ప్రపంచం: వార్తలు

క్రెజ్‌సికోవాపై కసత్కినా 6-2, 7-5తో విజయం

అడిలైడ్ ఇంటర్నేషనల్ 2లో శనివారం జరిగే మహిళల సింగిల్స్ మ్యాచ్ ఫైనల్‌లో ఐదో సీడ్ డారియా కసత్కినా, ఎనిమిదో సీడ్ బెలిండా బెన్సిక్‌తో పోరాడింది.

బాక్సింగ్ నుంచి మేరీ కోమ్ అవుట్..!

ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీకోమ్ 2023 బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నుండి వైదొలిగింది. ఈ ఏడాది బాక్సింగ్ మహిళల ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడం లేదని మేరీ కోమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

చెల్సియాపై 2-1 తో ఫుల్‌హామ్ విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23 మ్యాచ్ లో ఫుల్ హామ్ 2-1తో చెల్సియాపై విజయం సాధించింది. ఫుల్‌హామ్‌కు పెనాల్టీని తోసిపుచ్చిన తర్వాత VAR, విల్లియన్‌ను అధిగమించాడు. మ్యాచ్ హాఫ్ టైం తర్వాత చెల్సియా, ఫుల్ హామ్ ను సమం చేసింది. కార్లోస్ వినిసియస్ 2006 తర్వాత మొదటిసారిగా చెల్సియాను ఓడించడంలో ఫుల్‌హామ్ సక్సస్ అయింది.

భారత్ 48 ఏళ్ల కల నెరవేరేనా..?

హాకీ జట్టు అజిత్ పాల్ సింగ్ నాయకత్వంలో పైనల్లో పాకిస్తాన్ ను ఓడించి 1975లో విజేతగా నిలిచింది. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు సాధ్యం కాలేదు. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన జట్టు కనీసం సెమీఫైన్‌ల్‌కి కూడా చేరుకోలేదు.

స్పానిష్ సూపర్ కప్ ఫైనల్‌కు రియల్ మాడ్రిడ్

స్పానిష్ సూపర్ కప్ ఫైనల్‌కు రియల్ మాడ్రిడ్ చేరుకొని సత్తా చాటింది. వాలెన్సియాను 4-3తో ఓడించడంతో మ్యాచ్ 1-1తో ముగిసింది. అదనపు సమయం తర్వాత మ్యాచ్ 1-1తో టైగా ఉండడంతో కరీమ్ బెంజెమా 39వ నిమిషంలో పెనాల్టీని శామ్యూల్ లినో రద్దు చేశాడు.

ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం

ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఆదాయాన్ని పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఆదాయాన్ని సంపాదించేందుకు ఆన్‌లైన్‌లో యూజర్ నేమ్స్ ను విక్రయించాలని ఆలోచిస్తుంది.

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంపై నవోమి ఒసాకా క్లారిటీ

జపాన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, మాజీ వరల్డ్ నంబర్ వన్ నవోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 2019, 2021లో ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నవోమి ఒసాకా నిలిచింది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్ని ప్రారంభం కానున్న నేథప్యంలో ఓసాకా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై నిర్వాహకులను షాక్ గురి చేసింది.

ఆస్ట్రేలియాలో మీడియా హక్కుల వేలం ప్రారంభం

గతేడాది నిలిచిపోయిన మీడియా హక్కుల వేలాన్ని ఆస్ట్రేలియాలో ఐసీసీ పున:ప్రారంభించనుంది. 2022 సెప్టెంబర్‌లో టెండర్ జారీ చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను నిలిపివేశారు.

11 Jan 2023

నాసా

సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి గ్రహాన్నిTESS టెలిస్కోప్ ద్వారా గుర్తించిన నాసా

ఖగోళ శాస్త్రవేత్తలు, నాసా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) సహాయంతో, TOI 700 e అనే ఒక ఎక్సోప్లానెట్‌ను కనుగొన్నారు, ఇది భూమికి 95% పరిమాణం ఉండడమే కాదు భూగ్రహం లాగే రాతిలాగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎక్సోప్లానెట్ అది తిరిగే నక్షత్రం (TOI 700) నివాసయోగ్యమైన జోన్‌లో నీటిని నిలుపుకోగలిగే దూరంలో ఉంది.

