విశాఖపట్టణం: వార్తలు

15 Sep 2023

ముంబై

ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ సమయంలో రన్‌వే నుంచి జారిపడి కుప్పకూలింది. భారీ వర్షమే దీనికి కారణంగా తెలుస్తోంది.

కోడికత్తిని అందించింది మంత్రి బొత్స మేనల్లుడే: న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు 

కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తరఫున వాదిస్తున్న లాయర్ సలీం సంచలన ఆరోపణలు చేశారు.

పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తున్నాయి.

పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల కోసం ముందుకెళ్తున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నద్ధం అవుతున్నారు.

పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ 

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కి చెందిన ఓ కానిస్టేబుల్ పాకిస్థాన్ మహిళ హనీట్రాప్ ఆపరేషన్‌కు బలయ్యాడు.

విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ మేరకు నగరంలోని ఓ మహిళా డాక్టర్ మద్యం మత్తులో కారును నడిపి ప్రమాదానికి కారణమయ్యారు.

విశాఖపట్నం జిల్లాలో ఘోరం.. బంగారం కోసం యజమాని తల్లిని హత్య చేసిన వాలంటీర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర ఘటన కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో విధులు నిర్వహస్తున్న ఓ వాలంటీర్ బంగారు గొలుసు కోసం యజమాని తల్లిని హత్య చేశాడు.

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా సూర్యుడు కనిపించకుండా పోయాడు.

విశాఖలో రియల్ దంపతుల కిడ్నాప్.. రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు

విశాఖపట్నంలో మరో కుటుంబం కిడ్నాప్‌ కు గురైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని బుధవారం సాయంత్రం ఏడుగురు వ్యక్తుల బృందం అపహరించింది.

స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం

విశాఖపట్టణంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీ అత్యాచారం ఆరోపణలపై అరెస్టయ్యారు. తనపై రెండేళ్ల నుంచి స్వామీజీ అత్యాచారానికి పాల్పడుతున్నారని రాజమహేంద్రవరానికి చెందిన 15 ఏళ్ల అనాథ బాలిక ఫిర్యాదు చేసింది.

15 Jun 2023

ఎంపీ

వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యలు కిడ్నాప్‌కు గురైన వార్త సంచలనం రేపింది.

విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు 

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలును మహబూబ్‌నగర్ వరకు పొడిగించనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే (ఈసీఓఆర్) ప్రకటించింది.

09 May 2023

వైజాగ్

విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి

విశాఖపట్టణంకు దశాబ్దాల చరిత్ర ఉంటుంది. ఈ చరిత్రను తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.

 హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం

హైదరాబాద్ - వైజాగ్ ను కలుపుతూ నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) శరవేగంగా చేపడుతోంది.

పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్ 

ఆంధ్రప్రదేశ్‌లో పాస్ పోర్ట్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలో విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఇక నుంచి శనివారం కూడా పని చేయనున్నాయి.

19 Apr 2023

వైజాగ్

 వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ చేతులు కలిపారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం 

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌గా పిలిచే రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని శుక్రవారం కేంద్రం స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్

అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన ఒడిశాలోని బైలాదిలా మైనింగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని అన్నారు.

10 Apr 2023

వైజాగ్

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేలం పాటలో బిడ్ వేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు.

విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక

విశాఖపట్నంలోని గంగవరంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన ఘటన శనివారం వెలుగుచూసింది.

30 Mar 2023

ఏలూరు

ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 'దురంతో ఎక్స్‌ప్రెస్‌' రైలు గురువారం తెల్లవారుజామున ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలంలో ఈ ఘటన జరగడంతో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లు ఆరు గంటలకు పైగా ఆలస్యంగా వెళ్లాయి.

సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో విశాఖపట్నంలోని వాల్తేరు డివిజిన్ అత్యుత్తమంగా నిలిచినట్లు భారతీయ రైల్వే తెలిపింది.

విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన

విశాఖపట్నం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్థరాత్రి ఘోరం జరిగింది. మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?

ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, శ్రీకాకులం, విజయనగరం) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు.

ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించడానికి తుఫాన్ ముంచుకొస్తుంది. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్క్‌కు 65 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైస్పీడ్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే రైల్వైశాఖ మొదలు పెట్టింది. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం

2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు

విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజైన శనివారం దాదాపు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి. 13కంటే ఎక్కువ రంగాలలో 260 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లో 50,000 కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని, రిటైల్ వ్యాపారం ద్వారా రాష్ట్రంలో తయారైన ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహిస్తుందని చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.

వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు

విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు ఇతర దిగ్గజ కంపెనీల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్: విశాఖలో హైడ్రోజన్ హబ్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ పరిసరాల్లో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు అనుమతులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు.

మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా?

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.

2024 ఎన్నికల్లో జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో 2024లో ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పునరుద్ఘాటించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని కూడా వెల్లడించారు. తాను అసెంబ్లీ కంటే వైజాగ్‌ లోక్‌సభ సీటుకే ప్రాధాన్యత ఇస్తానని లక్ష్మీనారాయణ ప్రకటించారు.

ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది.

విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాస్పత్రుల దయనీయ స్థితికి అద్దం పట్టే సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగింది. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వైద్యలు, సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా చంటిబిడ్డ మృతదేహంతో దాదాపు 120 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించారు తల్లిదండ్రులు.

విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్

విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్ర్‌టన్‌ ఎరీనాలో 'గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌' ప్రారంభమైంది. గురువారం, శుక్రవారం జరగనున్న ఈ ఈవెంట్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాల ఆవిష్కరణలపై చర్చించనున్నారు. ఉదయం 10గంటలకు సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు.

15 Feb 2023

తెలంగాణ

తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన రైలు నెం.12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. బీబీనగర్- ఘట్‌కేసర్ మధ్య ఈ ఘటన జరిగింది.

మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..

ఆంధ్రప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంబులెన్స్‌కు డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భూజలపై మోసుకుంటూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నఇంటికి బయలుదేరాడో ఓ భర్త.

ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్!

ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని ఇటీవల నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు.

మునుపటి
తరువాత