భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్

భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగంపై పార్లమెంట్ లో బుధవారం కూడా ప్రతిపక్షాలు- అధికార పార్టీ బీజేపీ మధ్య రగడ కొనసాగుతోంది.

కేబుల్ బ్రిడ్జి దగ్గర వాహనాలు పార్కింగ్ జరిమానా తప్పదు

హైదరాబాద్ : ఇకపై దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సెల్ఫీ తీసుకోవడానికి వాహనాలను పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించనున్నారు. కొంతమంది బ్రిడ్జిపై కారు లేదా బైక్ పార్కింగ్‌పై సెల్ఫీలు దిగుతున్నారు. దీని వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది.

15 Mar 2023

ముంబై

ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు

ముంబయిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లాల్‌బాగ్ ప్రాంతంలో 53 ఏళ్ల మహిళ మృతదేహం ప్లాస్టిక్ సంచిలో లభ్యమైంది. మృతదేహాన్ని నెలల తరబడి గదిలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతురాలు కుమార్తెపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు

మహారాష్ట్రలోని కందర్ లోహాలో మార్చి 26న జరిగే భారీ బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని పార్టీ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

తాలిబాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్ క్రాష్ కోర్సులో భారత్ శిక్షణ

అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ సభ్యులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 'ఇండియా ఇమ్మర్షన్' ఆన్‌లైన్ కోర్సుకు హాజరయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐఎం-కోజికోడ్‌లో ఈ ఆన్ లైన్ క్రాష్ కోర్సును నిర్వహిస్తోంది. మార్చి 14 నుంచి మార్చి 17 వరకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తున్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు: రేపు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి బుధవారం దిల్లీలోని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది.

14 Mar 2023

గుజరాత్

దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి

దేశంలో హెచ్‌3ఎన్2 ఇన్‌ప్లూయెంజా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. అయితే ఈ ఇన్‌ప్లూయెంజా వైరస్ సోకి మరణాలు సంభవిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

14 Mar 2023

కర్ణాటక

కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు

కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు.

జనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్

జనసేన 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ.. మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకల్లో పాల్గొనేందుకు ఎన్నికల ప్రచారం వాహనం 'వారాహి'పై బయలుదేరారు.

14 Mar 2023

కోవిడ్

హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్‌లతో భయాలు వద్దు: ఐసీఎంఆర్

హెచ్3ఎన్2, టైప్ బీ ఇన్‌ప్లూయెంజా, అడెనో, కరోనా లాంటి గాలి ద్వారా సంక్రమించే వైరస్‌లు ఆందోళనకరమైనవి కావని నేషనల్ ఇన్‌ప్లూయెంజా సెంటర్ (ఎన్ఐసీ) పేర్కొంది.

వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్

వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి సాధిస్తోందని, 11.43శాతం గ్రోత్ రేటును సాధించినట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు-2023 ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలకోపాన్యాసం చేశారు.

14 Mar 2023

దిల్లీ

దిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడం నిషేధం: డీఎంఆర్‌సీ

మెట్రోలలో రీల్స్, డ్యాన్స్ వీడియోల చిత్రీకరణపై దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్( డీఎంఆర్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడాన్ని నిషేధిస్తున్నట్లు డీఎంఆర్‌సీ పేర్కొంది. ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఆస్కార్ గెలిచిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఏనుగును చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు

'ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకున్న భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్' ద్వారా ప్రసిద్ధి చెందిన ఏనుగును చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి తరలి వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో మొదలయ్యాయి. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే.

14 Mar 2023

ఎన్ఐఏ

టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది.