ఫిబ్రవరి 1 నుండి యూట్యూబ్ Shorts క్రియేటర్లకు కూడా ఆదాయం

గత సెప్టెంబరులో, Shorts కోసం మానిటైజేషన్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని YouTube హామీ ఇచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుండి, యూట్యూబ్ Shorts క్రియేటర్లు తమ కంటెంట్ పై రాబడిని పొందగలరు. యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రామ్ (YPP) అప్డేట్ లో భాగంగా ఈ మార్పును ప్రవేశపెట్టింది యూట్యూబ్.

3-0 తేడాతో మంచెస్టర్ యునైటెడ్ విజయం

కరాబావో కప్ 2022-23, మాంచెస్టర్ యునైటెడ్ క్వార్టర్స్‌లో చార్ల్టన్‌ను అధిగమించింది. 2022-23 కారబావో కప్ లో మాంచెస్టర్ యునైటెడ్ సత్తా చాటింది. చార్ట్లన్ అథ్లెటిక్ పై 3-0 తేడాతో విజయం సాధించింది. దీంతో క్వార్టర్స్ లో మంచెస్టర్ యునైటెడ్ అర్హత సాధించింది.

10 Jan 2023

మెటా

వివక్షను తగ్గించడమే లక్ష్యంగా మెటా కొత్త AI ప్రకటన సాంకేతికత

తమ ప్రకటనలు వివక్షతతో ఉన్నాయనే ఆందోళనలను పరిష్కరించే ప్రయత్నంలో, మెటా కొన్ని మార్పులను రూపొందించింది.

10 Jan 2023

పరిశోధన

ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చగలిగే అద్భుతమైన పదార్ధం

సౌరశక్తిని ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు, గ్రీన్‌హౌస్ వాయువులను స్థిరమైన ఇంధనాలుగా మార్చగల వ్యవస్థను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రెండు వ్యర్థ ప్రవాహాలు ఏకకాలంలో రెండు రసాయన ఉత్పత్తులుగా మారడం సౌరశక్తితో పనిచేసే రియాక్టర్‌లో సాధించడం ఇదే మొదటిసారి. ఈ పరిశోధన ద్వారా సౌర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది. ఈ పెరోవ్‌స్కైట్ పదార్ధం సాంప్రదాయ సిలికాన్ కు మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది చౌకగా తయారవుతుంది.

ఫుట్‌బాల్‌కు ప్రముఖ ప్లేయర్ వీడ్కోలు

వేల్స్ కు చెందిన అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాళ్లలో ఒకరైన గారెత్ బేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించారు.

జనవరి 13న హాకీ ప్రపంచ కప్

పురుషుల హాకీ ప్రపంచ కప్ 15వ ఎడిషన్ జనవరి 13-29 వరకు ఇండియాలో జరగనుంది. ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. చివరిసారిగా 1975లో భారత్ ట్రోఫిని గెలుచుకున్న విషయం తెలిసిందే.

10 Jan 2023

పరిశోధన

పక్షి జాతి ఆవిర్భావం గురించి చెప్పే డైనోసార్ లాంటి తలతో ఉన్న శిలాజం

చైనాలో వెలికితీసిన 120 మిలియన్ సంవత్సరాల పురాతన శిలాజానికి విచిత్రమైన శరీర నిర్మాణం అంటే డైనోసార్‌ను పోలిన తల, పక్షిని పోలిన శరీరంతో ఉంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు "క్రాటోనావిస్ జుయ్" అనే శిలాజ నమూనాను అధ్యయనం చేశారు. ఈ పుర్రె పక్షులలా కాకుండా టైరన్నోసారస్ రెక్స్ డైనోసార్ ఆకారంలో ఉందని కనుగొన్నారు.

