తెలుగు సినిమా: వార్తలు

08 Feb 2023

ఓటిటి

ఓటిటి: జనవరిలో థియేటర్లలో రిలీజైన చిత్రాలు ఈ వారం ఓటీటిలోకి

ఈ వారం ఓటిటిలో తెలుగు సినిమాలు రెండు తెలుగు సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లలో రిలీజై ఎక్కువ రోజులు కాకముందే ఓటిటి ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి.

08 Feb 2023

సినిమా

క్రితిసనన్ తో ఎంగేజ్ మెంట్ వార్తలపై స్పందించిన ప్రభాస్ టీమ్

ప్రభాస్ -క్రితిసనన్ ఎంగేజ్మెంట్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాయి. సడెన్ గా ఎంగేజ్మెంట్ గురించి వార్త రావడంతో నమ్మాలా వద్దా అనే డైలమాలో పడిపోయారు.

జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, ఈ మధ్య గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సత్యదేవ్ హీరోగా కనిపించిన ఈ సినిమా, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ లాంచ్ అయ్యింది. 2:25నిమిషాల ట్రైలర్ లో కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అంశాలన్నీ కనిపించాయి.

07 Feb 2023

సినిమా

టికెట్ లేకుండా సినిమా చూడొచ్చంటున్న రైటర్ పద్మభూషణ్ టీమ్

సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ, పోయిన శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుంది రైటర్ పద్మభూషణ్.

థియేటర్స్ లో ఇచ్చిపడేసేందుకు కాస్త లేట్ అవుతుందంటున్న విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు అలరించడానికి ఎప్పుడూ ముందుంటాడు. అదేం విచిత్రమో గానీ విశ్వక్ సేన్ విభిన్నంగా కనిపించిన చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయవంతం అవ్వలేదు.

07 Feb 2023

సినిమా

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఆ సినిమా, వెండితెర మీద ప్రభావం చూపించలేకపోయింది.

07 Feb 2023

సినిమా

ప్రభాస్ సలార్ నుండి సాలిడ్ అప్డేట్

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సలార్ పై అభిమానుల్లో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. కేజీఎఫ్ తో రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ ని ఎలా చూపిస్తాడోనన్న ఆతృత అందరిలోనూ ఉంది.

06 Feb 2023

సినిమా

కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో

ఈ మధ్య వరుస పరాజయాలు మూటగట్టుకున్న కిరణ్ అబ్బవరం, తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ మధ్య గౌతమ్ తిన్ననూరికి ఓకే చెప్పిన విజయ్, తాజాగా మరో సినిమాను ప్రకటించాడు.

04 Feb 2023

సినిమా

ఎన్నెన్నో జన్మల బంధం ఈనాడే కన్నుమూసింది, సింగర్ వాణీజయరాం హఠాన్మరణం

భారతీయ సినిమా పాటలకు తన గొంతునిచ్చిన ప్రఖ్యాత గాయని, భారత ప్రభుత్వంచే ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న దిగ్గజం వాణీ జయరాం ఈరోజు కన్నుమూసారు.

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న?

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ, తారకరత్న పరిస్థితిని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.

మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ?

మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే సారధి స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభమయ్యింది.

03 Feb 2023

సినిమా

హైదరాబాద్ టాకీస్ నిర్వహిస్తున్న ఇళయరాజా లైవ్ కాన్సెర్ట్

మేస్ట్రో ఇళయరాజా హైదరాబాద్ లో లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ లైవ్ కాన్సెర్ట్ ఉండనుంది. ఈ కాన్సెర్ట్ లో 100మంది సంగీత కళాకారులు పాల్గొంటున్నారు.

సమంత ఎస్ చెప్పడంతో రెండు సినిమాలను ఒకేసారి తీసుకురానున్న విజయ్ దేవరకొండ

లైగర్ సినిమాతో అపజయం అందుకున్న విజయ్ దేవరకొండ, ఈసారి గట్టిగా కొట్టాలని రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. మళ్ళీరావా, జెర్సీ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో కలిసి విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు.

