భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
15 Feb 2023
అస్సాం/అసోంఅసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న
బాల్య వివాహాలను అదుపు చేయడంలో అసోం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గువాహటి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో' చట్టాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారని ప్రశ్నించింది.
15 Feb 2023
నందమూరి తారక రామారావురూ.100వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని కేంద్రం నిర్ణయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు, సినీ వినీలాకాశంలో నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు శత జయంతి సంబంర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
15 Feb 2023
బీబీసీబీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు
ముంబయి, దిల్లీలో బీబీసీకి చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి.
15 Feb 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న క్షేత్రం అభివృద్ధికి మరో రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
15 Feb 2023
కడపకడప: జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
15 Feb 2023
ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియా చారిత్రక ఒప్పందం: 34బిలియన్ డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్
'టాటా'లకు చెందిన ఎయిర్ ఇండియా - అమెరికాకు చెందిన బోయింగ్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. 34 బిలియన డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది.
15 Feb 2023
దిల్లీప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ప్రిజ్‌లో పెట్టి; అదేరోజు మరో అమ్మాయితో పెళ్లి
ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసి, అదే రోజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన దిల్లీలో మిత్రోన్ గ్రామంలో జరిగింది. ఈ హత్యకు సంబంధించి దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
15 Feb 2023
ఎన్ఐఏఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలున్న వారే లక్ష్యంగా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.
15 Feb 2023
తెలంగాణతెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన రైలు నెం.12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. బీబీనగర్- ఘట్‌కేసర్ మధ్య ఈ ఘటన జరిగింది.
14 Feb 2023
తెలంగాణకాంగ్రెస్-బీఆర్‌ఎస్ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.
14 Feb 2023
త్రిపురఅసెంబ్లీ ఎన్నికలు: త్రిపురలో ముగిసిన ప్రచారం పర్వం, గురువారం పోలింగ్
త్రిపురలో నెల రోజులుగా హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. 8 జిల్లాల్లోని మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, త్రిపుర స్టేట్ రైఫిల్స్, రాష్ట్ర పోలీసు సిబ్బందితో భారీ భద్రత నడుమ పోలింగ్ జరగనుంది.
14 Feb 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్
పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు.
14 Feb 2023
యుద్ధ విమానాలుHLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు
శిక్షణ కోసం వినియోగించే అత్యాధునిక HLFT-42 యుద్ధ విమానంపై ఉన్న హనుంతుడి బొమ్మను తలొగించినట్లు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్( హెచ్ఏఎల్) మంగళవారం ప్రకటించింది.
14 Feb 2023
బీబీసీప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం
ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్, పీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. కమల దళం కూడా అదేస్థాయిలో తిప్పికొట్టింది.
14 Feb 2023
బీబీసీBBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు
ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
14 Feb 2023
అమిత్ షాఅదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ధర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే తమ గళాన్ని మారు మ్రోగించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మౌనం వీడారు.
14 Feb 2023
ఉత్తర్ప్రదేశ్ఉత్తర్ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆక్రమణల తొలగింపు సమయంలో ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల మహిళతో పాటు ఆమె కుమార్తె (20) మరణించారు.
14 Feb 2023
అత్యాచారంఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ నగరంలో ఘోరం జరిగింది. 27ఏళ్ల మహిళా టెక్కీకి మత్తుమందు ఇచ్చి సహారా మాల్‌లోని బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన తన కారులోనే నిందితుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
14 Feb 2023
సుప్రీంకోర్టుయూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
లైసెన్సు లేని తుపాకుల వల్ల కలిగే అనార్థాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
13 Feb 2023
తెలంగాణతెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు గణనీయంగా పెరిగినట్లు చెప్పింది. లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
13 Feb 2023
తమిళనాడు'ఎల్‌టీటీఈ నాయకుడు ప్రభాకరన్ బతికే ఉన్నారు'; నెడుమారన్ సంచలన కామెంట్స్
తమిళ్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ నాయకుడు పజా నెడుమారన్ సోమవారం సంచలన కామెంట్స్ చేశారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవంగా ఉన్నారని ప్రకటించారు. త్వరలోనే తమిళ జాతి విముక్తి కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తారని పేర్కొన్నారు.
