14 Mar 2023
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అప్‌డేట్‌ను ట్విట్టర్‌లో మంత్రిత్వ శాఖ పంచుకుంది. ఫిబ్రవరి 28, 2023 నాటికి మొత్తం పురోగతి 26.33శాతం ఉందని పేర్కొంది. మహారాష్ట్ర మొత్తం పనిలో 13.72శాతం, గుజరాత్ సివిల్ వర్క్‌లో 52శాతానికి పైగా పూర్తి చేశాయి. ప్రస్తుతం 36.93శాతం పూర్తయింది.
భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు సిఈఓ శ్రీధర్ వెంబు, $4.5 బిలియన్ల విలువైన వ్యాపార సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ (ఫోర్బ్స్ ప్రకారం), తన మాజీ భార్య ప్రమీలా శ్రీనివాసన్‌తో విడాకుల పోరాటంలో ఉన్నారు.
ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్, వార్తలను అందించే వనరులలో ఒకటి. కాబట్టి, ప్లాట్‌ఫారమ్ ద్వారా వచ్చిన సమాచారం వాస్తవికతను నిర్ధారించడం చాలా అవసరం. అందుకే ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్‌ను ప్రవేశపెట్టింది.
బి ఎం డబ్ల్యూ R18 బైక్ లో ఉన్న టాప్ 5 ఫీచర్లు గురించి తెలుసుకుందాం
బి ఎం డబ్ల్యూ మోటోరాడ్ తన R 18 B మోటార్‌బైక్ అప్డేట్ వెర్షన్ ను USలోని డేటోనా బైక్ వీక్‌లో ప్రదర్శించింది. ద్విచక్ర వాహనం పేరు R 18 B హెవీ డ్యూటీ, దీనిని ప్రసిద్ధ కస్టమైజర్ ఫ్రెడ్ కోడ్లిన్, అతని కుమారుడు కలిపి రూపొందించారు.
తాలిబాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్ క్రాష్ కోర్సులో భారత్ శిక్షణ
అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ సభ్యులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 'ఇండియా ఇమ్మర్షన్' ఆన్‌లైన్ కోర్సుకు హాజరయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐఎం-కోజికోడ్‌లో ఈ ఆన్ లైన్ క్రాష్ కోర్సును నిర్వహిస్తోంది. మార్చి 14 నుంచి మార్చి 17 వరకు ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు: రేపు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి బుధవారం దిల్లీలోని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది.
రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే ఐరన్ సప్లిమెంట్స్ ఉపయోగాలు తెలుసుకోండి
ఐరన్ అనే పోషకం శరీరానికి ఎంత మేలు చేస్తుందో చాలామందికి తెలియదు. మన శరీరంలో ఐరన్ తగినంతగా లేకపోతే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
దేశంలో పెరుగుతున్న హెచ్3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి
దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. అయితే ఈ ఇన్‌ప్లూయెంజా వైరస్ సోకి మరణాలు సంభవిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి ఉద్యోగి కారణం
సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) నాయకత్వం $2.25 బిలియన్ల మూలధనాన్ని, $21 బిలియన్ల ఆస్తుల అమ్మకాన్ని ప్రకటించిన తర్వాత, ఒక్కరోజే టెక్ స్టార్టప్‌లలో $42 బిలియన్ల డిపాజిట్లను ఉపసంహరించుకునేలా చేసింది.
ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్
ఇండోర్ స్టేడియానికి ఇచ్చిన పిచ్ రేటింగ్‌పై ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ఐసీసీ పేలవమైన పిచ్ అంటూ గతంలో ఈ స్టేడియానికి మూడు డీమెరిట్ పాయింట్లను విధించింది.
