ప్రపంచం: వార్తలు

క్లబ్ మేనేజర్‌గా సీన్ డైచే, ధ్రువీకరించిన ఎవర్టన్

వెస్ట్ హామ్ యునైటెడ్‌తో 2-0 తేడాతో క్లబ్ ఓడిపోవడంతో తమ మేనేజర్ ఫ్రాంక్ లాంపార్డ్‌ను తొలగించిన విషయం తెలిసిందే. తర్వాత క్లబ్ నూతన పురుషుల సీనియర్ టీమ్ మేనేజర్‌గా సీన్ డైచే నియామకాన్ని ఎవర్టన్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రస్తుతం ధ్రువీకరించింది.

అలా ప్రవర్తించడం నాకే నచ్చలేదు : మెస్సీ

అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన కెరీర్ లో లోటుగా ఉన్న ఫిఫా వరల్డ్ కప్ ను గతేడాది అందుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ ను అందుకోవడంలో నాలుగుసార్లు విఫలమైన మెస్సీ ఐదో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. జట్టును అంతా తానై నడిపించి, ఫైనల్లో ఫ్రాన్స్ పై షూటౌట్ ద్వారా విజేతగా నిలిపాడు. టోర్నిలో ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును కైవసం చేసుకున్నాడు.

డ్రాగా ముగిసిన జర్మన్-ప్యారిస్ మ్యాచ్

లీగ్ 1 2022-2023లో భాగంగా ఆదివారం సెయింట్ జర్మన్, లీడర్స్ ప్యారిస్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. రీమ్స్ చివరి 96వ నిమిషంలో ఈక్వలైజర్‌ను కనుగొన్న ప్యారిస్ సెయింట్-జర్మన్‌కు సంబంధించిన మూడు పాయింట్లను తిరస్కరించింది.

రోమాపై విజయం సాధించిన నాపోలి

AS రోమాపై 2-1 తేడాతో నాపోలి గెలుపొందింది. మూడు దశాబ్దాలకు పైగా మొదటి సీరీ A టైటిల్‌ను సాధించడంలో నాపోలి, గియోవన్నీ సిమియోన్ సహాయపడింది.

యూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్‌ నియామకం

కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం యూనిలీవర్ సంస్థ సోమవారం తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హీన్ షూమేకర్‌ను ప్రకటించింది. జూలై 1 నుండి అలాన్ జోప్ స్థానంలో హీన్ షూమేకర్‌ కొనసాగుతారు.

రియల్ సొసిడాడ్ చేతిలో రియల్ మాడ్రిడ్ పరాజయం

2022-23 లా లిగాలో రియల్ మాడ్రిడ్ పరాజయం పాలైంది. రియల్ సోసిడాడ్ చేతిలో రెండు కీలకమైన పాయింట్లను కోల్పోవడంతో రియల్ మాడ్రిడ్ ఓడిపోయింది.

ఫైనల్‌లో తలపడనున్న బెల్జియం, జర్మనీ

పురుషుల హాకీ వరల్డ్‌కప్ ఫైనల్స్ లో బెల్జియం, జర్మనీ ప్రవేశించాయి. సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై జర్మనీ విజయం సాధించి, ఫైనల్స్ కి చేరకుంది.

ఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు

జర్మన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం SAP కూడా ఉద్యోగులను తొలగించే టెక్ కంపెనీల లిస్ట్ లో చేరింది. సంస్థ 3,000 మందిని అంటే ప్రపంచవ్యాప్తంగా 2.5%మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.

ఉద్యోగ కోతలు మొదలుపెట్టిన మరో కంపెనీ, 3,900 ఉద్యోగులను తొలగించనున్న IBM

ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (IBM)కూడా ఉద్యోగులను తొలగించే టెక్ దిగ్గజాల జాబితాలో చేరింది. 3,900 మంది సిబ్బందిని అంటే ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో 1.5% మందిని తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ తొలగింపులు asset divestmentలో అంటే కొన్ని రంగాల్లో తమ వ్యాపారాన్ని నిలిపివేయడంలో భాగమని అంతేకాని పనితీరు అంచనాల ఆధారంగా కాదని సృష్టం చేసింది.

నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం

మైక్రోసాఫ్ట్ 2022 చివరి మూడు నెలల ఆదాయాల నివేదికను ప్రకటించింది. ఈ త్రైమాసిక ఆదాయం గత 6 సంవత్సరాల కాలంలో అత్యల్ప వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఖర్చులను తగ్గించడానికి భారీగా ఉద్యోగులను తొలగించింది.

పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS

బి ఎం డబ్ల్యూ 2024 M3 CS మోడల్‌ ను తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,000 కార్లను ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తుంది. ఇది ప్రత్యేక సిగ్నల్ గ్రీన్ పెయింట్ తో వస్తుంది.