10 Jan 2023

ఇరాన్

హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి

హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న మరో ముగ్గురికి ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. హిజాబ్ ఆందోళనల్లో పాల్గొంటున్న నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ అణిచివేతపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మళ్లీ పునరాగమనం చేసిన స్టీవనేజ్

FA కప్ 2022-23 మూడవ రౌండ్‌లో ఆస్టన్ విల్లాను తొలగించేందుకు స్టీవనేజ్ తిరిగి పునరాగమనం చేశాడు. మోర్గాన్ సాన్సన్ విల్లాకు 33వ నిమిషంలో ఆధిక్యాన్ని అందించి సత్తా చాటాడు. స్టీవెనేజ్ అదృష్టవశాత్తూ పెనాల్టీని పొందడంతో క్యాంప్‌బెల్ 90వ నిమిషంలో జామీ రీడ్ ఈక్వలైజర్‌ను సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వీడ్కోలు

సౌతాఫ్రికా ఆటగాడు ఆల్ రౌండర్ డ్వైన్ పెట్రోరియస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై టీ20 ఫార్మాట్ పైనే దృష్టి సారిస్తానని పెట్రోరియస్ ప్రకటించాడు. ఇది తన కెరియర్లో అత్యంత కఠిన నిర్ణయమని పెట్రోరియస్ చెప్పారు.

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కన్నుమూత

మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంఫియన్ షిప్ విక్టోరియా లీ మరణవార్త యావత్ మార్షల్ ఆర్ట్స్ రంగాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. హవాయ్‌లో పుట్టిన ఈ ఫైటర్ 18 ఏళ్లకే తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

చెల్సియాను 4-0తో ఓడించిన మాంచెస్టర్ సిటీ

FA కప్ 2022-23 సీజన్‌లో చెల్సియాను 4-0తో మాంచెస్టర్ సిటీ ఓడించి 4వ రౌండ్‌కు అర్హత సాధించింది. మాంచెస్టర్ సిటీలో కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి లభించినప్పటికీ చెల్సియా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

రికార్డు బద్దలు కొట్టిన కోకో గౌఫ్

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన ASB క్లాసిక్ టైటిల్‌ను అమెరికా స్టార్ కోకో గౌఫ్ సాధించింది. ఫైనల్లో 6-1, 6-1 తేడాతో స్పానిస్ క్వాలిఫైయర్ రెబికా మసరోవాను ఓడించి రికార్డు బద్దలు కొట్టింది.

Acer, Razer, MSI, ASUS నుండి రాబోతున్న సరికొత్త ల్యాప్‌టాప్‌లు

CES 2023లో, సరికొత్త టెక్నాలజీ వినియోగదారుల ముందుకు వచ్చింది. వివిధ ప్రసిద్ధ బ్రాండ్‌ల నుండి ల్యాప్‌టాప్స్ అమ్మకానికి సిద్ధమవుతున్నాయి. కొత్త తరం ఫీచర్‌లు, తాజా హార్డ్‌వేర్, అత్యుత్తమ-నాణ్యత డిస్‌ప్లే ల్యాప్‌టాప్‌ల కోసం వెతుకుతున్న కొనుగోలుదారులని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ప్రపంచ ప్రసిద్ధ టెక్ ఈవెంట్‌లో Acer, Razer, MSI, ASUS నుండి లాంచ్ అయిన కొత్త ల్యాప్‌టాప్స్ గురించి తెలుసుకుందాం.

చెల్సియాపై మంచెస్టర్ సిటీ విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23 లీడర్స్ ఆర్సెనల్‌తో చెల్సియాను 1-0తో మాంచెస్టర్ సిటీ ఓడించింది. 63వ నిమిషంలో రియాద్ మహ్రెజ్ సిటీ తరఫున గోల్ చేశాడు. మొదటి అర్ధభాగంలో చెల్సియా జట్టు గాయాల కారణంగా రహీం స్టెర్లింగ్, క్రిస్టియన్ పులిసిక్ ఇద్దరినీ కోల్పోయింది. ప్రస్తుతం సిటీ రెండో స్థానంలో, చెల్సియా 10వ స్థానంలో ఉంది.

