భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే..

2022లో సుప్రీంకోర్టు మహిళలకు అనుకూలంగా అనేక తీర్పులను వెలువరించింది. అయితే అందులోని 5 చరిత్రాత్మక నిర్ణయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

27 Dec 2022

కోవిడ్

కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

దేశంంలో కరోనా కేసులు పెరుగుదల పెద్దగా లేకపోయినా..కేంద్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రెండో వేవ్‌లో తలెత్తిన పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేలా దేశవ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను కేంద్రం సంసిద్ధం చేస్తోంది. ఇందుకోసం మంగళవారం అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆరోగ్యమంత్రి మాండవీయా ఆదేశించారు.

26 Dec 2022

కోవిడ్

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం బిహార్ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయ్యింది.

చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నా.. అందరి చూపు మాత్రం గుడివాడ పైన ఉందని చెప్పాలి. 2024 ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకుంది. తాజాగా నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యమలో మరోసారి వార్తల్లో నిలిచింది గుడివాడ.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురుయ్యారు. దీంతో హుటాహుటిన మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆమెను దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్పించారు.

బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్

దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత.. బీఆర్‌ఎన్‌ను విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు అధినేత కేసీఆర్. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో జనవరిలో రైతుల సమస్యలపై పెద్ద బహిరంగ సభను నిర్వహించనున్న నేపథ్యంలో... వివిధ రాష్ట్రాల్లో కిసాన్ సెల్‌ల జిల్లా అధ్యక్షుల నియామకాలను వేగవంతం చేశారు.

24 Dec 2022

కోవిడ్

కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం

దేశానికి కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్ బీఎఫ్ 7' ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.. తాజాగా మరికొన్ని సూచనలు చేసింది.

24 Dec 2022

తెలంగాణ

టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ

సంక్షేమ హాస్టళ్లలో ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా 581 ఖాళీలను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, 2, మాట్రాన్ గ్రేడ్-1, 2, వార్డెన్ గ్రేడ్-1, 2తో పాటు మహిళా సూపరింటెండెంట్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం

కృష్ణ జన్మభూమి వివాద స్థలంపై ఉత్తరప్రదేశ్‌లోని మథుర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జనవరి 2 తర్వాత.. షాహీ ఈద్గా మసీదు ఉన్న వివాదాస్పద స్థలాన్ని సర్వే చేయాలని పురావస్తు శాఖను ఆదేశించింది. జనవరి 20 తర్వాత నివేదికను సమర్పించాలని సూచించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా?

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ అనుకున్నట్లే ఇతర రాష్ట్రాల్లో పాగా వేస్తారా? జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?

81కోట్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అదేంటంటే?

పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి కరోనా ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ఇంకో ఏడాది పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. 81కోట్ల మందికి రేషన్‌ఉచితంగా అందించాలని ప్రధాని మోదీ అధ్యక్షత కేంద్ర కేబినెట్‌నిర్ణయం తీసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడులోని తేని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది అయ్యప్ప భక్తులు మృత్యువాత పడ్డారు. స్వాములు ప్రయాణిస్తున్న వాహనం దాదాపు 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

24 Dec 2022

కోవిడ్

కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు

చైనాతో పాటు అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈమేరకు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల్లో కనీసం 2శాతం మందికి కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. శనివారం నుంచే ఈ పరీక్షలు చేయనున్నారు.

23 Dec 2022

తెలంగాణ

తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం?

అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించి.. తెలంగాణలో చాలా కాలంగా యాక్టివ్‌గా లేని టీడీపీని చంద్రబాబు తిరిగి చర్చలోకి తీసుకోచ్చారు. టీడీపీ యాక్టివ్ అయితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?

వైసీపీ నేత, మాజీ మంత్రి, మైదుకూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కడప రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి చేసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

టెర్రర్ ఫండింగ్‌‌తో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న వారి ఇళ్లపై శుక్రవారం జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని దాదాపు 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కొన్ని డిజిటల్ డివైజ్‌లు, సిమ్ కార్డులు సీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు.

23 Dec 2022

తెలంగాణ

గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే..

