అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

16 Jan 2023

నేపాల్

నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే!

నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానంలో ఉన్న ఐదుగురు భారతీయుల్లో ఒకరు ఫేస్‌బుక్ లైవ్‌లో ఫ్లైట్ గ్లాస్ నుంచి అందాలను చూపించారు. అయితే ఆ లైవ్ ప్రారంభమైన సెకన్లకే విమానం కుప్పకూలి.. అందులో మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాలు ఫేస్ బుక్ లైవ్‌లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో తీసిన వ్యక్తిని యూపీకి చెందిన జైస్వాల్‌గా గుర్తించారు.

ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు

ఇండోనేషియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ప్రస్తుతం అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించింది.

16 Jan 2023

నేపాల్

నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 72మంది ప్రయాణిస్తున్న నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 15మంది విదశీయులు మరణించినట్లు నేపాల్ పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది.

సుడిగాలుల బీభత్సం: అమెరికాలో ఆరుగురు, జార్జియాలో ఒకరు దుర్మరణం

అమెరికాకు ఆగ్నేయం వైపు ఉన్న రాష్ట్రాలు, దేశాల్లో సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు సుడిగాలల ధాటికి ఏడుగురు చనిపోయగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వందల ఇళ్లు నేలకొరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

బ్రెజిల్: బోల్సోనారో మద్దతుదారుల 'మెగా నిరసన' అట్టర్ ప్లాప్

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో మద్దతుదారులు మరో విధ్వంసానికి ప్లాన్ చేయగా.. అది అట్టర్ ప్లాప్ అయ్యింది. బోల్సొనారోను తిరిగి అధ్యక్షుడిని చేసేందుకు మెగా నిరసనలో భారీగా పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా ఆందోళనకారులు పిలుపునిచ్చారు.

నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ

నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దని ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది.

స్కూళ్లు, కాలేజీల్లో బాలికల నిషేధంపై మాటమార్చిన తాలిబాన్లు

అఫ్గానిస్థాన్‌లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో బాలికల విద్యపై తాలిబాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బాలికల విద్యను శాశ్వతంగా నిషేధించలేదని చెప్పింది. తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొంది.

అమెరికాను వణికిస్తున్న భారీ వర్షాలు.. కాలిఫోర్నియాను వీడుతున్న ప్రజలు

మొన్నటి వరకు మంచుతుపానుతో అల్లాడిపోయిన అమెరికా ప్రజలను ఇప్పుడు భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌తో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో కుండపోత వర్షాలు, బలమైన గాలులతో ప్రజలు వణికిపోతున్నారు.

పాకిస్థాన్‌కు తాలిబాన్ల భయం.. అఫ్గాన్ శరణార్థుల బహిష్కరణ

పాకిస్థాన్‌కు తాలిబాన్ల భయం వెంటాడుతోంది. దేశానికి తాలిబాన్ ముప్పు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అఫ్గాన్ నుంచి వచ్చిన శరణార్థులపై పాక్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బతుకుదెరువుకోసం అఫ్గనిస్థాన్ నుంచి వచ్చిన వలసదారులను బహిష్కరిస్తోంది. గత మూడు రోజుల్లో 600 మందికి పైగా అఫ్గాన్ పౌరులను దేశం నుంచి వెళ్లగొట్టింది.

10 Jan 2023

ఇరాన్

హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి

హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న మరో ముగ్గురికి ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. హిజాబ్ ఆందోళనల్లో పాల్గొంటున్న నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ అణిచివేతపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బ్రెజిల్‌లో విధ్వంసం: అధ్యక్ష భవనం తలుపు బద్ధలుకొట్టి బోల్సొనారో మద్దతుదారులు బీభత్సం

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. అమెరికాను మించి.. నిరసనకారులు బీభత్సం చేశారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా గద్దె దిగిపోవాలని డిమాండ్ చేస్తూ.. అధ్యక్ష భవనం, పార్లమెంట్, సుప్రీంకోర్టులోకి దూసుకెళ్లారు.

