సినిమా: వార్తలు

విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేయనున్న డీజే టిల్లు భామ

డీజే టిల్లు సినిమాతో పేరు తెచ్చుకున్న నేహా శెట్టి, ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. డీజె టిల్లు సినిమాలో తన గ్లామర్ తో యువత మతి పోగొట్టిన నేహా శెట్టి, బెదురులంక 2012చిత్రంతో ఉగాది రోజున ప్రేక్షకులను పలకరించనుంది.

భళ్ళాలదేవుడు రానాకు కంటి చూపు సమస్య, కిడ్నీ మార్పిడి, అనారోగ్య విషయాలు పంచుకున్న రానా

రానా నాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా, ఆ సిరీస్ ప్రమోషన్లలో ఆక్టివ్ గా పాల్గొంటున్నాడు. రానా నాయుడు సిరీస్ కి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు

టెలికాం దిగ్గజం టి-మొబైల్ 1.35 బిలియన్ డాలర్ల ఒప్పందంలో కంపెనీని కొనుగోలు చేసింది. మింట్ మొబైల్‌ను T-మొబైల్ కొనుగోలు తరవాత అందులో ఉన్న ర్యాన్ రేనాల్డ్స్ $300 మిలియన్లకు పైగా నగదు, స్టాక్‌లను అందుకోనున్నాడు.ఇదే కాకుండా రేనాల్డ్స్ వెల్ష్ ఫుట్‌బాల్ క్లబ్ రెక్స్‌హామ్ AFC సహ యజమాని. అతను 2021లో నటుడు రాబ్ మెక్‌ఎల్హెన్నీతో కలిసి క్లబ్‌ను స్థాపించాడు.

పొన్నంబాలం: సొంత కుటుంబమే విషమిచ్చి చంపాలని చూసింది

తమిళ నటుడు పొన్నంబాలం, చిరంజీవి తనకు చేసిన సాయాన్ని గురించి అందరితో చెప్పుకొచ్చారు. తన కిడ్నీలు రెండు ఫెయిల్ అవడంతో, ఎవరిని సాయమడగాలో తెలియట్లేదట.

హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కొడుకు, ఫస్ట్ లుక్ రిలీజ్

తెలుగు యాంకర్ అనే మాటకు మరో అర్థంగా మారిపోయిన యాంకర్ సుమ, తన కొడుకును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుంది. యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల.. హీరోగా మారుతున్నాడు.

నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల

నాగ చైతన్య తెరపై తెలుగు-తమిళం ద్విభాషా చిత్రం కస్టడీలో కనిపించనున్నారు. మానాడుతో శింబుకి అద్భుతమైన హిట్ ఇచ్చిన వెంకట్ ప్రభు పోలీస్ నేపధ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ కథా మార్పులపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తమిళ చిత్రమైన తెరీ నుండి రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

15 Mar 2023

ఓటిటి

ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు

ఈ వారం సినిమా ప్రేమికులకు మంచి ఆసక్తిగా ఉండనుంది. వేరు వేరు జోనర్లలో రూపొందిన సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. అలాగే విభిన్నమైన కంటెంట్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

కోటలో కొనసాగుతున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది.

ఆస్కార్ గెలిచిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఏనుగును చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు

'ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకున్న భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్' ద్వారా ప్రసిద్ధి చెందిన ఏనుగును చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి తరలి వస్తున్నారు.

ఇండియా గర్వంతో ఉప్పొంగిపోతోంది : ప్రధాని మోదీ

ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ సినీ ప్రపంచం గర్వించేలా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది.

సంగీత ప్రపంచంలో ప్రభంజనం సృష్టించిన ఎంఎం కీరవాణి

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గత ముప్పై ఏళ్లుగా తన సంగీత ప్రవాహంలో మనల్ని ఉర్రూతలూగిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆయన పాటలు అందించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం

ప్రతి సంవత్సరం మార్చి 8 న, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమాజంలో మహిళలు సాధించిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విజయాలను జరుపుకుంటారు. మహిళల సమానత్వం గురించి తెలియపర్చడంతో పాటు హక్కులపై దృష్టిని తీసుకురావడం ఈ రోజు లక్ష్యం.

ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ప్రాజెక్ట్ కె షూటింగ్ లో యాక్సిడెంట్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన్ ప్రమాదంలో గాయాలు కావడంతో కుడివైపు పక్కటెముకలకు గాయాలయ్యాయి.

06 Mar 2023

సినిమా

మా నాన్న లైంగికంగా వేధించే వాడంటూ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సంచలనం

సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్, సంచలన విషయాలు బయట పెట్టారు. తన ఎనిమిదేళ్ళ వయసులో తన తండ్రి లైంగికంగా వేధించే వారని చెప్పుకొచ్చారు.

02 Mar 2023

సినిమా

రజనీకాంత్ 170: జై భీమ్ దర్శకుడితో సినిమా మొదలు

హీరో రజనీకాంత్ 170వ మూవీ ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతానికి తలైవర్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నారు.

01 Mar 2023

సినిమా

అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్ళలో బాంబ్ భయం

బాలీవుడ్ సీనియర్ హీరోలైన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్ళలో బాంబ్ ఉందని మహారాష్ట్ర లోని నాగ్ పూర్ పోలీసులకు కాల్ వచ్చింది. దాంతో వెంటనే ముంబై పోలీసులను అలెర్ట్ చేసారు.

SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. హైదరాబాద్ లోని స్టూడియోలో వేసిన సెట్ లో వేగంగా షూటింగ్ కావస్తోంది.

యాక్షన్ ఇచ్చిన బహుమతులంటూ గాయాలను చూపుతున్న సమంత

స్టార్ హీరోయిన్ సమంత, సినిమాల షూటింగుల్లో పాల్గొనడానికి వచ్చేసింది. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం సిటాడెల్ అనే సిరీస్ లో నటిస్తోంది.

పవన్ కళ్యాణ్ సరసన ధమాకా బ్యూటీకి ఛాన్స్?

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిందని, కొత్త సినిమాలు రావాలనీ, అన్నీ కొత్తగా ఉండాలనీ, వింత పోకడలకు పోతున్న సమయంలో వచ్చిన ధమాకా, అందరి నోళ్ళను మూయించిందని చెప్పాలి.

రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్

నటుడు శ్రీ విష్ణు గత చిత్రం అల్లూరి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు సామజవరగమన అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల

ఈమధ్య హీరోల పుట్టినరోజు సంధర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలు విడుదల చేయడం ట్రెండ్ గా మారింది. అలాగే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు.

దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత

తెలుగు దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మరణించి నెల కూడా కాకముందే ఆయన సతీమణి జయలక్ష్మి ఆదివారం తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జయలక్ష్మి మరణించే నాటికి ఆమె వయసు 86 ఏళ్లు. విశ్వనాథ్ మరణించిన 24 రోజులకే జయలక్ష్మి మృతి చెందడం కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది

ధనుష్ తాజా సినిమా సార్ (తమిళంలో వాతి) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలపై తీసిన సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాతి/సార్, రూ. 75కోట్లు కలెక్షన్స్ సాధించి విజయవంతంగా విదేశాలలో కూడా ఆడుతుంది.

25 Feb 2023

ప్రభాస్

సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు

తెలుగు ప్రేక్షకులు అందులోనూ ముఖ్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ ఎక్కువగా ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా "సాలార్". సినిమా బృందం కూడా ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉండడం అభిమానుల్లో ఇంకొంచెం ఆతృత పెంచుతుంది.

25 Feb 2023

ఓటిటి

ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలుగు ప్రేక్షకులను తన ప్రేమ కథలతో మాయ చేసి, మైమరిపించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ రోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మాతృబాష మలయాళం అయినా "మిన్నల్" అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు గౌతమ్ మీనన్.

23 Feb 2023

సినిమా

ఫీఛర్ ఫిలిమ్ తో రాని గుర్తింపు షార్ట్ ఫిలిమ్ తో పొందిన షఫి, కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు నామినేట్

సినిమా ఇండస్ట్రీ విచిత్రంగా ఉంటుంది. ఏ సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుందో, ఏ ఆర్టిస్టుకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి ఆ ఆర్టిస్టు పనైపోయిందనుకుంటే అనూహ్యంగా అద్భుత విజయాలతో ఆకాశంలోకి వెళ్ళిపోతారు.

22 Feb 2023

సినిమా

100వ సినిమాకు అదిరిపోయే ప్లాన్ తో నాగార్జున, గాడ్ ఫాదర్ డైరెక్టర్ కు ఛాన్స్?

ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడకు దర్శకుడిగా అవకాశమిస్తున్నాడని నాగార్జున గురించి వార్తలు వచ్చాయి. ప్రసన్న కుమార్ చెప్పిన పాయింట్ నాగార్జునకు నచ్చిందనీ, పూర్తి కథను సిద్ధం చేయమని నాగార్జున చెప్పాడని అన్నారు.

డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా చేసిన ప్రభు కు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

చంద్రముఖి, శక్తి, డార్లింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ నటుడు ప్రభు, గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కొడంబక్కల్ లోని మెడ్ వే హాస్పిటల్ కు చేర్చారు.

ఉగ్రం టీజర్ టాక్: పవర్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఉగ్రం టీజర్ ఈరోజే విడుదలైంది. అక్కినేని నాగ చైతన్య అతిధిగా టీజర్ లాంచ్ కార్యక్రమం సాగింది.

22 Feb 2023

సినిమా

స్టార్ అయినా ప్రభాస్ మారలేదని చెప్పడానికి నిదర్శనమే సాచి ట్రైలర్ లాంచ్

పెద్ద హీరోలకు పెద్దగా సమయం ఉండదు. ఇది వందశాతం నిజం, ఆ పెద్ద హీరో చేతిలో ఐదారు సినిమాలుంటే ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లకు అటెండ్ కాలేరు.

21 Feb 2023

ప్రభాస్

అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే

ప్రభాస్.. ఈ ఒక్క పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

21 Feb 2023

సినిమా

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ 2023: ఆర్ఆర్ఆర్ కి ఆ విభాగంలో చోటు

భారతదేశ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా పిలవబడే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను నిన్న ప్రకటించారు. 2023 సంవత్సరానికి ఏయే సినిమాలు, ఎవరెవరు నటులు ఈ అవార్డు అందుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం

సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొన్నిరోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శివైక్యం చెందారు.

ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు'

యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ సంక్రాంతికి విడుదలైన కళ్యాణం కమనీయం సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం శివరాత్రి కానుకగా సంతోష్ శోభన్ బాబు నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు' చిత్రం విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల మనసు దోచుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం.

వినరో భాగ్యము విష్ణుకథ వర్సెస్ శ్రీదేవి శోభన్ బాబు: చిన్న హీరోలు, పెద్ద నిర్మాతలు, కానీ తేడా అదే

మహాశివరాత్రి సందర్భంగా తెలుగు బాక్సాఫీసు వద్ద సినిమాల సందడి ఎక్కువగానే ఉంది. ఈరోజు ధనుష్ నటించిన సార్ మూవీ రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

17 Feb 2023

సినిమా

తంగలాన్: భవిష్యత్తులోకి ప్రయాణం అంటూ కన్ఫ్యూజన్ లో పడేసిన విక్రమ్

తమిళ దర్శకుడు పా రంజిత్, వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తాడని అందరికీ తెలిసిందే. సమాజాన్ని అద్దంపట్టి చూపే సినిమాలను తెరకెక్కించడంలో పా రంజిత్ ముందుంటారు.

17 Feb 2023

సినిమా

ఇన్ కార్ ట్రైలర్: థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రితికా సింగ్ పాన్ ఇండియా మూవీ

గురు సినిమాలో బాక్సర్ పాత్రలో మెప్పించిన రితికా సింగ్, తెలుగు ప్రేక్షకులను పలకరించక చాలా రోజులైపోయింది. అప్పుడప్పుడు వచ్చిన అనువాద చిత్రాలు రితికా సింగ్ ని గుర్తుంచుకునేలా చేయలేకపోయాయి.

బెల్లంకొండ గణేష్ రెండవ మూవీ నేను స్టూడెంట్ సార్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే

స్వాతిముత్యం సినిమాతో పరిచయమైన బెల్లంకొండ గణేష్, తన రెండవ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. నేను స్టూడెంట్ సార్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సార్ మూవీ ట్విట్టర్ రివ్యూ: యెస్ సార్ అనేస్తున్నారు

హీరో ధనుష్, సార్ సినిమాతో తెలుగులోకి వచ్చేసాడు. సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలతో పలకరించాడు. ఈ ప్రీమియర్ షోస్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.