బుట్టబొమ్మ సినిమాకు రివ్యూ ఇచ్చిన డీజే టిల్లు ఫేమ్ సిద్ధు

మళయాల మూవీ కప్పెలా సినిమాకు తెలుగు రీమేక్ గా వస్తున్న సినిమా బుట్టబొమ్మ. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

03 Feb 2023

సినిమా

సరికొత్త కథలతో థియేటర్లను షేక్ చేయడానికి రెడీ అవుతున్న ఈ వారం సినిమాలు

సంక్రాంతి తర్వాత వేసవి వచ్చే వరకు తెలుగు సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా సందడి ఉండదు. పెద్ద సినిమాలు లేకపోవడమే దానికి కారణం. ఐతే ఈసారి మాత్రం వేసవికి ముందే థియేటర్లు షేక్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

02 Feb 2023

సినిమా

రెండు భాగాలుగా రానున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే ఎవరికైనా ఆశ్వర్యమేస్తుంది. ఇండియాలో ఏ స్టార్ చేతిలోనూ అన్నేసి సినిమాలు లేవు.

వేసవి నుండి షిఫ్ట్ అయ్యి సరికొత్త రిలీజ్ డేట్ లో వస్తున్న హరిహర వీరమల్లు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు రాజకీయంలో దూకుడుగా ఉంటూనే వరుసగా సినిమాలు చేస్తున్నారు.

మెగా హీరో వరుణ్ తేజ్ ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు

టాలీవుడ్ లో వరుస పెళ్ళిళ్ల పర్వం మరోసారి ఊపందుకోనుంది. అప్పట్లో కరోనా టైమ్ లో వరుసపెట్టి పెళ్ళిళ్ళు జరిగాయి. మరికొద్ది రోజుల్లో అదే తీరు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్: తరుణ్ భాస్కర్ రివీల్ చేసిన వీల్ ఛెయిర్ తాత క్యారెక్టర్

తెలుగు సినిమాల్లో హాస్యం ప్రధానంగా ఎక్కువ సినిమాలు వస్తుంటాయి. అందుకే తెలుగు హాస్యనటుల జాబితా పెద్దగా ఉంటుంది. తెలుగు తెర మీద ఎంత మంది హాస్యనటులున్నా ఒక్కరు కనిపించగానే అనుకోకుండానే అందరూ నవ్వేస్తుంటారు. ఆ ఒక్కరే బ్రహ్మానందం.

పవన్ కళ్యాణ్ అప్పులపై నాగబాబు మాటలు వైరల్

తెలుగు సినిమా హీరోల్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే ఇద్దరు ముగ్గురు హీరోల్లో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటారని చాలాసార్లు వార్తలు వచ్చాయి.

01 Feb 2023

సినిమా

నాని కెరీర్లో ఫస్ట్ సినిమాగా సరికొత్త రికార్డ్ సృష్టించిన దసరా

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా టీజర్ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జనరల్ గా నాని విభిన్నమైన సినిమాలు చేస్తాడని అందరికీ తెలుసు. కానీ ఇలా పూర్తిగా మాస్ పాత్రలో కనిపిస్తారని ప్రేక్షకులు ఊహించలేదు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి అప్డేట్

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి, ట్విట్టర్ వేదికగా అప్డేట్ ఇచ్చారు. యువగళం పేరుతో లోకేష్ మొదలెట్టిన పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు.

రెండు భాగాలుగా రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ

బాహుబలి సినిమా నుండి మొదలైన రెండు భాగాల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదు. పాన్ ఇండియా అనగానే ప్రతీ ఒక్కరూ రెండు భాగాలుగా తమ సినిమాలను తీసుకొస్తున్నారు.

31 Jan 2023

సినిమా

ధమాకా తో వందకోట్లు కొల్లగొట్టిన రవితేజ నెగెటివ్ రోల్స్ చేయబోతున్నాడా?

మాస్ మహరాజ్ రవితేజ, డీజేటిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి వెండితెరను పంచుకోనునున్నట్లు తెలుస్తోంది.

దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం

నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం దసరా టీజర్ ఇంతకుముందే రిలీజైంది. ఇదివరకు సినిమాల్లో నాని చేసిన పాత్రలన్నీ దాదాపుగా సాఫ్ట్ నేచర్ కలిగి ఉన్నవే. కృష్ణార్జున యుద్ధంలో ఒక పాత్రలో మాస్ గా కనిపించాడు గానీ అది కూడా పూర్తి మాస్ కాదు.

