భారతదేశం వార్తలు | పేజీ 6

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్‌పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్

ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో శనివారం యూపీఏ చైర్‌పర్సన్, పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మాట్లాడారు. దేశంలోని ప్రతి ఒక్క రాజ్యాంగ సంస్థను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు నాశనం చేశాయని ఆరోపించారు.

రంగారెడ్డి: మర్మాంగాన్ని కోసి, గుండెను బయటికి తీసి స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన యువకుడు

ఓ యువకుడు తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. మర్మాంగాన్ని కోసి, గుండెను బయటికి తీసి అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తను ప్రేమించిన యువతిని తన స్నేహితుడు ఇష్టపడటమే ఈ హత్యకు కారణం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఏఐఏడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదు, పూర్వ వైభవాన్ని తీసుకొస్తా: శశికళ

ఏఐఏడీఎంకే‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో దివంగత జయలలిత సన్నిహితురాలు, పార్టీ మాజీ నేత వీకే శశికళ స్పందించారు. అన్నాడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదని, పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తానని చెప్పారు.

కాంగ్రెస్ ప్లీనరీలో రోశయ్య, జైపాల్‌రెడ్డికి సంతాపం; రెండో‌రోజు సెషన్‌కు సోనియా, రాహుల్ హాజరు

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గైర్హాజరైన అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శనివారం ప్లీనరీలో పాల్గొన్నారు.

సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి ఆగి ఉన్న రెండు బస్సులను ఢీకొనడంతో 14 మంది మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రేవా-సత్నా సరిహద్దులోని మోహనియా సొరంగం సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కీలక బాడీ అయిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఎన్నికలు వద్దంటూ తీర్మానించారు.

తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను రూ.20.5లక్షల కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: కేటీఆర్

ప్రపంచ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్‌గా మార్చడమే తమ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 నాటికి తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను 250 బిలియన్ డాలర్లకు (రూ.20.5 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నాగాలాండ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షిల్లాంగ్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

24 Feb 2023

కేరళ

రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం పూర్తిస్థాయి ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

24 Feb 2023

కోవిడ్

మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది'

కరోనా సమయంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని కేంద్ర ఆరోగ్య‌మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల కోవిడ్ సమయంలో దేశంలో 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడగలిగినట్లు ఆయన చెప్పారు.

అమరావతి భూముల కేసు: హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు

అమరావతి భూముల కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తె నివాసంలో ఆంధ్రప్రదేశ్‌ నేరపరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌లో ఉంటున్న ఆమె ఇంట్లో ఉదయం నుంచి సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో తేనేటి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్‌ వద్ద అదానీ గ్రూప్‌ చేపట్టనున్న 500మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ హైబ్రిడ్‌ గ్రీన్‌‌ఎనర్జీ ప్రాజెక్టు నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ జిల్లా మేనేజర్ కోదండరామమూర్తి తెలిపారు.

గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు

Dharmavaram-Gooty: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన రైల్వే లింకు ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. అనంతపురంలోని చిగిచెర్ల నుంచి ధర్మవరం మధ్య సెక్షన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణను విజయవంతంగా పూర్తి చేసింది. తాజా పనుల పూర్తితో గుత్తి నుంచి ధర్మవరం వరకు మొత్తం 90 కిలోమీటర్ల మేర ఇప్పుడు డబుల్ రైల్వే లైన్ విద్యుద్దీకరించబడింది. గుత్తి-ధర్మవరం రైల్వే లింకును దక్షిణాది రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు.

కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగే పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం గమనార్హం.

ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో కనీసం 11మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

23 Feb 2023

కర్ణాటక

శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు

రూ.1000 కోట్లకు పైగా పబ్లిక్ డిపాజిట్లను దుర్వినియోగం చేసిన కేసులో శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్ వీఆర్ రాజేష్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది.

23 Feb 2023

శివసేన

మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం

శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఎంపీ సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, థానే పోలీసులు అతనిపై పరువు నష్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ

సికింద్రాబాద్‌లోని మౌలా-అలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జెడ్ఆర్‌టీఐ)లో గల 200 సంవత్సరాల పురాతన వారసత్వ మెట్ల బావిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

నమస్తే ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో న్యూస్ పేపర్ ఏర్పాటుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్

బీఆర్‌ఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌‌లో విస్తరింపజేసేందుకు కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో బీఆర్ఎస్ కోసమే సొంతంగా న్యూస్‌పేపర్‌ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ న్యూస్‌పేపర్‌ పేరును కూడా 'నమస్తే ఆంధ్రప్రదేశ్‌'‌గా ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

23 Feb 2023

దిల్లీ

దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ

దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.