టాప్-ఎండ్ కియా కేరెన్స్ కంటే ఎంట్రీ-లెవల్ టయోటా ఇన్నోవా క్రిస్టా మెరుగ్గా ఉంటుందా
2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఈ జనవరిలో భారతదేశంలో లాంచ్ అయింది, త్వరలో విడుదల కానుంది. మార్కెట్‌లో, ఎంట్రీ-లెవల్, సెవెన్-సీటర్ G మోడల్ కియా కేరెన్స్ రేంజ్-టాపింగ్ లగ్జరీ ప్లస్ సెవెన్-సీటర్ వేరియంట్ తో పోటీ పడుతుంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన అశ్విన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో దక్కించుకుంది. ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను సృష్టించాడు. సిరీస్ మొత్తం 25 వికెట్లు పడగొట్టి, 86 పరుగులు చేశాడు.
దసరా ట్రైలర్: ఇప్పటివరకు కనిపించని రీతిలో నాని విశ్వరూపం
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన దసరా మూవీ ట్రైలర్, ఇప్పుడే రిలీజైంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లో నాని కొత్తగా కనిపించాడు.
కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌కు గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు
కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు.
2031లో ISSని పసిఫిక్ మహాసముద్రంలో పడేయనున్న నాసా
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) 2030 వరకు పని చేస్తుంది. నాసా 2031 ప్రారంభంలో కక్ష్యలో ఉన్న స్పేస్ ల్యాబ్‌ను సురక్షితంగా పసిఫిక్ మహాసముద్రంలోకి క్రాష్ చేయాలని భావిస్తోంది.
ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి
2022లో ప్రపంచంలో ఎనిమిదవ అత్యంత కాలుష్య దేశం భారతదేశం, అంతకుముందు సంవత్సరం ఉన్న ఐదవ స్థానం నుండి పడిపోయింది. అయితే ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సురక్షిత పరిమితి కంటే 10 రెట్లు ఎక్కువ.
జనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్
జనసేన 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ.. మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకల్లో పాల్గొనేందుకు ఎన్నికల ప్రచారం వాహనం 'వారాహి'పై బయలుదేరారు.
డబ్బు గురించి పిల్లల్లో ఏ విధంగా అవగాహన కల్పించాలో తెలుసుకోండి
డబ్బు ఉండడం కన్నా దాన్నెలా ఖర్చుపెట్టాలో తెలిసినవాళ్లే ఎక్కువ ఆనందంగా ఉంటారు. డబ్బు దాచుకోవడం, ఖర్చుపెట్టడమనేది ఒక కళ. ఆ కళ అందరికీ రాదు, నేర్చుకోవాల్సిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాహుల్‌ని ఆడించాలి : గవాస్కర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. అటు శ్రీలంకను తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓడించడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌కు టీమిండియా క్వాలిఫై అయింది. ఇప్పుడు ఫైనల్లోనూ ఆస్ట్రేలియాతోనే టీమిండియా టైటిల్ కోసం పోరాడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్: హెలికాప్టర్‌పై వేలాడుతూ ఒక నిమిషంలో 32 పుల్ అప్స్
ఆర్మేనియాకు చెందిన అథ్లెట్ అరుదైన ఘనత సాధించాడు. హమాజాస్ప్ హ్లోయన్ అనే వ్యక్తి హెలికాప్టర్ స్కిడ్‌లపై వేలాడుతూ 1నిమిషంలో 32 పుల్ అప్స్ సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.
విరూపాక్ష ట్రైలర్: పండగ పర్వదినాన రిలీజ్ కి సిద్ధం?
దర్శకుడి సుకుమార్, తన కెరీర్లోనే మొట్ట మొదటి సారి రాసిన థ్రిల్లర్ కథ విరూపాక్ష. సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ బ్యానర్లు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది.
సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇతర ఆస్తులలో ప్రారంభ-దశ, వృద్ధి సంస్థల రుణాలు, సంపన్న వ్యాపారవేత్తలు, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు రుణాలు ఉన్నాయి.
ఇలా అయితే బౌలింగ్ జాబ్ వదిలేస్తానన్న అశ్విన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా వరుసగా నాలుగోసారి గెలుచుకుంది.
హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్‌లతో భయాలు వద్దు: ఐసీఎంఆర్
హెచ్3ఎన్2, టైప్ బీ ఇన్‌ప్లూయెంజా, అడెనో, కరోనా లాంటి గాలి ద్వారా సంక్రమించే వైరస్‌లు ఆందోళనకరమైనవి కావని నేషనల్ ఇన్‌ప్లూయెంజా సెంటర్ (ఎన్ఐసీ) పేర్కొంది.
ప్రేరణ: ఇతరులకు సహాయం చెయ్యడమే అసలైన విజయం
ఇవ్వడానికి చాలా పెద్ద మనసుండాలి. అది ప్రేమైనా, ఒక వస్తువైనా లేదా డబ్బులైనా సరే, మన దగ్గరున్న ఒక వస్తువును అవతలి వాళ్ళకు ఇవ్వడం అంత తేలిక కాదు.
పాక్ జట్టును ఇండియాకు పంపిస్తే భద్రతా సమస్యలు: పీసీబీ ఛైర్మన్
ఆసియా కప్ 2023 టోర్ని వేదిక విషయంలో రేగిన సందిగ్ధత ఇప్పట్లో తెగేలా లేదు. పాకిస్తాన్ లో ఆసియా కప్ 2023 టోర్ని జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో నిర్వహిస్తే అక్కడికి టీమిండియా వెళ్లదని, తటస్థ వేదికపై టోర్నిని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పిన విషయం తెలిసిందే.
ఆరోగ్యం: మిమ్మల్ని మీరు పట్టించుకుంటే జనాలు తప్పుగా ఆలోచిస్తున్నారా? ఇది చదవండి
మిమ్మల్ని మీరు పట్టించుకోవడమనేది స్వీయ రక్షణ కిందకు వస్తుంది. అంటే సెల్ఫ్ కేర్ అన్నమాట. మిమ్మల్ని మీరు శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉంచుకోగలగడం. ఐతే ఈ స్వీయ రక్షణ విషయంలో జనాల్లో కొన్ని అపోహలున్నాయి. అవేంటో చూద్దాం.
పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం; నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహిళా జడ్జిని బెదిరించినందుకు ఇమ్రాన్ ఖాన్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు లాహోర్ చేరుకున్నారు.
టాటా పంచ్ కు పోటీగా మైక్రో SUVను లాంచ్ చేయనున్న హ్యుందాయ్ ఇండియా
హ్యుందాయ్ 2024 ప్రారంభంలో భారతదేశంలో టాటా పంచ్ (Ai3 అనే సంకేతనామం)కి ప్రత్యర్థిని విడుదల చేయనుంది. కారు పైకప్పు పట్టాలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు ఉన్నాయని ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
ఆస్ట్రేలియాకు వన్డే సారిథిగా స్టీవ్ స్మిత్
మార్చి 17 నుంచి టీమిండియాతో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్
వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి సాధిస్తోందని, 11.43శాతం గ్రోత్ రేటును సాధించినట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు-2023 ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలకోపాన్యాసం చేశారు.
ఆస్కార్ అవార్డ్స్: ఆ జాబితాలో టాప్ లో నిలిచిన ఎన్టీఆర్, రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం అందరికీ ఆనందంగా ఉంది. తెలుగు పాటకు విశ్వ వేదిక మీద దక్కిన గౌరవానికి తెలుగు ప్రజలందరూ సంతోషంలో ఉన్నారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు పెంచుతున్న శిఖా పాండే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో శిఖాపాండే శివంగిలా దుమ్ములేపుతోంది. తన బౌలింగ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై మూడు కీలక వికెట్లు పడగొట్టింది.
ఆధార్ కార్డ్ పోయిందా, అయితే ఇలా చేయండి
భారతదేశంలో ఆధార్ కార్డ్ అనేక ప్రయోజనాల కోసం అవసరమవుతుంది అందుకే దానిని పోగట్టుకోవడం లేదా కార్డ్ వివరాలను తెలియని వారికి ఇవ్వడం లాంటివి చేస్తే సమస్యలు వస్తాయి. కార్డ్ పోయినప్పుడు ఏదైనా UIDAI- నడుపుతున్న ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి, ఆధార్ కరెక్షన్ ఫారమ్‌ను నింపాలి.
దిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడం నిషేధం: డీఎంఆర్‌సీ
మెట్రోలలో రీల్స్, డ్యాన్స్ వీడియోల చిత్రీకరణపై దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్( డీఎంఆర్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడాన్ని నిషేధిస్తున్నట్లు డీఎంఆర్‌సీ పేర్కొంది. ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కోటలో కొనసాగుతున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది.
డబ్య్లూటీసీ ఫైనల్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా నాలుగోసారి టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌పై శ్రీలంక ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.
చర్మానికి మెరుపును తీసుకురావడం నుండి నల్లమచ్చలను పోగొట్టడం వరకు తులసి చేసే మేలు
మన ఇళ్ళలో తులసి చెట్టుకు దివ్యమైన ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరి ఇళ్ళలో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీకిది తెలుసా? తులసి మొక్క చర్మానికి మంచి మేలు చేస్తుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న కెప్టెన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆస్కార్ గెలిచిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఏనుగును చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు
'ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకున్న భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్' ద్వారా ప్రసిద్ధి చెందిన ఏనుగును చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి తరలి వస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ కు సమానంగా ఎన్టీఆర్ 30: వెల్లడించిన ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో యావత్ భారతదేశం ఆనందంగా ఉంది. భారత జెండాను ఆస్కార్ వేదిక మీద నాటు నాటు అంటూ ఎగరవేసిన ఆర్ఆర్ఆర్ బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. అందుబాటులో స్టార్ ప్లేయర్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 ఎడిషన్ మార్చి 31న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. చాలామంది ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో ఫ్రాంచైజీల్లో అందోళన మొదలైంది. తాజాగా కొన్ని టీంలకు గుడ్ న్యూస్ అందింది.
అంతర్జాతీయ గణిత దినోత్సవం: ప్రకృతిలో మిళితమైన ఫిబోనాచీ సీక్వెన్స్ గురించి మీకు తెలుసా?
ఫిబోనాచీ సీక్వెన్స్, గోల్డెన్ రేషియో అనేవి గణిత శాస్త్రంలో చెప్పుకోదగ్గ కాన్సెప్ట్. కొన్ని వందల యేళ్ళ నుండి ఈ పద్దతులపై అధ్యయనం జరుగుతోంది. ప్రకృతిలోని ప్రతీ అందమైన వస్తువు ఈ గోల్డెన్ రేషియో విలువకు దగ్గరగా ఉంటుంది.
అక్షయ్‌కుమార్ మూవీ సీన్‌పై టీమిండియా క్రికెటర్ల ఫన్నీ వీడియో
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' గా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం సాధించిన తర్వాత అక్షయ్ కుమార్ మూనీ సీన్‌పై ఓ వీడియో చేశారు. ఈ వీడియోను రవిచంద్రన్ అశ్విన్ తన ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో పోస్టు చేశాడు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో మొదలయ్యాయి. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే.
ఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక మీద బాలయ్య డాన్స్, మామూలుగా ఉండదు
బాలయ్య క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అన్ స్టాపబుల్ టాక్ షో ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నప్పటి నుండి సోషల్ మీడియాలో బాలయ్య క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీకి ఇది వరుసగా ఐదో పరాజయం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది.
మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు(84) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో విజయరామారావు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మార్చి 14న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
13 Mar 2023
మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2023న ముగుస్తుంది కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే పెట్టుబడులను ప్లాన్ చేయడం ప్రారంభించారు. ఈ నెలాఖరులోపు ఇవి చేయడం ద్వారా పన్ను ఆదా చేయచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
భారతదేశంలో విడుదలైన 2023 కవాసకి వెర్సిస్ 1000
జపనీస్ వాహన తయారీ సంస్థ కవాసకి తన 2023 వెర్సిస్ 1000 మోటార్‌బైక్‌ను విడుదల చేసింది. ఇది ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్‌తో సహా ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్‌లను అందిస్తుంది. కవాసకి వెర్సిస్ 1000 2023 వెర్షన్ లో స్పోర్ట్స్ టూరర్ స్మార్ట్‌ఫోన్‌లను స్టాండర్డ్‌గా ఛార్జ్ చేయడానికి DC సాకెట్ ఉంది. మార్కెట్లో బి ఎం డబ్ల్యూ F 900 XR,Triumph టైగర్ 850 స్పోర్ట్ వంటి వాటితో పోటీ పడుతుంది.
స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 70% పైగా పడిపోయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్
భయాల మధ్య, US-ఆధారిత ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ (FRC) ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ సమయంలో 70% పైగా క్రాష్ అయ్యింది. ప్రస్తుతం స్టాక్ $21.94 దగ్గర ఉంది, ఇది నిన్నటి ముగింపుతో పోలిస్తే 73.17% తగ్గింది.
IND vs AUS:: ప్లేయర్స్ ఆఫ్ ది సిరీస్‌గా అశ్విన్, జడేజా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో దక్కించుకుంది.
ట్రావెల్: ఫిన్ లాండ్ పర్యటనకు వెళ్తే గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
ఫిన్ లాండ్ పర్యటనకు వెళ్ళినపుడు అక్కడి నుండి ఏం తీసుకురావాలో మీకు ఐడియా లేకపోతే, ఇక్కడ చెప్పే కొన్ని వస్తువులను గుర్తించుకోండి. ఫిన్ లాండ్ దేశ సంస్కృతి, వైవిధ్యంగా ఉంటుంది. దానివల్ల అక్కడ వివిధ రకాల వస్తువులు మీకు కొత్తగా కనిపిస్తాయి.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా హ్యారీ బ్రూక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతి నెలా క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నెలా పురుషుల, మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సోమవారం ప్రకటించింది.
తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
రాబోయో మూడు రోజుల్లో మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ) హెచ్చరించింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్లకు ఈరోజు నుండి డబ్బు యాక్సెస్ చేసుకునే సదుపాయం
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం US బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసింది. ఇప్పుడు, దాని డిపాజిటర్లు భయపడకుండా ఉండటానికి, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC), US ట్రెజరీ, ఫెడరల్ రిజర్వ్ కలిసి ప్రకటనను విడుదల చేశాయి. ఈరోజు నుండి డిపాజిటర్లు తమ నిధులను యాక్సెస్ చేయచ్చని, SVB రిజల్యూషన్ నష్టాలను పన్ను చెల్లింపుదారులు భరించరని ఏజెన్సీలు తెలిపాయి.
ప్రేరణ: ఆకాశం అందదని ఆలోచించడం మానేస్తే అంతరిక్షమనే విజయం చేరుకోలేం
ఒక పని మొదలు పెట్టే ముందు కొన్ని వందల ఆలోచనలు వస్తాయి. ఆ పని పూర్తవుతుందా లేదా? నా వల్ల అవుతుందా కాదా? నేను చేయగలనా లేదా అని అనిపిస్తుంటుంది.
వ్యోమగాములు ISSలో టమోటాలు ఎలా పండించారో తెలుసుకోండి
నాసా స్పేస్‌ఎక్స్ క్రూ-5 వ్యోమగాములు ఆదివారం (మార్చి 12) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి సురక్షితంగా భూమికి చేరుకున్నారు. అక్టోబర్‌లో ప్రారంభమైన వారి ఐదు నెలల మిషన్‌లో, అనేక శాస్త్రీయ పరిశోధనలు చేశారు, వాటిలో అత్యంత ఆసక్తికరమైనది కక్ష్యలో ఉన్న అంతరిక్ష ప్రయోగశాలలో టమోటాలు పండించడం. ఇంతకుముందు స్పేస్ స్టేషన్‌లో ఆకు కూరలు కూడా పండించారు.
