భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరగనుంది.

26 Mar 2023

కోవిడ్

దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం

భారతదేశంలో గత 24 గంటల్లో 1,890 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది.

రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు

రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హుత వేటు వేడయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా 'సత్యాగ్రహ' దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

25 Mar 2023

కర్ణాటక

బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని కర్ణాటక ప్రజలు నిర్ణయించినట్లు ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. కర్ణాటకలోని దావణగెరెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న చర్చ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. 2019లో టీడీపీ అధికారం కోల్పోయినపుడు ఈ చర్చ ఎక్కువగా జరిగింది.

25 Mar 2023

తెలంగాణ

ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్

ఎల్‌బీ నగర్‌ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఎల్‌బీ నగర్‌ ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లైఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీ రామారావు శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ.32 కోట్లతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది.

తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిజాం కాలం నాటి నాణేలు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉపాధిహామీ కూలీలు తమ పనిలో భాగంగా తవ్వకాలు చేపట్టగా చిన్న మట్టి కుండలో పురాతన 27 వెండి నాణేలను గుర్తించారు.

దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా?

క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది.

శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో సూరుత్ కోర్టు తీర్పు, లోక్‌సభలో అనర్హత వేటు, అధికార బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం నిప్పులు చెరిగారు. ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్నదని, 'సబ్ కా ప్రయాస్' ద్వారా ప్రతి ఒక్కరి కృషి ద్వారానే అది సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

25 Mar 2023

కోవిడ్

దేశంలో కొత్తగా 1,500పైగా కరోనా కేసులు; 146రోజుల గరిష్ఠానికి వైరస్ బాధితులు

భారతదేశంలో గత 24గంటల్లో 1,500పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 146 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి!

వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్‌ను భారతీయ రైల్వే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును నడిపేందుకు సిద్ధమవుతోంది.

Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరో నెలరోజుల్లో జరగనున్నారు. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించింది.

రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత సైన్యం చేస్తున్న ఫీల్డ్ ప్రాక్టీస్‌లో అపశృతి చోటు చేసుకుంది. సైన్యం ప్రయోగించిన మూడు క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయి. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీస్ జరగుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

24 Mar 2023

పంజాబ్

భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు

పరారీలో ఉన్న 'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ గురించి తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.

'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు.

వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనలంగా మారాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపులో సహకరించినట్లు అనుమానిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం టీడీపీలో చేరారు.

ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ

గ్రూప్ 4 స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. మెయిన్స్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తీపికబురు చెప్పింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

24 Mar 2023

లోక్‌సభ

గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ

అదానీ గ్రూప్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు ఒత్తిడిని కొనసాగించినప్పటికీ, మార్చి 24న లోక్‌సభ ఆర్థిక బిల్లు 2023ని సవరణలతో ఆమోదించింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్

రామ భక్తులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు కేవలం ఓట్ల కోసం శ్రీరాముడిని ఉపయోగించుకుంటున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రాముడు హిందువులకు మాత్రమే చెందినవాడు కాదని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ

ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14రాజకీయ పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.

One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ

2025 నాటికి టీబీ నిర్మూలనే లక్ష్యంగా భారత్ పని చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ లక్ష్యం కంటే 5 సంవత్సరాలు ముందే భారత్ టార్గెట్‌ను చేరుకుంటుందని పేర్కొన్నారు.

24 Mar 2023

కేరళ

'కథాకళి' పేరుతో ఒక గ్రామం; శాస్త్రీయ నృత్య రూపానికి అరుదైన గౌరవం

కేరళ రాష్ట్ర కళా వారసత్వంగా భావించే శాస్త్రీయ నృత్య రూపం 'కథాకళి'కి అరుదైన గౌరవం లభించింది. ఒక గ్రామానికి 'కథాకళి' పేరును అంకితం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు చేసింది. దీంతో దశాబ్దాల కల నెరవేరడంతో ఆ గ్రామ ప్రజలు ఆనందంలో ముగిపోతున్నారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీపై త్వరలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే జులై కానీ, ఆగస్టులో గానీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించి సంచలనం సృషించారు.

టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

ఈ ఏడాది, వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. జనరల్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ సాధించి చరిత్ర సృష్టించాలని కాషాయ దళం ఉవ్విళ్లురూతోంది. ఈ క్రమంలో పార్టీలో రాష్ట్రాల వారికి కీలక మార్పులు చేస్తోంది.

23 Mar 2023

సీబీఐ

విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా 2015-16లో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లలో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పేర్కొంది. అదే సమయంలో అతని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ విజయ్ మాల్యా విదేశాల్లో ఆస్తులను కొన్నారని చెప్పింది.

23 Mar 2023

పోలవరం

పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టుపై గురువారం కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంలో నీటి నిల్వ ప్రస్తుతం 41.15 మీటర్లకే పరమితం చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్రం పేర్కొంది.

23 Mar 2023

గుజరాత్

గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో

మామూలుగా సింహం లేదా పులి జింక లేదా మేకను వేటాడే వీడియోలను చూసి ఉంటారు, ఈ వీడియోలో వీధుల నుండి సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపుని చూడచ్చు. వీడియో ప్రకారం ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను గురువారం సీఎం కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పరిశీలించారు. తొలుత ఖమ్మ జిల్లా రామాపురం, గార్లపాడు గ్రామాల్లో పొలాలను స్వయంగా సందర్శించారు.

23 Mar 2023

ఇస్రో

శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్‌ 2028లో ప్రారంభం: ఇస్రో ఛైర్మన్

శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్‌ను 2028లో ప్రారంభించేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు.

23 Mar 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు?

కర్ణాటకలో మరో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. 18వ శతాబ్దపు పాలకుడు టిప్పు సుల్తాన్‌పై తాజాగా వివాదం రాజుకుంది. టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారనే అంశాన్ని బీజేపీ ఎన్నికల అంశంగా మార్చింది.

23 Mar 2023

ప్రపంచం

ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా

ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి యునైటెడ్ స్టేట్స్ నామినేట్ చేసిన అజయ్ బంగా తన మూడు వారాల ప్రపంచ వ్యాప్త పర్యటనను ముగించుకుని మార్చి 23, 24 తేదీల్లో భారతదేశంలోని న్యూఢిల్లీని సందర్శించనున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

హిమాచల్ ప్రదేశ్‌ను ఓవైపు వర్షాలతో పాటు మంచు వణికిస్తోంది. గత వారం రోజులుగా ఎత్తైన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలైన కద్రాలా, గొండ్లాలో వర్షాలతో పాటు 3 సెం.మీ నుంచి 1 సెం.మీ తేడాతో తేలికపాటి మంచు పడుతోంది. మధ్య, దిగువ కొండల్లో తేలికపాటి నుంచి కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్

భవిష్యత్తులో భారతదేశం పెను సవాళ్ళను ఎదుర్కునే అవకాశం ఉంది. ఆ సవాళ్ళు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నాయి. అవును, భారతదేశంలో త్వరళో నీటి సమస్య రాబోతుంది.

'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో అదే ఏడాది రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ చేసిన ఫిర్యాదు మేరకు పరువు నష్టం కేసు నమోదైంది.

Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయాన్నే సీఎం జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.