భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

నేడు బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర పెద్దల సమక్షంలో ఆయన ఆయన పార్టీలో చేరనున్నారు.

7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్

దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. కేవలం ఏడు రోజుల్లోనే కొత్త కరోనా కేసులు మూడింతలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13శాతం పెరిగాయి.

07 Apr 2023

గ్యాస్

వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు

దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. సహజ వాయువు ధరను నిర్ణయించడానికి కేంద్ర క్యాబినెట్ కొత్త పద్ధతిని ఆమోదించింది. దీంతో ఫైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలు దాదాపు 10శాతం తగ్గనున్నాయి.

06 Apr 2023

బీజేపీ

బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పదమైన బీబీసీ డాక్యుమెంటరీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగడంతో జనవరిలో ఆయన కాంగ్రెస్‌కతు రాజీనామా చేశారు.

06 Apr 2023

తెలంగాణ

సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రాబోయే రోజుల్లో 1,050మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై జరిగిన సమీక్ష సమావేశంలో సింగరేణి కంపెనీ సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

06 Apr 2023

బిహార్

స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు

కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుందని నిరూపించిన వారు ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్ కుమార్ కథ కూడా అలాంటి గొప్పవారికి ఏం తీసిపోనిది.

సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ హత్య జరిగింది. అమలాపురం పట్టణంలో ఈనెల 4న నెల్లూరు జిల్లాకు చెందిన కోట హరికృష్ణ ఓ మహిళను కత్తితో నరికి చంపాడు.

'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్

'ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌'తో దేశంలో వైద్య వ్యవస్థలో పెనుమార్పు వస్తాయని, ఆ మహత్తర కార్యక్రమం పల్నాడులోని లింగంగుంట్ల నుంచే ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

06 Apr 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు

నెల రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆశపడుతుంది.

06 Apr 2023

జనగామ

జనగామలో దారుణం: భార్య ఉరేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

జనగామలో గురువారం దారుణం జరిగింది. జనగామ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ కె శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్‌‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్య ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది.

ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్

దేశంలో గత 24 గంటల్లో 5,335 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవి నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువని వెల్లడించింది.

BJP Foundation Day: 'నేషన్ ఫస్ట్' మంత్రమే బీజేపీ నినాదం: ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అవినీతి, బాద్‌షా మనస్థతత్వంపై పోరాటానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ను వీడటానికి రాహుల్ గాంధీనే కారణం: గులాం నబీ ఆజాద్

డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ వీడటానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు.

'నన్నే కరుస్తావా'; పాము తల కొరికిన వ్యక్తి; వీడియో వైరల్

తమిళనాడులోని రాణిపేటలో పామును పట్టుకుని, దాని తలను కొరికి, వీడియో రికార్డు చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్

10వ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి?

ఒంటిమిట్టలో బుధవారం జరిగే సీతా రాముల కల్యాణానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయింది.

పెళ్లిళ్ల సీజన్‌ వేళ ఆకాశానంటిన బంగారం ధర; పది గ్రాములు రూ.61,360

పెళ్లిళ్ల సీజన్‌ వేళ హైదరాబాద్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. ఆరు నెలల్లో బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే రూ.1,030 పెరిగి రూ.61,360 వద్ద ఉంది.

ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ

ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలోని ఓ వైన్‌షాప్‌లో బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. సినీ ఫక్కీలో బుధవారం ఉదయం పోలీసుల అదుపులో నుంచి బయటపడ్డారు.

ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

భారత్‌లో 1,091 పక్షి జాతుల్లో 73% బర్డ్స్‌పై వాతావరణ మార్పుల ప్రభావం

వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత్‌లోని 1,091 పక్షి జాతులపై 'ప్రొజెక్టెడ్ షిఫ్ట్స్ ఇన్ బర్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా అండర్ క్లైమేట్ చేంజ్' పేరుతో నలుగురు పరిశోధకులు చేసిన అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది.

05 Apr 2023

తెలంగాణ

తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం

ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం

దేశంలో గత 24 గంటల్లో 4,435 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 15 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 163 రోజుల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది.

