భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీఆర్ఎస్; తొలిసారి తెలంగాణ బయట కేసీఆర్ రాజకీయం

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు అదును కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి తెలంగాణ బయట ఎన్నికలకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారు.

బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్

దిల్లీ, ముంబయిలోని బీబీసీ ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ సోదాల అంశం దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా బీబీసీ ఆఫీసుల్లో సోదాలపై బ్రిటన్ మంత్రి అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

01 Mar 2023

తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త: భారీగా డైట్ ఛార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో చదవుతున్న విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలు భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధింత మంత్రులు ప్రతిపాదనలను రూపొందించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు.

01 Mar 2023

దిల్లీ

దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం

సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత వారి స్థానంలో సౌరభ్ భరద్వాజ్, అతిషిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు వారి పేర్లను లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపారు.

ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య

బెంగళూరులో ఓ యువతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్: విశాఖలో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ పరిసరాల్లో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు అనుమతులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు.

01 Mar 2023

దిల్లీ

సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా; 2013 నాటి కేజ్రీవాల్ ట్వీట్‌ను వెలికితీసిన బేజేపీ

ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయడం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వాటిని ఆమోదించిన నేపథ్యంలో దిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. యాక్టివ్‌గా పని చేస్తున్న వారు 60 లక్షల మంది వరకు ఉంటే, పెన్షనర్లు 77లక్షల మంది ఉన్నారని చెప్పారు. 49వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.

బిల్‌గేట్స్‌ను కలిసిన ఆనంద్ మహీంద్రా; ఇద్దరూ క్లాస్‌మెట్స్ అని మీకు తెలుసా?

ఆనంద్ మహీంద్రా తన క్లాస్‌మెట్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలిశారు. ప్రస్తుతం గేట్స్ భారత పర్యటనలో ఉన్నారు. చాలా కాలం తర్వాత కలిసిన వీరద్దరూ తమ వ్యాపారాల గురించి కానీ, ఐటీ గురించి కానీ చర్చించలేదట. సమాజం గురించి, గేట్స్ పుస్తకం రాసిన పుస్తకం గురించి చర్చించినట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఈ వేసవిలో ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఫిబ్రవరి నెలలోనే గత 122 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఫిబ్రవరిలో అత్యధికంగా 29.54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు, 1901 తర్వాత ఆ స్థాయిలో ఎండలు కొట్టడం ఇదే తొలిసారని పేర్కొంది.

01 Mar 2023

ధర

వినియోగదారులకు షాక్: భారీగా పెరిగిన కమర్షియల్‌, వంటగ్యాస్‌ సిలిండర్ ధరలు

పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు భారీ షాకిచ్చాయి. వాణిజ్య లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజే) సిలిండర్‌లపై యూనిట్‌కు రూ. 350.50, వంట గ్యాస్‌ సిలిండర్‌పై యూనిట్‌కు రూ.50 చొప్పున పెంచాయి.

ఐక్యరాజ్యసమితి సమావేశంలో నిత్యానంద 'కైలాస' దేశ మహిళా ప్రతినిధులు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవం, కైలాస దేశ వ్యవస్థాపకుడు, స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల జనరల్ అసెంబ్లీలో కైలాస దేశ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా నిత్యానంద తెలియజేశారు. జనీవాలో జరిగిన సమావేశంలో తమ ప్రతినిధులు హాజరైనట్లు పేర్కొన్నారు.

28 Feb 2023

కర్ణాటక

పట్టపగలు, కత్తులతో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

నిత్యం రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో పట్టపగలు 26ఏళ్ల యువకుడిని దారుణంగా నరికి చంపారు. కర్ణాటక బీదర్ జిల్లాలోని త్రిపురాంత్ గ్రామంలో ఈ హత్య జరిగింది. హత్య దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి.

28 Feb 2023

చైనా

దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు

మార్చి 2న దిల్లీలో జరిగే జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ హాజరుకానున్నారు. ఈ మేరకు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

28 Feb 2023

తెలంగాణ

అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ డిసెంబర్‌లో జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఈ సారి జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధినేత జేపీ నడ్డాతో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు సమావేశమయ్యారు.

Access Now Report: ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు భారత్‌లోనే ఎక్కువ

ప్రపంచంలో ఇంటర్నెట్ అంతరాయాలు భారత్‌లోనే అధికంగా జరుగుతున్నాయని అంతర్జాతీయ డిజిటల్ హక్కుల సంస్థ యాక్సెస్ నౌ, కీప్ ఇట్ ఆన్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక చెబుతోంది. 2022లో భారత్‌లో అత్యధికంగా 84ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు జరిగినట్లు పేర్కొంది. వరుసగా ఐదో సంవత్సరం ఇంటర్నెట్ అంతరాయాల జాబితాలో భారత్ టాప్‌లో నిలవడం గమనార్హం. 2016నుంచి అంతరాయాల జాబితాను పరిశీలిస్తే ఒక్క భారత్ వాటా58% ఉన్నట్లు నివేదిక చెబుతోంది.

సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో సాంకేతికత భారత్‌కు సాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక

ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

28 Feb 2023

కర్ణాటక

కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అన్ని రాజకీయ పక్షాలను ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంగళవారం ఉత్తర కన్నడ జిల్లాలోని బనవాసి మార్గంలో వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి.

28 Feb 2023

దిల్లీ

దిల్లీ మద్యం కుంభకోణం: అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా

లిక్కర్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా మంగళవారం హ్యాక్ అయ్యింది. పార్టీ ఖాతా పేరు మార్పు, లోగోను హ్యాకర్లు మార్చారు.

కింగ్‌ఫిషర్ బీర్ కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మందుబాబు

కొందరి మందుబాబుల సమస్యలు అప్పడప్పుడూ హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లకు అది సీరియస్ సమస్య అయినా, వేరే వాళ్లకు నవ్వు తెప్పించే విషయం అవుతుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే'

దిల్లీ మద్యం కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అంశం తెలుగు రాష్ట్రాలు కూడా చర్చశీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కొంతర కీలక నేతలు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈ కేసు వ్యవహారాన్ని ఇరు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

'హిందుత్వం అంటే జీవన విధానం'; చారిత్రక స్థలాల పేర్లను మార్చాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

పురాతన, చారిత్రక సాంస్కృతిక మత స్థలాల పేర్లను మార్చే కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. భారతదేశం ఒక లౌకిక దేశమని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. హిందూ మతం ఒక జీవన విధానమని చెప్పుకొచ్చింది.

27 Feb 2023

దిల్లీ

మనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్

దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిసోడియా అరెస్ట్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని చెప్పారు.

మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా?

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.

27 Feb 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు: కర్ణాకటపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్; శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం

మరో రెండు నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆ రాష్ట్రంపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయన కర్ణాటక‌లో పర్యటిస్తున్నారు. 2023లో ఇప్పటి వరకు రెండు నెలల్లోనే ఏకంగా ఐదు సార్లు మోదీ కర్ణాటకలో పర్యటించడం గమనార్హం.

27 Feb 2023

తెలంగాణ

D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత

తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఆయన ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

27 Feb 2023

దిల్లీ

అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత

అగ్నిపథ్ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

27 Feb 2023

దిల్లీ

దిల్లీ మద్యం కేసు: సిసోడియా అరెస్టుపై ఆప్ నిరసనలు; బీజేపీ హెడ్ క్వార్టర్ వద్ద హై టెన్షన్

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే సిసోడియా అరెస్టు అక్రమమంటూ దేశవ్యాప్తంగా నిరసనలకు ఆప్ సోమవారం పిలుపునిచ్చింది.

Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్

మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

26 Feb 2023

దిల్లీ

దిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం రాత్రి అరెస్టు చేసింది. ఉదయం నుంచి తొమ్మిది గంటలకు పైగా మనీష్ సిసోడియాను సీబీఐ విచారించింది. అనంతరం అదుపులోకి తీసుకుంది.

Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ

ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ మూడో రోజుకు చేరుకున్నాయి. ముగింపు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదాని-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.

Mann Ki Baat: 'ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 98వ 'మన్ కీ బాత్' ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక అంశాలపై మాట్లాడారు.

నాగాలాండ్: 60ఏళ్ల అసెంబ్లీ చరిత్రలో మహిళకు దక్కని ప్రాతినిధ్యం; ఈసారైనా అబల గెలిచేనా?

నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27(సోమవారం) ఒకే దశలో మొత్తం 60అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే 1963లో ఏర్పడిన నాగాలాండ్ అసెంబ్లీకి ఇంతవరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాకపోవడం గమనార్హం. 2023 ఎన్నికల్లో అయినా అబలలకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుందా? అని ఆ రాష్ట్ర మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

26 Feb 2023

దిల్లీ

Delhi Excise Policy Scam: నేను జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను: మనీష్ సిసోడియా

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసు విచారణలో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఆదివారం సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

నిజామాబాద్‌: మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని దాసరి హర్ష (22)గా గుర్తించారు.

జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో మార్పు కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు లోకేశ్. అయితే ఎన్టీఆర్ మాజీ సన్నిహితుడు, మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు.

యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్

2005లో హత్యకు గురైన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజుపాల్ కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్‌ను ప్రయాగ్‌రాజ్‌లో శుక్రవారం దుండగులు హతమార్చారు. ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మధ్య డైలాగ్ వార్ నడిచింది.

ప్రధాని మోదీతో జర్మన్ ఛాన్సలర్‌ భేటీ; రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్వైపాక్షిక అంశాలపై చర్చ

రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం భారత్‌కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.