బ్రిటన్ రాజకుటంబంలో రచ్చ: కుక్క తినే ప్లేట్‌పైకి ప్రిన్స్ హ్యారీ ని తోసేసిన అన్న విలియం!

బ్రిటన్ రాజకుటుంబంలో జరిగిన మరో సంచలన విషయం బయటికి వచ్చింది. ప్రిన్స్ హ్యారీ, విలియం మధ్య జరిగిన ఘర్షణనను అంతర్జాతీయ మీడియా సంస్థ 'ది గార్డియన్' రాసుకొచ్చింది.

05 Jan 2023

ప్రపంచం

మరో 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌

ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 18వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటించారు.

560 మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు 20ఏళ్ల జైలు శిక్ష

560 శవాలకు చెందిన అవయవాలను అక్రమంగా విక్రయించిన ఘటన ఆమెరికాలోని కొలోరాడోలో వెలుగుచూసింది. ఈ కేసులో ఓ మహిళకు 20ఏళ్లు, ఆమె తల్లికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది.

04 Jan 2023

చైనా

ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా

చైనాలో కరోనా విరవిహారం చేస్తోంది. దీంతో ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించిన జాబితాలో ఉన్నాయి.

పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర!

పాకిస్థాన్ మిలటరీపై ఆ దేశ రిటైర్ట్ ఆర్మీ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ హనీట్రాప్‌కు పాల్పడుతోందని చెప్పారు. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ.. అందంగా ఉండే నటీమణులను ఎగదోస్తుందంటూ తన వీడియో వ్లాగ్‌లో చెప్పుకొచ్చారు. ఈ హనీ ట్రాప్‌లో ప్రముఖ పాకిస్థానీ హీరోయిన్ సాజల్ అలీ పేరు కూడా చెప్పినట్లు వార్తలు రావడం గమనార్హం.

పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్

దాయాది దేశం పాకిస్థాన్‌ కుట్రలను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఎత్తిచూపారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు. పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే చాలా చిన్నపదం అవుతుందని, అంతకు మించిన కఠిన పదాన్ని వాడాల్సి ఉంటుందన్నారు.

03 Jan 2023

గూగుల్

మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు

టెక్ సంస్థలు మళ్ళీ వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే USలోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఈసారి కోతలు మరింత ఎక్కువగా ఉండచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్

క్రిప్టోకరెన్సీ ప్రధాన డెవలపర్‌లలో ఒకరైన బిట్‌కాయిన్ ల్యూక్ డాష్జర్ కు ఈ కొత్త సంవత్సరం అంతగా కలిసిరాలేదు. అతని క్రిప్టో వాలెట్ హ్యాక్ దాడికి గురైంది, అతని వ్యక్తిగత హోల్డింగ్స్ నుండి 216.93 బీట్ కాయిన్ల నష్టానికి దారితీసింది. ఒక్కో బీట్ కాయిన్ ధర $16,570 (దాదాపు రూ. 13.7 లక్షలు)గా ఉంది. అంటే, $3.6 మిలియన్లు (దాదాపు రూ. 30 కోట్లు) నష్టపోయారు.

ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా?.. ఆరోజే తుది నిర్ణయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా ? అనే అంశాన్ని పరిశీలించేందుకు మాతృ సంస్థ 'మెటా' సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. జనవరి 7న ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మెటా యాజమాన్యం చెప్పింది.

02 Jan 2023

ప్రపంచం

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. లిక్కర్‌పై పూర్తస్థాయిలో పన్ను రద్దు.. ఎక్కడో తెలుసా?

