ప్రపంచం: వార్తలు

శని గ్రహం చుట్టూ ఉండే వలయాల గుట్టు విప్పిన NASA

NASA హబుల్ స్పేస్ టెలిస్కోప్ చాలా సంవత్సరాలుగా శనిగ్రహాన్ని పర్యవేక్షిస్తుంది, ఎందుకంటే ఈ గ్రహం సూర్యుని చుట్టూ 29 సంవత్సరాల సుదీర్ఘ కక్ష్యలో తిరుగుతుంది.

'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా?

గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రచారంతో భారతదేశాన్ని ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రయత్నం చేసింది. అయితే ప్రపంచవ్యాప్త డిమాండ్ తగ్గడంతో తయారీ రంగం ఒత్తిడికి గురవుతుంది. భారతదేశ ఎగుమతి ఆదాయాన్ని దెబ్బతీసి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నందున ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం రాబోయే బడ్జెట్‌లో తన విధానాలను సర్దుబాటు చేయవలసి ఉంటుంది.

టెన్నిస్ దిగ్గజం మార్టినాకు మరోసారి క్యాన్సర్ ఎటాక్

టెన్నిస్ స్టార్ మార్టినా నవత్రిలోవా మళ్లీ కేన్సర్ బారినపడ్డారు. దీంతో అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం కేన్సర్ తో పోరాడుతున్నానని టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా సోమవారం వెల్లడించారు.

03 Jan 2023

గూగుల్

మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు

టెక్ సంస్థలు మళ్ళీ వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే USలోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఈసారి కోతలు మరింత ఎక్కువగా ఉండచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్

క్రిప్టోకరెన్సీ ప్రధాన డెవలపర్‌లలో ఒకరైన బిట్‌కాయిన్ ల్యూక్ డాష్జర్ కు ఈ కొత్త సంవత్సరం అంతగా కలిసిరాలేదు. అతని క్రిప్టో వాలెట్ హ్యాక్ దాడికి గురైంది, అతని వ్యక్తిగత హోల్డింగ్స్ నుండి 216.93 బీట్ కాయిన్ల నష్టానికి దారితీసింది. ఒక్కో బీట్ కాయిన్ ధర $16,570 (దాదాపు రూ. 13.7 లక్షలు)గా ఉంది. అంటే, $3.6 మిలియన్లు (దాదాపు రూ. 30 కోట్లు) నష్టపోయారు.

హార్థిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేస్తారా.. ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..!

2022లో టీమిండియా అశించిన విజయాలు సాధించకపోవడంతో సెలెక్టర్లతో పాటు బీసీసీఐకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలం చెందడంతో టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటి బాట పట్టింది. వయస్సు మీద పడుతున్న రోహిత్‌శర్మను తప్పించి కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు బీసీసీఐ నిమగ్నమైంది.

పిల్లల కోసం ప్రత్యేకంగా Tab M9ని లాంచ్ చేసిన Lenovo

చైనీస్ టెక్ దిగ్గజం Lenovo Tab M9 పేరుతో కొత్త టాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఈ ఏడాది మధ్యలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

నాదల్ రికార్డులపై జకోవిచ్ గురి..!

ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడేందుకు నోవాక్ జొకోవిచ్‌కు అవకాశం దక్కింది. కరోనా వ్యాక్సిన్ టీకాను వేసుకోకపోవడంతో గతంలో టోర్నమెంట్స్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్‌ ఆడటానికి అవకాశం రాలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్ని నుంచి మాత్రం ఆయనే స్వయంగా తప్పుకున్నాడు.

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. లిక్కర్‌పై పూర్తస్థాయిలో పన్ను రద్దు.. ఎక్కడో తెలుసా?

అద్భుతమై ప్రదేశాలకు నెలవైన దుబాయ్‌కు పర్యాటకుల తాకిడి నిత్యం ఉంటుంది. అయితే దేశ పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు.. నూతన సంవత్సరం వేళ.. ఆ దేశ రాజ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

స్వీయ- అభ్యాస బ్రెయిలీ పరికరం 'Annie' గురించి తెలుసుకుందాం

గోవాలోని BITS పిలానీకి చెందిన అమన్ శ్రీవాస్తవ, అతని ముగ్గురు స్నేహితుల మధ్య టిఫిన్ తింటున్నప్పుడు ప్రారంభమైన సంభాషణ ఒక పరిశోధన ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంది. ఆ విధంగా బెంగళూరుకు చెందిన టింకర్‌బెల్ ల్యాబ్స్ దృష్టి లోపం ఉన్న పిల్లలకు బ్రెయిలీ లిపిని నేర్పడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి స్వీయ-అభ్యాస పరికరం 'Annie'ని అభివృద్ధి చేసింది.

