ప్రపంచం: వార్తలు

వెస్ట్ హామ్‌పై 2-0 తేడాతో స్పర్స్ విజయం

ప్రీమియర్ లీగ్ 2022-23 సీజన్‌లో వెస్ట్ హామ్‌పై స్పర్స్ 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్ హ్యూంగ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 2వ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

యూజర్లుకు ఝలక్ ఇచ్చిన ట్విట్టర్

ట్విట్టర్ మరోసారి యూజర్లకు ఝలక్ ఇచ్చింది. ఎస్ఎమ్ఎస్ ఆధారిత టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్(2ఎఫ్ఏ) భద్రతా సదుపాయాన్ని ఇకపై ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లే ఇస్తామంటూ శుక్రవారం వెల్లడించింది. త్వరలో ఈ విధానం అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూజర్లకు మరోమారు షాక్ తగిలినట్లు అయింది.

ఎయిర్ న్యూజిలాండ్ ప్లేన్: 16గంటలు గాల్లోనే ప్రయాణం చేసి వెనక్కి వచ్చేసిన ఫ్లైట్

ఎయిర్ న్యూజిలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన ఫ్లైట్ NZ2, న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుండి అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కి బయలు దేరింది.

17 Feb 2023

చైనా

చైనాకు సారీ చెప్పను.. అమెరికా అధ్యక్షుడు

ఇటీవల అమెరికా గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బెలూన్ ఘటన అమెరికా, చైనా సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది.

హర్యానాలోని భివానీ జిల్లాలో దారుణం.. ఇద్దరు సజీవదహనం

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తుల్ని కారుతో సహా సజీవదాహనం చేసిన ఘటన భివానీ జిల్లాలో జరిగింది. మృతులు రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35)గా గుర్తించామని లోహారు (భివానీ) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగత్ సింగ్ తెలిపారు.

17 Feb 2023

బీబీసీ

బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని కార్యాలయాల్లో దాదాపు 60 గంటల పాటు ఐటీ సోదాలు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. సంస్థ ఆర్థిక లావాదేవీలపై పలువురు ఉద్యోగులను ప్రశ్నించారు.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద హైడ్రామా

లాహోర్‌లోని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద హై డ్రామా జరిగింది. అతన్ని అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారంటూ వందలాది మంది పిటిఐ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

టెలిగ్రామ్ vs వాట్సాప్ వీటి మధ్య ఏం జరుగుతోంది

గత వారం, వాట్సాప్ అధిపతి విల్ క్యాత్‌కార్ట్ తన ఎన్‌క్రిప్షన్ విధానాలపై మాట్లాడుతూ టెలిగ్రామ్‌ను డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయలేదని విమర్శించారు. వాట్సాప్ ఇతర యాప్‌ల భద్రతా పద్ధతులపై ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరులో, నిర్దిష్ట భద్రతా ఫీచర్లు లేవని ఆపిల్ Message సేవను విమర్శించింది. వాట్సాప్ గోప్యతా విధానాలపైనా, ప్రైవేట్ సందేశాలను స్నూపింగ్ చేస్తుందనే దానిపై ఆరోపణలను ఎదుర్కుంటుంది.

ప్రీమియర్ లీగ్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసిన లివర్‌పూల్

ప్రీమియర్ లీగ్ 2022-23లో లివర్‌పూల్ మొదటిసారిగా విజయాన్ని నమోదు చేసింది. 2-0తో ఎవర్టన్‌ను ఓడించి లివర్ పూల్ సత్తా చాటింది. మొహమ్మద్ సలా, కోడి గక్పో గోల్స్ చేసి లివర్ పూల్‌కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ముఖ్యంగా 2023లో లివర్‌పూల్‌కు ఇది తొలి విజయం కావడం విశేషం.

నాపోలి చేతిలో క్రెమోనీస్ ఓటమి

2022-23 మ్యాచ్ లో నాపోలి సంచలన విజయాన్ని నమోదు చేసింది. 3-0తో క్రీమోనీస్‌ను ఓడించి సత్తా చాటింది. ఖ్విచా క్వారత్ స్టెలియా, విక్టర్ ఒసిమ్ హెన్, ఎల్జిఫ్ ఎల్మాన్ గోల్స్ చేసి ఈ సీజన్లో నాపోలికి 19వ విజయాన్ని అందించాడు.

13 Feb 2023

రగ్బీ

కాన్సాస్ సిటీ చీఫ్స్ సంచలనం విజయం

కాన్సాస్ సిటీ చీఫ్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఫిలిడెల్ఫియా ఈగల్స్ పై ఆదివారం 38-35తో సంచలన విజయం సాధించింది. విజయాన్ని సాధించిన తర్వాత కాన్సాస్ సిటీ చీఫ్స్ సూపర్ బౌల్ 57ను గెలుచుకుంది.