అద్భుతమై ప్రదేశాలకు నెలవైన దుబాయ్‌కు పర్యాటకుల తాకిడి నిత్యం ఉంటుంది. అయితే దేశ పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు.. నూతన సంవత్సరం వేళ.. ఆ దేశ రాజ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

జైలుపై తుపాకులతో రెచ్చిపోయిన సాయుధులు.. 14మంది మృతి

మెక్సికో జుయారెజ్ నగరంలోని జైలుపై గుర్తులు తెలియని సాయుధులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 14మంది మృతి చెందగా.. 13 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. చనిపోయిన వారిలో 10మంది భద్రతా సిబ్బంది, నలుగురు ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ దాడి నేపథ్యంలో దాదాపు 24మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు వివరించారు.

మాజీ పోప్ బెనెడిక్ట్ అస్తమయం.. న్యూఇయర్ వేళ విషాదంలో క్యాథలిక్‌లు

క్యాథలిక్‌ల మత గురువు, మాజీ పోప్ బెనెడిక్ట్-16(95) కన్నుమూశారు. శనివారం ఉదయం 9:34 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని వాటికన్‌ ప్రతినిధి మాటియో బ్రూనీ తెలిపారు. బెనెడిక్ట్ పార్థీవదేహం సెయింట్ పీటర్స్ బసిలికాలో సోమవారం నుంచి ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పారు.

చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ

చైనాలో కరోనా విజృంభిస్తోంది. దీంతో బీజింగ్‌పై ఆంక్షలు విధించే దేశాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యూకే, ఫ్రాన్స్, భారత్ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించిన జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలో చైనాలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలపై తాజాగా నివేదికలను అందించాలని చైనాను డబ్య్లూహెచ్ఓ కోరింది.

'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్

ఏ చిన్న అవకాశం వచ్చినా.. పాక్, చైనాపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. తాజాగా సైప్రస్‌లోని ప్రవాస భారతీయలను ఊద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్, చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం

ఉక్రెయిన్ యుద్ధం, బలమైన డాలర్, ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రూడ్ దిగుమతిదారు చైనా నుండి డిమాండ్ తగ్గడం వలన చమురు ధరలు శుక్రవారం పెరిగాయి.

29 Dec 2022

చైనా

కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు

చైనాలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒమిక్రాన్ బీఎఫ్.7తో ఉక్కిరిబిక్కరి అవుతున్న బీజింగ్‌లో ఇప్పుడు.. ఔషధార కొరత ఏర్పడింది. మహమ్మారి నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చైనీయులు భారతీయ ఔషధాలను ఆశ్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో అవి లభ్యం కాకపోవడంతో.. బ్లాక్ మార్కెట్ కొని మరీ.. వినియోగిస్తున్నారు.

హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం

ఫార్మా దిగ్గజం హెటిరో మరో మైలు రాయిని అధిగమించింది. ఆ సంస్థ తయారు చేసిన కరోనా ఔషధం 'నిర్మాకామ్' ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ప్రీక్వాలిఫికేషన్ గుర్తింపు లభించింది. కరోనా రోగులకు అందించే.. ఫైజర్‌కు చెందిన పాక్స్‌లోవిడ్‌ ఔషధానికి 'నిర్మాకామ్' అనేది జెనరిక్‌ ఔషధం.

దక్షిణ కొరియాలో సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధం ఎత్తివేత.. పిల్లల ఆకారంలోని డాల్స్ పై మాత్రం..!!

ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దక్షిణ కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్

ఒకవైపు కరోనా పీడ తొలగకముందే.. మరోవైపు కొత్త వైరస్‌లు పుట్టుకురావడం, పాతవి తిరిగి ప్రభావాన్ని చూపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాలో 'మెదడు తినే అమీబా' వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురువుతున్నాయి.

ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'

క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఒకవైపు యుద్ధం చేస్తూనే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి ఫోన్ చేశారు.

