భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు

ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రైల్వే స్టేషల్ లేదా బస్టాండ్ వద్ద క్యాబ్ లేదా ఆటో ఎక్కే మహిళా ప్రయాణికుల భద్రత కోసం ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. అర్థరాత్రి నుంతి తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

రేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించాల్సి ఉండగా, శుక్రవారం అరుణ్‌రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు.

సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

త్వరలో ప్రారంభం కానున్న కొత్త సచివాలయ భవనం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం తుది దశ పనులను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరిశీలించారు.

ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆ దేశంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతీయ సమాజం భద్రత విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు మోదీ చెప్పారు.

10 Mar 2023

కర్ణాటక

హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా రూపంలో మరో వైరస్ వణికిస్తోంది. దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

అగ్నివీరులకు గుడ్‌న్యూస్: బీఎస్‌ఎఫ్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన కేంద్రం

అగ్నిపథ్ పథకంలో భాగంగా నియామకయ్యే అగ్నివీరులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) నియామకాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటించింది. అలాగే వారి గరిష్ట వయోపరిమితి నిబంధనలను సడలించింది.

IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్లే లక్ష్యంగా ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది మూడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత

ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత శుక్రవారం దిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

10 Mar 2023

బీజేపీ

కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ

అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది.

10 Mar 2023

తెలంగాణ

మహిళల కోసం 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం; ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు

సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి వారి అవసరాలకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయాన్ని అందించనుంది.

Tamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే

తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి బీటలు వారాయని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో విడివిడిగా పోటి చేస్తాయని అందరు అనుకుంటున్న తరుణంలో రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తినా పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత డి జయకుమార్ స్పష్టం చేశారు.

09 Mar 2023

తెలంగాణ

ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు

సీబీఐ, ఈడీ విచారణలతో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు అరెస్టు అవుతారనే ఊహాగానాలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచేశాయి.

TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ

హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) రెండు ప్రత్యేకమైన ఆఫర్లను గురువారం లాంఛ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రయాణికులకు సరసమైన ధరలో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.

09 Mar 2023

దిల్లీ

దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం

దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను దిల్లీ హైకోర్టు మధ్యవర్తిగా నియమించింది.

09 Mar 2023

దిల్లీ

తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం తీహార్ జైలులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రెండోసారి ప్రశ్నించింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చినం అంశాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఏ తప్పూ చేయలేదు, ఈడీ విచారణను ఎదుర్కొంటా: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత

ఎన్నికలు ఉన్న చోట మోదీ కంటే ముందే ఈడీ చేరిపోతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున తెలంగాణలో కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. గురువారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

తమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం!

తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), బీజేపీ కూటమికి బీటలు వారే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉంటున్నాయి.

09 Mar 2023

ముంబై

ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం

మహారాష్ట్ర ముంబయికి సముద్రం ద్వారా వచ్చే సందర్శకులకు స్వాగతం పలికేందుకు 100ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన కట్టడం 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు ఏర్పడినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్

బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ గురువారం తెలిపింది. వాయనాడ్‌కు చెందిన షఫీ అనే వ్యక్తిని 1,487 గ్రాముల బంగారంతో కొచ్చిలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.

పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా

పాకిస్థాన్, భారత్ మధ్య సరిహద్దు ఘర్షణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వార్షిక ముప్పు నివేదిక వెల్లడించింది.

చాబహార్ ఓడరేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపనున్న భారత్

అఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు భారత్ మంగళవారం ప్రకటించింది . ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకురాలు కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మార్చి 9 (గురువారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

07 Mar 2023

లోక్‌సభ

వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు

విద్యుత్ సవరణ బిల్లు- 2022ను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. విద్యుత్‌ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే బిల్లుపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది.

Women's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే

పురుషాధిక్య భారతీయ సమాజంలో మహిళలకు రాజకీయాల్లో పరిమిత సంఖ్యలో అవకాశాలు దక్కాయి. కాలానుగూనంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కొందరు నాయకురాళ్లు స్వశక్తితో ఎదిగి దేశ రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు.

తెలంగాణ లాంటి పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేయాలి: కేటీఆర్

2022 నాటికి అన్ని భారతీయ రాష్ట్రాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెంది ఉంటే భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించి ఉండేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

'భారత్‌లో విదేశీ జోక్యాన్ని కోరడం సిగ్గుచేటు'; రాహుల్‌పై బీజేపీ ధ్వజం

భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరప్‌ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం

2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ అధినేత నీఫియు రియో ​​ప్రమాణ స్వీకారం

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) నేత నీఫియు రియో ​​మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.

గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు

గ్రేటర్ హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేదుకు అనేక అర్బన్ పార్కులను ఏర్పాటు చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మరో అడుగు ముందుకేశాయి.

దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్

దిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ విచారణలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. పాలసీని రూపొందించి అమలు చేస్తున్నప్పుడు ఇతర నిందితులతో జరిగిన సమావేశాల్లో పిళ్లై 'సౌత్ గ్రూప్'కు ప్రాతినిధ్యం వహించారని అధికారులు తెలిపారు.

జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

ఉద్యోగాల కుంభకోణం కేసులో సోమవారం రబ్రీ దేవిని విచారించిన సీబీఐ అధికారులు, మంగళవారం బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

07 Mar 2023

మేఘాలయ

ప్రధాని మోదీ సమక్షంలో మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం

నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా మంగళవారం మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా ప్రిస్టోన్ టైన్‌సాంగ్, స్నియాభలాంగ్ ధర్ ప్రమాణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి, అమిత్ షా, నడ్డా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపిన బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ ఇటీవల తన భారత పర్యటనలోని ఆసక్తికర అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను నడిపిన వీడియోను బిల్ గేట్స్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. తన క్లాస్‌మెట్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను కలుసుకున్న సందర్భంలో ఇది జరిగింది.

07 Mar 2023

కోవిడ్

హెచ్3ఎన్2 వైరస్ కూడా కరోనా తరహాలోనే వ్యాపిస్తుంది; ఎయిమ్స్ మాజీ చీఫ్ హెచ్చరిక

దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్-ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు.

నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు

ఎన్‌డీపీ చీఫ్ నీఫియు రియో, ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం

ఉత్తరాఖండ్‌లో గత కొన్ని నెలలుగా అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉత్తరాఖండ్‌లో 107 హెక్టార్లకు పైగా అటవీ విస్తీర్ణం కార్చిచ్చు వల్ల దగ్ధమైనట్లు రాష్ట్ర అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గర్హ్వాల్ ప్రాంతంలో 40.68 హెక్టార్లు, కుమావోన్ ప్రాంతంలో 35.55 హెక్టార్ల విస్తీర్ణం దగ్ధమైనట్లు తెలుస్తోంది.

women's day 2023: 'ఉమెన్స్ డే' రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరికీ సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం

లండన్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో, పార్లమెంటులో ప్రతిపక్ష మాట్లాడనివ్వదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

06 Mar 2023

దిల్లీ

దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ

దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను వారం రోజుల రిమాండ్ ముగియడంతో సీబీఐ సోమవారం రోస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ క్రమంలో సిసోడియాను 14రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అంటే మార్చి 20 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.

06 Mar 2023

సీబీఐ

జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం పాట్నాలోని తన నివాసంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ప్రశ్నించారు.