2-0 తేడాతో న్యూజిలాండ్‌పై బెల్జియం విజయం

ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం విజయం సాధించింది. భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ పై 2-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు బెల్జియం దూసుకెళ్లింది.

ఐదు గోల్స్‌తో రికార్డు బద్దులు కొట్టిన ఎంబప్పే

ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ ఎంబెప్పా ఐదు గోల్స్ చేసి పారిస్ ఫ్రెంచ్ కప్‌లో ఆరవ-స్థాయి క్లబ్ పేస్ డి కాసెల్‌ను మట్టికరిపించాడు. ఈ విజయంతో PSG ఫ్రెంచ్ కప్‌లో 16వ స్థానానికి చేరుకున్నాడు. నేమార్, కార్లోస్ సోలెర్ ఒక్కో గోల్ సాధించారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు

మ్యూజిక్-స్ట్రీమింగ్ సంస్థ Spotify మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకోవడం కోసం 6% సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ డేనియల్ ఏక్ బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు.

సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన రుబ్లెవ్

ఐదోవ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో సత్తా చాటాడు. పురుషుల సింగల్స్ లో క్వార్టర్ ఫైనల్ కి అర్హత సాధించాడు. తొమ్మిదో-సీడ్ హోల్గర్ రూన్‌పై 6-3, 3-6, 6-3, 4-6, 7-6(9)తో రుబ్లెవ్ సంచలన విజయాన్ని నమోదు చేశారు. రుబ్లెవ్ తన కెరీర్‌లో ఏడవ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం.

క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లిన కరోలియా ప్లిస్కోవా

ప్రపంచ మాజీ నంబర్ వన్, కరోలినా ప్లిస్కోవా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో సత్తా చాటింది. చైనాకు చెందిన 23వ ర్యాంకర్ జాంగ్ షువాయ్‌ను మట్టి కరిపించింది. తన ప్రత్యర్థిని వరుస సెట్లలో (6-0, 6-4) ఓడించి కరోలియా ప్లిస్కోవా నాలుగో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

విక్టర్ ఆక్సెల్‌సెన్‌ను మట్టికరిపించిన కున్లావుట్ విటిడ్ సర్న్

థాయ్ లాండ్ కు చెందిన కున్లావుట్ విటిడ్ సర్న్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన డెన్నార్క్కు చెందిన విక్టర్ ఆక్సెల్‌సెన్‌ను మట్టికరిపించి సత్తా చాటాడు.

ఐఫోన్ లో ఇకపై సులభంగా ట్విట్టర్ ట్వీట్‌లను బుక్‌మార్క్ చేయచ్చు

ట్విట్టర్ ఐఫోన్ వినియోగదారులు ట్వీట్‌లను సులభంగా బుక్‌మార్క్ చేసేలా ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బుక్‌మార్క్ చేయడానికి వినియోగదారులు ట్వీట్ వివరాల క్రింద ఉన్న బుక్‌మార్క్ బటన్‌పై నొక్కాలి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల విషయానికొస్తే, ఫ్లాగ్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా ఫోల్డర్‌లలో తమకు నచ్చిన ట్వీట్‌లను సేవ్ చేసుకోవచ్చు.

టెస్టింగ్ దశలో ఉన్న Xiaomi మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, Modena

Xiaomi మంగోలియాలో తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు Modenaను టెస్టింగ్ దశకు తీసుకువచ్చింది. ఈ రాబోయే ఎలక్ట్రిక్ వాహనంలో ఆటోనోమస్ డ్రైవింగ్ సామర్థ్యం ఉంది.

21 Jan 2023

గూగుల్

గూగుల్ లో 12,000 ఉద్యోగుల తొలగింపు, క్షమాపణ కోరిన సుందర్ పిచాయ్

టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపు సీజన్ నడుస్తుంది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ ఇంక్. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరింది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ సుమారు 12,000 మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.

రీడ్ హేస్టింగ్స్ పదవీ విరమణతో కొత్త సిఈఓ ను నియమించిన నెట్‌ఫ్లిక్స్‌

నెట్‌ఫ్లిక్స్‌ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సహ-వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సిఈఓ పదవి విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. కంపెనీ అద్దె ద్వారా మెయిల్ DVD సేవ నుండి ఎంటర్టైన్మెంట్ వేదికగా ఎదిగేవరకు అతను రెండు దశాబ్దాలుగా ఈ పదవిలో కొనసాగారు.

20 Jan 2023

విమానం

తొలి ప్రయోగాన్ని పూర్తి చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ విమానం

ZeroAvia, ఒక బ్రిటిష్-అమెరికన్ హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ డెవలపర్, ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్-ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.

పారిస్ సెంయిట్- జెర్మెయిన్ జట్టు థ్రిలింగ్ విక్టరీ

సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా రోనాల్డ్, మెస్సీ తలపడ్డారు. రియాజ్ సీజన్, పారిస్ సెంయిట్- జెర్మెయిన్ టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఔట్

సొంత గడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగల్స్ లో డిఫెండింగ్ చాంఫియన్ లక్ష్యసేన్, మహిళల సింగల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు.

20 Jan 2023

బైక్

గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన 2023 యమహా గ్రాండ్ ఫిలానో

టూ-వీలర్ తయారీ సంస్థ యమహా గ్లోబల్ మార్కెట్‌లలో గ్రాండ్ ఫిలానో 2023 వెర్షన్ ను విడుదల చేసింది.ఇప్పుడు ఇందులో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఇది భారతదేశంలో అమ్ముతున్న Fascino 125 Fi హైబ్రిడ్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతానికి, ఈ బ్రాండ్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది ఆ సంస్థ ఇంకా తెలియజేయలేదు.

4-2 తేడాతో వేల్స్‌పై భారత్ ఘన విజయం

కళింగ స్టేడియంలో గురువారం జరిగిన హాకీ ప్రపంచకప్ 2023 ఫైనల్స్ లో భారత పురుషుల జట్టు 4-2తో వేల్స్‌ను ఓడించింది. భారత్ తరఫున షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేయగా, వేల్స్‌కు చెందిన ఫర్లాంగ్ గారెత్, డ్రేపర్ జాకబ్ గోల్స్ చేశారు.

ఇండియా ఓపెన్స్ నుండి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి అవుట్

భారత్ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి గురువారం ఇండియా ఓపెన్ నుంచి తప్పుకున్నారు. స్వాతిక్, చిరాగ్ లు సూపర్ 750 ఈవెంట్ నుండి నిష్క్రమించారు. న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీ రెండో రౌండ్‌లో వీరిద్దరూ చైనాకు చెందిన యు చెన్ లియు, జువాన్ యి ఓయుతో తలపడాల్సి ఉంది.

AC మిలన్‌పై 3-0 తేడాతో ఇంటర్ మిలస్ విజయం

AC మిలన్‌పై ఇంటర్ మిలస్ విజయం సాధించింది. AC మిలన్‌పై 3-0 తేడాతో ఇంటర్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో సూపర్ కోప్పా ఇటాలియానా ట్రోఫిని ఇంటర్ కైవసం చేసుకుంది.

మహిళా రెజ్లర్లపై కోచ్‌లు లైంగిక వేధింపులు

కోచ్‌ల వేధింపులు తాళలేక 30మంది మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నాకు దిగారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేష్ పొగట్, సాక్షి మాలిక్ లైగింక వేధింపుల ఆరోపణలను చేశారు.

ఎమ్మా రాడుకానుపై కోకో గౌఫ్ విజయం

2023 ఆస్ట్రేలియా ఓపెన్లో టెన్నిస్ స్టార్ కోకో గౌఫ్ అద్భుతంగా ఆడింది. ఎమ్మా రాడుకాను కోకో గౌఫ్ ఓడించింది. మ్యాచ్ టైబ్రేకర్‌కు ముందు గౌఫ్ తొలి సెట్‌లో 6-3తేడాతో గౌఫ్ ముందుకెళ్లింది.

415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు

FTX కష్టాలు త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. దానికి కారణం ఇప్పటికే దివాళా తీసిన FTX US ప్లాట్‌ఫారమ్ నుండి $90 మిలియన్లు, గ్లోబల్ ఎక్స్ఛేంజ్ నుండి $323 మిలియన్లతో సహా దాదాపు $415 మిలియన్ల విలువైన క్రిప్టోను హ్యాకర్లు దొంగిలించారని సిఈఓ జాన్ J. రే III తెలిపారు.

మూడో రౌండ్‌కు అర్హత సాధించిన స్వియాటెక్, సక్కరి

2023 ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇగా స్వియాటెక్, సక్కరి చక్కటి ప్రదర్శన చేయడంతో మూడో రౌండ్‌కు అర్హత సాధించారు. టెన్నిస్‌లో మహిళల సింగిల్స్ ప్రపంచ నంబర్ వన్ స్వియాటెక్, కమిలా ఒసోరియాను వరుస సెట్లలో ఓడించింది. అనంతరం డయానా ష్నైడర్‌పై గ్రీకు సంచలనం మారియా సక్కరి విజయం సాధించింది.

