09 Mar 2023

60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో

దేశంలో 5G సేవలు మొదలుపెట్టిన టెలికాం సంస్థలలో జియో ఒకటి, బ్రాడ్ బ్రాండ్ సర్వీసులను కూడా విస్తరించడంపై దృష్టి పెట్టిన రిలయన్స్ జియో అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ డివైజ్ తయారీ సంస్థ మిమోసా నెట్వర్క్ (Mimou)ను కొనుగోలు చేయనుంది. జియో లో భాగమైన ర్యాడీసీస్ కార్పొరేషన్, మిమోసా నెట్వర్క్ పేరెంట్ సంస్థ ఎయిర్ట్స్పెన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది.

భారతదేశంలో లాంచ్ కానున్న 2023 Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 బైక్

బ్రిటిష్ తయారీసంస్థ Triumph మోటార్‌సైకిల్స్ మార్చి 15న భారతదేశంలో స్ట్రీట్ ట్రిపుల్ 765 R, RS 2023 వెర్షన్ లాంచ్చేస్తోంది. ఈ బైక్‌ల ధర రూ. రూ.10 లక్షలు - రూ.12 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్‌ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's

బెంగళూరులోని 170కి పైగా డొమినోస్ అవుట్‌లెట్‌లు ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లోనే పిజ్జాను డెలివరీ చేస్తాయని డొమినోస్‌పేరెంట్ సంస్థ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. పిజ్జా బ్రాండ్, డొమినోస్ సోమవారం బెంగళూరులో తమ 20 నిమిషాల పిజ్జా డెలివరీ సేవను ప్రారంభించింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరంలో ఇది ఒక గేమ్ ఛేంజర్ అని పేర్కొంది. అంతకుముందు 30 నిమిషాల వ్యవధిలో పిజ్జా డెలివరీతో కంపెనీ పేరు సంపాదించింది.

Tamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే

తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి బీటలు వారాయని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో విడివిడిగా పోటి చేస్తాయని అందరు అనుకుంటున్న తరుణంలో రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తినా పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత డి జయకుమార్ స్పష్టం చేశారు.

గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్

గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో గ్రాండ్ i10 NIOS కొత్త స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను రూ.7.16 లక్షల ధరతో పరిచయం చేస్తుంది.

లక్నో, కోల్ కతా బిర్యానీల కంటే చెన్నై దిండిగల్ బిర్యానీ బాగుందంటూ ట్వీట్ వార్ కి తెరలేపిన నెటిజన్

ఏ ప్రాంత ప్రజలకైనా అక్కడి ఆహారాలు కూడా వాళ్ళ సంస్కృతిలో ఒక భాగంగా ఉంటాయి. అలా బిర్యానీని కూడా తమ సంస్కృతిలో భాగంగా చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుపడ్డ రష్యా- ఆరుగురు పౌరులు మృతి

ప్రజలు నిద్రిస్తున్న సమయంలో గురువారం రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణుల ధాటికి కీవ్ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రష్యా దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందారు.

లెజెండ్స్ క్రికెట్ లీగ్ వచ్చేసిందోచ్..!

లెజెండ్స్ లీగ్ క్రికెట్ కొత్త సీజన్ మార్చి 10 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ ఇండియా మహరాజాస్, ఏసియా లయన్స్ మధ్య జరగనుంది. ఈసారి ఈ టోర్నీ ఖతార్ లోని దోహాలో జరగనుంది.

అటు ఒక సినిమా రిలీజ్ పెట్టుకుని ఇటు సినిమా లాంఛ్ చేసిన కిరణ్ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ప్రేక్షకుల మీద దండయాత్ర చేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇటీవల వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో యావరేజ్ విజయం అందుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు మీటర్ అంటూ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

German Open 2023లో నిరాశ పరిచిన లక్ష్యసేన్

ఎన్నో అంచనాలతో జర్మన్ ఓపెన్ వరల్డ్ టూరు సూపర్-300 బ్యాడ్మింటన్ బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్యసేన నిరాశ పరిచాడు.

ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు

సీబీఐ, ఈడీ విచారణలతో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు అరెస్టు అవుతారనే ఊహాగానాలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచేశాయి.

వేసవిలో భారతదేశంలో పెరగనున్న విద్యుత్ అంతరాయాలు

పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగం భారతదేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను పెంచింది. అయితే ఈ వేసవితో పాటు రాబోయే రోజుల్లో దేశంలో రాత్రిపూట విద్యుత్ అంతరాయాలు పెరిగే అవకాశం ఉంది.

IND vs AUS : మొదటి రోజు సెంచరీతో కదం తొక్కిన ఉస్మాన్ ఖావాజా

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.