ఆంధ్రప్రదేశ్: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14న ప్రారంభం కానున్నాయి. తొలుత ఫిబ్రవరి 27 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా.. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్-2023 కారణంగా వాయిదా వేసింది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై మంగళవారం జరిగే బీసీఏ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
IND vs AUS: పాపం ట్రావిస్ హెడ్.. సెంచరీ మిస్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో బాగా రాణించాడు. హెడ్ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర పటేల్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టులో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర పటేల్ చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్‌ను ఔట్ చేసి ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు. భారత్ తరుపున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అక్షర్ పటేల్ రికార్డు క్రియేట్ చేశాడు.
వచ్చే వారం రష్యాకు జిన్‌పింగ్; జెలెన్‌స్కీ- పుతిన్ మధ్య సంధి కుదురుస్తారా?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ మాస్కోకు వెళ్లనున్నట్లు సమాచారం.
2023 హోండా CB350 RS vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఏది కొనడం మంచిది
జపనీస్ తయారీసంస్థ హోండా తన ప్రసిద్ధ ఆఫర్ అయిన CB350RS ను భారతదేశంలో MY-2023 అప్‌డేట్‌లతో అప్‌గ్రేడ్ చేసింది. మార్కెట్లో రెట్రో మోటార్‌సైకిల్ కేటగిరీలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350తో పోటీ పడుతుంది.
భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన OPPO Find N2 ఫ్లిప్
OPPO Find N2 ఫ్లిప్ ఇప్పుడు భారతదేశంలో సోలో 8GB/256GB కాన్ఫిగరేషన్ ధరతో రూ.89,999 అందుబాటులోకి రానుంది. ఇది ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్‌లో అతిపెద్ద కవర్ స్క్రీన్‌తో పాటు కొత్త-తరం ఫ్లెక్షన్ హింజ్ తో వస్తుంది. ఇది హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ కెమెరా సెటప్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
ఆస్కార్ అవార్డ్స్ 2023: వైవిధ్యమైన ఫ్యాషన్ తో రెడ్ కార్పెట్ మీద మెరిసిన తారలు
ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో తారలు తమ ఫ్యాషన్ తో అందరినీ ఆకట్టుకున్నారు. రెడ్ కార్పెట్ మీద నడుస్తూ, చూపరులను తమవైపు ఆకర్షించుకున్నారు.
'యోగా మహోత్సవ్'లో పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల 'యోగ మహోత్సవ్'లో ఆనందంగా పాల్గొనాలని పౌరులను ఆహ్వానించారు. ప్రజలు ఇప్పటికే యోగా చేయకపోతే, ఆసనాలను నేర్చుకొని వారి జీవితాల్లో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
NZ vs SL: హాఫ్ సెంచరీతో చెలరేగిన డారిల్ మిచెల్
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఐదో రోజు హాఫ్ సెంచరీతో డారిల్ మిచెల్ రాణించి సత్తా చాటాడు.
95వ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న విజేతలు వీళ్ళే
ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు మరింత కళ వచ్చింది. ఇండియాకు రెండు అవార్డులు రావడం సంతోషించాల్సిన విషయం. ఆస్కార్ అవార్డ్ అందుకున్న విజేతల జాబితా చూద్దాం.
షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
విహారయాత్రకు గోవాకు వచ్చిన దిల్లీకి చెందిన ఓ కుటుంబంపై కత్తులతో దాడి చేశారు. అంజునా ప్రాంతంలో బీచ్‌కు సమీపంలో ఉండే 'స్పాజియో లీజర్' అనే రిసార్ట్‌లో బస చేసిన వారిపై కొందరు దుండగులు పాశవికంగా దాడి చేశారు. కుటుంబ సభ్యుల్లో జతిన్ శర్మ ఈ సంఘటన గురించి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తెలియజేశాడు.
