భారతదేశం వార్తలు | పేజీ 9

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం

జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని గురెజ్ సరిహద్దు ప్రాంతంలో హిమపాతం కారణంగా ఇద్దరు మహిళలు ప్రమాదంలో పడ్డారు.

10 Feb 2023

ముంబై

ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌

బుల్లెట్ రైలు పని మహారాష్ట్రలో వేగాన్ని పుంజుకుంది, దీనిని బాంబే హైకోర్టు "జాతీయ ప్రాముఖ్యత మరియు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన" ప్రాజెక్ట్ అని పేర్కొంది.

బీబీసీ బ్యాన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

భారత్‌లో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హిందూసేన ఈ పిటిషన్ వేయగా.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్

డబ్ల్యూఈఎఫ్ లో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎఫ్‌ఎంసిజి సహా వివిధ రంగాల్లో తెలంగాణ దాదాపు రూ.21,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం స్ఫష్టం చేశారు.

2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులైన వారం తర్వాత, కేంద్రం ఈరోజు మరో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను అత్యున్నత న్యాయస్థానానికి పెంచింది, ఇప్పుడు పూర్తి స్థాయి 34 మంది న్యాయమూర్తుల సంఖ్యకు చేరుకుంది.

జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు

దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో లిథియం నిల్వలు లభించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.

10 Feb 2023

లోక్‌సభ

వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ లో అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంపై వివాదం రేగింది. అసభ్య పదజాలం వాడారని ఆరోపిస్తూ ఆమెను బీజేపీ టార్గెట్ చేసింది.

గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బుధవారం లోక్‌సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మోదీ, గురువారం రాజ్యసభలో కూడా మాటల తూటాలను పేల్చారు.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు తీవ్ర అస్వస్థత-ఆస్పత్రిలో చేరిక

జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులను అయన్ను వెంటనే రాంచీలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.

సుప్రీంకోర్టుకు అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం, రేపు విచారణ

షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై 'కుట్ర'కు పాల్పడిందంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పీఐఎల్)పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ పీఐఎల్‌లు దాఖలు చేశారు.

09 Feb 2023

రాజ్యసభ

కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను దేశం సీరియస్‌గా తీసుకుంటోందని, ఈ క్రమలో కొంతమంది ఎంపీల ప్రవర్తన ప్రజలను నిరాశకు గురి చేసిందని ప్రధాని మోదీ అన్నారు.

ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' కాదు, 'కౌ హగ్ డే'ను జరుపుకోండి: కేంద్రం

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కాకుండా 'కౌ హగ్ డే'ను జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆవును కౌగిలించుకోవడం వల్ల వ్యక్తిగత, సామూహిక ఆనందం పెరుగుతుందని చెప్పింది. ఆవు ప్రేమికుల విజ్ఞప్తి మేరకు కేంద్ర జంతు సంక్షేమ విభాగం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్థానిక, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, తెలంగాణలోని ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.

మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..

ఆంధ్రప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంబులెన్స్‌కు డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భూజలపై మోసుకుంటూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నఇంటికి బయలుదేరాడో ఓ భర్త.

ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

09 Feb 2023

కేరళ

బిడ్డకు జన్మనిచ్చిన జహాద్, దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులైన టాన్స్‌జెండర్ జంట

దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లి దండ్రులయ్యారు. జహాద్ బుధవారం కేరళలోని కోజికోడ్ ప్రభుత్వాస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన బిడ్డ ఆడ, మగ అనేది జియా పావల్, జహాద్ జంట వెల్లడించలేదు.

కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు.

08 Feb 2023

లక్నో

'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన

లక్నో పేరు మార్పుపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కీలక ప్రకటన చేశారు. భదోహిలో జిల్లాలో వివిధ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యావలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.

08 Feb 2023

లోక్‌సభ

'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ హేమ మాలిని బుధవారం మండిపడ్డారు. అక్షేపణీయమైన పదాన్ని లోక్‌సభలో మహువా ఉపయోగించారని, నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడలని సూచించారు.

రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో సమాధానం ఇచ్చారు. ఆమె అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు!

వైసీపీ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు తొలుత నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు.

అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ

జమ్ముకశ్మీర్‌లో ఇళ్లను కూల్చడాన్ని నిరసిస్తూ పీడీపీ అగ్రనేత మెహబూబా ముఫ్తీ దిల్లీలో ఆందోళన చేప్టటారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ, లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనపై ఆమె విరుచుపడ్డారు. పేదలు, అట్టడుగువర్గాల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు జమ్ముకశ్మీర్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

08 Feb 2023

దిల్లీ

దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ

దిల్లీ మద్యం కేసులో శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది.

ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటం‌రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు.

ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ

ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు దూబే లేఖ రాశారు.

దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ

దిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది.

07 Feb 2023

దిల్లీ

శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించిన మరికొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఆ విషయాలు ఉన్నాయి.

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్!

ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని ఇటీవల నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు.

అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌‌గాంధీ మంగళవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో ఆయన అదానీ అంశాన్ని లేవనెత్తారు. గౌతమ్ అదానీ ప్రయోజనాలను కోసం మోదీ ప్రభుత్వం వ్యాపార నియమాలను మార్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా విమనంలో అదానీతో కలిసి ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని రాహుల్ ప్రదర్శించారు.

జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల: సత్తాచాటిన అబ్బాయిలు, 20మందికి 100 పర్సంటైల్

జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ( ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ ఫలితాల్లో అబ్బాయిలు సత్తాచాటారు. 20మంది అబ్బాయిలు 100 పర్సంటేజ్ సాధించారు. ఈ సెషన్‌లో మహిళా అభ్యర్థులెవరూ 100 పర్సంటేజ్ సాధించలేకపోవడం గమనార్హం.

మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రముఖ మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి రైళ్లలో వాట్సాప్‌లోనే భోజనం ఆర్డర్

వినియోగదారుల సౌకర్యార్థం రైళ్లలో ఇటీవల అనేక మార్పులు తీసుకొచ్చింది భారతీయ రైల్వే. తాజాగా రైళ్లలో ప్రయాణికులు భోజన్ ఆర్డర్ చేసుకున్న పద్ధతిని మరింత సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే సేవలను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్

వరుస భూకంపాలతో అల్లాడుతున్న టర్కీకి ఆపన్న హస్తం అందించడం కోసం ప్రత్యేక విమానాన్ని భారత్ పంపింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో పాటు నైపుణ్యం కలిగిన డాగ్ స్క్వాడ్‌లు, వైద్య సామగ్రి, అధునాతన డ్రిల్లింగ్ పరికరాలు, ఇతర కీలకమైన సాధనాలతో ఈ విమానం బయలుదేరింది.

ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.

'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్

ఎవరైనా దూరప్రయాణాలకు వెళ్లేటప్పడు గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవాలంటే విమానాలను ఎంచుకొంటారు. అయితే ఇప్పుడు విమానాల కంటే వేగంగా రోడ్డు మార్గం ద్వారానే వెళ్లొచ్చని చెబుతున్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం ఆజ్‌తక్ నిర్వహించిన కాన్‌క్లేవ్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోసం, స్టాక్ మానిప్యులేషన్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌పై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు.

ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణను ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల అంశాన్నిఅత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో 23న విచారిస్తామని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మానసం వెల్లడించింది.

బీజేపీ మండలాధ్యక్షుడిని హత్య చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడిని అతని కుటుంబసభ్యుల ఎదుటే మావోయిస్టులు హతమార్చారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

06 Feb 2023

కర్ణాటక

కత్తులతో మార్కెట్‌లో వ్యక్తి వీరంగం, షూట్ చేసిన పోలీసులు

కర్నాటకలోని కలబురగిలో ఒక వ్యక్తి కత్తులతో వీరంగం సృష్టించారు. మార్కెట్ ప్రాంతంలో సాధారణ ప్రజలపై దాడి చేస్తానని బెదిరిస్తున్న అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు.