భారతదేశం వార్తలు | పేజీ 12
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
23 Jan 2023
తెలంగాణసీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డి డిప్యూటీ తహశీల్దార్ సస్పెండ్
సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి డిప్యూటీ తహశీల్దార్ చొరబడ్డ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే పోలీసులు డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయగా, తాజాగా ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది.
23 Jan 2023
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. పైగా వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఈ దారుణం జరిగిన రెండు నెలల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.
23 Jan 2023
హైదరాబాద్హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ
ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ నేతృత్వంలోని 14 మంది సభ్యులతో కూడిన హౌసింగ్, అర్బన్ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ మెట్రో రైలు సందర్శించింది. రాయదుర్గ్ నుంచి అమీర్‌పేట్ స్టేషన్ వరకు ప్రయాణించారు.
23 Jan 2023
నరేంద్ర మోదీ21 అండమాన్ దీవులకు వీరుల పేర్లు, నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు పరమవీర చక్ర అవార్డు పొందిన 21 మంది వీరుల పేర్లను పెట్టారు ప్రధాని మోదీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి 23) సందర్భంగా నిర్వహించిన 'పరాక్రమ దివస్'లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ ఈ పేర్లను ప్రకటించారు.
23 Jan 2023
భారతదేశంభారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం, నౌకాదళంలోకి ప్రవేశించిన సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ 'వగిర్'
భారత నౌకాదళం మరో ప్రధాన అస్త్రాన్ని తన అమ్ములపొదిలో చేర్చుకుంది. సముద్రగర్భంలో శత్రువు పాలిట మారణాస్త్రంగా భావిస్తున్న సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ 'వగిర్'ను చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఆధ్వర్యంలో సోమవారం నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.
23 Jan 2023
అసదుద్దీన్ ఒవైసీబీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం భారత ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోకు సబంధించిన యూట్యూబ్ లింకులను కేంద్రం భ్యాన్ చేయడంపై జాతీయస్థాయిలో రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం తీసుకున్న చర్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
21 Jan 2023
నరేంద్ర మోదీప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం
ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తీవ్ర దుమారం రేగుతోంది. భారత ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. బ్రిటన్ పార్లమెంట్‌లో కూడా డాక్యుమెంటరీపై చర్చ జరిగింది. తాజాగా డాక్యుమెంటరీలో మొదటి ఎపిసోడ్‌ను బీబీసీ ప్రసారం చేసింది. అయితే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో లింక్ ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి.
21 Jan 2023
మహారాష్ట్రPune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు
ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలు పెచ్చరిల్లుతున్నాయి. కొడలికి పిల్లలు పుట్టడం లేదని దారుణానికి ఒడిగట్టారు ఓ మహిళ అత్తమామలు. తాంత్రికుడు చెప్పిన మాటలు విని కొడలితో శ్మశానంలోని ఎముకలు, వాటి పొడిని తినిపించారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ దారుణం జరిగింది.
21 Jan 2023
జమ్ముకశ్మీర్జమ్ముకశ్మీర్లో జంట పేలుళ్లు, ఆరుగురికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు కలకలం సృష్టించాయి. 15 నివిషాల వ్వవధిలోనే ఈ పేలుళ్లు జరగ్గా, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నర్వాల్ ప్రాంతంలో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని యార్డ్ నంబర్ 7లో ఈ పేలుళ్లు సంభవించాయి.
21 Jan 2023
ఉజ్బెకిస్తాన్బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు వస్తున్న చార్టర్డ్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో షాక్‌కు గురైన అధికారులు విమానాన్ని అత్యవరస ల్యాండింగ్ కోసం ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. శనివారం తెల్లవారుజామున జరిగన ఈ ఘటనతో అధికారులు హడలెత్తిపోయారు.
21 Jan 2023
ఉత్తర్ప్రదేశ్డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్
డోలో-650 ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కుంభకోణానికి కంపెనీ పాల్పడినట్లు ఆరోపిస్తూ, ట్రయల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
21 Jan 2023
రెజ్లింగ్డబ్ల్యూఎఫ్ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి వరకు రెజ్లర్లతో అనురాగ్ ఠాకూర్ చర్చలు జరిపారు.
