ఎలక్ట్రిక్ వాహనాలు: వార్తలు

హెలికాప్టర్ కంటే వేగంగా ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీ వచ్చేసింది..!

మనం ఇప్పటివరకు చాలా టాక్సీలను చూసి ఉంటాం. కానీ ఇది సరికొత్త ఎలక్ట్రిక్ టాక్సీ. ఇది వరకు ఎన్నడూ లేనట్లుగా ఆకాశంలో ఎగిరే టాక్సీ, త్వరలో ఆకాశంలో వెళుతూ గమ్యానికి చేరుకునేలా ఓ టాక్సీ అందుబాటులో రానుంది. త్వరలో బెంగళూరు జరిగే ఏరో ఇండియా ఈ ప్రదర్శనకు వేదిక కానుంది.

17 Feb 2023

స్కూటర్

సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్

బజాజ్ చేతక్, ఒకప్పుడు ప్రతి మధ్య తరగతి ఇంట్లో ఉండేది. అయితే కైనెటిక్ జూమ్‌లు, హోండా యాక్టివా వంటి బ్రాండ్ల రాకతో అమ్మకాలలో వెనకపడింది. 2006లో చివరిగా చేతక్ విడుదలైంది. మళ్ళీ 16 సంవత్సరాల తరవాత ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో మార్కెట్లోకి రాబోతుంది.

SE కన్వర్టిబుల్ బ్రేక్‌లున్న లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న MINI

దిగ్గజ కార్ల తయారీ సంస్థ MINI గ్లోబల్ మార్కెట్ల కోసం SE కన్వర్టిబుల్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం కేవలం 999 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తి చేయబడుతుంది. కారు బ్రాండ్ ఆధునిక డిజైన్ ఫిలాసఫీని అనుసరిస్తుంది, స్టాండర్డ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ నుండి చాలా డిజైన్ ఎలిమెంట్‌లతో వస్తుంది. ఇది 181hp ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది.

ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం

USలో వాహన దొంగతనం అనేది ఒక పెద్ద సమస్య, కొన్ని బీమా కంపెనీలు సులభంగా దొంగిలించగల మోడల్‌లకు ఇన్సూరెన్స్ కి నిరాకరిస్తాయి. హ్యుందాయ్, కియా మోటార్స్ దాదాపు 8.3 మిలియన్ వాహనాల కోసం ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నాయి, అది వాటిని దొంగిలించడం కష్టం చేస్తుంది. హ్యుందాయ్ ఇప్పటికే తన కార్లపై ఫర్మ్‌వేర్‌ను అందించడం ప్రారంభించింది.

ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు

మెర్సిడెస్-మేబ్యాక్ ఆసియా, యూరోపియన్ మార్కెట్‌ల కోసం S 580e ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లిమోసిన్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన కారు జర్మన్ తయారీ సంస్థ మేబ్యాక్ నుండి మొదటి ఎలక్ట్రిఫైడ్ వాహనం.

హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా హైదరాబాద్ E-Prixలో XUV400 వన్-ఆఫ్ ఫార్ములా E ఎడిషన్‌ను ప్రదర్శించింది. మహీంద్రా ఫార్ములా ఈ-టీమ్ తో మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (మేడ్) ద్వారా ప్రత్యేక లివరీని రూపొందించారు.

10 Feb 2023

స్కూటర్

3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో దాని అత్యంత సరసమైన ఆఫర్ S1 ఎయిర్ కోసం మూడు కొత్త ట్రిమ్ స్థాయిలను ప్రవేశపెట్టింది. స్కూటర్ బేస్ వేరియంట్ ఇప్పుడు చిన్న 2kWh బ్యాటరీ ప్యాక్‌తో , మిడ్-లెవల్ మోడల్ 3kWh బ్యాటరీ ప్యాక్‌ తో, రేంజ్-టాపింగ్ వెర్షన్ 4kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుంది.

భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP

స్వదేశీ స్టార్ట్-అప్ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో OXO మోడల్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 1.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). మోటార్‌సైకిల్ బేస్, ప్రో మోడల్స్ లో అందుబాటులో ఉంటుంది. తయారీ సంస్థ ఈ బైక్‌ను ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ ఈ-మోటార్ షోలో ప్రదర్శించింది. ప్రో ప్యాకేజీ కింద మొత్తం-ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఐదు రంగులలో ఆర్డర్ చేసుకోవచ్చు.

09 Feb 2023

గూగుల్

అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్

ChatGPTతో ఉన్న కొత్త Bing గురించి మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటన గురించి ఇంకా అందరు చర్చిస్తుండగానే గూగుల్ తన AI-సెంట్రిక్ "లైవ్ ఫ్రమ్ ప్యారిస్" ఈవెంట్ ను పారిస్‌లో ఏర్పాటు చేసింది. ఇందులో Bard-గూగుల్ గురించి ప్రివ్యూతో పాటు గూగుల్ లెన్స్ గురించి కొన్ని అప్‌డేట్‌లు ఉన్నాయి.

భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault, జపాన్ తయారీ సంస్థ Nissan భారతీయ మార్కెట్ కోసం మూడు మోడళ్లపై పని చేస్తున్నాయి. ఇందులో 3 rd gen Renault Duster, Renault Triber ఆధారంగా ఒక నిస్సాన్ MPV, ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనం ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ప్లాన్‌ను విజయవంతం చేసేందుకు రెండు కంపెనీలు దాదాపు రూ. 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి.

మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా గత సంవత్సరం ఆగస్టులో బ్రాండ్ యూరోపియన్ డిజైన్ స్టూడియోలో ఐదు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVలను ప్రకటించింది. అవి XUV.e8, XUV.e9, BE.05, BE.07, BE.09 మోడల్స్. కొత్త XUV.e, BE సబ్-బ్రాండ్‌ల క్రింద వస్తాయి. ఫిబ్రవరి 10న ఈ వాహనాలను తొలిసారిగా భారతదేశంలో ప్రదర్శిస్తుంది.

బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు

మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, హీరో మోటోకార్ప్, TVS మోటార్ కంపెనీ, అశోక్ లేలాండ్‌తో సహా దేశంలోని అగ్రశ్రేణి ఒరిజినల్ పరికరాల తయారీదారులు (OEMలు) ఆర్థిక మంత్రి సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023ని ప్రశంసించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను వృద్ధి ఆధారిత, ప్రగతిశీల బడ్జెట్ అని కొనియాడారు.

బడ్జెట్ 2023-24 భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు పనికొచ్చే అంశాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్ 2023ని సమర్పించారు ఇందులో ఆటోమొబైల్ పరిశ్రమకు అనేక రాయితీలను ప్రస్తావించారు. గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టడం, ప్రభుత్వ వాహనాలను రద్దు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా తయారు చేయడం వరకు ఆటోమొబైల్ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు.

భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గా ecoDryftను లాంచ్ చేయబోతున్నPURE EV

PURE EV భారతదేశంలో తన ఎకోడ్రైఫ్ట్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి, డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి. ఈ బైక్ పూర్తి-LED లైటింగ్ సెటప్ తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 130కిమీల వరకు నడుస్తుంది.

భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్

భారతదేశానికి చెందిన SUV స్పెషలిస్ట్ మహీంద్రా XUV400 కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో XUV400ను బుక్ చేసుకోవచ్చు. ఇవి మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. మహీంద్రాకు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV

24 Jan 2023

బైక్

ఓలా S1 Proను డ్రైవ్ చేస్తుండగా విడిపోయిన ముందుచక్రం, ఐసియూలో చికిత్స పొందుతున్న మహిళ

ఓలా S1 Pro భద్రత, నాణ్యత ప్రమాణాలపై మరిన్ని భయాలు పెరిగాయి. జనవరి 21న, ఒక మహిళ స్కూటర్ నడుపుతుండగా ముందు సస్పెన్షన్ విడిపోయి ముందు చక్రం విడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యి ఐసియూలో చికిత్స పొందుతుంది.

40వ వార్షికోత్సవం సందర్భంగా Outlander స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసిన Mitsubishi

Mitsubishi తన Outlander మోడల్ 40వ వార్షికోత్సవ స్పెషల్ ఎడిషన్‌ను USలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర $41,340 (సుమారు రూ. 33.47 లక్షలు). ఈ ఆఫ్-రోడర్ నలుపు, బ్రాంజ్ పెయింట్ తో వస్తుంది. దీనికి లోపలా, బయటా 40వ వార్షికోత్సవ బ్యాడ్జ్‌లు ఉంటాయి. ప్రస్తుతానికి బుకింగ్స్ తెరుచుకున్నాయి.

21 Jan 2023

ధర

టెస్టింగ్ దశలో ఉన్న Xiaomi మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, Modena

Xiaomi మంగోలియాలో తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు Modenaను టెస్టింగ్ దశకు తీసుకువచ్చింది. ఈ రాబోయే ఎలక్ట్రిక్ వాహనంలో ఆటోనోమస్ డ్రైవింగ్ సామర్థ్యం ఉంది.