ప్రేరణ: అందమైన అబద్ధం జీవితాన్ని అందంగా మార్చలేదు

అబద్ధం.. ఇది చాలా అందంగా ఉంటుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు రావనుకునే అబద్ధం ఎంతో హాయినిస్తుంది. ప్రపంచంలోని ధనమంతా రేపు తెల్లారేసరికి నీ కాళ్ళముందుకు వచ్చేస్తుందనే అబద్ధపు నమ్మకం నిన్ను ఉత్సాహంగా ఉంచుతుంది.

TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ

హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) రెండు ప్రత్యేకమైన ఆఫర్లను గురువారం లాంఛ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రయాణికులకు సరసమైన ధరలో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.

పాక్ గడ్డపై జాసన్ రాయ్ విధ్వంసకర శతకం

పీఎస్ఎల్‌లో సరికొత్త సంచలన రికార్డు నమోదైంది. జాసన్ రాయ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 63 బంతుల్లో 145 పరుగులు చేశారు. దీంతో పెషావర్ జాల్మీ జట్టు విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా చేధించింది.

త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350

US బైక్‌ తయారీసంస్థ హార్లే-డేవిడ్‌సన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసం X350 బైక్ ని లాంచ్ చేయనుంది. అయితే అధికారిక ప్రకటన కంటే ముందు, మోటార్‌సైకిల్ US డీలర్‌షిప్‌లో కనిపించింది. ప్రస్తుతం మార్కెట్ మిడ్-కెపాసిటీ మోటార్‌సైకిళ్ల వైపు వేగంగా అభివృద్ధి చెందుతుంది, వాహన తయారీ సంస్థ తన రాబోయే X350 మోడల్‌తో ఈ సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలనుకుంటుంది.

దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం

దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను దిల్లీ హైకోర్టు మధ్యవర్తిగా నియమించింది.

ఏదైనా జ్వరం రాగానే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేస్తున్నారా? ఇప్పుడే ఆపేయండి

ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. అన్ని విషయాలు చిటికెలో తెలిసిపోతున్నాయి. అదే ధైర్యంతో మీక్కొంచెం అనీజీగా అనిపించగానే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేసే అలవాటు కూడా పెరిగిపోయింది.

పీఎస్‌ఎల్‌లో సెంచరీతో చెలరేగిన బాబర్ ఆజమ్

షెషావర్ జల్మీ, క్వెటా గ్లాడియేటర్స్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఫెషావర్ జల్మీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పెషావర్ జెల్మీ కెప్టెన్ బాబార్ ఆజమ్ సెంచరీతో చెలరేగిపోయాడు.

అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్

కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ అయిన రిలేటివిటీ స్పేస్ నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్ త్వరలో అంతరిక్షంలోకి వెళ్లనుంది.

ఆస్కార్ అవార్డ్స్: ఆ ఘనత సాధించిన తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్

95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఇంకో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఈ అవార్డుల కోసం ప్రపంచ సినిమా అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం తీహార్ జైలులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రెండోసారి ప్రశ్నించింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చినం అంశాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన

ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్, సెన్సేషనల్ న్యూస్ తో వచ్చాడు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ కోసం నాటు నాటు పాటను ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్, పాడ్ కాస్టర్ సామ్ ప్రాగాసోతో ముచ్చటిస్తూ తన హాలీవుడ్ ప్రవేశం గురించి చెప్పుకొచ్చాడు.

మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్

FTX కుంభకోణం తర్వాత కష్టాల్లో ఉన్న క్రిప్టో-ఫ్రెండ్లీ బ్యాంక్ సిల్వర్‌గేట్ ఎట్టకేలకు మూసివేయబడుతోంది. బ్యాంక్ హోల్డింగ్ కంపెనీ, సిల్వర్‌గేట్ క్యాపిటల్, బ్యాంక్ కార్యకలాపాలను స్వచ్ఛందంగా లిక్విడేట్ చేసే నిర్ణయాన్ని ప్రకటించింది.

ఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత

ఎన్నికలు ఉన్న చోట మోదీ కంటే ముందే ఈడీ చేరిపోతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున తెలంగాణలో కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. గురువారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఐపీఎల్‌లో కొన్ని జట్లకు బ్యాడ్ న్యూస్

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో కొన్ని జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు.

దాతృత్వం కోసం 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించిన జాక్సన్

ఆస్ట్రేలియన్ ఫిట్‌నెస్ అభిమాని జాక్సన్ ఇటాలియన్ ఒక స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లను పూర్తి చేయడం ద్వారా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పారు. వ్యాయామాలలో కష్టమైనవి పుల్-అప్‌లు. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడానికి వ్యాయామం చేయడానికి చాలా శక్తి అవసరం. ఎలాంటివారైనా 100 చేయగలరు. అయితే, 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లు చేయడం అనేది మామూలు విషయం కాదు.

టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆకరి టెస్టు అహ్మదాబాద్‌లో జరుగుతోంది. తొలి మూడు టెస్టులో రెండింటిలో నెగ్గిన భారత్ 2-0తో అధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా అడుగు పెట్టనుంది.

పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్

పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ధరమ్ దేవ్ రాతి అనే డాక్టర్ మంగళవారం తన ఇంట్లోనే అతని డ్రైవర్ చేతిలో హత్యకు గురయ్యాడు. డ్రైవర్ కత్తితో డాక్టర్ గొంతు కోశాడని పోలీసులు పాకిస్థాన్ వార్తా సంస్థ ది నేషన్‌కు తెలిపారు.

తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం!

తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), బీజేపీ కూటమికి బీటలు వారే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉంటున్నాయి.

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వరల్డ్ కిడ్నీ డే: మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయాల్సిన పనులు

మార్చ్ 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూత్రపిండాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మూత్రపిండాల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కోసం 2006 నుండి ఈ రోజును జరుపుతున్నారు.

2023 మహీంద్రా XUV300 vs మారుతి సుజుకి బ్రెజ్జా ఏది కొనడం మంచిది

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా తన SUV, MY-2023 అప్‌గ్రేడ్‌లు, RDE-కంప్లైంట్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో XUV300ని అప్‌డేట్ చేసింది. కారు ధర రూ.22,000 ప్రారంభ ధర రూ.8.41 లక్షలు. మార్కెట్లో సెగ్మెంట్-లీడర్ మారుతి సుజుకి బ్రెజ్జాతో పోటీ పడుతుంది.

ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం

మహారాష్ట్ర ముంబయికి సముద్రం ద్వారా వచ్చే సందర్శకులకు స్వాగతం పలికేందుకు 100ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన కట్టడం 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు ఏర్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

అండర్సన్ దూసుకొచ్చినా అశ్వినే నెంబర్ వన్

టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ప్రభావం చూపలేకపోయిన అశ్విన్ ఆరు రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. దీంతో బుధవారం ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 859 పాయింట్లతో అశ్విన్, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ నెంబర్ వన్ స్థానంలో సమానంగా నిలిచారు.

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో హీరోగా వస్తున్న వరుణ్ సందేశ్

హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఆ తర్వాత కొత్త బంగారు లోకం మూవీతో హిట్ కొట్టిన వరుణ్ సందేశ్, తన పాపులారిటీని ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయాడు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బోణి కొట్టిన గుజరాత్ జెయింట్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా మూడోసారి రాయల్ బెంగళూర్ ఛాలెంజర్స్ ఓటమిపాలైంది. బుధవారం రాత్రి జరిగిన 6వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు 11 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై విజయం సాధించింది.

100కు పైగా దేశాల కార్బన్ ఫూట్ ప్రింట్ ను నాసా ఎలా కొలిచిందంటే...

నాసా, భూమి-కక్ష్యలో ఉన్న ఉపగ్రహం సహాయంతో, ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను కొలిచింది. 60 కంటే ఎక్కువ మంది పరిశోధకులు ఉన్నపైలట్-స్థాయి ప్రాజెక్ట్, ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ-2 (OCO-2) మిషన్ ద్వారా చేసిన కొలతల ఆధారంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను అంచనా వేసింది.

నేషనల్ మీట్ బాల్ డే: మాంసంతో తయారయ్యే వెరైటీ వంటకాల రెసిపీ మీకోసమే

అమెరికా జనాలు ఈరోజు నేషనల్ మీట్ బాల్ డే జరుపుకుంటారు. చికెన్, చేపలు, మటన్, పందిమాంసం మొదలుగు వాటితో ఉండలుగా వంటకాలు రెడీ చేసుకుని హ్యాపీగా ఆరగిస్తారు.

1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్

బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ గురువారం తెలిపింది. వాయనాడ్‌కు చెందిన షఫీ అనే వ్యక్తిని 1,487 గ్రాముల బంగారంతో కొచ్చిలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.

IND vs AUS : చివరి టెస్టుకు హజరైన ప్రధానమంత్రులు మోడీ, ఆంటోని ఆల్బనీస్

భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన చివరి టెస్టుకు ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ హజరయ్యారు.

యోగా: విమాన ప్రయాణం వల్ల కలిగిన అలసటను దూరం చేసే యోగాసనాలు

వేరు వేరు టైమ్ జోన్లలో ప్రయాణించినపుడు నిద్ర దెబ్బతింటుంది. విమాన ప్రయాణం వల్ల కలిగిన అలసటతో పాటు టైమ్ జోన్ మారిపోయినపుడు నిద్ర సరిగ్గా పట్టదు. అంతేగాకుండా తీవ్రమైన అలసట శరీరాన్ని చేరుతుంది.

