భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్

బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం అన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తమతో చెప్పిందని పేర్కొన్నారు.

03 Apr 2023

తెలంగాణ

10వ తరగతి తెలుగు పేపర్ లీక్; ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు

వికారాబాద్ జిల్లాలోని తాండూరు నంబర్ 1 సెంటర్‌లో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లి ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి సర్క్యులేట్ చేసినందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ సహా ముగ్గురు అధికారులను తెలంగాణ విద్యాశాఖ సోమవారం సస్పెండ్ చేసింది.

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 17వరకు పొడిగింపు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తున్న మద్యం పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని దిల్లీ కోర్టు సోమవారం రెండు వారాల పాటు పొడిగించింది.

'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని పజైయసీవరం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ తాకింది. వంటగ్యాస్ ధరను తగ్గించాలని గృహిణులు డిమాండ్ చేశారు.

పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా

పరువు నష్టం కేసులో తనను దోషిగా సూరత్ కోర్టు తేల్చడాన్ని సవాల్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ పిటిషన్‌ను స్వీకరించిన సూరత్ సెషన్స్ కోర్టు, తదిపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.

దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తర భారత పర్యటనలో ఉన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం పవన్ పర్యటించారు. పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు.

03 Apr 2023

కోవిడ్

దేశంలో కరోనా ఉద్ధృతి; కొత్తగా 3,641మందికి వైరస్; ఏడుగురు మృతి

భారతదేశంలో సోమవారం 3,641 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్త కేసులతో కలిసి క్రియాశీల కేసుల సంఖ్య 20,219కి పెరిగింది.

03 Apr 2023

కర్ణాటక

ప్రభుత్వాస్పత్రి నుంచి నవజాత శిశువును ఈడ్చుకెళ్లిక కుక్క; చిన్నారి మృతి

ప్రసూతి వార్డు నుంచి ఒక కుక్క నవజాత శిశువును ఈడ్చుకెళ్లిన ఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.

03 Apr 2023

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో పరీక్ష కేంద్రాల వల్ల సందడి నెలకొంది. ఈ ఏడాది నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా 11పేపర్లతో నిర్వహించే పరీక్షను 6 పేపర్లతో నిర్వహిస్తున్నారు.

సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్

పరువు నష్టం కేసులో సూరత్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్‌లోని సూరత్‌లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ కేసును ఈ రోజే విచారించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

శ్రీరామనవమి శోభాయాత్రలో మళ్లీ ఘర్షణలు; బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఆదివారం నిర్వహించిన స్వామివారి ఊరేగింపులో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు.

03 Apr 2023

కేరళ

కేరళ: రైలులో గొడవ; తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన వ్యక్తి; రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు

కేరళలోని కోజికోడ్‌లో ఎలత్తూర్‌ సమీపంలో కదులుతున్న రైలులో దారుణం జరిగింది. తోటి ప్రయాణికుడితో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు.

02 Apr 2023

కోవిడ్

దేశంలో ఒక్కరోజులో 27శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,823 మందికి వైరస్

దేశంలో 24గంటల్లో కొత్తగా 3,824 మందికి కరోనా సోకినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజే 27శాతం కేసులు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొంది. 184 రోజుల్లో ఇదే అత్యధికమని చెప్పింది.

ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. అయితే ఈసారి ఫిర్యాదు చేసింది ఏ పార్టీ ప్రతినిధి కాదు.

01 Apr 2023

దిల్లీ

1000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన పక్షి; దిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ విధింపు

దుబాయ్‌కి వెళ్లే ఫెడెక్స్ విమానాన్ని ఓ పక్షి బలంగా ఢీకొట్టడంతో శనివారం మధ్యాహ్నం ఆ ఫ్లైట్‌ను దిల్లీ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం

ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం తెలిపారు.

ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో జరిగిన శ్రీరామనవమి ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రాజా‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ ) సెక్షన్ 153-ఏ, 506 కింద అభియోగాలు మోపారు.

మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు

శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ఒకప్పుడు కర్ఫ్యూలు, ఉగ్రవాద దాడులకు నెలవుగా ఉండేది. నిత్యం ఇంటర్నెట్ ఆంక్షల్లో ఉండే ఆ ప్రాంతం త్వరలో ఉచిత వై-ఫై జోన్‌గా మారుబోతోంది. శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా చేయడంలో భాగంగా జమ్ముకశ్మీర్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో విషాదం

తెలంగాణ సీఎం కుమార్తె, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల పర్యటనలో విషాధం చోటుచేసుకుంది.

'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్‌కు చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. రౌత్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించినట్లు ముంబయి పోలీసులు శనివారం తెలిపారు.

హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం; ఆ కంపెనీలే టార్గెట్‌గా దాడులు

హైదరాబాద్‌లోని వివిధ ఫార్మా కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) శనివారం ఉదయం నుంచి దాడులు ప్రారంభించింది.

01 Apr 2023

కోవిడ్

దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు

24గంటల్లో భారతదేశంలో 2,994 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదైనట్లు శనివారం కేంద్రం ఆరోగ్య శాఖ పేర్కొంది. గత రోజుతో పోల్చుకుంటే కేసులు 101 మేరకు తగ్గినట్లు వెల్లడించింది.

01 Apr 2023

ముంబై

మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు; ముంబయిలో నిందితుడు అరెస్ట్

బ్యాంకాక్‌ నుంచి ముంబయికి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఎయిర్ హోస్టెస్‌పై ఓ స్వీడన్‌ ప్రయాణికుడు వేధింపులకు పాల్పడ్డాడు. విమానం దిగిన వెంటనే ముంబయి పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత

తాను అవినీతిపరుడినంటూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా పరువు నష్టం కేసు పెడతానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు.

వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్

వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. ఏప్రిల్ 1నుంచి తగ్గిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి.

ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు

ఐఐటీ-హైదరాబాద్ మరో ఘనత సాధించింది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సహకారంతో స్వదేశీ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ వంతెనను పరిశోధన బృందం అభివృద్ధి చేసింది.

మద్యం పాలసీ కేసు: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ కోర్టు

లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియా బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.

ఇంట్లో భారీ పేలుడు, 4మృతదేహాలు లభ్యం; రంగంలోకి ఫోరెన్సింగ్ బృందం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని పొలాల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.

ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లపై శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మోదీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఎవరికీ అందించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది.

ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు; ఏప్రిల్ 1నుంచి అమలు

ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్) ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో కొత్తగా ప్రవేశపెట్టిన ఆఫర్లు, డిస్కౌంట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని యాజమాన్యం ప్రకటించింది.

31 Mar 2023

పంజాబ్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తెకు ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులు

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కుమార్తె సీరత్ కౌర్‌ను ఖలిస్థానీ అనుకూల శక్తులు బెదిరించారు. భగవంత్ మాన్ కుమార్తెకు భద్రత కల్పించాలని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.

31 Mar 2023

పంజాబ్

పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏప్రిల్ 1న, పాటియాలా జైలు నుండి విడుదల కానున్నారు. అతని అధికారిక హ్యాండిల్ నుండి విడుదల గురించి ప్రస్తావిస్తూ ట్వీట్‌ విడుదల అయింది,

31 Mar 2023

దిల్లీ

మస్కిటో కాయిల్‌ నుంచి విషవాయువు; ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

దోమల నివారణకు ఉపయోగించే మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణాలను తీసింది. దిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో గురువారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మస్కిటో కాయిల్ కారణంగా విడుదలైన విష వాయువును పీల్చడంతో ఊపిరాడక మరణించారు.

31 Mar 2023

దిల్లీ

దిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం; ట్రాఫిక్‌కు అంతరాయం

దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీలోని పలు ప్రాంతాలు శుక్రవారం ఉదయం జలమయమైనట్లు ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్‌డబ్ల్యూఎఫ్‌సీ) సూచించింది.

31 Mar 2023

తెలంగాణ

తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ

తెలంగాణలో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మార్చి 31(శుక్రవారం) నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సూర్యుడు భగ్గమననున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.

ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీరామనవమి సందర్భంగా బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది.

31 Mar 2023

కోవిడ్

దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు

దేశంలో గత 24 గంటల్లో 3,095 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.

తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం

తమిళనాడులో మరోసారి 'హిందీ' వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ 'ఆవిన్' తమ ప్యాకెట్లపై పెరుగుకు సమానమైన హిందీ పదమైన 'దహీ'ని ముద్రించడంపై రగడ రాజుకుంది.

30 Mar 2023

కర్ణాటక

Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో సీఎం కుర్చి కోసం పోటీ మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్‌లో చాలా మందే సీనియర్ నాయకులు సీఎం అభ్యర్థిగా తామంటే తాము అని ఊహించుకుంటున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ మధ్య నెలకొంది.