భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య

లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 15ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలను చూసి ఇంట్లో బిడ్డను ప్రసవించింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని అంబజారి ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు

10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గతంలో ఏపీలో 10వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ అయిన నేపథ్యంలో తెలంగాణలో కూడా కార్పొరేట్, పలు ప్రవేటు పాఠశాలలు అలా అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఏప్రిల్ 1నుంచి టోల్ రేట్లను భారీగా పెంచే యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ; ప్రయాణికులపై మరింత భారం

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఏప్రిల్ 1 నుంచి టోల్ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీంతో నేషనల్ హైవేస్ (ఎన్‌హెచ్‌లు), ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించే ప్రయాణికులపై మరింత భారం పడే అవకాశం ఉంది. టోల్ ధరలను 5శాతం నుంచి 10శాతానికి పెంచే ఆలోచనలో ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నట్లు తెలుస్తోంది.

06 Mar 2023

పెన్షన్

ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు

ఈపీఎఫ్ పింఛన్‌దారులకు ఉద్యోగుల భవిషనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) షాక్ ఇచ్చింది. అధిక వేతనంపై ఎక్కువ పింఛన్ పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది. అయితే 2014కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ఈ నోటీసులను పంపింది.

06 Mar 2023

మేఘాలయ

మేఘాలయలో 45కు చెరిన సంగ్మా బలం; నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

మేఘాలయ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సోమవారం తొలిసారి అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి

ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఉస్మాన్ సోమవారం మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారాలో పోలీసులు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఉస్మాన్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

04 Mar 2023

త్రిపుర

ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరనేది తీవ్రమైన చర్చనడుస్తోంది.

మార్చి 7న నాగాలాండ్ సీఎంగా ​​ 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం

ఎన్‌డీపీపీ అధినేత నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతతో ఆయన ఐదోసారి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.

IMA: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఐఎంఏ హెచ్చరిక

సీజనల్‌గా వచ్చే దగ్గు వికారం, వాంతులు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, అతిసారం వంటి లక్షణాలను కలిగి ఉన్న రోగులకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వైద్య నిపుణులను కోరింది.

రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు భారీ ప్రమాదం; కార్లు ధ్వంసం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఈ ఘటన జరిగింది.

గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆక్రమణల పేరుతో అధికారులు మళ్లీ కూల్చివేతలకు పాల్పడ్డారు. అధికారులు జేసీబీలతో 12ఇళ్లను కూల్చివేయడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు.

04 Mar 2023

దిల్లీ

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను శనివారం దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఐదు రోజలు కస్టడీ ముగిసిన నేపథ్యంలో సిసోడియాకు బెయిల్ మంజూరు చేయాలని అతని తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు

విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజైన శనివారం దాదాపు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి. 13కంటే ఎక్కువ రంగాలలో 260 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

మధ్యతరగతి ఇన్వెస్టర్ల డబ్బును కొల్లగొట్టడం దురదృష్టకరం; హిండెన్‌బర్గ్‌పై హరీష్ సాల్వే ఫైర్

అదానీ గ్రూప్ సంస్థలను టార్గెట్ చేసి, గత నెలలో మార్కెట్ ఒడిదుడుకులకు దారితీసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే కోరారు.

04 Mar 2023

బీజేపీ

'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్

కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఉపన్యాసం దేశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ అటాక్‌కు దిగింది.

03 Mar 2023

తెలంగాణ

ఆరుద్ర భార్య, ప్రముఖ రచయిత కె.రామలక్ష్మి కన్నుమూత

ప్రముఖ రచయిత, ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి శుక్రవారం కన్నుమూశారు. వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

03 Mar 2023

బెలారస్

హక్కుల కార్యకర్త, 'నోబెల్' గ్రహీత అలెస్ బియాల్‌యాస్కీకి పదేళ్ల జైలు శిక్ష

బెలారస్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అలెస్ బియాల్‌యాస్కీకి శుక్రవారం కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

03 Mar 2023

మేఘాలయ

ఈనెల 7న మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం

నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నాయకుడు కాన్రాడ్ సంగ్మా ఈ నెల 7న మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్

పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేలా రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్‌పై ఫైర్ అయ్యారు.

Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో 50,000 కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని, రిటైల్ వ్యాపారం ద్వారా రాష్ట్రంలో తయారైన ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహిస్తుందని చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శుక్రవారం ఆసుపత్రి వర్గాలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి.

2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. తాను ఏ పార్టీతోనూ చేతులు కలపబోనని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు.

03 Mar 2023

కైలాసం

భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, కైలాస దేశ వ్యవస్థాపకుడు స్వామి నిత్యానందను భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు వేధించాయని విజయప్రియ ఆరోపించారు.

భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: కేంబ్రిడ్జ్ ఉపన్యాసంలో రాహుల్ గాంధీ

భారత ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. '21వ శతాబ్దంలో వినడం నేర్చుకోవడం' అనే అంశంపై కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్‌లోని ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు.

వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు

విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు ఇతర దిగ్గజ కంపెనీల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.

03 Mar 2023

కర్ణాటక

బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు

అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ ఇంట్లో 6కోట్ల రూపాయల నగదును శుక్రవారం ఉదయం లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రశాంత్ మాదాల్‌ను అరెస్టు చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.

ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ

మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయకేతాన్ని ఎగురవేశాయి.

తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు

ఆపిల్‌తో సహా వివిధ బ్రాండ్‌లకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.

02 Mar 2023

మైలవరం

అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే తన మద్దతని తేల్చి చెప్పారు.

పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వద్ద పెండింగ్ బిల్లుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చారు.

ఐటీ నిపుణుల నియామకంలో హైదరాబాద్ నంబర్ వన్

సాఫ్ట్‌వేర్ నిపుణులను నియమించుకోవడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు టెక్నికల్ హైరింగ్ ఏజెన్సీ అయిన 'కారత్' జాబితాను విడుదల చేసింది.

నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరికొత్త చరిత్రకు నాందిపలికాయి. చరిత్రలో తొలిసారి మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

నేడు రాత్రి 7గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి 7 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ప్రధాని ఏ విషయంపై మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. గురువారం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది.

సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ

అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో బహుపాక్షిక(ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ వేదికలు) సంస్థలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. దిల్లీలో గురువారం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు.

ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు

భారత ఎన్నికల సంఘంలో కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఆదేశించింది.

'అదానీ-హిండెన్‌బర్గ్' వ్యవహారంపై దర్యాప్తుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

అదానీ-హిండెన్‌బర్గ్ ఎపిసోడ్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ జడ్జి ఏఎం సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై రెండు నెలల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది.

జేఎన్‌యూ కొత్త నిబంధనలు: ధర్నా చేస్తే రూ.20వేల ఫైన్; హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. యూనివర్సిటీలో శాంతి భద్రతలను విఘాతం కలగకుండా ఉండేందుకు 'రూల్స్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ప్రాపర్ కండక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్‌యూ' పేరుతో 10 పేజీల రూల్ బుక్‌ను తీసుకొచ్చింది.

అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.