భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఆయన తండ్రి పేరును కాంగ్రెస్ నాయకులు అపహాస్యం చేస్తున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సభ్యుల భయంకరమైన వ్యాఖ్యలను దేశం క్షమించదని శర్మ పేర్కొన్నారు.

21 Feb 2023

ఎన్ఐఏ

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్ అణచివేతపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఫోకస్ పెట్టింది. మంగళవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 72చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

20 Feb 2023

కర్ణాటక

'10మంది ముస్లిం బాలికలను ట్రాప్ చేయండి, భద్రత కల్పిస్తాం'; శ్రీరామ్ సేన అధ్యక్షుడు సంచలన కామెంట్స్

'లవ్ జిహాద్'ను ఎదుర్కొనేందుకు కర్ణాటకలో శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

20 Feb 2023

దిల్లీ

దిల్లీ మద్యం కేసు: 'ఈ నెల 26న విచారణకు రండి'; మనీష్ సిసోడియాను మళ్లీ సీబీఐ సమన్లు

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో విచారణ నిమిత్తం ఫిబ్రవరి 26న మళ్లీ తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోరింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది.

భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య

ఓ మహిళ తన భర్త, అత్తను హత్య చేసి, వారి మృతదేహాలను ముక్కలుగా నరికి మూడు రోజులు ఫ్రిజ్‌లో ఉంచింది. ఈ ఘటన అసోంలోని గువాహటిలో జరిగింది.

ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) వివిధ కోటాల కింద మార్చి 13, 2023న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 18 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో?

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి భార్య భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కడప రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

20 Feb 2023

ఐఫోన్

ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ హత్య- నాలుగురోజులుగా బాత్‌రూమ్‌లోనే మృతదేహం

ఐఫోన్ కోసం ఒక వ్యక్తి డెలివరీ బాయ్‌ను హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన మూడున్నరేళ్ల తర్వాత లోయలో మోహరించిన అదనపు బలగాలను ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం.

20 Feb 2023

గుజరాత్

మోర్బి వంతెనపై 'సిట్' నివేదిక: కూలిపోవడానికి ముందే సగం కేబుల్స్ తెగిపోయాయి

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో గతేడాది అక్టోబర్ 30న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 135 మంది మృతిన ఈ ఘటనపై విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుజరాత్ హైకోర్టుకు సోమవారం నివేదికను సమర్పించింది.

20 Feb 2023

శివసేన

'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ

'శివసేన' పార్టీ పేరు, 'విల్లు, బాణం' గుర్తును మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి

దిల్లీలోని తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడిలో ఇంటి కిటికీ ధ్వంసమైనట్లు చెప్పారు.

ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది?

ఫిబ్రవరి 24నుంచి 26వరకు నయా రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే నియామకాన్ని ఆమోదించనున్నారు. ప్లీనరీలోనే కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కూడా ఎన్నుకోనున్నారు. అయితే సీడబ్ల్యూసీని ఎలా ఏర్పాటు చేస్తారనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది.

సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం

సినీనటుడు నందమూరి తారకరత్న శనివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొన్నిరోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శివైక్యం చెందారు.

కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస

సమకాలీన రాజకీయ నాయకులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకి హాజరైన రాజకీయాలు, సినిమా, స్టూడెంట్ లైఫ్ లాంటి పలు విషయాలపై చంద్రబాబు మాట్లాడారు.

ఎయిర్ ఇండియాను మించిపోయిన ఇండిగో ఎయిర్‌లైన్స్, ఏకంగా 500 విమానాలకు ఆర్డర్

ఎయిర్ ఇండియా 470 విమానాలకు అర్డర్ ఇస్తేనే ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు దానికి మించిన విమానాల ఆర్డర్‌ను ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో ఇవ్వడంతో ప్రపంచమంతా భారత్‌లో ఏం జరుగుతుందని గమనిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా?

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లను కైసవం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రోడ్డెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో పార్టీని మరోసారి విజయతీరాలకు చేర్చేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచి వ్యూహ రచన చేస్తున్నారు.

మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై పెట్టుబడిదారుల ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మండిపడ్డారు.

18 Feb 2023

దిల్లీ

దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ

దిల్లీ మద్యం కేసులో డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సీబీఐ సమన్లు జారీ చేసినట్లు సిసోడియా శనివారం ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన

ఇక నుంచి ఏ రాష్ట్రం విషయంలో కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో చాలా ఏళ్లుగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు ఇది ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు

12 చిరుతలతో దక్షిణాఫ్రికా నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకుంది.