'టీ20 వరల్డ్ కప్ చాహెల్ అడుంటే ఎక్కవ నష్టం జరిగేది' : దినేష్ కార్తీక్

టీమిండియా సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్.. స్పిన్నర్ చాహల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ లో లెగ్ స్పిన్నర్ చాహల్ ను ఆడించి ఉంటే టీమిండియా ఎక్కువ నష్టం జరిగేదని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.

బౌండరీ లైన్ బయట క్యాచ్ పట్టినా ఔటిచ్చారు.. ఎందుకు..?

బౌండరీ లైన్ బయట క్యాచ్ పడితే అది సిక్సర్ అవుతుంది. అయితే బౌండరీ లైన్ బయట క్యాచ్‌ను ఔటిచ్చారు అంపైర్లు.. బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఫీల్డర్ పట్టిన క్యాచ్ చర్చనీయాంశమైంది.

2022లో లియాన్, రబాడ సరికొత్త రికార్డు

ధక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ, ఆస్ట్రేలియా ఆప్ స్పిన్నర్ నాథల్ లియాన్ ఈ ఏడాది టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లగా రికార్డుకెక్కారు. 2022లో మంచి ఫామ్‌ను కొనసాగిస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

టీ20 సిరీస్‌లో.. ముగ్గురు నయా ప్లేయర్లు

టీమిండియాలో ముగ్గురు జూనియర్ ఆటగాళ్లకు చోటు లభించింది. టీమిండియా జట్టు జనవరిలో మూడు వన్డేలు, మూడు టీ20లను స్వదేశంలో శ్రీలంకతో ఆడనుంది. సీనియర్ ఆటగాళ్ల పక్కను పెట్టి జూనియర్ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. టీ20 కెప్టెన్‌గా హార్థిక్, వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు.

సిక్స్ ప్యాక్ లుక్‌లో అర్జున్ టెండూల్కర్ అదరహో..

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఒకప్పుడు సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేసేవారు. ప్రస్తుతం ఆ జాబితాలోకి యువ క్రికెటర్లు కూడా రాబోతున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా సిక్స్ ప్యాక్ బాడిని ఒకప్పుడు ప్రదర్శించారు. వీరి జాబితాలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఈ జాబితాలో చేరిపోయాడు.

కోనేరు హంపి ఆట ఆదుర్స్

ప్రపంచ బ్లిట్జ్ లో కోనేరు హంపి చరిత్రను బద్దలు కొట్టింది. 9రౌండ్లు ముగిసేసరికి 44వ స్థానంలో ఉంది. ఇంకె ఆమె పతకం సాధించదని అందరూ ఓ అంచనాకు వచ్చారు. అయితే అంచనాలను తలకిందులు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫామ్ ఉన్న అమ్మాయిలను వెనక్కి నెట్టి ప్రపంచ బ్లిట్జ్ టోర్నలో పతకం సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్రను తిరగరాసింది.

గత పదేళ్లలో ఐదు అద్భుత టెస్టు సిరీస్‌లు

టెస్టు మ్యాచ్ ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని మ్యాచ్‌లు ఇప్పటికీ చూసిన ఉత్కంఠను రేపుతాయి.

2023 లో ఇస్రో చేయబోతున్న ప్రయోగాలు

2023 లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, భూమిని పరిశోధించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అక్టోబర్ 2022 నాటికి USA, జర్మనీ, కెనడా, స్వీడన్‌తో సహా 34 దేశాల కోసం దాదాపు 385 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు 2023 లో జరపబోయే మిషన్ల గురించి తెలుసుకుందాం.

రోనాల్డ్‌కి బంఫరాఫర్.. సౌథీతో రూ.2వేల కోట్ల డీల్..!