20 Jan 2023
దిల్లీఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ స్పందించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో తాను ఫెడరేషన్ పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదన్నారు. తనకు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఈ పదవి దక్కలేదన్నారు. ప్రజలు ఎన్నుకోవడం వల్ల తాను ఇక్కడ కూర్చున్నట్లు స్పష్టం చేశారు.
20 Jan 2023
దిల్లీదిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మాటల యుద్ధం రోజుకు రోజుకు పెరుగుతోంది. ఇటీవల గవర్నర్‌పై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్జీని కలిసేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. ఈ ప్రశ్నలపై సమాధానంగా శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. కేజ్రీవాల్‌కు లేఖ రాశారు.
20 Jan 2023
గుజరాత్'పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?' మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై మున్సిపాలిటీకి షాకాజ్ నోటీసులు
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై స్థానిక మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విధుల నిర్వహణలో ఘోరంగా విఫమైన మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆ నోటీసుల్లో పేర్కొంది.
20 Jan 2023
ఆంధ్రప్రదేశ్సుప్రీంకోర్టు ఆదేశాలు: జీఓ నెం.1 పిటిషన్‌పై 23న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1 పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. జీఓ నంబర్ 1పై జనవరి 23న విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది.
20 Jan 2023
ఎయిర్ ఇండియావిమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
న్యూయార్క్-దిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం చర్యలు తీసుకుంది.
20 Jan 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. గ్లోబల్ మల్టీ-బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' హైదరాబాద్‌లో సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
20 Jan 2023
హైకోర్టుఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు
ఐసీఐసీఐ బ్యాంక్ - వీడియోకాన్ రుణం కేసులో బాంబే హైకోర్టు వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు చేసింది.
20 Jan 2023
దిల్లీరిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం
దిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు కలకలం సృష్టించాయి. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న నేపథ్యంలో దిల్లీలో పలు ప్రాంతాల్లో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి.
20 Jan 2023
అనురాగ్ సింగ్ ఠాకూర్అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌తోపాటు పలువురు కోచ్‌ల వేధింపులు తాళలేక ఆందోళనకు దిగిన రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమావేశమయ్యారు.
19 Jan 2023
సికింద్రాబాద్సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్‌లోని నల్లగుట్ట వద్ద ఉన్న డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న పది మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
19 Jan 2023
నరేంద్ర మోదీప్రదాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: 'వలసవాద ఆలోచనా ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది'
ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్ తీవ్రంగా స్పందించింది. అపఖ్యాతితో కూడుకున్న కథనాన్ని ముందుకు తీసుకురావడానికి రూపొందించబడిన ప్రచారాస్త్రంగా కనపడుతోందని చెప్పింది.
19 Jan 2023
గుజరాత్గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక
తండ్రి వజ్రాల వ్యాపారి, రూ. కోట్లలో ఆస్తి, విసాలవంతమైన జీవితం, ఏది కావాలన్నా క్షణాల్లో తెచిపెట్టే తల్లిదండ్రులు.. వీటన్నింటి త్యజించి, ఎనిమిదేళ్లకే భక్తి మార్గంలో నడవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. అనుకున్న విధంగానే జైన సన్యాసాన్ని స్వీకరించింది. ఈ అసాధారణ ఘటన గుజరాత్‌లో జరిగింది.
19 Jan 2023
దిల్లీదిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కు వేధింపులు, కారు అద్దంలో చేయి ఇరుక్కున్నా ఈడ్చుకెళ్లిన డ్రైవర్
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్‌ను ఓ డ్రైవర్ వేధించాడు. ఆమె చేయి కారు అద్దంలో ఇరుక్కోగా, అమెను అలాగే కొంతదూరం లాక్కెళ్లాడు. రాత్రి 3గంటల సమయంలో ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది.
19 Jan 2023
సుప్రీంకోర్టు'రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే ప్రక్రియ జరుగుతోంది: సుప్రీంకోర్టుకు తెలిపి కేంద్రం
రామసేతుపై కేంద్రం ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. రామసేతును 'జాతీయ స్మారక చిహ్నం'గా ప్రకటించే ప్రక్రియ జరుగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం ప్రభుత్వం తెలిపింది.
19 Jan 2023
తెలంగాణరూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి మర్డర్ డ్రామా
మెదక్ జిల్లా వెంకటాపూర్ గ్రామ శివార్లలోని కొండగట్టులో కారు దగ్ధమై, ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన ఘటనలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రభుత్వ ఉద్యోగి చనిపోలేదని రూ. 7కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ మర్డర్ డ్రామాకు తెరలేపాడని పోలీసుల విచారణలో తేలింది.
19 Jan 2023
మహారాష్ట్రముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి
మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ముంబయి-గోవా హైవేపై మంగావ్ ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొన్న ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.
18 Jan 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌పై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశంసలు కురించారు. కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక్కడి పథకాలు అద్భుతమని, కంటి వెలుగు పథకాన్ని దిల్లీ, పంజాబ్ లలో అమలు చేస్తామని ప్రకటించారు.
18 Jan 2023
భారతదేశం'రిపబ్లిక్ డే' ఈవెంట్‌లో 50 విమానాలు ఫ్లైపాస్ట్: ఐఏఎఫ్
జనవరి 26 రిపబ్లిక్ డే రోజున 50 విమానాలతో 'ఫ్లైపాస్ట్'ను నిర్వహించనున్నారు. రాజ్‌పథ్ మీదుగా ఈ ఫ్లైపాస్ట్ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 45 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నేవీకి చెందిన ఒకటి, ఆర్మీకి చెందిన నాలుగు హెలికాప్టర్లు 'ఫ్లైపాస్ట్'లో పాల్గొననున్నాయి.
18 Jan 2023
అసెంబ్లీ ఎన్నికలుఅసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ఈసీ ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మార్చి 2న ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో కలిపి 9,125 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
18 Jan 2023
తమిళనాడుతమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి
తమిళనాడు పేరును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి 'తమిళగం' అని సంభోదించడంపై తీవ్ర దుమారం రేగింది. తమిళనాడు వ్యాప్తంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ వివాదం రోజురోజుకు మరింత ముదురుతున్న నేపథ్యంలో గవర్నర్ రవి స్పందించారు.
18 Jan 2023
త్రిపురElection Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు విలేకరుల సమావేశంలో ఈసీ షెడ్యూల్‌ను వెల్లడించనుంది.
18 Jan 2023
బండి సంజయ్చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు, తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియోలు వైరల్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తోటి విద్యార్థులను కొట్టడంతో పాటు అసభ్యకర పదజాలంతో తిట్టిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
18 Jan 2023
బీజేపీవిమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఒక ఘటనపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
17 Jan 2023
జేపీ నడ్డా2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగిస్తూ.. జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు జేపీ నడ్డానే బీజేపీ చీఫ్‌గా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
17 Jan 2023
దిల్లీరాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్
దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో యూఏఈ రాజకుటుంబ సభ్యుడిగా నటిస్తూ మూడు నెలలకు పైగా అక్కడే ఉండి.. ఏకంగా రూ.23 లక్షలు బిల్లు చెల్లించకుండా పరారయ్యాడు ఓ యువకుడు. అతడిని మహమ్మద్ షరీఫ్ వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. ఆచూకీకోసం వెతుకున్నారు.
17 Jan 2023
కర్ణాటకకర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ
మరికొన్ని నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ మళ్లీ రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది.
17 Jan 2023
భారతదేశంపాక్ మహిళను రెండోపెళ్లి చేసుకున్న దావూద్, సంచలన విషయాలను వెల్లడించిన 'డాన్' మేనల్లుడు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి అతని మేనల్లుడు అలీషా పార్కర్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో సంచలన విషయాలను వెల్లడించారు. మొదటి భార్య మైజాబిన్‌కు విడాకులు ఇవ్వకుండానే.. పాక్ పఠాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.
17 Jan 2023
చంద్రబాబు నాయుడురేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు
తెలంగాణలో మరో భారీ కార్యక్రమానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఈనెల 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొననున్నారు.