13 Feb 2023
జమ్ముకశ్మీర్జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత-సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట
జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వవ్యస్థీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పు 370కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభావం చూపదని ధర్మాసనం చెప్పింది.
13 Feb 2023
మానిక్ సాహాకమ్యూనిస్టులు హత్యలు చేశారు, వారిని తిరిగి అధికారంలోకి రానివ్వం: త్రిపుర సీఎం
గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో 35ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ చరిత్ర సృష్టించినట్లు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
13 Feb 2023
నరేంద్ర మోదీ2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ
2024-25 నాటికి రక్షణ ఎగుమతులను 5 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 8-9 సంవత్సరాల్లో భారతదేశం తన రక్షణ రంగాన్ని పునరుజ్జీవింపచేసిందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా 2023'ని బెంగళూరులో ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.
13 Feb 2023
కర్ణాటకరాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ దుర్రానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆదిల్ తనపై అత్యాచారం చేశారని మైసూరులో ఓ ఇరాన్ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
13 Feb 2023
గూగుల్గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు- హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్
మహారాష్ట్ర పుణె నగరంలోని గూగుల్ కార్యాలయానికి సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారించగా అది ఫేక్ కాల్ అని తేలింది.
13 Feb 2023
బెంగళూరుఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు.
13 Feb 2023
భూకంపంసిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు
సిక్కింలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్సోమ్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.
11 Feb 2023
నందమూరి బాలకృష్ణనందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్
నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
11 Feb 2023
త్రిపుర'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం
త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ప్రధాని మోదీ కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రెండు పార్టీలు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టినట్లు ఆరోపించారు.
11 Feb 2023
తెలంగాణతెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మహబూబాబాద్ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని, రాళ్లదాడి కారణంగా ఒక కిటికీ పగిలిపోయిందని వార్తా సంస్థ పీటీడీ నివేదించింది.
11 Feb 2023
హిమాచల్ ప్రదేశ్దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా?
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భద్రత కోసం ఒక దశాబ్దం పాటు సేవలందించిన స్నిఫర్ లాబ్రడార్ కుక్కను ఈ వారం వేలం వేశారు.
11 Feb 2023
బీజేపీ'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ముస్లింలు వ్యతిరేకం కాదని, అయితే వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు కొనసాగుతున్నాయని జమియత్ ఉలామా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదానీ శనివారం అన్నారు. ప్రస్తుత హిందూత్వ రూపం భారతదేశ స్ఫూర్తికి విరుద్ధమని మదానీ పేర్కొన్నారు.
11 Feb 2023
దిల్లీపవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్
దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వైరం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఆప్ నియమించిన ఇద్దరు ప్రభుత్వ నామినీలను ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) బోర్డుల నుంచి గవర్నర్ తొలగించారు.
11 Feb 2023
విమానంఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
మరో ఎయిర్‌లైన్స్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కొరడా ఝులిపించింది. పౌర విమానయాన అవసరాలను ఉల్లంఘించినందుకు ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ.20 లక్షల జరిమానా విధించింది.
11 Feb 2023
నరేంద్ర మోదీఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిని కలుపుతూ, ఐదు రాష్ట్రాల గుండా వెళ్లే ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్రం చేపడుతోంది. 1,386 కిలోమీటర్లు దూరంతో దాదాపు రూ.4లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే మొదటి ఫేజ్‌ను ఆదివారం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు.
11 Feb 2023
ఎన్నికల సంఘంతెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17న జరగాల్సిన తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది.
11 Feb 2023
దిల్లీదిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్
దిల్లీ మద్యం కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
10 Feb 2023
భారతదేశంకౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా
యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14ని సంప్రదాయబద్ధంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే తేదీని కౌ హగ్ డేగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.
10 Feb 2023
అంబటి రాంబాబుటీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు
ఏలూరు జిల్లా పోలవరంలో వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు తలెత్తాయని అంబటి రాంబాబు ఆరోపించారు.