పోర్చుగల్ ఫుట్ బాల్ వీరుడు క్రిస్టియానో రోనాల్డ్ మాంచెస్టర్ యూనైటైడ్ తో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.గతంలో ప్రపంచ కప్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు రోనాల్డ్.. మాంచెస్టర్ యూనైటెడ్ జట్టు, మేనేజర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం అప్పట్లో దూమారం రేపింది.

2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం

ఉక్రెయిన్ యుద్ధం, బలమైన డాలర్, ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రూడ్ దిగుమతిదారు చైనా నుండి డిమాండ్ తగ్గడం వలన చమురు ధరలు శుక్రవారం పెరిగాయి.

పెట్: ఎలాంటి బ్రీడ్ కుక్కపిల్లను పెంచుకోవాలో మీకు తెలుసా? ఇది తెలుసుకోండి

చాలామందికి పెట్స్ ని పెంచుకోవాలని ఇష్టంగా ఉంటుంది. కొందరు కుక్కలను పెంచుకుంటే కొందరు పిల్లులను పెంచుకుంటారు. కుక్కపిల్లల్ని పెంచుకోవాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

భారత్‌తో పోరుకు సై అంటున్న వార్నర్

ఆస్రేలియా డేంజరేస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన వంద టెస్టులో సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫిబ్రవరిలో భారత్తో టెస్టు సిరీస్ జరగనుంది. దీనిపై డేవిడ్ వార్నర్ తాజాగా స్పందించాడు. భారత్ టెస్టు సిరీస్ గొప్ప సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు.

ఈ ఏడాది ఎంట్రీతో సత్తా చాటిన బౌలర్లు వీరే..

ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాడ్ తరుపున ఆరగ్రేటం చేసిన మ్యాటీ పాట్స్ అద్భుతంగా రాణించాడు. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో విలియమ్సన్ వికెట్ తీసి సత్తా చాటాడు. 4/13 రాణించి టెస్టులో అకట్టుకున్నాడు.

2022వ సంవత్సరం ప్రపంచ కుబేరుల లిస్ట్ లోకి గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల స్థాయికి ఎదిగారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్ టెన్‌లో ఈ ఏడాది తన సంపదను పెంచుకున్న ఏకైక వ్యక్తి కూడా అదానీ మాత్రమే.

ఫుట్ బాల్ ప్లేయర్ పీలే

ఫుట్ బాల్

లెజండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నూమూత

క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. బ్రెజిల్కు మూడుసార్లు కప్పు అందించిన పీలే(82) కన్నుమూశారు. పీలే చాలా సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పీలే మరణాన్ని అతని కుమార్తె కెల్లీ నాసిమెంటో ఇన్ స్టాగ్రామ్‌లో వెల్లడించారు. 1958, 1962, 1970లో బ్రెజిల్‌కు ప్రపంచ కప్పును అందించారు.

భారత హాకీ ఇండియా జట్టుకు నగదు బహుమతి

భారత్ హాకీ ఇండియా సరికొత్త నిర్ణయం తీసుకుంది. హాకీని మరింత ప్రోత్సహించేలా జట్టులోకి సభ్యులకు నగదును బహుమతిని ప్రకటించింది. ప్రస్తుతం నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందనలు తెలుపుతూ ట్విట్స్ చేస్తున్నారు. జనవరిలో జరిగే FIH పురుషుల ప్రపంచ కప్ 2023 భువనేశ్వర్-రూర్కెలాలో జరగనుంది.

చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్ సవితా శ్రీ భాస్కర్

భారత్ చెస్ ప్లేయర్ సవితాశ్రీ భాస్కర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. కజకిస్తాన్‌లో జరిగిన ఎఫ్‌ఐడీఈ (ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్) వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి రికార్డును క్రియేట్ చేసింది. వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెలిచిన మూడో భారత చెస్ ప్లేయర్‌గా నిలిచి అరుదైన ఘనత తన సొంతం చేసుకుంది.

భారీ అంచనాలతో అరంగ్రేట్రం... ఆ తర్వాత అడ్రస్ గల్లంతు..!

టీమిండియాలో చోటు సంపాదించడం చాలా కష్టం.. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చి.. తరువాత చోటు దక్కకపోతే భవిష్యతులో ఆ ప్రభావం ఆటపై పడే అవకాశం ఉంటుంది. 2021లో జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు 2022లో ఇంటర్నేషన్ క్రికెట్ కి దూరంగా ఉండడం గమనార్హం.

