భారతదేశం వార్తలు | పేజీ 11
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
30 Jan 2023
ఉత్తర్ప్రదేశ్తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో గత 10నెలల్లో 111మంది శిశువులు అనుమానాస్పద కారణాలతో మరణించారు. ఈ మరణాలపై లక్నోలోని క్వీన్ మేరీ హాస్పిటల్ బృందం పరిశోధన చేయగా, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాజ్‌గంజ్‌లోని గర్భిణుల పాలల్లో పురుగుమందులు అవశేషాలను ఉండటం గమనార్హం.
30 Jan 2023
రాహుల్ గాంధీనేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారంతో మూగియనుంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విజయవంతంగా పూర్తి చేసుకొన్నయాత్ర శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో గల చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జాతీయ జెండాను ఆవిష్కరించడంతో అధికారికంగా ముగియనుంది.
30 Jan 2023
మహారాష్ట్రఎక్సర్సైజ్ టాప్‌చీ-2023: భారత ఆయుధ సంపత్తి ప్రదర్శన, చైనాకు సవాల్
మహారాష్ట్రలోని దేవ్‌లాలీలోని విశాలమైన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద భారత సైన్యం తన ఆయుధ సత్తా ఏంటో చూపించింది. వివాదాస్పద వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో శక్తివంతమైన ఆయుధాలను ప్రదర్శించి చైనాకు భారత్ సవాల్ విసిరింది. 'ఎక్సర్‌సైజ్ టాప్‌చీ-2023' పేరుతో భారత సైన్యం ఈ ప్రదర్శనను చేపేట్టింది.
28 Jan 2023
సుప్రీంకోర్టుకొలీజియం సిఫార్సు చేసిన పేర్లను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: జస్టిస్ నారిమన్
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలీ నారిమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల పేర్లను పెండింగ్‌లో ఉంచడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
28 Jan 2023
నరేంద్ర మోదీబీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయగా, ఆ సమయంలో గందరగోళం నెలకొంది.
28 Jan 2023
నరేంద్ర మోదీbanned documentaries: భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
28 Jan 2023
రాహుల్ గాంధీ'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జనవరి 27న జరిగిన భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. జమ్మకాశ్మీర్‌లో జరుగుతున్న 'భారత్ జోడో యాత్ర'కు తగిన భద్రత కల్పించడంలో వ్యక్తిగత జోక్యం చేసుకోవాలని కోరారు.
28 Jan 2023
మధ్యప్రదేశ్ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్
భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు గాయాలతో ప్రాణాలతో బయటపడగా, మరో పైలెట్ కోసం వెతుకున్నట్లు అధికారులు తెలిపారు.
28 Jan 2023
దిల్లీదిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి
దిల్లీలోని సుల్తాన్‌పురిలో జరిగిన అంజలి తరహా ఘటన దేశ రాజదానిలో మరొకటి చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత వారిని 350 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.
28 Jan 2023
రాజస్థాన్ప్రధాని మోదీ రాజస్థాన్ పర్యటనలో రాజకీయ కోణం? అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా?
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రాజస్థాన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. అందుకే మోదీ కూడా రాజస్థాన్‌పై శ్రద్ధ కనబరుస్తున్నారు.
28 Jan 2023
మహారాష్ట్రమహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్ నియామకం!
బీజేపీ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియామకమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలుత సుమిత్రా మహాజన్‌ను తదుపరి గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుమిత్రకు బదులుగా అమరీందర్ నియామకానికే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
27 Jan 2023
విమానండీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్' విమానానికి రూ.10లక్షల జరిమానా
బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్' విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది.
27 Jan 2023
గుజరాత్గుజరాత్: దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొని, భర్తను 12కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
దిల్లీలోని సుల్తాన్‌పురిలో అంజలిని కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన తరహా ఘటన తాజాగా గుజరాత్‌లో జరిగింది. సూరత్‌లో దంపతులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టి, బైకర్‌ను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
27 Jan 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్!
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తన కుమారుడు శిశిర్‌తో కలిసి బీజేపీని వీడి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరనున్నట్లు ప్రకటించారు.
27 Jan 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీలోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాదయాత్రను శుక్రవారం కుప్పం మొదలుపెట్టారు. అయితే తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న.. లోకేశ్‌తో నడుస్తున్న క్రమంలో అస్వస్థతకు గురై, ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.
27 Jan 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీకుప్పంలో లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాద యాత్రకు శ్రీకారం చుట్టారు.
27 Jan 2023
దిల్లీనేడు దిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించినా దేశంలో ప్రదర్శనలు ఆగడం లేదు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో పలు విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మంగా తీసుకొని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా దిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ, భీమ్ ఆర్మీ, వామపక్షతో పాటు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నార్త్ క్యాంపస్‌లో ప్రదర్శించనున్నట్లు పిలుపునిచ్చారు.
27 Jan 2023
కాంగ్రెస్సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం'
2016లో భారత దళాలు జరిపిన సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్‌కు మరో హస్తం పార్టీ నాయకుడు రషీద్ అల్వీ మద్దుతుగా నిలిచారు. సర్జికల్ స్ట్రైక్ వీడియోను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
27 Jan 2023
హైదరాబాద్హెచ్సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ, కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ఏబీవీపీ పోటీ పడి మరీ ప్రదర్శించడంతో హెచ్‌సీయూలో మరోసారి వివాదం రాజుకుంది.