ఆటోమొబైల్ రంగం భవిష్యత్తును నిర్దేశించనున్న Qualcomm Snapdragon Digital Chassis

టెక్నాలజీ దిగ్గజం Qualcomm USలోని లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో Snapdragon Digital Chassis కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ కారుతో ఆటోమేకర్లు దాని టెక్నాలజీ, సర్వీస్ ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రదర్శించింది. ఇది మొదటి ఆటోమోటివ్ సూపర్-కంప్యూట్ క్లాస్ సొల్యూషన్ గా ప్రచారం అవుతుంది.

19 Jan 2023

బైక్

విడుదలైన HOP లియో ఈ-స్కూటర్, దీనికి మార్కెట్లో ఉన్న ప్రత్యర్ధుల గురించి తెలుసుకుందాం

స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో లియో ఈ-స్కూటర్ హై-స్పీడ్ వెర్షన్‌ను ప్రారంభించింది, దీని ప్రారంభ ధర రూ. 81,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120కిమీల వరకు నడుస్తుంది. ఈ నెల నుండి ఆ బ్రాండ్ షోరూమ్ లో అందుబాటులో ఉంటుంది.

18 Jan 2023

టాటా

ఆటో ఎక్స్‌పో 2023లో 10-సీట్ల టాటా మ్యాజిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించిన టాటా మోటార్స్

స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త మ్యాజిక్ EVని ప్రదర్శించింది. భారతదేశంలో ప్రధానంగా పాఠశాలలు, స్టేజ్ క్యారేజ్, అంబులెన్స్‌లు వంటి డెలివరీ సేవలను లక్ష్యంగా చేసుకుంది.

XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో లాంచ్ చేసిన మహీంద్రా

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ వాహానాన్ని భారతదేశంలో విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. సరికొత్త కార్ టెక్నాలజీతో విశాలమైన క్యాబిన్‌ తో వస్తుంది. మహీంద్రా XUV400 గురించి గత సంవత్సరం సెప్టెంబరులో ప్రకటించారు. ఈ బ్రాండ్ కు ఇదే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ SUV. మార్కెట్‌లో, MG ZS EV, టాటా నెక్సాన్ EV వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతుంది.

ఆటో ఎక్స్‌పో 2023లో ప్రవైగ్ వీర్ EVను లాంచ్ చేసిన ప్రవైగ్ డైనమిక్స్

స్వదేశీ స్టార్టప్ ప్రవైగ్ డైనమిక్స్ ఆటో ఎక్స్‌పో 2023లో వీర్ EVని ప్రదర్శించింది. ఆఫ్-రోడ్ ఎలక్ట్రిక్ కారు ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ కోసం రూపొందించబడింది.

ఆటో ఎక్స్‌పో 2023లో హైడ్రోజన్-శక్తితో పనిచేసే Euniq 7ను ఆవిష్కరించిన MG మోటార్

బ్రిటిష్ సంస్థ MG మోటార్ దాని పూర్తి-పరిమాణ MPV Euniq 7ను ఆటో ఎక్స్‌పో 2023లో విడుదల చేసింది. ఇది వివిధ గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉన్న హైడ్రోజన్-శక్తితో పనిచేసే Maxus Euniq 7 వ్యాన్ రీ-బ్యాడ్జ్ వెర్షన్. ఇది పర్యావరణ అనుకూల వాహనం. MG 2019లో భారతీయ మార్కెట్లో హెక్టర్‌తో ప్రారంభించింది. ఇది ఫీచర్-ప్యాక్డ్ మిడ్-సైజ్ SUV ఆఫర్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను బాగా ఆకర్షించింది.

ఆటో ఎక్స్‌పో 2023లో EV9తో పాటు ఇతర కార్లని ప్రదర్శించిన కియా సంస్థ

ఆటో ఎక్స్‌పో 2023లో భారతదేశంలో వివిధ మోడళ్లను కియా మోటార్స్ ప్రదర్శించింది. బ్రాండ్ EV9 కాన్సెప్ట్, KA4 (కార్నివాల్)తో పాటుగా భారతదేశంలో ఇప్పటికే ఉన్న EV6, సెల్టోస్, సోనెట్ వంటి కొన్ని కార్లను విడుదల చేసింది. కియా మోటార్స్ తన సెల్టోస్ SUV 2019లో 44,000 కంటే ఎక్కువ అమ్మకాలతో భారతీయ మార్కెట్లో ప్రభంజనం సృష్టించింది.

ఆటో ఎక్స్‌పో 2023లో హ్యుందాయ్ సంస్థ విడుదల చేసిన IONIQ 5

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం IONIQ 5 ను భారతీయ మార్కెట్ కోసం విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో ఈ బ్రాండ్ జనవరి 13నుండి 18 వరకు సాధారణ ప్రజలకు కోసం ప్రదర్శిస్తోంది. దీనికి ప్రత్యేకమైన డిజైన్ తో పాటు ఫీచర్-రిచ్ క్యాబిన్‌ ఉంది.

ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్

ముంబైకి చెందిన లిగర్ మొబిలిటీ తన స్కూటర్‌లను ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. వాటి బుకింగ్‌లు 2023 మధ్యలో ప్రారంభమవుతాయి.

11 Jan 2023

టాటా

టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతదేశంలో తన Ace EV మినీ ట్రక్కు డెలివరీలను ప్రారంభించింది. ఇది మే 2022లో ఇక్కడ లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక బాక్స్ లాగా ఉంటుంది, 600 కిలోల వరకు పేలోడ్‌ను మోయగల తేలికపాటి కంటైనర్‌ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జీకి 154కిమీల వరకు నడుస్తుంది.

15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక

దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు 'ఓలా ఎలక్ట్రిక్స్ 'ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తమిళనాడులో ఈ పార్క్‌ ఏర్పాటుకు సుమారు 1500 ఎకరాల భూమిని కొనుగోలు చేయబోతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

లాస్ వెగాస్ CES 2023లో సరికొత్త ఆకర్షణ Peugeot ఇన్సెప్షన్ కాన్సెప్ట్

లాస్ వెగాస్‌లోని CES 2023లో Peugeot ఇన్‌సెప్షన్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శించింది దాని తయారీసంస్థ. ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం ఫాస్ట్ ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్‌తో కేవలం ఐదు నిమిషాల్లో 150కిమీల వరకు వెళ్లగలదు. ఇందులో వీడియో గేమ్స్ లో ఉన్నట్టు దీర్ఘచతురస్రాకార స్టీరింగ్ వీల్‌ను ఉపయోగించే హైపర్‌స్క్వేర్ స్టీర్-బై-వైర్ కంట్రోల్ సిస్టమ్‌తో వచ్చే ఐ-కాక్‌పిట్‌ కూడా ఉంది.

సబ్-బ్రాండ్ AFEELAని ప్రకటించిన సోనీ హోండా మొబిలిటీ

CES 2023లో టెక్నాలజీ దిగ్గజం సోనీ, జపనీస్ ఆటోమేకర్ హోండా మధ్య జాయింట్ వెంచర్ అయిన AFEELA అనే EV సబ్-బ్రాండ్‌ను ప్రకటించారు.

ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV

బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం 2023 MG 4ని ఈ నెలలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.MG 4 గత ఏడాది జూలైలో గ్లోబల్ మార్కెట్‌ లో లాంచ్ అయింది.

భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు

కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించేందుకు వాహన తయారీదారులు అనేక కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. జనవరి 2023లో భారతదేశంలో ప్రారంభించబోయే టాప్ 5 వాహనాల గురించి తెలుసుకుందాం.

VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ VIDA V1 కస్టమర్ డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది. బ్రాండ్ నుండి మొదటి ఎలక్ట్రిక్ వాహనం బెంగళూరులో డెలివరీ చేశారు. జైపూర్, ఢిల్లీలో డెలివరీలు జరుగుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ

భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమ 2024 చివరి నాటికి రూ. 15 లక్షల కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రంగంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో ఒకటిగా మారుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా

మార్గదర్శకంగా నిలిచిన లైఫ్ ఫర్ కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి మోపెడ్ "లూనా" సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం అవతారంలో సోదర సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ & పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ద్వారా లాంచ్ కాబోతుంది.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు

టాక్సీ, లాజిస్టిక్స్ కంపెనీలు వంటి ఫ్లీట్ ఆపరేటర్లు ఎలక్ట్రిక్ వాహనాల్ని ఎక్కువగా లీజుకి తీసుకుంటున్నారు. టాప్ బ్యాంకులు ఎలక్ట్రిక్ వాహనాలకు ఫైనాన్స్ ఇవ్వడానికి విముఖత చూపడంతో లీజుకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థ OLA ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, మోటార్‌బైక్‌లు, స్కూటర్‌లు, వంటి వాణిజ్య వాహనాలను కూడా తయారు చేయనుందని రాబోయే 12 నెలల్లో ఈ ఉత్పత్తులపై మరిన్ని ప్రకటనలను వింటారని ఆ సంస్థ సహా వ్యవస్థాపకులు భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

హ్యాకింగ్‌కు గురైన చైనీస్ ఆటోమొబైల్ దిగ్గజం 'నియో'

చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం నియో కంపెనీ సాఫ్ట్‌వేర్ హ్యాకింగ్ బారిన పడింది. తమ సంస్థకు చెందిన కంప్యూటర్లలోని వినియోగదారులు, వాహనాల అమ్మకాల డేటాను హ్యాకర్లు చోరీ చేసినట్లు నియో యాజమాన్యం ప్రకటించింది.

మునుపటి
తరువాత