాఫిల్స్ వెరైటీలను ఈజీగా తయారు చేయండి
ప్రతీ సంవత్సరం మార్చ్ 25వ తేదీన అంతర్జాతీయ వాఫిల్ దినోత్సంవంగా జరుపుతారు. నిజానికి ఈ దినోత్సవాన్ని కేవలం స్వీడన్ లో మాత్రమే జరుపుకునేవారు. ఆ తర్వాత ప్రపంచమంతా ఇది పాకింది.
ఫిన్ అలెన్ వన్డేలో ఐదో హాఫ్ సెంచరీ
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 49 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో వన్డే క్రికెట్‌లో ఐదు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు.
మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు
నథింగ్ సంస్థ నథింగ్ ఇయర్ (2)ని రూ. 9,999 ధరతో భారతదేశంలో ప్రారంభించింది., నథింగ్ ఇయర్ (2) నథింగ్ ఇయర్ (1) లాగా అనిపించచ్చు, కానీ లోపల చాలా మార్పులు వచ్చాయి.
దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు
భారతదేశంలో గత 24గంటల్లో 1,500పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 146 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
శ్రేయస్ అయ్యర్ గాయంపై టీమిండియా మాజీ ప్లేయర్ కామెంట్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను సంబంధిత సమస్యతో భాదపడుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఆడలేకపోయిన అయ్యర్.. నాలుగో టెస్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో వెన్నుముక సమస్యకు సర్జరీ చేయించుకోవాలని శ్రేయాస్‌కు బీసీసీఐ సూచించింది.
రంగమార్తాండ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రంగమార్తాండ సినిమా, ఉగాది రోజున థియేటర్లలోకి వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అతిరథ మహారథులందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం
లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెట్టి భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా నియమితులయ్యారు. అమెరికా కాలామానం ప్రకారం శుక్రవారం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సమక్షంలో కొత్త రాయబారిగా ప్రమాణ స్వీకారం చేశారు.
యాంగ్జాయిటీని పెంచే ఈ ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు
మీకు యాంగ్జాయిటీ డిజార్డర్ ఉందా? కారణం లేకుండానే మీలో యాంగ్జాయిటీ పెరిగిపోతుందా? అయితే మీరు తినే ఆహారమే అలా పెరగడానికి కారణం కావచ్చు.
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రేసులో రసెల్..?
ఐపీఎల్ సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో పలు స్టార్ ఆటగాళ్లు గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. కోల్‌కత్తా రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి దూరమయ్యే అవకావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి!
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్‌ను భారతీయ రైల్వే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును నడిపేందుకు సిద్ధమవుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం
ప్రభుత్వ సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ)ని కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం అంటే ప్రస్తుతమున్న 38 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘాన్ విక్టరీ
పాకిస్థాన్ జట్టుకు ఆప్ఘనిస్తాన్ షాకిచ్చింది. శుక్రవారం షార్జా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ ఓడించింది. ఆఫ్ఘన్ బౌలింగ్ ధాటికి పాక్ బ్యాటర్లు విలవిలలాడారు. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 92 పరుగులను మాత్రమే చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంవత్సరం: విడుదల నుండి ఆస్కార్ దాకా ఆర్ఆర్ఆర్ ప్రయాణం
తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తుందని కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఊహలకందని విషయాలను తన సినిమాలో చూపించే రాజమౌళి, అవే ఊహలతో ఎవ్వరూ ఊహించని దాన్ని నిజం చేసి చూపించాడు.
2023 బజాజ్ పల్సర్ 220F గురించి తెలుసుకుందాం
బజాజ్ ఆటో భారతదేశంలో రెండు సంవత్సరాల విరామం తర్వాత పల్సర్ 220Fను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ సంస్థ ఇతర మోడల్స్ పల్సర్ F250, పల్సర్ RS200 ఇదే ధరలో లభిస్తున్నాయి. పల్సర్ 220Fని నిలిపేసిన తర్వాత, 2021లో బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ F250ని లాంచ్ చేసింది.
Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరో నెలరోజుల్లో జరగనున్నారు. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించింది.
పులిమేక నుండి రిలీజైన ట్విస్ట్: సీరియల్ కిల్లర్ గా అందాల రాక్షసి
ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన పులి మేక సిరీస్, జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో
ప్రతిష్టాత్మక మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్లో భారత బాక్సర్ల హావా కొనసాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా అమ్మాయిలు అదరగొడుతున్నారు.
రాజస్థాన్: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత సైన్యం చేస్తున్న ఫీల్డ్ ప్రాక్టీస్‌లో అపశృతి చోటు చేసుకుంది. సైన్యం ప్రయోగించిన మూడు క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయి. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ జరగుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
మార్చి 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.