భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

18 Mar 2023

కోవిడ్

దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన

దేశంలో కరోనా కేసుల్లో రోజురోజుకు పెరుగుదల నమోదవుతోంది. రోజువారీ కోవిడ్ కేసులు శనివారం నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది.

ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం!

ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ల లీకేజీ వల్ల ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి.

IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా

భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇంధన భద్రతలో సహకారాన్ని మెరుగుపర్చేందుకు చేపట్టిన 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్'(ఐబీఎఫ్‌పీఎల్) ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యింది.

హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు

దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వైరస్ సోకి 9మంది మృతి చెందినట్లు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.

గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ల లీకేజీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలని కేటీఆర్ అన్నారు. పేపర్ల లీకేజీ వ్యవహారం బీజేపీ చేసిన కుట్రగా అభివర్ణించారు.

17 Mar 2023

కర్ణాటక

శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్

శివమొగ్గ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కుట్ర కేసులో ఇద్దరు రాడికలైజ్డ్ బి.టెక్ గ్రాడ్యుయేట్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలన పునరుద్ఘాటించారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వంటి అంశాలపై చర్చించారు.

కిరణ్ పటేల్‌: పీఎంఓ అధికారినంటూ హల్‌చల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు; 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ప్రధానమంత్రి కార్యాలయం( పీఎంఓ)అధికారిగా నటించి అడ్డంగా దొరికిపోయిన గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్‌ను శుక్రవారం శ్రీనగర్ కోర్టు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు

మద్యం పాలసీ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5రోజులు పొడిగిస్తున్నట్లు రూస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.

17 Mar 2023

తెలంగాణ

TSPSC సంచలన నిర్ణయం; గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ పరీక్షలు రద్దు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్‌సీ) సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తోపాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్

పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ (ప్రత్యేక హక్కుల తీర్మానం) ప్రవేశపెట్టారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

ప్రపంచాన్ని ఊపేస్తున్న 'నాటు..' పాటతో తెలుగు ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టడమే కాదు ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్న RRR సినిమా బృందం ఇటీవలే తిరిగి హైదరాబాద్ వచ్చారు. భారతదేశానికి ఆస్కార్ అవార్డును తెచ్చి పెట్టిన ఆ సినిమా బృందాన్ని అభినందిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఆ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు ఆహ్వానం అందింది.

ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించడానికి తుఫాన్ ముంచుకొస్తుంది. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్క్‌కు 65 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది.

వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా విచారణకు సహకరించాలని ఆదేశించింది.

లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్‌లో జరుగుతున్న రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం కూడా గందరగోళంగా మారాయి. లండన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభ నుంచి సస్పెండ్ చేయాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ప్యానెల్‌కు నోటీసును అందచేశారు.

తెలంగాణ: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం; ఆరుగురు మృతి

తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని నివాస సముదాయంలో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

17 Mar 2023

కోవిడ్

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు; 6రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. గురువారం ఒక్కరోజే 754కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు లేఖలు రాసింది.

ఉమేష్ పాల్ హత్య కేసు నిందితులకు నేపాల్‌లో ఆశ్రయం; అండర్ వరల్డ్‌ నాయకుడు అన్సారీ అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఉమేష్ పాల్ హత్య కేసు వ్యవహారం దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ కేసులోని నిందుతులకు నేపాల్‌లో ఖయ్యూమ్ అన్సారీ అనే వ్యక్తి ఆశ్రయం ఇచ్చినట్లు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) గుర్తించింది. ఖయ్యూమ్ అన్సారీకి అండర్ వరల్డ్‌‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

16 Mar 2023

తెలంగాణ

టీఎస్‌పీఎస్‌సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్!

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి అపహరించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) గుర్తించినట్లు తెలుస్తోంది.

Fake News: నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదు: అస్లే టోజే

భారత పర్యటనలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు

అరుణాచల్‌ప్రదేశ్‌లోని బొమ్‌డిలా సమీపంలో ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. మండాలా పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఉత్తర్‌ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్

దేశ‌వ్యాప్తంగా సంచలనంగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమేష్‌పై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు రికార్డయిన సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది.

దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

దిల్లీ మద్యం పాలసీ కేసు విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఈ కేసులో విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు పంపింది.

కవితకు మళ్లీ నోటీసులు పంపిన ఈడీ; ఈనెల 20న విచారణ

దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 20న తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.

జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు

దిల్లీ ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్ యూనిట్ (ఎఫ్‌బీయూ) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో కేసు నమోదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023: వ్యవసాయ రంగానికి రూ.41,436 కోట్ల కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రూ.41,436 కోట్లతో ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్‌ సౌకర్యాలు కల్పిస్తున్నామని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

16 Mar 2023

సీబీఐ

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌‌ను విచారించేందుకు గురువారం సీబీఐ మరోసారి సమన్లను జారీ చేసింది.

చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ

దిల్లీ మద్యం పాలసీ కేసులో మరికొద్ది సేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరు హాజరు కావాల్సిన భారత రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు.

AP Budget Hghlights: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2023-24 హైలెట్స్; వార్షిక పద్దు రూ.2,79,279కోట్లు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,79,279కోట్ల వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్‌లో కీలక కేటాయింపులు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి

ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఈరోజు మళ్ళీ ఈడీ ముందు హాజరు అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో బీపేజీ పై పోస్టర్ల తో గురి పెట్టింది బీఆర్ఎస్.

నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో

Aadhaar: ఆన్‌లైన్లో ఆధార్ ఆప్డేట్ మూడు నెలలు ఫ్రీ

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఆధార్ కార్డు వినియోగిస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్‌ను మూడు నెలల పాటు అంటే ఈ ఏడాది జూన్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైస్పీడ్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే రైల్వైశాఖ మొదలు పెట్టింది. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023; అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బుగ్గన రాజేంద్రనాథ్

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023ను గురువారం ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర పద్దును అసెంబ్లీలో ప్రతిపాదించనున్నారు. శాసన మండలిలలో డిప్యూటీ సీఎం అంజాద్ పాషా బడ్జెట్‌ను చదవనున్నారు.

మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 11.28 ఆర్థిక వృద్ధి రేటు నమోదవుదైందని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చినట్లు ప్రకటించారు.

జమ్ముకశ్మీర్ పోలీసుల అదుపులో లష్కరే తోయిబా ఉగ్రవాది; 24 గంటల్లో రెండో అరెస్ట్

జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం బారాముల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఇటీ) ఉగ్రవాదిని అరెస్టు చేశారు. గత 24గంటల్లో బారాముల్లాలో ఇది రెండో అరెస్ట్ అని పోలీసులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వాడుకొని ఓ వక్తి దాదాపు 60కంపెనీల నుంచి రూ.3 కోట్ల వరకు కాజేశాడు. తాజాగా తనను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకుని రూ.12 లక్షల వరకు టోపీ పెట్టాడు. తర్వాత మోసపోయానని గమనించిన బాధితుడు పోలీసుల ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

15 Mar 2023

దిల్లీ

'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం

'పాత ఎక్సైజ్ పాలసీ'ని దిల్లీ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ లోగా కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి దిల్లీ రూస్ అవెన్యూ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 29న జరగనుంది.

ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ

దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.