భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో విశాఖపట్నంలోని వాల్తేరు డివిజిన్ అత్యుత్తమంగా నిలిచినట్లు భారతీయ రైల్వే తెలిపింది.

23 Mar 2023

పంజాబ్

బైక్‌పై వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటో వైరల్; అతని భార్యను ప్రశ్నించిన పోలీసులు

ఖలిస్తానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కొత్త ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అతను మూడు చక్రాల బండిపై మోటారుసైకిల్, డ్రైవర్ కాకుండా మరొక వ్యక్తితో కనిపించాడు.

విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన

విశాఖపట్నం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్థరాత్రి ఘోరం జరిగింది. మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో అధునాతన హంగులతో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన వారికి సేవలను ఇక్కడి నుంచి అందిస్తున్నారు.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. గత 24గంటల్లో దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 7,026కి పెరిగింది.

బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం

తమిళనాడులోని కాంచీపురంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా ఫ్యాక్టరీలో మంటల చేలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు ఫ్యాక్టరీలోనే చనిపోయారు.

బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు

గుజరాత్ అల్లర్ల సమయంలో అత్యాచారం, హత్య కేసులో 11మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.

22 Mar 2023

భూకంపం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?

అఫ్ఘానిస్థాన్‌లో మంగళవారం రాత్రి 6.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని జైపూర్, జమ్ముకశ్మీర్‌లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వస్తే దాని ప్రకంపనలు ఉత్తర భారతంలో ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

22 Mar 2023

పంజాబ్

గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్

ఖలిస్థానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌కు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు శనివారం ఆపరేషన్‌ను ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయన ఓ గురుద్వారాకు వెళ్లి 45నిమిషాలు గడిపిన విషయం తాజాగా బయటికి వచ్చింది.

22 Mar 2023

దిల్లీ

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు

దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. దీంతో అలర్ట్ అయిన దిల్లీ పోలీసులు వాటిని తొలగించే పనిలో పడ్డారు.

22 Mar 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చుకున్నాడా? 7ఫొటోలను విడుదల చేసిన పంజాబ్ పోలీసులు

'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ కోసం పంజాబ్ పోలీసులు ఏడు రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నారు. అయినా ఇంతవరకు ఆయన ఆచూకీని కనుగోనలేకపోయారు.

SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మిలటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ కాన్ఫరెన్స్‌కు పాకిస్థాన్ మంగళవారం హాజరుకాలేదు. కశ్మీర్‌కు సంబంధించిన దేశ సరిహద్దులను తప్పుగా మార్చి పాక్ ప్రదర్శించాలని చూసింది. దీనిపై భారత్ అభ్యంతరం చెప్పడంతోనే పాకిస్తాన్ గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రూ.10 కోట్ల డిమాండ్ చేశాడు.

ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు

మరణశిక్షను అమలు చేసే కేసుల విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష అమలులో భాగంగా మెడకు తాడును వేలాడిదీసి ఉరివేయడం క్రూరమైన చర్యగా చెబుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.

కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం తనపై చేసిన ఆరోపణలపై లోక్‌సభలో మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్

పాఠశాల విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న గోరుముద్ద ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.

దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మంగళవారం అధికారులు విచారిస్తున్నారు. మూడో దఫా విచారణలో భాగంగా కవిత ఇప్పటి వరకు తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించారు.

21 Mar 2023

బీజేపీ

కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావు చించన్‌సూర్ పార్టీని వీడారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు.

21 Mar 2023

బీజేపీ

ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్

భారతీయ జనతా పార్టీపై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని పేర్కొంది. వాల్టర్ రస్సెల్ మీడ్ ఈ కథనాన్ని రాశారు.

'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక విడుదల చేసింది. 2022లో భారతదేశంలో గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలను జరిగినట్లు ఆ వార్షిక నివేదికలో పేర్కొంది.

ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి

ప్రఖ్యాత సాలార్‌జంగ్ మ్యూజియాన్ని సందర్శించాలనుకుంటున్నారా? పని ఒత్తడిలో ఉండటం, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ వల్ల మ్యూజియంకు వెళ్లేందుకు సమయం కేటాయించకలేకపోతున్నారా? అయితే మీలాంటి వారికోసమే మ్యూజియం నిర్వాహకులు ప్రత్యేక ఆన్‌లైన్ ప్రదర్శనను ప్రారంభించారు.

దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. ఈ క్రమంలో అమె అరెస్టుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానంపై వడగళ్ల వాన పడింది. దీంతో విమానం భారీగా దెబ్బదిన్నది.

20 Mar 2023

జపాన్

రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం

జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం భారత్, జపాన్ మధ్య రెండు కీలక ఒప్పందాలు జరిగాయని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు.

20 Mar 2023

పంజాబ్

'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు

'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే అమృతపాల్ సింగ్‌ వేటలో పోలీసులకు లభిస్తున్న ఆధారాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.

20 Mar 2023

కోవిడ్

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24గంటల్లో దేశంలో 918 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,350కి పెరిగినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.46 కోట్లు (4,46,96,338)కు చేరుకున్నట్లు చెప్పింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?

ఆంధ్రప్రదేశ్‌లోని 3 గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం), తూర్పు రాయలసీమ(ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు), పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు)పట్టభద్రల స్థానాల్లో వైసీపీ అనూహ్య పరాభవం ఎదురైంది.

20 Mar 2023

దిల్లీ

భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం!

లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు కిందకు లాగిన ఘటన సంచలనంగా మారింది.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ

కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జరిగిన ముర్షిదాబాద్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.

20 Mar 2023

జపాన్

దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు

జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కిషిదాకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు.

బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు

బెంగళూరులో బైక్‌ ట్యాక్సీ సేవలను నిరసిస్తూ సోమవారం ఆటోరిక్షా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. బెంగుళూరు ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఫెడరేషన్ రాపిడో, ఇతర బైక్ టాక్సీ సర్వీసులు నగరంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు.

ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోరం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ తొమ్మిదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

20 Mar 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్

ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. శనివారం నుంచి అమృతపాల్ సింగ్‌కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

19 Mar 2023

తెలంగాణ

TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్‌కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది.

19 Mar 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!

కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో ముగియనుంది. రాష్ట్రంలో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి.

18 Mar 2023

కర్ణాటక

గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా?

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన ప్రారంభించిన జాతికి అంకితం చేశారు. అయితే ప్రారంభించి వారం రోజుకు కూడా కాలేదు.. అప్పుడు హైవే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయి.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?

ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, శ్రీకాకులం, విజయనగరం) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు.

18 Mar 2023

పంజాబ్

అమృతపాల్ సింగ్‌ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత

ఖలిస్తానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 'ఆపరేషన్ అమృతపాల్ సింగ్‌'ను ప్రారంభించారు. దీంతో పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్

స్వలింగ సంపర్కుల వివాహంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాల విషయం అనేది దేశ ప్రజల విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం అని కిరెన్ రిజిజు అన్నారు.