05 Apr 2023

కర్ణాటక

సూపర్ బామ్మ! 70ఏళ్ల వృద్ధురాలి ఆలోచన భారీ రైలు ప్రమాదాన్ని నివారించింది; అదెలాగో తెలుసుకోండి

మంగళూరులోని మందారకు చెందిన 70ఏళ్ల వృద్ధురాలు ఇటీవల కర్ణాటకలో భారీ రైలు ప్రమాదాన్ని నివారించడంలో దోహదపడింది.

గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది

బెంగళూరు మెట్రో 13.71 కి.మీ ఫేజ్ II ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత, నిన్న సాయంత్రం బెంగళూరులో భారీ వర్షం కారణంగా నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లో నీరు నిలిచిపోయింది.

05 Apr 2023

కేరళ

కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు

కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడిని మంగళవారం అర్థరాత్రి మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు.

ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం

ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రయాగ్‌రాజ్ పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కసరి మసారి ఇంటి నుంచి ఒక ఐఫోన్, కీలకమైన రిజిస్టర్‌తో పాటు రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ది పనులపై మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగుతున్న హింసాకాండ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంపై మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరింది.

04 Apr 2023

దిల్లీ

దిల్లీ మెట్రోలో బ్రాలెట్, మినీ స్కర్ట్‌లో మహిళ హల్‌చల్; అశ్లీల ప్రదర్శనపై చట్టం ఏం చెబుతోంది?

ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా అశ్లీల ప్రదర్శన, డ్యాన్స్‌లు, వీడియోలు తీయడాన్ని దిల్లీ మెట్రో ఇప్పటికే నిషేధించింది. అయినా ఆ ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటించడం లేదు.

04 Apr 2023

కోవిడ్

దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు; కొత్తగా 3,038 మందికి వైరస్

భారతదేశంలో మంగళవారం 3,038 కరోనా వైరస్ కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి సోకి కొత్తగా మరో 9మంది మృతి చెందినట్లు పేర్కొంది.

పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే?

'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్‌లోని సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న తన రాహుల్ బెయిల్ పిటిషన్‌పై తిరిగి విచారించనున్నది. అయితే రాహుల్ గాంధీ ఆ బెయిల్ పిటిషన్‌లో ఏం పేర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

04 Apr 2023

సిక్కిం

సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది

సిక్కింలోని నాథు లా పర్వత మార్గంలో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. అనేక మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు.

04 Apr 2023

తెలంగాణ

రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ

తెలంగాణలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల్లో మంగళవారం హిందీ పేపర్ లీకైంది. తాండూరులో సోమవారం తెలుగు పేపర్ లీక్ అయిన రీతిలోనే వరంగల్‌లో పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చింది.

04 Apr 2023

చెన్నై

ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో ఉద్యోగం చేస్తున్న 29ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలు హత్య చేసింది. ఈ ఘటన పుదుకోట్టైలో జరిగింది.

04 Apr 2023

దిల్లీ

దిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దీపక్ బాక్సర్ మెక్సికోలో అరెస్ట్

దిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన దీపక్ బాక్సర్‌ మెక్సికోలో అరెస్టు చేసినట్లు సీనియర్ స్పెషల్ సెల్ అధికారులు మంగళవారం తెలిపారు.

గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్

బెంగళూరు నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E897లో సాంకతిక లోపం తలెత్తడంతో మంగళవారం హైదరాబాద్‌కు మళ్లించారు. హైదరాబాద్‌ విమానాశ్రాయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో తన సిరీస్‌లోని రెండో ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేయగా, 3వ ఎపిసోడ్‌ను మంగళవారం విడుదల చేసింది.

04 Apr 2023

చైనా

మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం

'కుక్క తోక వంకర' అన్న చందంగా చైనా వ్యవహరిస్తోంది. మరోసారి డ్రాగన్ దేశం అరుణాచల్ ప్రదేశ్‌లో కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు 'దక్షిణ టిబెట్‌'గా పేరు మార్చి చైనా మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది.

కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ

తెలంగాణ కూల్ రూఫ్ పాలసీని సోమవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.