06 Jan 2023

పరిశోధన

'త్రీ అమిగోస్' తో పాలపుంత హృదయాన్ని ఆవిష్కరించిన నాసా

నాసా పాలపుంతకు సంబంధించిన ఒక చిత్రాన్ని విడుదల చేసింది. నక్షత్ర మండలం లోపల కుడి వైపున కాస్మిక్ దుమ్ము, శిధిలాలతో, నక్షత్రాలతో నిండి ఉన్నా సరే చిత్రంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

టీ20 సిరీస్‌పై భారత్ కన్ను

పూణేలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. శ్రీలంక 16 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. శ్రీలంక కెప్టన్ షనక 56 పరుగులు చేసి శ్రీలంక విజయంలో భాగస్వామ్యం అయ్యాడు.

స్వియాటెక్ పై జెస్సికా పెగులా విజయం

ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ పై 6-2, 6-2 తేడాతో జెస్సిగా పెగులా విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఓపెనింగ్ సింగిల్స్ రబ్బర్‌లో జెస్సిగా పెగులా యూనైటెడ్ స్టేట్ కు మంచి అరంభాన్ని అందించింది.

06 Jan 2023

మెటా

ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్

ఫోన్‌లను మార్చినప్పుడు వాట్సాప్ చాట్ హిస్టరీని బదిలీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. గత సంవత్సరం, ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్ చాట్‌లను సులభంగా తరలించే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్. ఈ కంపెనీ ఇప్పుడు చాట్ చరిత్రను కొత్త Android డివైజ్ కు సులభంగా ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్‌పై పని చేస్తోంది.

మాంచెస్టర్ సిటీతో జియో కీలక ఒప్పందం

మాంచెస్టర్ సిటీ జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్ (JIO)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ సేవల బ్రాండ్ క్లబ్ అధికారిక మొబైల్ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ భాగస్వామిగా జియో అవతరించనుంది.

మీకు తెలుసా? సౌరశక్తితో పనిచేసే కణాలు వృద్ధాప్యాన్ని వాయిదా వేయగలవు!

సౌరశక్తితో పనిచేసే కణాలు వినియోగం మానవ జీవితకాలాన్ని పొడిగించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చగల మైటోకాండ్రియా జన్యుపరంగా రూపొందించబడింది.

క్వెంటిన్ హాలీస్‌ను ఓడించిన నోవాక్ జొకోవిచ్

అడిలైడ్‌లో క్వెంటిన్ హాలీస్‌ను నోవాక్ జొకోవిచ్ ఓడించి.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గురువారం హాలీస్‌ను 7-6(3), 7-6(5)తో పోరాడి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు నోవాక్ జొకోవిచ్.. 57 నిమిషాలు పాటు ఇద్దరు హోరాహోరీగా పోరాడాడు. భీకర ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ అద్భుతమైన షాట్లతో హాలీస్‌ను గెలుపొందాడు.

మరో 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌

ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 18వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటించారు.

Bingలో ChatGPT AIతో గూగుల్ ను సవాలు చేయనున్న మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ గత సంవత్సరం బ్లాగ్ పోస్ట్‌లో OpenAI, DALL-E 2 నుండి ఇమేజ్-జెనరేషన్ సాఫ్ట్‌వేర్‌ను Bingకి అనుసంధానించాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది.

CES 2023లో సరికొత్త Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ ప్రారంభం

CES 2023లో గేమింగ్ పరిశ్రమ కోసం Govee మొట్టమొదటిసారిగా AI-ఆధారిత లైటింగ్ సొల్యూషన్‌ను పరిచయం చేయబోతుంది. దీనిని Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ అని అంటారు. ఇది ఆన్-స్క్రీన్ గేమింగ్ కంటెంట్ నుండి కీలక విషయాలను విశ్లేషించడానికి, వాటిని సాంకేతికత ఉపయోగించి మళ్ళీ సరికొత్త లైటింగ్ ఎఫెక్ట్స్ తో చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇది 2023లో లాంచ్ అవుతుందని ప్రకటించారు కానీ ధర ఇంకా వెల్లడించలేదు.