18 Feb 2023

దిల్లీ

దిల్లీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్: 2020లో సాహిల్, నిక్కీకి పెళ్లి; మ్యారేజ్ సర్టిఫికెట్ లభ్యం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిక్కీ యాదవ్ హత్య కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలైన నిక్కీకి, నిందితుడు సాహిల్‌కు 2020లో పెళ్లి జరిగింది. వివాహానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోయిడాలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.

ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

అదానీ గ్రూప్ హిండెస్ బర్గ్ నివేదిక వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నివేదికను పరిశీలించేందుకు కమిటీలో కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సూచించే నిపుణుల పేర్లను చేర్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజెఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

బిలియనీర్ జార్జి సోరోస్‌పై మండిపడ్డ స్మృతి ఇరానీ

అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేపుతున్నారు. తాజాగా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జార్టి సోరోస్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.కొన్ని విదేశీ శక్తులు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

కేసీయార్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి బెలూన్లు పేలి కాలేరు వెంకటేష్ కు గాయాలు

అంబర్ పేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం కేసీయార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఆ వేడుకలో బెలూన్లు పేలి అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.

హర్యానాలోని భివానీ జిల్లాలో దారుణం.. ఇద్దరు సజీవదహనం

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తుల్ని కారుతో సహా సజీవదాహనం చేసిన ఘటన భివానీ జిల్లాలో జరిగింది. మృతులు రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35)గా గుర్తించామని లోహారు (భివానీ) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగత్ సింగ్ తెలిపారు.

17 Feb 2023

బీబీసీ

బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు

బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని కార్యాలయాల్లో దాదాపు 60 గంటల పాటు ఐటీ సోదాలు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. సంస్థ ఆర్థిక లావాదేవీలపై పలువురు ఉద్యోగులను ప్రశ్నించారు.

జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం

జమ్మూకాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కత్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.6గా నమోదైందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఉదయం 5.01 గంటలకు 10 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది.

16 Feb 2023

త్రిపుర

త్రిపురలో ముగిసిన పోలింగ్; మార్చి 2న ఓట్ల లెక్కింపు

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం 5గంటలకు ముసింగింది. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్

క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఎ పాల్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తాను హిందువుగా పుట్టానని, హిందువుగానే చనిపోతానని ప్రకటించారు. అయితే తాను చివరి వరకు ఏసుక్రీస్తు అనుచరుడిగా ఉంటానని వెల్లడించారు.

16 Feb 2023

బీజేపీ

బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ముందుగా గుంటూరులో తన ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తగ్గేదేలే అంటున్న 'ఎయిర్ ఇండియా'; ఏకంగా 840 విమానాల కోనుగోలుకు 'టాటా' ప్లాన్

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానాల కొనుగోళ్లలో ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే రూ.6లక్షల కోట్ల విలువ చేసే 470 విమానాలను బోయింగ్, ఎయిర్‌బస్‌ కంపెనీలకు ఆర్డర్‌ చేసి ప్రపంచంలోనే అతిపెద్ద డీల్‌ను ఎయిర్ ఇండియా కుదుర్చుకుంది.

విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాస్పత్రుల దయనీయ స్థితికి అద్దం పట్టే సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగింది. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వైద్యలు, సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా చంటిబిడ్డ మృతదేహంతో దాదాపు 120 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించారు తల్లిదండ్రులు.

16 Feb 2023

బీబీసీ

బీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు- మూడు రోజులుగా ఇంటికెళ్లని ఉద్యోగులు

దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఆదాయపు పన్ను శాఖ సోదాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. దాదాపు 45 గంటలకు పైగా ఏకధాటిగా అధికారులు సర్వే చేస్తున్నారు.

16 Feb 2023

ఒడిశా

మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ

ఒడిశా అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు జయనారాయణ్ మిశ్రా తన విధులకు ఆటంకం కలిగించారని, తనను దుర్భాషలాడారని సంబల్‌పూర్ జిల్లాలోని ధనుపాలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనితా ప్రధాన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించన వీడియో వైరల్‌గా మారింది.

విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్

విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్ర్‌టన్‌ ఎరీనాలో 'గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌' ప్రారంభమైంది. గురువారం, శుక్రవారం జరగనున్న ఈ ఈవెంట్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాల ఆవిష్కరణలపై చర్చించనున్నారు. ఉదయం 10గంటలకు సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు.

16 Feb 2023

త్రిపుర

త్రిపుర అసెంబ్లీ పోలింగ్: కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటేస్తున్న ప్రజలు

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. 28.14లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. 60స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి 259 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

15 Feb 2023

దిల్లీ

హత్యకు ముందు 'నిక్కీ యాదవ్' సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు- నెట్టింట్లో వైరల్

దిల్లీలో ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి, అదే రోజు ఆ యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో నిందితుడిని సాహిల్ గెహ్లాట్‌గా, మృతురాలిని నిక్కీ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు.