భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు 

తెలుగుదేశం పార్టీ/టీడీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ మ్యాగజైన్ చైతన్య రథం పబ్లిషర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.

11 Apr 2023

కర్ణాటక

ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత 

మూడు వారాల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్

అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన ఒడిశాలోని బైలాదిలా మైనింగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని అన్నారు.

11 Apr 2023

దిల్లీ

ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత

ధూళి ఎక్కువగా ఉన్నందున దిల్లీలోని గాలి నాణ్యత మంగళవారం దారుణంగా పడిపోయిందని, మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వీచే పశ్చిమ గాలులు నగరానికి దుమ్మును చేరవేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

11 Apr 2023

ఐఎండీ

రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా

ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్రం వెల్లడించింది. సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం 67 శాతం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసినట్లు కేంద్రం పేర్కొంది.

భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్

భారతదేశంలో ముస్లింలపై హింస అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

11 Apr 2023

చైనా

డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన 

డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న భూటాన్‌లోని 'అమో చు' లోయలో చైనా సైన్యం భారీ నిర్మాణాలను చేపడుతోంది. దీనిపై భారత సైన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

11 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్! 

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిఘా వ్యవస్థల కళ్లు గప్పి అతను ఎలా తప్పించుకుంటున్నాడు? అతను అసలు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలను అమృత్‌పాల్ సింగ్‌ సలహాదారుగా చెప్పుకునే పాపల్‌ప్రీత్ సింగ్‌‌ పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష 

రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్- కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్ 

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి భారత ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హోదాను రద్దు చేస్తున్నట్లు ఈసీ ఉత్తర్వులు విడుదల చేసింది.

శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్ 

హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నుంచి బయలు దేరే అలయన్స్ ఎయిర్‌కు చెందిన ఎనిమిది విమానాలను రద్దు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది.

10 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్ 

ఖలిస్థానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను సోమవారం పంజాబ్ పోలీసులు, పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.

10 Apr 2023

కర్ణాటక

అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు

కన్నడనాట అమూల్ వ్యవహారం ముదురుతోంది. ఎన్నికల సీజన్ కూడా కావడంతో దానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అమూల్ వ్యవవహారం చినికి చినికి గాలి వాన మాదిరిగా మారింది.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సస్పెండ్ చేసింది.

నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు

నల్లమల అడవులు పెద్దపులులకు నిలయంగా మారినట్లు, ఈ ప్రాంతంలో టైగర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నల్లమల అడవుల్లో 75 వరకు పులులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

10 Apr 2023

కోవిడ్

కరోనా భయాలు: దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నేపథ్యంలో ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లను ప్రకటించింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేలం పాటలో బిడ్ వేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు.

దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 6.91శాతం

భారతదేశంలో గత 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 6.91%గా ఉన్నట్లు వెల్లడించింది.

రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు?

ఎప్పుడూ అదానీ అంశంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించే అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కాంగ్రెస్‌ను వీడిన నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే రాహుల్ చేసిన ఆ ట్వీట్‌కు తీవ్ర స్థాయిలో ప్రతి స్పందన వ్యక్తమవుతోంది.

ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని అకోలాలో ఓ టిన్‌షెడ్‌పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.

దేశంలో కొత్తగా 5,357 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 3.39%

దేశంలో గత 24 గంటల్లో 5,357 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కి చేరుకుంది.

చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు

పౌల్ట్రీ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల సరికొత్త యంత్రాన్ని జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ పదేళ్ల బాలుడు ఆవిష్కరించాడు.

08 Apr 2023

తెలంగాణ

10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం

10వ తరగతి పేపర్ లీక్ కేసులో డిబార్ అయిన విద్యార్థిని సోమవారం నుంచి మిగిలిన పరీక్షలు రాయడానికి తెలంగాణ హైకోర్టు శనివారం అనుమతించింది.

'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

'మోదీ ఇంటిపేరు' వివాదంలో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిపై తమిళనాడులోని దిండిగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శనివారం అనుచితన వ్యాఖ్యలు చేసారు.

08 Apr 2023

బీజేపీ

బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు

తొలి భారత గవర్నర్ జనరల్, కాంగ్రెస్ దిగ్గజం సి.రాజగోపాలాచారి మనవడు, తమిళనాడుకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు.

విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక

విశాఖపట్నంలోని గంగవరంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన ఘటన శనివారం వెలుగుచూసింది.

హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో అప్పుడప్పుడు వర్షాలు పుడుతున్నా, ఎండలు మాత్రం మరింత పెరిగే అవకాశం ఉదని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా పగటి పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించారు.

అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా?

మహారాష్ట్ర మరో రాజకీయ కుదుపునకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదని మండిపడ్డారు.

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను జెండా ఊపి ప్రారంభించారు.

దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు

దేశంలో గత 24 గంటల్లో 6,155 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 31,194కి చేరుకుంది.

సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య

సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యయి. అలాగే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది.

రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు; 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ మూసివేత

ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు.

రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి

ఐటీ సిటీ హైదరాబాద్‌ను వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలను కలిపే సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ సెమీ-హై స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని రవాణా కార్యాలయం సమీపంలోని ఒక దుకాణంలో భారీ పేలుడు సంభవంచింది.

07 Apr 2023

కోవిడ్

ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 10, 11తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

07 Apr 2023

బీజేపీ

ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం దిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

07 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసులకు 'బైసాఖి' సెలవులు రద్దు

ఖలీస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అహర్నిషలు అమృత్‌పాల్ కోసం వెతుకుతున్నారు. ఆపరేషన్ 'అమృత్‌పాల్ సింగ్'లో భాగంగా ఇప్పటికే పోలీసులు సెలవులు తీసుకోకుండా పని చేస్తున్నారు.

'దేశానికి విద్యావంతులైన ప్రధాని కావాలి'; మోదీని ఉద్దేశించి సిసోడియా లేఖ

జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రధాని మోదీని ఉద్దేశించి దేశ ప్రజలకు ఒక లేఖ రాశారు. అందులో ప్రధాని మోదీ విద్యార్హతలపై ప్రశ్నలు లేవనెత్తారు. లేఖలో ప్రధాని మోదీపై సిసోడియా విరుచుకపడ్డారు. భారతదేశం పురోగమించాలంటే చదువుకున్న ప్రధానమంత్రి కావాలన్నారు.