ఇంట్లో నిర్బంధించి, తిండి పెట్టకుండా 1000 కుక్కలను చంపేసిన వృద్ధుడు

తిండి పెట్టకుండా, కడుపు మాడ్చి దాదాపు 1000 కుక్కుల చావుకు కారణమయ్యాడు ఓ వృద్ధుడు. దక్షిణ కొరియాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లోని ఓ ఇంట్లో వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.

బేయర్స్ మ్యానిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్తైన్ పరాజయం

అలియాంజ్ ఎరీనాలో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్‌లో పారిస్ సెయింట్-జర్మైన్‌ను బేయర్న్ మ్యునిచ్ ఓడించింది. 2-0తేడాతో బేయర్న్ మ్యునిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్మైన్‌ ఓటమి పాలైంది.

RC15 : పాటకు పదికోట్లు ఖర్చు పెడుతున్న శంకర్ ?

శంకర్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్న సంగతి తెలిసిందే. పాటలను అందంగా చిత్రీకరించడం కోసం ఎంతగానో ఖర్చు చేస్తుంటారు. అందుకే శంకర్ సినిమాల పాటలు ప్రత్యేకంగా ఉంటాయి.

IND vs AUS: బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా

పాకిస్థాన్, భారత్ మధ్య సరిహద్దు ఘర్షణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వార్షిక ముప్పు నివేదిక వెల్లడించింది.

రవిశాస్త్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ

ఇండియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా మూడో టెస్టులో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. ముఖ్యంగా అతి విశ్వాసమే టీమిండియా ఓటమికి కారణమని శాస్త్రి అన్నారు.

ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత

యాక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, దర్శకుడిగా బాలీవుడ్ సినిమాకు విశేష సేవలందించిన సతీష్ కౌషిక్, 66ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, ట్విట్టర్ వేదికగా వెల్లడి చేసారు.

మార్చి 9న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

08 Mar 2023

OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహానికి హాజరైన సాఫ్ట్‌బ్యాంక్ CEO, Paytm బాస్

ఓయో హోటళ్ల సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ వివాహం గీతాన్షా సూద్‌తో దిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది.

చాబహార్ ఓడరేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపనున్న భారత్

అఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు భారత్ మంగళవారం ప్రకటించింది . ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది.

IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ

RPSG గ్రూప్ యాజమాన్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ మంగళవారం తమ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది. ఈ టోర్నమెంట్ తాజా ఎడిషన్ మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది .

బస్సులో టీమిండియా క్రికెటర్ల హోలీ సెలబ్రేషన్స్

అహ్మదాబాద్ టెస్టును గెలవాలని టీమిండియా శ్రమిస్తోంది. ఇండోర్‌లో ఓటమి తర్వాత అహ్మదాబాద్ టెస్టులో విజయం సాధించి ఐసీసీ టెస్టు చాంఫియన్ షిప్‌కు అర్హత సాధించాలని టీమిండియా భావిస్తోంది. కాగా, టీమ్ భారత టీం బస్సులోనే హోలీ సంబరాలు చేసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకురాలు కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మార్చి 9 (గురువారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

ODI Tickets: 10 నుంచి విశాఖ వన్డే టికెట్ల అమ్మకం

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 19న జరిగే రెండో వన్డే టికెట్ల అమ్మకం ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్‌లో ఈనెల 13 నుంచి టికెట్లు విక్రయాలు జరగనున్నాయి. ఆఫ్ లైన్ లో టికెట్ల అమ్మకాల కోసం నగరంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

మహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్

టెక్ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడం లేదనే అభిప్రాయం చాలామందికి ఉంది. అయితే ఒక స్త్రీ, స్త్రీల కోసం నిర్మించిన సామ్రాజ్యం నేడు ట్రిలియన్ డాలర్లకు ఎదిగింది.

వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు

విద్యుత్ సవరణ బిల్లు- 2022ను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. విద్యుత్‌ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే బిల్లుపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది.

Women's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే

పురుషాధిక్య భారతీయ సమాజంలో మహిళలకు రాజకీయాల్లో పరిమిత సంఖ్యలో అవకాశాలు దక్కాయి. కాలానుగూనంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కొందరు నాయకురాళ్లు స్వశక్తితో ఎదిగి దేశ రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: తెలుగు సినిమా దశను మార్చిన హీరోయిన్స్

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగు సినిమాలో మహిళల పాత్రను, తెలుగు సినిమాను మార్చిన మహిళల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్

భారత క్రీడారంగంలో పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. బాక్సింగ్ నుంచి క్రికెట్ దాకా భారత మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో భారత తొలి మహిళలు ఎవరో ఓసారి చూద్దాం.

మార్చి 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.