30 Jan 2023

సినిమా

2024 సంక్రాంతిని టార్గెట్ చేసుకుని రెడీ అవుతున్న సినిమాలివే

తెలుగు సినిమాల విడుదలకు సంక్రాంతిని మించిన పెద్ద పండగ మరొకటి లేదు. ప్రతీ ఒక్కరూ తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటారు. ఈసారి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల మధ్య గట్టిపోటీ నడిచింది.

30 Jan 2023

సినిమా

బాలయ్య పాటల రీమేక్: అప్పుడు పటాస్ లో మాస్ సాంగ్, ఇప్పుడు అమిగోస్ లో రొమాంటిక్ సాంగ్

నందమూరి కళ్యాణ్ రామ్ మంచి ఫామ్ లో ఉన్నారు. చాలారోజుల తర్వాత బింబిసార సినిమాతో మంచి విజయం దక్కించుకున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది బింబిసార.

ఘనంగా ప్రారంభమైన పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చాలా బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు ఇంకా సెట్స్ మీద ఉండగానే మరో మూవీ మొదలెట్టేసారు పవన్ కళ్యాణ్.

భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ

నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తర్వాత తెలుగులో మళ్లీ డిటెక్టివ్ మూవీ రాలేదు. డిటెక్టివ్ సినిమాలకు అభిమానులు ఎప్పుడూ ఉంటారు.

బాలయ్య తర్వాతి సినిమాకు హీరోయిన్ కష్టాలు తీరినట్లే?

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న బాలకృష్ణ, తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ కెరీర్లో 108వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి.

బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ

సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న బుట్టబొమ్మ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. అనికా సురేంద్ర, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్యస్వామి ప్రధాన పాత్రల్లో కనిపించారు.

27 Jan 2023

సినిమా

హీరో సూర్యకు గొంతునందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక లేరు

పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఈరోజు ఉదయం చెన్నైలో తన నివాసంలో కన్నుమూసారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా శ్రీనివాస మూర్తి తుదిశ్వాస విడిచాడు.

27 Jan 2023

ఓటిటి

దేశం కోసం త్యాగం చేసిన అజ్ఞాత వీరులకు సమర్పణగా సాయిధరమ్ తేజ్ షార్ట్ ఫిలిమ్

బైక్ ప్రమాదం నుండి కోలుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఐతే ఆ సినిమా కంటే ముందే మ్యూజికల్ షార్ట్ ఫిలిమ్ ని మన ముందుకు తీసుకురానున్నాడు.

27 Jan 2023

సినిమా

సర్కార్ నౌకరి: హీరోగా మారుతున్న సింగర్ సునీత కొడుకు

సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. వరుసపెట్టి సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబాల నుండి వారసులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఒక్కో కుటుంబం నుండి ఎక్కువ మొత్తంలో వారసులు ఉన్నారు.

25 Jan 2023

సినిమా

అనుష్క అపాయింట్మెంట్ ఇప్పిస్తానంటూ 51లక్షలకు టోపీ వేసిన దుండగుడు

ఎక్కడ ఆశ ఉంటుందో అక్కడ మోసం ఉంటుందనేది అక్షరాలా నిజం. ఇండస్ట్రీ మీద అవగాహన లేక సినిమా పరిశ్రమలో వెలుగు వెలగాలని ఎంతో ఆశతో వచ్చిన వాళ్ళు, మోసగాళ్ల చేతుల్లో పడి అన్నీ కోల్పోతుంటారు.

25 Jan 2023

సినిమా

వెంకటేష్ కొత్త సినిమా సైంధవ్ నుండి గ్లింప్స్ విడుదల

విక్టరీ వెంకటేష్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ దొరికింది. వెంకటేష్, తన 75వ చిత్ర టైటిల్ ని ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ కూడా విడుదలైంది.

టీవీల్లోకి వస్తున్న ఉప్పెన హీరోయిన్ కొత్త సినిమా

ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మినహా మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మూడో హిట్ గా కళ్యాణ్ రామ్ చిత్రం నిలవనుందా?

మైత్రీ మూవీ మేకర్స్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మంచి విజయం అందుకుంది.