విల్లారియల్‌ను 1-0తో ఓడించిన బార్సిలోనా

లాలిగా 2022-23 మ్యాచ్‌లో బార్సిలోనా సత్తా చాటింది. విల్లారియల్‌ను 1-0తో బార్సిలోనా చిత్తు చేసింది. పెడ్రీ 18వ నిమిషంలో గోల్ చేసి బార్సిలోనాకు విజయాన్ని అందించాడు. ముఖ్యంగా బార్సిలోనా ఈ లీగ్‌లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసి సత్తా చాటింది.

సెమీఫైనల్లో వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా ఓటమి

క్వార్టర్ ఫైనల్లో జరిగిన పోరులో ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా 2023 అబుదాబి ఓపెన్ సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 లో ఫైనల్‌కు చేరిన రెబాకినా మూడు సెట్లలో ఓడిపోయి నిరాశ పరిచింది.

10 Feb 2023

భూకంపం

టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ

టర్కీలో వరుసగా సంభవించిన భూకంపాల తర్వాత మూడు రోజులపాటు శిథిలాల కింద కూరుకుపోయిన 6 ఏళ్ల బాలికను స్నిఫర్ డాగ్స్ రక్షించాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్‌లో భాగమైన రోమియో, జూలీ, శిథిలాల కింద 6 ఏళ్ల నస్రీన్ ఆచూకీని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి.

ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం

జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని గురెజ్ సరిహద్దు ప్రాంతంలో హిమపాతం కారణంగా ఇద్దరు మహిళలు ప్రమాదంలో పడ్డారు.

ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయన్ను బ్యాన్ చేశారు. అయితే రెండేండ్ల తరువాత ఆయన అకౌంట్లకు యాక్సిస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల మాతృసంస్థ మెటా ప్రకటించింది.

10 Feb 2023

భూకంపం

పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు

సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం తర్వాత జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఒక ఇంటి శిథిలాల కింద దొరికిన అప్పుడే పుట్టిన పసికందుకు పేరుతో పాటు ఒక ఇల్లు దొరికింది..

1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ

యాహూ తన మొత్తం సిబ్బందిలో 20% కంటే ఎక్కువ మందిని తొలగించాలని ఆలోచిస్తున్నట్లు గురువారం ప్రకటించింది, దాదాపు 50% యాడ్ టెక్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉంటుంది రికార్డు స్థాయిలో అధిక ద్రవ్యోల్బణంతో పాటు మాంద్యం భయంతో కంపెనీలు టెక్ రంగంలో విస్తృతంగా ఉద్యోగ కోతలను ప్రకటిస్తున్నాయి.

10 Feb 2023

భూకంపం

టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు

సోమవారం భారీ భూకంపం కారణంగా సిరియా, టర్కీలో 21,000 మందికి పైగా మరణించారు. విరామం లేకుండా 24 గంటలూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కానీ మంచు, వర్షం కారణంగా వారి పనికి ఆటంకం కలుగుతుంది.

జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు

దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో లిథియం నిల్వలు లభించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.

క్వార్టర్స్‌కు చేరుకున్న వింబుల్డన్ ఛాంపియన్ రిబాకినా

ప్రస్తుత వింబుల్డన్ ఛాంపియన్ ఎలెనా రిబాకినా మరోసారి చెలరేగింది. 2023 అబుదాబి ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకొని సత్తా చాటింది. రౌండ్ ఆఫ్-16 క్లాష్‌లో కరోలియా ప్లిస్కోవాపై విజయం సాధించింది.

ఫైనల్‌కు దూసుకెళ్లిన రియల్ మాడ్రిడ్

ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ కు రియల్ మాడ్రిడ్ దూసుకెళ్లాడు. ఈజిప్టుకు చెందిన ఆల్ అహ్లీని 4-1తో ఓడించి రియల్ మాడ్రిడ్ సత్తా చాటాడు. అనంతరం సౌదీ అరేబియా జట్టుకు చెందిన అల్ హిలాల్‌తో తలపడనున్నారు. రియల్ తరఫున వినిసియస్, ఫెడెరికో వాల్వెర్డే, రోడ్రిగో, సెర్గియో అర్రిబాస్ గోల్స్ చేశారు. అంతకుముందు, అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే.

దోహా, దుబాయి లీగ్ నుండి తప్పుకున్న ఒన్స్ జబీర్

ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఒన్స్ జబీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈనెల చివరిలో డబ్య్లూటీఎ టోర్నమెంట్ లు, ఖతార్ ఓపెన్, దుబాయి టెన్నిస్ ఛాంపియన్ షిప్ నుండి తప్పుకుంటున్న బుధవారం పేర్కొంది. ఈ ఏడాది చివర్లో చిన్న సర్జరీ చేయించుకుంటానని, అందువల్ల ఈ సిరీస్ దూరమవుతున్నట్లు తెలియజేసింది.