భారీ ఆఫర్లను తిరస్కరించి.. చివరకి మెగా డీల్ పట్టిన రొనాల్డ్

ప్రపంచకప్ నుంచి కన్నీటితో నిష్క్రమించిన సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి క్రేజ్ కొంచె కూడా తగ్గలేదు. ప్రస్తుతం సౌది అరేబియాకు చెందిన అల్-నాసర్ జట్టు క్రిస్టియానో రొనాల్డ్ ఫాలోయింగ్ చూసి పిచ్చెక్కిపోయింది.

విజయంతో పీలేకు నివాళి

ఫుట్‌బాల్ ఆటలో బాగా రాణిస్తూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న వారు ఎందరో ఉన్నారు. కానీ తన ఆట వల్ల ఫుట్‌బాల్ ఆటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినవాడు మాత్రం పీలే ఒక్కడే.. మంగళవారం స్పానిష్ కప్ రోడ్రిగ్ ఒక గోల్ చేసి, కాసెరెనోపై 1-0 తేడాతో విజయం సాధించారు. ఈ విజయాన్ని పీలేకు అంకితం చేస్తున్నట్లు రోడ్రిగో ప్రకటించారు.

పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర!

పాకిస్థాన్ మిలటరీపై ఆ దేశ రిటైర్ట్ ఆర్మీ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ హనీట్రాప్‌కు పాల్పడుతోందని చెప్పారు. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ.. అందంగా ఉండే నటీమణులను ఎగదోస్తుందంటూ తన వీడియో వ్లాగ్‌లో చెప్పుకొచ్చారు. ఈ హనీ ట్రాప్‌లో ప్రముఖ పాకిస్థానీ హీరోయిన్ సాజల్ అలీ పేరు కూడా చెప్పినట్లు వార్తలు రావడం గమనార్హం.

కిరణజన్య సంయోగక్రియ నియంత్రణకు కారణమవుతున్న ప్రోటీన్లు

మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ ప్లాంట్ ఫిజియాలజీ పరిశోధకులు, మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలోని కాలేజ్ ఆఫ్ నేచురల్ సైన్స్ పరిశోధకులు కలిసి కిరణజన్య సంయోగక్రియ నియంత్రణలో VCCN1, KEA3 అనే రెండు ప్రోటీన్ల ప్రాముఖ్యతను కనుగొన్నారు. మొక్కకు కాంతి పరిస్థితులను మార్చడం ద్వారా, కాంతి, నీడతో కూడిన సహజ పరిస్థితులను కల్పించడం ద్వారా మోడల్ ప్లాంట్-అరబిడోప్సిస్ థాలియానాపై వరుస ప్రయోగాలు చేశారు.

ఆస్ట్రేలియాకు రీ ఎంట్రీ.. మొదటి మ్యాచ్‌లోనే జకోవిచ్ అద్భుత విజయం

ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్లో నోవాక్ జొకోవిచ్‌ విజయంతో టోర్నిని ప్రారంభించాడు. కరోనా వ్యాక్సిన్ టీకాను వేసుకోకపోవడంతో గతంలో టోర్నమెంట్స్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్‌ ఆడటానికి అవకాశం రాలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్ని నుంచి మాత్రం ఆయనే స్వయంగా తప్పుకున్నాడు.

03 Jan 2023

ఆపిల్

చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్

ఆపిల్ చౌకైన ఎయిర్‌పాడ్స్ ఇయర్‌బడ్‌లపై పనిచేస్తోంది, వాటినే "AirPods Lite" అంటారు. AirPods డిమాండ్ 2022లో 73 మిలియన్ యూనిట్ల నుండి 2023లో 63 మిలియన్లకు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి కంపెనీ సరసమైన ఇయర్‌బడ్‌లపై పని చేస్తోందని విశ్లేషకులు సృష్టం చేసారు.