26 Dec 2022

ప్రపంచం

నేపాల్ కొత్త ప్రధానిగా 'ప్రచండ' ప్రమాణ స్వీకారం

నేపాల్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాని షేర్ బహదుర్ దేవ్​బా తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. కొత్త ప్రధానిగా సీపీఎన్-మావోయిస్టు సెంటర్ పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' సోమవారం ప్రమాణ స్వీకారం. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలితో పాటు చిన్న పార్టీల మద్దతుతో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

26 Dec 2022

కోవిడ్

కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు.. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు

చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ BF.7 వేరియంట్ విజృంభణతో చైనాలో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి . ముఖ్యంగా పట్టణాల్లో అయితే... కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒక్కో ప్రావిన్స్‌లో లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. షాంఘై సమీపంలోని పెద్ద పారిశ్రామిక ప్రావిన్స్ అయిన ఒక్క జెజియాంగ్‌లోనే రోజుకు 10లక్షలు నమోదవుతుండటం గమనార్హం.

26 Dec 2022

ప్రపంచం

మంచు తుపాను ఎఫెక్ట్: 34 మందిని మృతి.. అంధకారంలో లక్షల మంది

మంచు తుపానుతో అమెరికా అల్లాడిపోతోంది. మైనస్ 40డిగ్రీల ఉష్టోగ్రతలతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు... శీతల గాలుల కారణంగా అగ్రరాజ్యంలో 34మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలోని 60శాతం జనాభాపై ఈ తుపాను ప్రభావం పడింది.

24 Dec 2022

ప్రపంచం

అమెరికా విదేశాంగ శాఖ అత్యున్నత పదవిలో భారత సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవిని కట్టబెట్టాడు. భారతీయ మూలాలున్న రిచర్డ్ వర్మను అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ డిప్యూటీ సెక్రటరీగా నామినేట్ చేశారు.

మైక్రో సాఫ్ట్ పై 60 మిలియన్ యూరోల జరిమానా విధించిన వాచ్ డాగ్

యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పై 60 మిలియన్ల జరిమానా విధించినట్లు ఫ్రాన్స్ ప్రైవసీ సంస్థ వాచ్‌డాగ్ తెలిపింది.

22 Dec 2022

ప్రపంచం

సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌‌ విడుదలకు కారణం అదేనట!

సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీం‌కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నరహంతకుడిని ఎలా విడదుల చేస్తారంటూ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆ దేశ చట్టం ప్రకారమే చార్లెస్ శోభరాజ్‌ విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మంచి ప్రవర్తనతో 75శాతం జైలు శిక్షను పూర్తి చేసిన ఖైదీలను విడుదల చేయొచ్చని ఆ దేశ చట్టం చెబుతోంది.

22 Dec 2022

కోవిడ్

ఈ చైనా సింగర్ చాలా క్రేజీ.. న్యూఇయర్ కోసం కరోనా అంటించుకుందట..

కరోనా కేసులతో చైనా అల్లాడిపోతంది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఓ చైనీస్ సింగర్ మాత్రం కరోనా పట్ల వింతగా ప్రవర్తించింది. అందరూ కరోనాకు దూరంగా ఉంటుంటే.. చైనాకు చెందిన ప్రముఖ గాయని, పాటల రచయిత జేన్ జాంగ్ మాత్రం కరోనాను కావాలనే అంటించుకుంది.

21 Dec 2022

ఓటిటి

ట్రంప్ కు ఎదురుదెబ్బ... మద్దతుగా US ప్యానల్

మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పన్ను రిటర్న్‌లను రక్షించుకోవడానికి తీవ్రంగా పోరాడారు. అయినా ఫలితం లేకుండా పోయింది. US అధ్యక్షులు దశాబ్దాలుగా తమ పన్ను రిటర్న్‌లను విడుదల చేయడం లేదు.

14 Dec 2022

ఓటిటి

2008 తర్వాత పుట్టిన వారు సిగరెట్ కొంటే నేరమట.. ఎక్కడో తెలుసా?

న్యూజిలాండ్ తమ దేశ ప్రజల భవిష్యత్ కోసం చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది. తమ దేశ కొత్త తరాన్ని ధూమపానానికి పూర్తిగా దూరం చేసేందుకు స్మోక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ రెగ్యులేటేడ్ ప్రొడక్ట్స్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మునుపటి
తరువాత