భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద

దేశంలోని ఆర్థిక అసమానతలపై అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్ తన 'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్' నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. 40శాతం సంపద కేవలం 1% ధనవంతుల చేతిలోనే ఉన్నట్లు పేర్కొంది.

సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలి: కిరెన్ రిజిజు

న్యాయమూర్తులను నియమించే ప్రక్రియకు సంబంధించి చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య వివాదం నడుస్తోంది. అయితే ఈ విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

16 Jan 2023

ఐపీఎల్

నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ

కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కీలక ప్రకటన చేశారు. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పిన ఆయన.. ట్విట్టర్ వేదికగా తన ఆస్థులకు వారసుడిగా కుమారుడు రుచిర్ మోదీని ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది చెప్పారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్

రాష్ట్ర అభివృద్ధి భాగస్వాములు కావాలని, రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఉద్యోగాలు కల్పించాలనుకున్నా పూర్తి సహకారం అందిస్తామని హామీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు.

16 Jan 2023

టర్కీ

ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం

ఎనిమిదో నిజాం ముకరం జా టర్కీలోని ఇస్తాంబుల్‌లో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 89 ఏళ్ల ముకరం జా హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ మనవడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు కొడుకులు ఉన్నా.. ఆయన వారసుడిగా మనవడు అయిన ముకరం జానే ప్రకటించారు. దీంతో ఎనిమిదో నిజాంగా ముకరం జా గుర్తింపు పొందారు.

జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రెండు రోజుల పాటు జీ20 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాల్లో 'థింక్-20' అనే థీమ్‌పై చర్చించనున్నారు. ఇందుకోసం రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.

13 Jan 2023

కేరళ

ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి

పాఠశాలల్లో పాఠాలు బోధించే గురువును సంబంధించే అంశంపై కేరళ బాలల హక్కల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో ఉపాధ్యాయుడిని 'సార్' అని, ఉపాధ్యాయురాలినిని మేడమ్ అని సంభోదించవద్దని పేర్కొంది. పాఠశాలల్లో ఈ రెండు పదాలకు బదులుగా ఇద్దరినీ 'టీచర్' అని సంబోధించాలని సూచించింది.

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ ఇద్దరు రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. ఈ భేటీలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్ ఉన్నారు.

ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది'

ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తాను ఆ మహిళపై మూత్ర విసర్జన చేయలేదని, ఆమెపై ఆమెనే చేసుకుందని కోర్టులో శంకర్ మిశ్రా తరఫు లాయర్ కోర్టులో వాదించారు.

13 Jan 2023

దిల్లీ

దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ

దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11మంది పోలీసులను సస్పెండ్ చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది.

నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి

మహారాష్ట్రలోని నాసిక్-షిర్డీ హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీకి యాత్రికులతో వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దాదాపు 34 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి

రోజుకు కొంత మునిగిపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ పట్టణం గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన విషయాలను వెల్లడించింది. జోషిమఠ్‌‌లో భూమి నెమ్మదిగా కుంగిపొతోందని, దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.

ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ

ప్రపంచంలోనే అతిపొడవైన నదీ యాత్రకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ 'ఎంవీ గంగా విలాస్‌'ను వర్చువల్‌గా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

సోషలిస్టు నేత, కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు. శరద్ యాదవ్‌కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

జీఓ నెం.1ను సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీనిపై రాష్ట్రం ప్రభుత్వం జనవరి 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

భద్రతలో వైఫల్యం: ప్రధాని మోదీపైకి దూసుకొచ్చిన యువకుడు

కర్ణాటకలో జరుగుతున్న జాతీయ యువజనోత్సవాల వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో ఘోర వైఫల్యం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు హుబ్బళికి మోదీ చేరుకోగా.. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు.

12 Jan 2023

కర్ణాటక

సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత

ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. బెంగళూరు సమీపంలోని నంది కొండల దిగువన ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవంపై స్టే విధించింది.

ప్రతి గ్రామపంచాయతీకి రూ.10లక్షలు మంజురూ చేస్తాం: సీఎం కేసీఅర్

మహబూబాబాద్‌ జిల్లా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు భారీగా నిధులను ప్రకటించారు. జిల్లాలోని పలు తాండాలను పంచాయతీలుగా మార్చామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు

దిల్లీలో అధికార పార్టీ అయిన 'ఆప్'కు డీఐపీ విభాగం షాకిచ్చింది. ప్రకటన కోసం వినియోగించిన రూ.163కోట్లు చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు జారీ చేసింది.

విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు

ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించింది. దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఒక నాన్ బెయిలబుల్ నేరం కూడా ఉందని కేసును విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్ వెల్లడించారు.

కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్.. రిపోర్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా.. నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ప్రధాని నరేంద్ర‌‌మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. జనవరి 19న ప్రధాని పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హైదరాబాద్ రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులను ఆదేశించింది.

11 Jan 2023

తెలంగాణ

తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి తెలంగాణ మొట్టమొదటి మహిళా సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!

తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. రోజుకో నాటకీయ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్‌కు వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది.

11 Jan 2023

తెలంగాణ

తెలంగాణ సీఎస్‌: రామకృష్ణారావు వైపే కేసీఆర్ మొగ్గు!

తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ ప్రక్రియ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంత కుమారిలో ఒకరు సీఎస్‌గా నియామకం అయ్యే అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో రామకృష్ణారావు ఎంపికకే కేసీఆర్ మొగ్గు చూపినట్లు సమాచారం.

11 Jan 2023

తెలంగాణ

హైదరాబాద్ హై'టెక్' పోలీస్: సైబర్ యూనిట్ బలోపేతానికి 'ఏఐ' సపోర్టు

హైదరాబాద్‌లో శాంతిభద్రతలను మరింత మెరుగు పర్చేందుకు నగర పోలీసులు ఈ ఏడాది ప్రత్యేక కార్యచరణతో ముందుకుపోతున్నారు. అధునాత టెక్నాలజీ సాయంతో రాజధానిని హైటెక్ నరగంగా మార్చేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవనంలో అన్ని విభాగాల పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ కార్యాచరణను వివరించారు.

జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 723కి చేరుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 131 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే జోషిమఠ్‌ మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

'కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు'.. కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ఫైర్

జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనేవి కశ్మీర్ ప్రజల హక్కు అన్నారు ఒమర్ అబ్దుల్లా. అయితే వాటిని నిర్వహంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని అడుక్కోరని చెప్పారు. కశ్మీరీ ప్రజలు బిచ్చగాళ్లు కాదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు

ప్రకృతి ప్రకోపానికి కుంచించుకుపోతున్న ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ పట్టణంలో కూలిపోయే అవకాశం ఉన్న భవనాలను కూల్చివేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. రోజు రోజుకు పగుళ్లు వచ్చిన ఇళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇది విపత్తుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

10 Jan 2023

కర్ణాటక

మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం

బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులోని హెచ్‌బీఆర్ లేఅవుట్ వద్ద నిర్మాణలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

మధ్యాహ్న భోజనంలో పాము.. 30మంది విద్యార్థులకు అస్వస్థత

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఈ క్రమంలో ఆ ఆహారం తిన్న 30 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మయూరేశ్వర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా?

దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈ‌నెల 19న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలుకుతారా? లేదా? అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

10 Jan 2023

తెలంగాణ

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు

తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్‌ క్యాడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సోమేష్‌కుమార్‌ కేడర్‌ను రద్దు చేసింది. ఏపీ క్యాడర్‌కు సోమేష్‌కుమార్‌ వెళ్లాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ‌ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

10 Jan 2023

హర్యానా

ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ

హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయి జాతీయస్థాయిలో వార్తల్లో నిలిచారు. ఎక్కువ సార్లు బదిలీ అయిన అధికారిగా అశోక్ ఖేమ్కాకు పేరుంది. తన 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇది అతనికి 56వ ట్రాన్స్‌ఫర్.

ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్

విమానాల్లో ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల తరుచూ జరుగుతున్నాయి. న్యూయార్క్- దిల్లీ, దిల్లీ-పాట్నా ఘటనలు మరవకముందే.. మరోసారి ఇలాంటి వార్తే ఆలస్యంగా బయటకు వచ్చింది.

12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత

కోల్‌కతాలోని రాజర్‌హట్‌లోని బిస్వా బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో సోమవారం జరిగిన జీ20మొదటి 'గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్' సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించారు. బెంగాల్ రాష్ట్రం ప్రభుత్వం 12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించినట్లు చెప్పారు. జీడీపీని అనేక రేట్లను పెంచినట్లు వెల్లడించారు.

09 Jan 2023

దిల్లీ

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.25.25 కోట్లు చెల్లించినట్లు అధికార వర్గాలు తెలిపారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం!

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ తొలి బహిరంగ సభను నిర్వహించేందుకు అధినేత కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. వాస్తవానికి తొలి‌సభను దిల్లీలోనే ఏర్పాటు చేయాలని భావించినా.. అది సాధ్యం కాలేదు. దీంతో సభా వేదికను మార్చాలని నిర్ణయించారు.