LED హెడ్‌లైట్‌లకు అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఇది తెలుసుకోండి
దాదాపు అన్ని వాహన తయారీదారులు తమ దృష్టిని LED హెడ్‌లైట్‌ల వైపు మార్చడంతో, అనేక OEMలు, విడిభాగాల తయారీదారులు భారతీయ మార్కెట్‌లో LED యూనిట్‌లను ప్రవేశపెడుతున్నారు. భారతదేశంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో LED రీప్లేస్‌మెంట్ బల్బులు రూ.1,000కే అందుబాటులో ఉన్నాయి. హాలోజన్ బల్బ్ పేలవమైన పనితీరుతో ఇబ్బందీపడలేక, చాలా మంది ఆఫ్టర్మార్కెట్ HID (హై-ఇంటెన్సిటీ డిశ్చార్జ్) లేదా LED (లైట్-ఎమిటింగ్ డయోడ్) యూనిట్లను ఎంచుకుంటున్నారు.
ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
ఇటీవల లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే బీజేపీ నాయకుల తీరుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
NZ vs SL: సెంచరీతో న్యూజిలాండ్‌ను గెలిపించిన కేన్ విలియమ్సన్
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఐదో రోజు అజేయ శతకం బాదిన కేన్ విలియమ్సన్ శ్రీలంకపై న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 177 బంతుల్లో సెంచరీ చేసి, టెస్టులో తన 27వ సెంచరీని కేన్ విలియమ్సన్ నమోదు చేశాడు.
డిసెంబర్ నాటికి ముగియనున్న $100బిలియన్ల భారతదేశం-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పంద చర్చలు
భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య $100 బిలియన్ల విలువైన సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం డిసెంబర్ నాటికి చర్చలను ముగించాలని ఇరుదేశాలుభావిస్తున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ నార్మన్ అల్బనీస్ గత శుక్రవారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన తర్వాత ఈ విషయం ప్రకటించింది.
ఆస్కార్ అవార్డ్స్: గునిత్ మోంగా మాటలను ఆపేయడంపై ఇంటర్నెట్ లో చర్చ
95వ ఆస్కార్ అవార్డ్స్ భారతీయులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, అలాగే డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ది ఎలిఫెంట్ విష్పర్స్ కు ఆస్కార్ రావడం ఇందుకు కారణం.
యూపీ వారియర్స్‌పై హర్మన్‌ప్రీత్ కౌర్ సునామీ ఇన్నింగ్స్
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. కేవలం 33 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 53 పరుగులు చేసింది.
ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్
ఉమేష్ పాల్ హత్య కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు పురోగతి సాధించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌గా, రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న అతిక్ అహ్మద్‌కు సన్నిహితుడైన బల్లి పండిట్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి
దిల్లీ నుంచి దోహాకు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన 6ఈ-1736 మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. అయితే విమానం విమానాశ్రాయానికి చేరుకునే లోపే నైజీరియన్‌కు చెందిన ప్రయాణికుడు మరణించినట్లు వైద్య బృందం ప్రకటించింది.
గుడ్‌న్యూస్.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో ఫలితం లేకుండానే టీమిండియా గుడ్‌న్యూస్ అందింది. క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకను న్యూజిలాండ్ ఓడించడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించింది.
ఆస్కార్ అవార్డ్స్ 2023: ఉత్తమ నటి అవార్డ్ అందుకున్న ఆసియాలోనే మొదటి పర్సన్
ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ముగిసింది. ప్రతీ సంవత్సరం ఆస్కార్ ఉత్తమ నటులుగా ఎవరు గెలుచుకున్నారనే దానిపై చాలా ఆసక్తి ఉంటుంది. అదే ఆసక్తితో ఉత్తమ నటులుగా ఎవరు నిలిచారో చూద్దాం.
మార్చి 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. మొదటి నాలుగు మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది. వరుస పరాజయాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఆస్కార్ వేదిక మీద మెరుపులు మెరిపించిన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ విశేషాలు
ఆస్కార్ అవార్డుల కార్యక్రమం, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో డాల్బీ థియేటర్ లో జరిగింది. భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 5:30గంటలకు మొదలై 9గంటలకు ముగిసింది.
రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్
ఉత్తర్‌ప్రదేశ్ ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న ఐపీఎస్ అధికారి వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ఆ అధికారిపై 'బుల్‌డోజర్' ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ వీడియో దర్యాప్తునకు ఆదేశించింది.
టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్‌కి శ్రేయాస్ అయ్యర్ దూరం..!
టీమిండియా స్టార్ బ్యాట్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి గాయం కారణంగా ఆఖరి రోజుకు ఆటకు దూరమయ్యాడు. మూడో రోజు ఫీల్డింగ్ చేస్తూ వెన్నునొప్పితో పెవిలియన్ చేరిన శ్రేయాస్ అయ్యర్‌ని అఖరి టెస్టు ఆఖరి రోజు నుంచి తప్పినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
డేనియల్ క్వాన్, డేనియల్ షీనర్ట్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ మూవీ, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మూవీకి ఆస్కార్ ఉత్తమ చిత్రంగా అవార్డ్ దక్కింది. మిషెల్లీ యో కీలక పాత్రలో మెరిసిన ఈ మూవీ, అత్యధిక నామినేషన్లు(11) పొందిన చిత్రంగా నిలిచింది.
3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ
ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని కొట్టినందుకు భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీకి నటి అనుష్క శర్మ అతిపెద్ద చీర్‌లీడర్‌గా మారారు. అతను నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై తన చివరి టెస్టు సెంచరీని సాధించాడు.
కేరళ: బీజేపీ నాయకుడి ఇంట్లో బాంబు పేలుడు
కేరళలోని కన్నూర్ జిల్లా కక్కయంగడ్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు కలకలం రేపింది. అయితే ఈ ఘటన ఒక బీజేపీ నాయకుడి ఇంట్లో జరగడం గమనార్హం. ఆదివారం సాయంత్రం ముజక్కున్ను పోలీస్ స్టేషన్ పరిధిలో సంభవించిన ఘటనలో దంపతులు గాయపడ్డారు.
WPL 2023 : చెలరేగిన కెప్టెన్.. ముంబై ఇండియన్స్‌కు నాలుగో విజయం
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో ముందుకెళ్తోంది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ అదరగోట్టారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీవారియర్స్ 20 ఓవర్లలో 159/6 స్కోరు చేసింది.
'మంచుకొండల్లోన..' నుండి 'నాటు నాటు..' వరకు చంద్రబోస్ ప్రయాణం
తన పాటతో ప్రపంచ వేదికపై ఉర్రూతలూగించి, తెలుగు ఖ్యాతిని ప్రపంచాన్ని తెలియచేసిన పాటల రచయత చంద్రబోస్ ప్రయాణం 1995లో వచ్చిన "తాజ్ మహాల్" సినిమా నుండి మొదలైంది.
అమెరికాలో మరో బ్యాంకు మూసివేత; బాధ్యులను వదిలి పెట్టబోమని బైడెన్ ప్రకటన
అమోరికాలో మరో బ్యాంకు మూతపడింది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభాన్ని మరువకముందే సిగ్నేచర్ బ్యాంకును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇండియా గర్వంతో ఉప్పొంగిపోతోంది : ప్రధాని మోదీ
ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ సినీ ప్రపంచం గర్వించేలా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది.
సంగీత ప్రపంచంలో ప్రభంజనం సృష్టించిన ఎంఎం కీరవాణి
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గత ముప్పై ఏళ్లుగా తన సంగీత ప్రవాహంలో మనల్ని ఉర్రూతలూగిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆయన పాటలు అందించారు.
చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'; 'నాటు నాటు' పాటను వరించిన ఆస్కార్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాట చరిత్ర సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును గెల్చుకొని.. తెలుగు సినిమా సత్తాను చాటింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ అవార్డును గెల్చుకొని భారతీయ సినీ ప్రేమికులను మరింత గర్వపడేలా చేసింది.