భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశం చెల్లుబాటు అవుతుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు జడ్జీలు తీర్పు చెప్పారు. జస్టిస్ నాగరత్నం ఒక్కరే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన జడ్జిమెంట్‌ను రాశారు.

రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో మరో ఉగ్ర పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరిలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 24గంటలు గడవక ముందే రాజౌరిలో మరో పేలుడు సంభవించడంతో కశ్మీర్ లోయలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి విస్తరణపై అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. వీలైనంత త్వరలో ఏపీలో పార్టీ కార్యాలయాలన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీలో పార్టీని నడిపే నాయకుల జాబితాను ఇప్పటికే ఖరారు చేశారట. కీలక నాయకుల పేర్లు ఇప్పడు బయటకు వచ్చాయి. వీరందరూ సోమవారం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన పెద్దనోట్ల రద్దుపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. జస్టిస్ నజీర్‌, జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత.. ఈ అంశంపై దాదాపు 58 పిటిషన్లు దాఖలయ్యాయి.

చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మృతి

చంద్రబాబు సభల్లో వరుస విషాదాలు టీడీపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో మొదటి రోజు గుంటూరు వికాస్‌నగర్‌లో జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ మహిళలే. ఇటీవల కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో లోక్‌సభ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో బీజేపీలో, కేంద్ర మంత్రివర్గంలో భారీమార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. అంత కంటే ముందే.. ఈ మార్పులు, చేర్పులు చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.

2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), 2022లో పలు ప్రయోజనం చేకూర్చే సానుకూల నిర్ణయాలను తీసుకుంది. '2047 నాటికి అందరికీ బీమా' అనే దృక్పథంతో IRDAI అనేక సంస్కరణలు చేసింది.

'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

భారతీయ జనతా పార్టీ తనకు గురువులాంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాను ఎలా ఉండకూడదో , ఏ పనులు చేయకూడదో.. బీజేపీ నాయకులే తనకు శిక్షణ ఇచ్చినట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్.

2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే?

2022లో కశ్మీర్ లోయలో జరిగిన ఎన్‌కౌంటర్ల వివరాలను అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. కశ్మీర్‌‌లో మొత్తం 93 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు పేర్కొన్నారు.

31 Dec 2022

బిహార్

Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్

బిహార్‌కు చెందిన రాజు రామ్ అనే వ్యక్తి డ్రీమ్11 బెట్టింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కేవలం రూ.49లో బెట్టింగ్ పెట్టి రూ.కోటి జాక్ పాట్ కొట్టేశాడు. కొన్ని లక్షల మందిని ఓడించి మరీ.. రాజు రామ్ ఈ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు.

సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం

రైళ్లలో ప్రయాణించే మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 15,000 కోచ్‌లను సీసీ కెమెరాల నీడలోకి తేనుంది. ఇందుకోసం కేంద్రం రూ. 705 కోట్లను కేటాయించింది.

పవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనకాడటం లేదు.

30 Dec 2022

తెలంగాణ

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా 1990 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్నఅంజనీకుమార్‌కు తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.

30 Dec 2022

తెలంగాణ

న్యూఇయర్ అలర్ట్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెండ్

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 10గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

30 Dec 2022

తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో వైద్య విద్య చదివి.. అర్హత పరీక్ష రాయకుండానే.. ప్రాక్టీసు చేస్తున్న వైద్యులపై సీబీఐ గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మిగతా రాష్ట్రాల్లో 91చోట్ల సోదాలు నిర్వహించింది.

తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ

కన్నతల్లి అంత్యక్రియలు ముగిసి... రెండు గంటలు కూడా గడవలేదు, అప్పుడే విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు.

2022వ సంవత్సరం ప్రపంచ కుబేరుల లిస్ట్ లోకి గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల స్థాయికి ఎదిగారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్ టెన్‌లో ఈ ఏడాది తన సంపదను పెంచుకున్న ఏకైక వ్యక్తి కూడా అదానీ మాత్రమే.

మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ

మాల్దీవులోని భారత హైకమిషన్‌పై దాడికి ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు అబ్బాస్ ఆదిల్ రిజా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇరు దేశాలు అలర్ట్ అయ్యారు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందించారు.

2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి

భారతదేశం 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజా డేటా ప్రకారం ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది వ్యక్తులు గాయపడ్డారు. 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6% పెరిగాయి. ఏడాదిలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు 16.9%, గాయాలు 10.39%గా నమోదు అయ్యాయి.

30 Dec 2022

కేరళ

కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?

కేరళ గురువాయూర్ ఆలయ ఆస్తులపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆలయం పరిధిలో ఎన్ని రూ. కోట్ల డిపాజిట్లు ఉన్నాయి? ఎంత భూమి ఉంది? అనేది బయటి ప్రపంచానికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ విషయం బయటికి వచ్చింది.

మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్

ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబేన్(100) కన్నుమూశారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆ తర్వాత కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి

పాన్ కార్డు ఉన్నవారు తమ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తుది హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, పాన్ పనిచేయదు. PANకి లింక్ చేయబడిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను పెండింగ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ నుండి నిలిపివేయబడతాయి.

'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం

భారత ఔషధ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి తమ దేశంలో 18మంది చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ ప్రకటించిన నేపథ్యంలో.. కేంద్రం స్పందించింది. ఈ విషయంలో ఉజ్బెకిస్థాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచారణ జరుపుతున్నట్లు.. ఇప్పటికే దగ్గు సిరప్ తయారీని నిలిపివేసినట్లు తెలిపింది.

జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పని సరి చేసింది. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'

దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరిస్థితులు అనుకూలించక పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చి ఓటు వేయలేని వారు చాలా మంది ఉంటారు. అలా గ్రామాలకు వచ్చి ఓటవేయలేని వారికోసం ఎన్నికల సంఘం 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'ను తీసుకురావాలని నిర్ణయించింది.

రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు.. కేంద్రం ఏం అంటోంది?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రత విషయం ఇప్పడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీ భద్రత విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ చెబుతోంది. భారత్ జూడో యాత్ర ఈనెల 24న దిల్లీకి చేరిన సందర్భంలో.. రాహుల్ గాంధీ భద్రతపై నిర్లక్ష్యం తేటతెల్లమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇది రాజకీయంగా చర్చకు దారిసింది.

కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. తోపులాటలో 8మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరనేదానిపై వైసీపీ- టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు

దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల పంచాయితీని కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జగన్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు.

29 Dec 2022

కేరళ

ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు

అతివాద, నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం తెల్లవారుజామున కేరళ వ్యాప్తంగా సోదాలు చేపట్టింది. రాష్ట్రంలో దాదాపు 56చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది.

28 Dec 2022

కోవిడ్

కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!

జనవరి మధ్యలో దేశంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవి అని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత అనుభవాలను విశ్లేషించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నాయి.

ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు.

సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

సంక్రాంతికి ఊళ్లకు వెళ్లాలనుకునే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రెయిన్స్ నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. సకాలంలో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అదనంగా 94రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.

ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ లో అగ్ర స్థానంలో నిల్చిన అర్బన్ కంపెనీ

భారతదేశంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావంతో, గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగింది. అయినా సరే, వీరికి ఇప్పటికీ సరైన వేతనం, మిగిలిన సౌకర్యాలు అందడంలేదని తెలుస్తుంది.

'అప్పటి వరకు టీషర్ట్ మీదనే ఉంటా'.. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం దేశంలో కరోనా తర్వాత.. ఆ స్థాయిలో చర్చ జరుగుతున్నది రాహుల్ గాంధీ టీషర్ట్ పైనే. భారత్ జూడో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఆయన టీషర్ట్ ధరించే నడన సాగిస్తున్నారు. చలి చాలా ఎక్కువగా ఉండే.. ఉత్తర భారతంలో కూడా రాహుల్ టీషర్ట్ పైనే ఉదయం పాదయాత్ర చేయడాన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన కేసులో నోటీసు జారీ చేసింది. మంత్రి విడదల రజనీకి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఈ సందర్భంగా ధర్మాసనం కోరింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణం కేసు : కొచ్చర్‌ దంపతులకు సీబీఐ కస్టడీలోనూ సకల సౌకర్యాలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌లు ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే కస్టడీలో ఉన్నన్ని రోజులు వీరు ప్రత్యేక వసతులు వినియోగించుకునేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది.

27 Dec 2022

టీకా

ముక్కు ద్వారా తీసుకునే టీకా ధరను ఖరారు చేసిన భారత్ బయోటెక్.. డోసు రేటు ఎంతంటే?

దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తాను అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌ ధరను నిర్ణయించింది. సింగిల్ డోసు ధర రూ. 800గా నిర్ణయించినట్లు వెల్లడించింది. దీనికి పన్నులు అదనం అని తెలిపింది.

27 Dec 2022

కోవిడ్

కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స

చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ BF.7 వేరియంట్ దేశంలో వెలుగు చూడడంతోపాటు అంతర్జాతీయ ప్రయాణికుల్లో బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే?

కార్గో సేవల్లో ఏపీఎస్ఆర్టీసీ దూసుకుపోతోంది. సురక్షితంగా, సకాలంలో, చౌకగా గమ్యస్థానాలకు సరుకులను చేరుస్తుండటంతో కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. కార్గో సేవల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో రూ.122 కోట్ల ఆదాయంతో సత్తా చాటింది ఏపీఎస్ఆర్టీసీ.

27 Dec 2022

తెలంగాణ

ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు కీలక మలుపులు తీరుగుతోంది. తాజాగా ఈ కేసులో తదుపరి విచారణకు రావట్లేదని ఈడీకి రోహిత్ రెడ్డి చెప్పారు. తాను ఎందుకు రావట్లేదో.. మెయిల్ ద్వారా స్పష్టంగా వివరించారు.