26 Jan 2023
నరేంద్ర మోదీగణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక
74వ గణతంత్ర వేడుకల వేళ ప్రధాని మోదీ తలపాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి స్వాతంత్య్ర, రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఆయన వస్త్రాధారణ హైలెట్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా మోదీ ధరించే తలపాగా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.
26 Jan 2023
గణతంత్ర దినోత్సవం74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్యపథ్‌లో అంబరాన్నంటిన సంబరాలు
దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళితో గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ హాజరయ్యారు.
26 Jan 2023
పద్మశ్రీ అవార్డు గ్రహీతలుతెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీనుంచి ఏడుగురికి అవార్టులు వచ్చాయి.
25 Jan 2023
పద్మవిభూషణ్padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు
ఎస్పీ వ్యవస్థాపకులు, దివంగత ములాయం సింగ్ యాదవ్, సంగీతకారుడు జాకీర్ హుస్సేన్, ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) సృష్టికర్త ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు దివంగత దిలీప్ మహలనాబిస్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు దేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది.
25 Jan 2023
గణతంత్ర దినోత్సవంప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన కేంద్రం, ఏపీకి విశిష్ట సేవా పురస్కారాలు
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రపతి పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను గెలుచుకుంది.
25 Jan 2023
నరేంద్ర మోదీఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు
జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.
25 Jan 2023
తెలంగాణరాజ్భవన్లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం
కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
25 Jan 2023
గణతంత్ర దినోత్సవంఛత్తీస్గఢ్: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది
ఛత్తీస్‌గఢ్‌లో జనవరి 26న నిర్వహంచే రిపబ్లిక్ డే పరేడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రిపబ్లిక్ డే పరేడ్ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పరేడ్‌లో పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీపీ పి.సుందర్‌రాజ్ వెల్లడించారు.
25 Jan 2023
కేరళకాంగ్రెస్కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ పార్టీకి రాజీనామా చేశారు.
25 Jan 2023
ఎన్నికల సంఘంNational Voters Day: యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ
యువ ఓటర్లు భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్ అని, 2000 సంవత్సరం తర్వాత జన్మించిన వారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.
25 Jan 2023
దిల్లీశ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి 6,629 పేజీల ఛార్జ్‌షీట్ ను దిల్లీ పోలీసులు సాకేత్ కోర్టులో దాఖలు చేశారు. శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ పూనావాలా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, పూర్వాపరాలను ఛార్జ్‌షీట్‌లో పోలీసులు వెల్లడించారు.
25 Jan 2023
నరేంద్ర మోదీజేఎన్యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో మంగళవారం రాత్రి హై డ్రామా జరిగింది. వామపక్ష విద్యార్థులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో బీబీసీ డాక్యుమెంటరీని చూసేందుకు గుమికూడగా వారిపై రాళ్లదాడి జరిగింది. దీంతో జేఎన్‌యూలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
24 Jan 2023
ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాకు డీజీసీఏ మరో షాక్, ఈ సారి రూ.10లక్షల ఫైన్
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు డీజీసీఏ మరోసారి షాక్ ఇచ్చింది. న్యూయార్క్-దిల్లీ వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనలో ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ, తాజాగా అలాంటి సంఘటనలో రూ. 10లక్షల ఫైన్ విధించింది. వారం లోపలే ఎయిర్ ఇండియాకు ఈ రెండు ఫైన్లు విధించడం గమనార్హం.
24 Jan 2023
హర్యానాడేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్
పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా మరో వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. తను బెయిల్‌పై విడుదలైన సందర్భంగా అనుచరులతో కలిసి బర్నావా ఆశ్రమంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు డేరా బాబా.
24 Jan 2023
దిల్లీదిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు
దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
24 Jan 2023
రాహుల్ గాంధీ'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్
2016లో భారత దళాల 'సర్జికల్ స్ట్రైక్', 2019 పుల్వామా ఉగ్రదాడిపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అవి దిగ్వజయ్ వ్యక్తిగత అభిప్రాయాలని రాహుల్ పేర్కొన్నారు. వాటితో తాము ఏకీభవించడం లేదని, సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి భారత సైనికులు ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు.
24 Jan 2023
తెలంగాణఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం
తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజున అంటే ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దాదాపు రూ. 700 కోట్లతో నిర్మించిన కొత్త ఐకానిక్ భవనాన్ని ఆ రోజు ఉదయం 11:30గంటలకు ప్రారంభించనున్నారు.
24 Jan 2023
హైదరాబాద్హెచ్సీయూలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన, యూనివర్సిటీ అధికారులకు ఏబీవీవీ ఫిర్యాదు
ప్రధాని మోదీ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తాజాగా ఈ వివాదాస్పద విషయం హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి చేరుకుంది.
24 Jan 2023
విమానంస్పైస్జెట్: దిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన, అరెస్టు చేసిన పోలీసులు
విమానాల్లో కొందరు ప్రయాణికులు సిబ్బంది పట్ల , తోటి ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల సంఘటనలు మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
23 Jan 2023
కాంగ్రెస్'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు
భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2016లో జరిగిన సర్జికల్ దాడుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
23 Jan 2023
అమెజాన్హైదరాబాద్లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
కస్టమర్లకు వేగంగా బుకింగ్ డెలివరీలను చేరవేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా హైదరాబాద్‌లో ఎయిర్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఎయిర్ సర్వీసులకు ప్రారంభించారు.