2023 ఆస్ట్రేలియన్ ఓపెన్లో రాఫెల్ నాదల్ ఓటమి

ఆస్ట్రేలియా ఓపెన్ నుండి రాఫెల్ నాదల్ నిష్క్రమించాడు. రెండో రౌండ్ లో అమెరికన్ మెకెంజీ చేతిలో ఓడిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుండి బయటికొచ్చాడు. గాయంతో ఇబ్బంది పడుతున్నా బరిలోకి దిగిన నాదల్ ఒక సెట్ వెనుకబడ్డాడు. నాదల్ రెండో సెట్ చివరిలో మెడికల్ టైమ్ తీసుకున్నా.. చివరికి పరాజయం పాలయ్యాడు.

రెండో రౌండ్‌కు చేరుకున్న అలెగ్జాండర్ జ్వెరవ్

జర్మనీ స్టార్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. జువాన్ పాబ్లో వరిల్లాస్‌ను ఐదు సెట్లలో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. నాలుగు గంటల ఆరు నిమిషాల్లో ప్రపంచ 103వ ర్యాంకర్‌ను 4-6, 6-1, 5-7, 7-6(3), 6-4తో అధిగమించాడు. జ్వెరెవ్ ఈ సీజన్‌లో తన మొదటి టూర్-లెవల్ విజయాన్ని సాధించాడు. జ్వెరవ్ గాయం నుండి కోలుకొని యునైటెడ్ కప్‌లోకి తిరిగొచ్చి సత్తా చాటాడు.

హోరాహోరీ పోరులో మాటియో బెరెట్టినిపై ఆండ్రీ ముర్రే విజయం

మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్, ఆండీ ముర్రే తొలి రౌండ్‌ను అతి కష్టం మీద అధిగమించాడు. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభ రౌండ్‌లో (13వ సీడ్) మాటియో బెరెట్టినిని ఓడించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో ముర్రే.. ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినీని 6-3, 6-3, 4-6, 6-7(7), 7-6(10-5) తేడాతో ఓడించి సత్తా చాటాడు. దాదాపు మ్యాచ్ 4 గంటల 49 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగింది.

రెండో రౌండ్‌కు చేరుకున్న రష్యా స్టార్ మెద్వెదేవ్

ఆస్ట్రేలియా ఓపెన్లో సోమవారం జరిగిన ఓపెనింగ్ రౌండ్లో రష్యా స్టార్ డేనియల్ మెద్వెదేవ్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మార్కోస్ గిరోన్‌పై మెద్వెదేవ్ పోటిపడి గెలిచాడు. మెల్‌బోర్న్‌లో రెండో రౌండ్‌కు వెళ్లేందుకు 6-0, 6-1, 6-2 తేడాతో గెలుపొంది సత్తా చాటాడు.

17 Jan 2023

ఆపిల్

ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న ఆపిల్ సంస్థ

ఎట్టకేలకు ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్యను ఆపిల్ పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తోంది. ఫోన్ ఆన్ చేసినప్పుడు స్క్రీన్‌పై సమాంతర రేఖల సమస్య ఎదుర్కుంటున్న వినియోగదారులకు ఇది శుభవార్తే.

స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో మొట్టమొదటి తయారుచేసిన మాడా 9 అనే సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది తాలిబాన్. ENTOP అనే సంస్థ ఈ వాహనాన్ని ఐదు సంవత్సరాలు రూపొందించింది. అద్భుతమైన పనితీరుతో పాటు స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ కార్ టయోటా కరోలా ఇంజిన్ తో నడుస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కూడా వచ్చే అవకాశముంది.

పురుషుల సింగల్స్‌లో సత్తా చాటిన నాదల్

22సార్లు గ్రాండ్ స్లామ్ విజేత రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 పురుషుల సింగల్స్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. తొలి రౌండ్‌లో అరంగ్రేటం చేసిన జాక్ డ్రేవర్‌ను ఓడించారు. అయితే జాక్ డ్రేపర్‌తో జరిగిన ఫిట్ నెస్ పోరులో 7-5, 2-6, 6-4తో తిరుగులేని విజయాన్ని అందించాడు. దీంతో నాదల్ రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న కిర్గియోస్

నిక్ కిర్గయోస్ ఆస్రేలియా ఓపెన్ నుండి తప్పుకున్నాడు. గాయం కారణంగా తన సొంత గ్రౌండ్ లో స్లామ్‌ ఆడకపోవడం చాలా దారుణమైన విషయమని కిర్గియోస్ చెప్పారు. టైటిల్ గెలవడానికి అవకాశంగా భావించిన ఈ ఆస్ట్రేలియన్ చీలిమండ సమస్య కారణంగా మొత్తం టోర్నికి దూరమయ్యాడు.