డ్రాగా ముగిసిన ముంచెస్టర్ యునైటెడ్, లీడ్స్ యునైటెడ్ మ్యాచ్

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన కీలకమైన ప్రీమియర్ లీగ్ 2022-23 ఎన్‌కౌంటర్‌లో మేనేజర్‌లెస్ లీడ్స్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

మార్టా కోస్ట్యుక్‌ను చిత్తు చేసిన బెలిండా బెన్సిక్

అబుదాబి ఓపెన్ 2023లో బెలిండా బెన్సిక్ విజయపరంపర కొనసాగుతోంది. బుధవారం మార్టా కోస్ట్యుక్‌ను వరుస సెట్లతో ఓడించి క్వార్టర్స్ కు చేరుకుంది. మార్టా కోస్ట్యుక్‌పై (6-4, 7-5)తో బెలిండా బెన్సిక్ విజయం సాధించింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెన్సిక్ రెండో సెట్‌లో 5-3తో మొదట వెనుకబడింది. అయితే 1.35 నిమిషాల తర్వాత 57వ ర్యాంక్ కోస్ట్యుక్‌పై వరుస సెట్లలో చిత్తు చేసింది.

ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్

NBAలో లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. కరీమ్ అబ్దుల్-జబ్బాను అధిగమించి ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా లెబ్రాన్ జేమ్స్ సరికొత్త రికార్డును సృష్టించాడు. బుధవారం ఓక్లహోమా సిటీ థండర్‌తో జరిగిన లాస్ ఏంజెల్స్ లేకర్స్ గేమ్‌లో కరీమ్ అబ్దుల్-జబ్బార్ రికార్డును బద్దలు కొట్టి సత్తా చాటాడు.

ఫ్లెమెంగో‌ను ఓడించిన సౌదీ అరేబియా జట్టు

మొరాకోలోని టాంజియర్‌లో జరుగుతున్న ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో సౌదీ అరేబియా క్లబ్ అద్భుతాన్ని సృష్టించింది. అల్ హిలాల్ బ్రెజిల్ దిగ్గజం ఫ్లెమెంగోపై 3-2 తేడాతో విజయం సాధించింది. కబ్ల్ వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా సౌదీ అరేబియా క్లబ్ చరిత్రలో నిలిచింది.

FA కప్ 2022-23లో షెఫీల్డ్ యునైటెడ్ విజయం

FA కప్ 2022-23 రీప్లేలో రెక్స్‌హామ్ ఓటమి పాలైంది. షెఫీల్డ్ యునైటెడ్ రెక్సహామ్ పై 3-1తేడాతో విజయాన్ని నమోదు చేసింది. యునైటెడ్ టోటెన్‌హామ్ హాట్‌స్‌పుర్‌తో 5వ రౌండ్ క్లాష్‌ను ఏర్పాటు చేయడానికి రెండు ఆలస్య గోల్‌లను సాధించడం గమనార్హం.

సెలెర్నిటానాపై 3-0తో జువెంటస్ సంచలన విజయం

సీరీ A 2022-23 సీజన్‌లో 21వ మ్యాచ్‌డేలో భాగంగా జువెంటస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. సలెర్నిటానాపై 3-0తో విజయఢంకా మోగించింది. మధ్యలో ఫిలిప్ కోస్టిక్ ఒకరిని జోడించగా.. దుసాన్ వ్లహోవిచ్ బ్రేస్ గోల్ చేశాడు. ప్రస్తుతం సీరీ A 2022-23 స్టాండింగ్స్‌లో 10వ స్థానానికి జువెంటస్ చేరుకుంది.

సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సంధర్భంగా భద్రతా ఫీచర్లను ప్రారంభించిన Tinder

సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం (SID) గుర్తుగా, ప్రముఖ ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ Tinder వినియోగదారులు సులభంగా నియంత్రించడానికి అనేక భద్రతా ఫీచర్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్లలో 'Incognito Mode', 'Block Profile' వంటి భద్రతా ఫీచర్లను అప్‌డేట్ చేసింది.

ఇంటర్నెట్ సురక్షిత దినోత్సవం రోజున వాట్సాప్ ఉపయోగించడానికి ఉత్తమ చిట్కాలు

ఫిబ్రవరి 7న సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంగా ప్రకటించారు. InSafe సంస్థ, ప్రతి సంవత్సరం సేఫ్ ఇంటర్నెట్ డే ను సెలెబ్రేట్ చేస్తుంది. సైబర్ బెదిరింపు, సోషల్ నెట్‌వర్కింగ్, డిజిటల్ గుర్తింపు వంటి ఆన్‌లైన్ సమస్యలతో పాటు మరెన్నో ప్రస్తుత ఆందోళనలపై అవగాహన పెంచడం దీని లక్ష్యం.

