భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

09 Jan 2023

దిల్లీ

ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు

విమానాల్లో అసభ్యకర సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎయిర్ ఇండియాలో తోటి మహిళా ప్రయాణికులపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మరువకముందే.. ఇండిగో ఫ్లైట్‌లో మరో ఘటన జరిగింది.

తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు

నందమూరి తారకరామారావు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశానికే కాదు.. ప్రపంచానికి చాటిన నాయకుడు. టీడీపీని స్దాపించిన కేవలం 9నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనుడు. సరిగ్గా 40ఏళ్ల క్రితం ఇదే రోజున జనవరి 9న తెలుగునాట తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించిన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఇదే రోజున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.. ఉమ్మడి రాష్ట రాజకీయాల్లో కొత్త శఖాన్ని పూరించారు.

09 Jan 2023

సీబీఐ

'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ అరెస్టుపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారి అరెస్టు చట్ట ప్రకారం జరగలేదని, ఈ మేరకు వారికి బెయిల్ మంజూరు చేసింది.

09 Jan 2023

దిల్లీ

దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా..

దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో విచారణ జరుగుతున్నా కొద్ది.. షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో అరెస్టయిన నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. కారు కింద ఆ యువతి ఇరుక్కుపోయిందని తమకు తెలుసునని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్

తెలంగాణలో టీడీపీకి పుర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరింత ఫోకస్‌గా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.

06 Jan 2023

బీజేపీ

తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్లుగా తెలంగాణలో కాస్త పుంజుకున్నా.. ఏపీలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న కేంద్ర‌మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఏపీకి ప్రాధాన్యత కల్పించొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

కాబోయే తండ్రులకు కూడా 12 వారాల సెలవు ప్రవేశపెట్టిన ఫైజర్ ఇండియా

డ్రగ్‌ తయారీ సంస్థ ఫైజర్ భారతదేశంలో తన ఉద్యోగుల కోసం 12 వారాల పితృత్వ సెలవు విధానాన్ని ఉద్యోగుల-కేంద్రీకృత పని వాతావరణాన్ని పెంపొందించే కార్యక్రమాలలో భాగంగా ప్రవేశపెట్టింది.

వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్

డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే (ఐఎఫ్‌పిడి) ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ స్క్రీన్‌లతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం

అక్రమ పద్ధతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువులు సాధించిన వారిపై కోల్‌కతా హైకోర్టు కోరడా ఝులిపించింది. తప్పుడు మార్గాల ద్వారా ఉద్యోగాలను పొందిన 59మందిని విధుల నుంచి తొలగించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ)ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది.

సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నాలుగు రోజలు పర్యటన నిమ్మితం భారత్‌కు వచ్చారు . నాలుగో రోజైన శుక్రవారం నాదెళ్ల హైదరాబాద్‌కు రాగా.. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వివిధ శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులను నియమించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సలహాదారులను నియమించే అధికారం ఉందా? లేదా? అనే దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని డివిజన్‌ ​​బెంచ్‌ పేర్కొంది.

06 Jan 2023

దిల్లీ

ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని

దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనలో పోలీసులు మరో పురోగతిని సాధించారు. అంజలిని 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు యజమాని అశుతోష్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అంజలి స్కూటర్‌ను ఢీకొట్టినప్పుడు కారులో ఉన్న నలుగురితో పాటు మరో వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

గుడి గోపురంపై కుప్పకూలిన విమానం

మధ్యప్రదేశ్‌లోని రేవాలో శిక్షణ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందగా.. శిక్షణ తీసుకున్నంటున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాముల ఈ ప్రమాదం జరిగినట్లు రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు.

జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. కాజీపేట మీదుగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించే ఈ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని షెడ్యూల్‌ను బట్టి జనవరిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌ ప్రారంభోత్సవాన్ని నిర్వహించే అవకాశం ఉందని పీఎంఓ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ

అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1, 2024 నాటికి రామమందిరాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. త్రిపురలో ఎనిమిది రోజలు పాటు జరగనున్న బీజేపీ 'రథయాత్ర'ను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు.

05 Jan 2023

కోవిడ్

షాకింగ్ న్యూస్: దేశంలో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తింపు

చైనాలో ఒమిక్రాన్ బీఎఫ్-7 సబ్ వేరియంట్ విజృంభణ నేపథ్యంలో దేశంలో కూడా దీనిపైనే చర్చ జరిగింది. అయితే తాజాగా తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే.. దేశంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉన్నాయని తేలింది. ఈ విషయంగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను కనుగొన్నిది అంతర్జాతీయ ప్రయాణికుల్లోనే కావడం గమనార్హం.

కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు

కుప్పంలోని టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.

50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు

హల్ద్వానీ సమీపంలోని రైల్వే భూముల నుంచి 4,000 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు

దిల్లీలోని సుల్తాన్‌పురి ఘటన మరవక ముందే... నోయిడాలో అలాంటి ప్రమాదమే వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ రోజు రాత్రి నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్ కౌశల్ యాదవ్ బైక్‌ను కారు ఢీకొట్టడంతో పాటు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కౌశల్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

నీటి సరఫరా నిర్వహణపై కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పంచాయతీలను కోరారు. మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సులో 'వాటర్ విజన్- 2047'ను ఉద్దేశించి వర్చువల్‌గా మోదీ మాట్లాడారు.

పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్

పశ్చిమ బెంగాల్‌లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పింది.

అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను.. దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ అరూప్ బసు బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరే సమయంలో సోనియాగాంధీ వెంట ఆమె కుమార్తె ప్రియాంక వాద్రా ఉన్నారు.

మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై నిషేధం విధించిన ఎయిర్ ఇండియా

న్యూయార్క్ నుంచి దిల్లీ ప్రయాణిస్తున్నవిమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఎయిర్ ఇండియా చర్యలు తీసుకుంది. మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిపై 30 రోజలు పాటు నిషేధం విధించింది. నిషేధం ఉన్నన్ని రోజులు ఎయిర్ ఇండియా విమానంలో అతడు ప్రయాణించడానికి వీలు లేదని ఎయిర్ ఇండియా చెప్పింది.

ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ముంబయి పర్యటనకు వెళ్లారు. గురువారం ఆయన ముంబయిలో నిర్వహించే రోడ్ షోలలో పాల్గొంటారు. దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భాగంగానే యోగి దేశమంతా పర్యటించనున్నారు. జనవరి 5 నుంచి జనవరి 27 వరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ముఖ్యమైన నగరాల్లో నిర్వహించే రోడ్ షోల్లో యోగి పాల్గొనున్నారు.

04 Jan 2023

దిల్లీ

తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది?

ఓ వ్యక్తి పీకల దాకా తాగి.. ఆ మత్తులో తొటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇది జరిగింది.. బస్సులో కాదు, ట్రైన్‌లో కాదు. అమెరికా నుంచి దిల్లీకి వస్తున్న ఢిల్లీ ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బుధవారం ఎయిర్ ఇండియా అధికారులు ధృవీకరించారు.

సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు.. చిత్రీకరించింది ఎవరో తెలుసా?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ మూలవిరాట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అమ్మవారు మూల విరాట్టు వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు దుర్గ గుడి ఈవో భ్రమరాంబ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె విచారణకు ఆదేశించారు.

కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీసులు షాకిచ్చారు. బుధవారం నుంచి మూడు రోజుల‌పాటు చంద్రబాబు కుప్పంలో రోడ్‌షోలు, బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది.

03 Jan 2023

బిహార్

'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత.. నడ్డా బిహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నితీశ్‌పై నడ్డా విమర్శాస్త్రాలు సంధించారు.

సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సినిమా హాళ్ల లోపల ఆహారం, పానీయాల అమ్మకానికి సంబంధించిన నిబంధనలు, షరతులను విధించే పూర్తి అర్హత యజమానులకు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి

పశ్చిమ బెంగాల్‌లో హౌరా నుంచి న్యూ జల్‌పాయిగుఢి మధ్య ఇటీవల ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దా జిల్లాలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మాల్దా పట్టణానికి 50కిలోమీటర్ల దూరంలో దాడి జరిగనట్లు అధికారులు చెప్పారు.

ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే!

సాధారణంగా వేసవిలో ఉపయోగించే వస్తువులు చలికాలంలో తక్కువ ధరకు లభిస్తాయి. మార్చి వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధరలు అమాంతం పెరిగిపోతాయి. కానీ ఈసారి మాత్రం రిఫ్రిజిరేటర్ల విషయంలో మాత్రం కొంచెం ముందుగానే ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్య్ర హక్కు అందరికీ సమానంగా ఉంటుందని చెప్పింది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా దీనికి అతీతం కాదని ధర్మాసనం చెప్పింది. ఆర్టికల్ 19(2) కింద పేర్కొన్నవి తప్ప.. వాక్‌స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.

దిల్లీ లిక్కర్ స్కామ్: నిందితులకు బెయిల్ మంజూరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్‌లో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. నరేందర్ సింగ్, కుల్దీప్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిల్ళై, సమీర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే వీరు రెగ్యులర్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా?

గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రచారంతో భారతదేశాన్ని ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రయత్నం చేసింది. అయితే ప్రపంచవ్యాప్త డిమాండ్ తగ్గడంతో తయారీ రంగం ఒత్తిడికి గురవుతుంది. భారతదేశ ఎగుమతి ఆదాయాన్ని దెబ్బతీసి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నందున ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం రాబోయే బడ్జెట్‌లో తన విధానాలను సర్దుబాటు చేయవలసి ఉంటుంది.

చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం

రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

03 Jan 2023

కర్ణాటక

కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య..

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. బీటెక్ చదవుతున్న విద్యార్థిని(19)పై ఆమె స్నేహితుడే దాడికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. ఏకంగా 10 సార్లు ఆమెపై దాడి చేసి.. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థినిని స్మితగా.. ఆమె స్నేహితుడిని పవన్ కల్యాణ్‌గా గుర్తించారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం

అరుణాచల్‌ప్రదేశ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం, బుధవారం పర్యటించనున్నారు. తవాంగ్ సెక్టార్‌లోని ఎల్‌ఎసీ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం

అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 మధ్య భారతదేశంలో పిల్లలపై లైంగిక దోపిడీ, బలవంతపు నగ్నత్వాన్ని ప్రోత్సహించినందుకు 45,589 ఖాతాలను ట్విట్టర్ నిషేధించింది. దేశంలో తమ వేదికపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 3,035 ఖాతాలను కూడా తొలగించింది. మొత్తంగా, భారతదేశంలో ఈ విషయంపై ట్విట్టర్ 48,624 ఖాతాలను నిషేధించింది.

02 Jan 2023

తెలంగాణ

2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా..

2023 జనవరి 1 రాకతో.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టాయి. ఈ‌ఏడాది ఏకంగా 9రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే.. ఈ ఎలక్షన్స్‌ను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.