23 Feb 2023

హర్యానా

గురుగ్రామ్: కరోనాకు భయపడి మూడేళ్లుగా బయటికి రాకుండా ఇంట్లోనే తల్లీకొడుకులు

కరోనాకు భయపడి ఓ మహిళ మూడేళ్లుగా బయటకు రావడం లేదు. తన పదేళ్ల కొడుకుతో కలిసి ఇంటికి తాళం వేసి లోపల ఉంటుంది. కనీసం తన భర్తను కూడా లోపలికి రానివ్వకపోవడం గమనార్హం. హర్యానా గురుగ్రామ్‌లో వెలుగుచూసిన ఈ ఘటన పోలీసు అధికారులు, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

23 Feb 2023

కేరళ

చిన్నారి వైద్యం కోసం పేరు చెప్పకుండా రూ.11కోట్లు విరాళంగా ఇచ్చిన దాత

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స నిమిత్తం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.11కోట్లను విరాళంగా ఇచ్చాడు. అంత మొత్తం ఇచ్చిన వ్యక్తి అతని పేరు చెప్పకపోవడం గమనార్హం.

23 Feb 2023

గన్నవరం

గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి

గన్నవరం ఘటనలో పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.

2024 ఎన్నికల్లో జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో 2024లో ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పునరుద్ఘాటించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని కూడా వెల్లడించారు. తాను అసెంబ్లీ కంటే వైజాగ్‌ లోక్‌సభ సీటుకే ప్రాధాన్యత ఇస్తానని లక్ష్మీనారాయణ ప్రకటించారు.

22 Feb 2023

శివసేన

శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పేరు, విల్లు-బాణం గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

22 Feb 2023

దిల్లీ

దిల్లీ కొత్త మేయర్‌గా ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక

దిల్లీ మేయర్‌గా ఆప్‌కు చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికలయ్యారు. ఒబెరాయ్‌కు 150ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116ఓట్లు వచ్చాయి. మేయర్ ఎన్నికల్లో గెలుపొందిన షెల్లీ ఒబెరాయ్‌ను దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అభినందించారు.

హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ

హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించాలని, తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన విద్యార్థినుల బృందం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

హైదరాబాద్ లో మరో బాలుడిపై వీధి కుక్కుల దాడి

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో వీధికుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన మరువకముందే, మరొకటి వెలుగులోకి వచ్చింది.

22 Feb 2023

భూకంపం

భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక

ప్రతి సంవత్సరం భారత భూభాగం సుమారు 5 సెం.మీ వరకు స్థాన భ్రంశం అవుతున్నట్లు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఈ ప్రభావం హిమాలయ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఫలితంగా రాబోయే రోజుల్లో భూకంపాలు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

300మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఆయిల్ లీక్; అత్యవసర ల్యాండింగ్

అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయం నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా AI106 విమానంలో బుధవారం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అలర్ట్ అయిన పైలెట్, స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

22 Feb 2023

దిల్లీ

దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి

ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అనుమతిని ఇచ్చింది.

21 Feb 2023

గన్నవరం

పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ- టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పట్టాభితో పాటు మరో 11మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Climate Risk: డేంజర్ జోన్‌లో ముంబయి; దేశంలోని 9రాష్ట్రాల్లో ప్రమాదకరంగా వాతావరణం

2050నాటికి ప్రపంచంలోని 50రాష్ట్రాల్లో వాతావరణం ప్రమాదకరంగా మారనుందని ప్రముఖ వాతావరణ పరిశోధన సంస్థ క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ (ఎక్స్‌డీఐ) పేర్కొంది. 'గ్రాస్ డొమెస్టిక్ క్లైమెట్ రిస్క్' పేరుతో ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.

హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్

త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తన అభ్యర్థిని ఏఐఎంఐఎం ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థిగా మీర్జా రహ్మత్ బేగ్‌ను రాబోయే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ట్విట్టర్‌లో ప్రకటించారు.

21 Feb 2023

గన్నవరం

'24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతుదారులు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఎపిసోడ్‌తో కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.

21 Feb 2023

దిల్లీ

ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలపై నిషేధం విధించిన దిల్లీ ప్రభుత్వం

ఓలా, ఊబర్, రాపిడో బైక్ టాక్సీ సేవలపై దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బైక్ ట్యాక్సీల నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. వీధికుక్కుల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన అతడి తండ్రి పనిచేసే స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.

21 Feb 2023

గన్నవరం

టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు

గన్నవరం నియోజకవర్గంలో మంగళవారం కూడా టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. గన్నవరం ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఇతర ప్రాంతాల ప్రజలను నియోజకవర్గంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.