14 Mar 2023

తెలంగాణ

మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం

సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు(84) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో విజయరామారావు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; 16వ తేదీన ఫలితాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

13 Mar 2023

తెలంగాణ

తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

రాబోయో మూడు రోజుల్లో మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ) హెచ్చరించింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14న ప్రారంభం కానున్నాయి. తొలుత ఫిబ్రవరి 27 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా.. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్-2023 కారణంగా వాయిదా వేసింది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై మంగళవారం జరిగే బీసీఏ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

'యోగా మహోత్సవ్‌'లో పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల 'యోగ మహోత్సవ్'లో ఆనందంగా పాల్గొనాలని పౌరులను ఆహ్వానించారు. ప్రజలు ఇప్పటికే యోగా చేయకపోతే, ఆసనాలను నేర్చుకొని వారి జీవితాల్లో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

13 Mar 2023

గోవా

షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్

విహారయాత్రకు గోవాకు వచ్చిన దిల్లీకి చెందిన ఓ కుటుంబంపై కత్తులతో దాడి చేశారు. అంజునా ప్రాంతంలో బీచ్‌కు సమీపంలో ఉండే 'స్పాజియో లీజర్' అనే రిసార్ట్‌లో బస చేసిన వారిపై కొందరు దుండగులు పాశవికంగా దాడి చేశారు. కుటుంబ సభ్యుల్లో జతిన్ శర్మ ఈ సంఘటన గురించి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తెలియజేశాడు.

ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

ఇటీవల లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే బీజేపీ నాయకుల తీరుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్

ఉమేష్ పాల్ హత్య కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు పురోగతి సాధించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌‌గా, రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న అతిక్ అహ్మద్‌కు సన్నిహితుడైన బల్లి పండిట్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్

ఉత్తర్‌ప్రదేశ్ ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న ఐపీఎస్ అధికారి వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ఆ అధికారిపై 'బుల్‌డోజర్' ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ వీడియో దర్యాప్తునకు ఆదేశించింది.

13 Mar 2023

కేరళ

కేరళ: బీజేపీ నాయకుడి ఇంట్లో బాంబు పేలుడు

కేరళలోని కన్నూర్ జిల్లా కక్కయంగడ్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు కలకలం రేపింది. అయితే ఈ ఘటన ఒక బీజేపీ నాయకుడి ఇంట్లో జరగడం గమనార్హం. ఆదివారం సాయంత్రం ముజక్కున్ను పోలీస్ స్టేషన్ పరిధిలో సంభవించిన ఘటనలో దంపతులు గాయపడ్డారు.

కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృష్టి చేస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దక్షిణాదిన బీజేపీకి కీలకమైన కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని మోదీ భావిస్తున్నారు. అందుకే గత మూడు నెలల్లో ఇప్పటికే ఐదు సార్లు రాష్ట్రంలో పర్యటించగా, ఆదివారం మరోసారి కర్ణాటకకు రానున్నారు.

11 Mar 2023

బీజేపీ

రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక

దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన విరాళాలపై ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను విడుదల చేసింది.

11 Mar 2023

దిల్లీ

నా చిన్నతనంలో మా నాన్న లైంగికంగా వేధించాడు: డీసీడబ్ల్యూ చీఫ్ సంచలన కామెంట్స్

దిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ శనివారం తన చిన్ననాటి కష్టాలను వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు.

వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేసారు. 80ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులందరికీ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ అంశం; భారత్‌పై మరోసారి అక్కసును వెల్లగక్కిన పాకిస్థాన్

దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తమ అక్కసును వెల్లగక్కింది. కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి ఎజెండాలో కశ్మీర్ అంశాన్ని చేర్చడంలో ఆ దేశం విఫలమైందని భుట్టో జర్దారీ అంగీకరించారు.

తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు ​​జారీ చేయడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. మహాఘ్‌బంధన్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని బీజేపీపై విరుచుకుపడ్డారు.

దేశంలో హెచ్2ఎన్3 వైరస్ కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; రాష్ట్రాలకు లేఖ

దేశంలో హెచ్2ఎన్3, హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరుపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. శనివారం దిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మద్దతుదారులు సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

దిల్లీలో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ; హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

దిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత శనివారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)శనివారం సమన్లు ​​పంపింది.

11 Mar 2023

బీజేపీ

బీజేపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

11 Mar 2023

దిల్లీ

దిల్లీ: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు; ముగ్గురు అరెస్టు

దిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో జపాన్‌కు చెందిన యువతిని కొందరు వేధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనను దిల్లీ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరుకానున్నారు.

సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.