ఏసీ మిలన్ పై ఇంటర్ అద్భుత విజయం

శాన్ సిరోలో ఆదివారం జరిగిన తాజా సిరీస్ A మ్యాచ్‌లో AC మిలన్‌పై ఇంటర్ 1-0తో విజయం సాధించింది. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ మొదటి అర్ధ భాగంలో అద్భుత ప్రదర్శన చేయడంతో ఇంటర్ విజయానికి పునాది పడింది.

సెవిల్లాపై 3-0 తేడాతో బార్సిలోనా విజయం

లాలిగా 2022-23లో లీగ్ లీడర్లు ఐదవ వరుస గేమ్‌లో విజయం సాధించగా.. బార్సిలోనా 3-0తో సెవిల్లాను ఓడించింది. జోర్డి ఆల్బా 58వ నిమిషంలో బార్సిలోనాను అగ్రస్థానంలో నిలిపాడు.

ప్రీమియర్ లీగ్‌లో హ్యారికేన్ అద్భుత రికార్డు

ప్రీమియర్ లీగ్‌లో హ్యారికేన్ సంచలన రికార్డును నమోదు చేశారు. 200వ ప్రీమియర్ లీగ్ గోల్ ను సాధించి అద్భుత రికార్డును తన పేరిట రాసుకున్నారు. ఈ ఫీట్ సాధించిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కారు.

భారత్ జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌పై నిషేధం

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ లో భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారత స్టార్ జమ్మాస్ట్ దీపా కర్మాకర్‌ పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల పాటు నిషేధం విధించింది. నిషేధిత పదార్థాన్ని తీసుకున్నందుకు కర్మాకర్‌ను ఇంటర్నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ దోషిగా తేల్చింది.

మాజీ ప్రియురాలిపై ఆసీస్ టెన్నిస్ స్టార్ దాడి

మాజీ ప్రియురాలిపై టెన్నిస్ స్టార్ ఆటగాడు నిక్ కిర్గియోస్ దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. మానసిక ఆరోగ్య సమస్యల కారణం వల్లే దాడికి పాల్పడినట్లు కిర్గియోస్ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో నేరారోపణ నుండి కెర్గియోస్ తప్పించుకున్నాడు.

మూడువారాలు పాటు ఆటకు దూరం కానున్న ఎంబాపే

ఛాంపియన్స్ లీగ్ చివరి-16, ఫస్ట్-లెగ్ టై వర్సెస్ బేయర్న్ మ్యూనిచ్‌కు ఎంబాపే దూరమయ్యాడు. గాయంతో మోంట్‌పెల్లియర్‌తో జరిగిన పీఎస్‌జీ మ్యాచ్ ప్రారంభంలోనే పిచ్‌ను వదిలి బయటికి వెళ్లాడు. గాయం తీవ్రత వల్ల మూడువారాలు పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు వెల్లడించారు. లియోనెల్ మెస్సీ గోల్ చేయడంతో పీఎస్‌జీ 3-1తో మ్యాచ్‌ను గెలుచుకుంది.

సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం

OPPO ఫిబ్రవరిలో Find X6 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. Find X6 సిరీస్‌లో Find X6 pro మోడల్‌లతో సహా మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. OPPO Find X6 సిరీస్ గురించి గత ఏడాది చివర్లో వార్తలు వినిపించాయి అయితే ఆ తర్వాత Find N2, N2 ఫ్లిప్ మోడల్‌ల వైపు అందరి దృష్టి మారిపోయింది.

31 Jan 2023

హకీ

ఆగ్రస్థానికి ఎగబాకిన జర్మనీ

ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్ లో జర్మనీ ఆగ్రస్థానంలో నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ 5-4తో బెల్జియాన్ని ఓడించి మూడోసారి ప్రపంచకప్ ను ముద్దాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా, ఒడిశాలో ముగిసిన ఈవెంట్‌కు ముందు జర్మన్లు ​​నాల్గవ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది.

జొకోవిచ్, నాదల్ సాధించిన రికార్డులివే

జొకోవిచ్, నాదల్ ఇద్దరూ గొప్ప టెన్నిస్ ఆటగాళ్ళు, ఇద్దరి పేరుమీద మెరుగైన రికార్డులున్నాయి. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో తన కెరీర్‌లో వరుసగా 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిట్ ను గెలుచుకున్నాడు.