2023 జనవరిలో బీసీసీఐ నూతన సెలక్షన్ కమిటీ..!

2023 జనవరిలో అశోక్ మల్హోత్రా నేతృత్వంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ, కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ముంబైలోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కార్యాలయంలో సమావేశం డిసెంబర్ 30న జరగనుంది. ఇందులో సభ్యులగా సులక్షణ నాయక్, పరంజ్పే ఉండనున్నారు.

టీ20 మహిళల ప్రపంచ కప్‌లో వెటరన్ పేసర్ రీ ఎంట్రీ

వచ్చే ఏడాది 2023 టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత మహిళ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ ప్రీతికౌర్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఇక టాప్‌లో కొనసాగుతున్న స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్

ఇటీవల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 3-0 సిరీస్ విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం అతని స్థానంలో నజామ్ సేథీని నియమించారు.

మెస్సీ పేరును వాడకూడదని.. అమల్లోకి చట్టం

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అంటే ఇలానే ఉంటుంది అన్నట్లుగా కప్పు కోసం అర్జెంటీనా- ఫ్రాన్స్ జట్లు కొదమ సింహాల్లా తలపడ్డాయి. చివరికి పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో గెలిచి మూడో ప్రపంచకప్‌ను అందుకుంది. వయసు పెరిగినా.. ఆట తగ్గలేదంటూ మెస్సీ అర్జెంటీనా జట్టును ముందుండి నడిపించి విజయంలో భాగస్వామ్యం అయ్యాడు.

12 ఏళ్లు నిరీక్షించి.. కలను సాకారం చేసుకున్నాడు

టీమిండియా బౌలర్ జయదేవ్ ఉనద్కత్ 12 ఏళ్ల తరువాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. తనపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ అందివచ్చిన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు లెఫ్టార్మ్‌ పేసర్‌.

ధోని కూతురికి సర్‌ప్రైజ్ గిప్ట్‌ను పంపిన మెస్సీ

ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ 2022 ట్రోఫీని అర్జెంటీనా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సి కల నేరవేరింది.

'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్

ఒకవైపు కరోనా పీడ తొలగకముందే.. మరోవైపు కొత్త వైరస్‌లు పుట్టుకురావడం, పాతవి తిరిగి ప్రభావాన్ని చూపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాలో 'మెదడు తినే అమీబా' వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురువుతున్నాయి.

ఐఏఎస్ సాధించిన ఏకైక భారత్ క్రికెటర్

భారత జట్టులో ఓ గ్రేట్ క్రికెటర్ ఉన్నాడు ఆతను ఆట, చదువు రెండింటిలోనూ విజయం సాధించాడు. దేశంలో అత్యంత కష్టతరమైన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం భారత జట్టులో చేరాడు. ఈ ఆటగాడి పేరు అమయ్ ఖురాసియా.

వార్నర్

క్రికెట్

1089 రోజుల తర్వాత వార్నర్ డబుల్ సెంచరీ.. కానీ అంతలోనే..

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులో చరిత్ర సృష్టించాడు. తన వందో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ప్రస్తుతం టెస్టులో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దాదాపు 1089 రోజుల తర్వాత సెంచరీ చేసి.. విమర్శకుల నోళ్లను మూయించాడు.

2022లో ప్రముఖ లెంజెండరీ ప్లేయర్లు కన్నుమూత

2022 క్రీడారంగంలో తీవ్ర విషాదం నింపింది. వరుసగా దిగ్గజ ప్లేయర్ల మరణాలు అభిమానుల గుండెల్లో శోకాన్నిమిగిల్చాయి.

'అవమానంతో ఆఫీసు నుంచి వెళ్లగొట్టారు' : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్

ఇటీవల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 3-0 సిరీస్ విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం అతని స్థానంలో నజామ్ సేథీని నియమించారు.

ఐపీఎల్‌లో 114 వికెట్లు తీసినా.. వేలంలో చుక్కెదురు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువ మంది వీక్షించే లీగుల్లో ఐపీఎల్‌ ఒకటి. భారత్ ఫాస్ట్ బౌలర్, టీ20 స్పెషలిస్ట్ అయిన సందీప్ శర్మకి ఈ వేలంలో చుక్కెదురైంది. 10మంది ప్రాంచేజీ ఉన్నా.. ఏ ఒక్క ప్రాంచేజీ సందీప్ శర్మ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.