హైదరాబద్‌లోని గోషామహల్ బస్తీలో అనూహ్య సంఘటన జరిగింది. ఉన్నట్టుండి పెద్ద నాల కుంగిపోయింది. దీంతో ఆ నాలాపై ఉన్న దుకాణాలు, అక్కడ నిలిపేసిన వాహనాలు అందులోకి పడిపోయాయి. వాహనాలు స్వల్పంగా దెబ్బ తినగా.. కొందరికి గాయాలయ్యాయి.

23 Dec 2022

కోవిడ్

భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే ?

భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. బూస్టర్ డోస్‌గా నాసల్ వ్యాక్సిన్‌కు వేసుకోవచ్చని సూచించారు.

లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి

భారత సైనిక వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16జవాన్లు వీర మరణం పొందారు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. నార్త్ సిక్కిం ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

లద్దాఖ్‌‌లో భారత సైనికుల పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరణకు ఒప్పుకోని చైనా

భారత్- చైనా కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరిగిన 17వ సమావేశంలో సరిహద్దు వివాద పరిష్కారానికి ఎలాంటి ముందడుగు పడలేదు. తూర్పు లద్దాఖ్‌లోని డెప్సాంగ్ ప్లెయిన్స్, చార్డింగ్ నింగ్‌లుంగ్ నుల్లా జంక్షన్‌లో భారత సైన్యానికి పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరించడానికి చైనా అంగీకరించకపోవడంతో.. కొన్ని తాత్కాలిక నిర్ణయాలు తీసుకొని సమావేశాన్ని ముగించారు.

రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం

దేశీయ స్టాక్‌లు శుక్రవారం వరుసగా నాల్గవరోజు పడిపోయాయి, BSE సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు పడిపోయింది. NSE నిఫ్టీ మార్క్ 18,000 దిగువకు జారింది.

22 Dec 2022

కోవిడ్

'బూస్టర్‌ డోస్‌ త్వరగా తీసుకోండి'.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిక

దేశంలోని ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది. రాబోయే రోజుల్లో కోవిడ్ వ్యాప్తిని అధిగమించడానికి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్‌లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటివి చేయాలని సూచించింది. పాజిటివ్ కేసులను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని అన్ని రాష్ట్రాలను కోరినట్లు చెప్పింది.

3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌

జియో అనుబంధ సంస్థ ముంబై రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ మొబైల్ టవర్, ఫైబర్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎస్‌బిఐ ఎస్క్రో ఖాతాలో రూ. 3,720 కోట్లు జమ చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నవంబర్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ కొనుగోలుపై జియోకు ఆమోదం తెలిపింది.

భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్

భారత్ జూడో యాత్రలో కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తన పాదయాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోందని రాహుల్ అన్నారు. బీజేపీ పాలకులు సత్యానికి భయపడుతున్నారని చెప్పారు.

మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా?

2022 క్రిప్టో కరెన్సీకు పెద్దగా కలిసిరాలేదు, కాకపోతే క్రిప్టో చరిత్రలో నిలిచిపోయే LUNA క్రాష్, FTX పతనం పాటు మార్కెట్లో అనేక ఇతర నష్టాలు సంభవించాయి. అయితే సరైన నిర్ణయాలతో లాభం పొందే అవకాశాలు ఇంకా ఉన్నాయి.

22 Dec 2022

కోవిడ్

'పండగల వేళ జాగ్రత్తలు అవసరం'.. పార్లమెంట్‌లో రాష్ట్రాలకు మంత్రి కీలక సూచనలు

దేశంలోని కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఉభయ సభల్లో కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, తదనుగుణంగా చర్యలు తీసుకుటుందని చెప్పారు. రానున్నవి పండగ రోజులని, ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.

PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు

ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తూ, పీఎఫ్‌ జీతంలో కట్ అవుతున్నవారికి ఇది శుభవార్త.

మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త

అతను అనుకుంటే విలాసవంతమైన జీవితం తన కాళ్ల ముందుకు వస్తుంది. చుట్టూ పదిమంది పనివాళ్లతో దర్జాగా బతికే అవకాశం ఉన్నా.. అతనికి ఆ జీవితం సంతృప్తిని ఇవ్వలేదు. రూ.కోట్లలో జీతం.. అతి పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి జైన సన్యాసిగా మారాడానికి ముందుకొచ్చాడు మధ్యప్రదేశ్ కు చెందిన ప్రన్సుఖ్ కాతేడ్(28).

'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు

ఏపీ సీఎం జగన్‌పై సంచనల ఆరోపణలు చేశారు కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. పీకల్లోతు నష్టాల్లో ఉన్న బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా అందులో అవినీతి కోణం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బైజూస్ తో ఒప్పందం విషయంలో జగన్ అవినీతికి పాల్పడ్డారని, ఫలితంగా రూ. 1400 కోట్లు వృథా అవుతోందని సంచలన ఆరోపణపు చేశారు.

22 Dec 2022

కోవిడ్

భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే..

చైనాలో కరోనా విజృంభించడానికి కారణమైన BF.7 వేరియంట్‌.. భారత్‌ను సైతం వణికిస్తోంది. దేశంలో నాలుగు కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే నిపుణులు మాత్రం భారత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. భారత్‌లో నమోదైన నాలుగు కేసులు కూడా.. తాజాగా వచ్చినవి కావని, జూలై, సెప్టెంబర్, నవంబర్‌లో కనుగొనబడినట్లు చెబుతున్నారు.

21 Dec 2022

ఓటిటి

మణిపూర్ లో ఘోర విషాదం.. టూరిస్టు బస్సు ఢీకొని..

మణిపూర్ ఘోర విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్తున్న రెండు టూరిస్టు బస్సులు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన మణిపూర్‌లోని నోనీ జిల్లాలో చోటు చేసుకుంది.

21 Dec 2022

కోవిడ్

'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ

'భారత్ జోడో యాత్ర'లో కోవిడ్ ప్రోటోకాల్‌ పాటించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా రాసిన లేఖపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రం తాజా కోవిడ్ మార్గదర్శాలను జారీ చేసింది.

21 Dec 2022

కోవిడ్

కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాండవీయ స్పష్టం చేశారు.

డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు

పాకిస్థాన్ నుంచి భారత్‌కు డ్రోన్ల ద్వారా దిగుమతి అవుతున్న డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫోకస్ పెట్టింది. పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోని డ్రగ్స్ సరఫరాకు సంబంధమున్నట్లు అనుమానిస్తున్న గ్యాంగ్ స్టర్ల ఇళ్లు, వారికి సంబంధించిన ప్రాంగణాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సన్నిహితులను టార్గెట్ చేశారు అధికారులు.

దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు

దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లోనూ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరుతో పాటు దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్లు ఉన్నాయి. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి పేర్లను కూడా ఈడీ చేర్చింది.

విదేశాల్లో సేవా కార్యక్రమాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో పెద్ద ఎత్తున అభిమానులు చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు వైసీపీ క్యాడర్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

మూడు రాజధానులు V/S ఒక రాజధాని..!

ఏపీలో అప్పుడే రాజకీయ వేడీ మొదలైంది. ఎన్నికలకు సమయం ఉన్నా.. అప్పుడే ముందస్తు హడావుడి కనిపిస్తోంది. ఏపీలో ప్రధానంగా రెండు నియోజకవర్గాలపైనే వైసీపీ, టీడీపీ, జనసేన దృష్టి సారించాయి.

21 Dec 2022

కోవిడ్

మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

చైనాతో పలు దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోజూవారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల నమూలనాలను క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం వారానికి 1,200 కేసులు నమోదవుతున్నాయి.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ

టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సమావేశమయ్యారు. ఈ భేటీ వివరాలను జైశంకర్ ట్విటర్ వేదికగా తెలిపారు. పిచాయ్‌తో అంతర్జాతీయ వ్యూహాత్మక పరిణామాలు, డిజిటలైజేషన్ గురించి చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.

ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ.. వచ్చేఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో జరగనన్ను ఎలక్షన్లపై ఫోకస్ పెట్టింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో 2023 ప్రారంభంలో.. మిజోరాంలో డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మునుపటి
తరువాత