అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలటరీ ఫోర్స్ మంగళవారం అరెస్టు చేసింది.

09 May 2023

అమెరికా

క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే 

ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని, తరగతి గదిలో ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఉపాధ్యాయుడిపై రెండుసార్లు పెప్పర్ స్ప్రే చేసింది. అమెరికా టెన్నెస్సీలో ఆంటియోక్‌లోని ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు 

అమెరికా టెక్సాస్‌లోని అలెన్‌లో శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) రద్దీగా ఉండే మాల్‌లో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు.

05 May 2023

భూకంపం

జపాన్ లో భారీ భూకంపం.. పరుగుల తీసిన జనం

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ వెల్లడించింది.

రష్యా ప్రతినిధిపై చేయి చేసుకున్న ఉక్రెయిన్ ఎంపీ.. జెండా లాక్కున్నాడని పిడిగుద్దులుE

ఉక్రెయిన్, రష్యా మధ్య రోజు రోజుకూ ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ బిల్డింగ్ పై డ్రోన్లు తిరగడంతో రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచింది.

సెర్బియాలో మళ్లీ పేలిన తుపాకీ.. దుండగుడి కాల్పులో 8 మంది మృత్యువాత

సెర్బియా రాజధాని సమీపంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం అర్ధరాత్రి రాజధాని బెల్ గ్రేడ్ సమీపంలోని పట్టణంలో 21 ఏళ్ల అనుమానితుడు కాల్పులు జరిపాడు.

కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే! 

మే 6వ తేదీన లండన్‌లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుక‌ను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ఉత్సవం కోసం బ్రిటన్ రాజవంశం అంతా సిద్ధమైంది.

03 May 2023

బ్రిటన్

కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం

బ్రిటన్ కింగ్ చార్లెస్- III పట్టాభిషేకం వేళ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తూటాల కలకలం రేగింది. షాట్‌గన్ కాట్రిడ్జ్‌లను ప్యాలెస్ మైదానంలోకి విసిరిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా మరో మహిళ ట్రంప్‌పై లైంగిక ఆరోపణలు చేశారు.

కాళీ దేవతపై ఉక్రెయిన్ అనుచిత ట్వీట్; భారతీయులకు క్షమాపణలు చెప్పిన ఆ దేశ మంత్రి 

కాళీ దేవత చిత్రాన్ని వక్రీకరిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్‌కు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎమిన్ ఝపరోవా ట్వీట్ చేశారు.

01 May 2023

సిరియా

సిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన 

సిరియాలో డేష్/ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కీలక నాయకుడు అబూ హుస్సేన్ అల్-ఖురాషీని హతమార్చినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు.

28 Apr 2023

అమెరికా

అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు

శిక్షణ ముగించుకుని తిరిగి వస్తున్న అమెరికాకు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు అలస్కాలో గురువారం కూలిపోయాయి.

'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత

మూడు దశాబ్దాల క్రితం డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేశారని అమెరికాకు చెందిన రచయిత జీన్ కారోల్ న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.

కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం

కిలో గంజాయిని స్మగ్లింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తిని బుధవారం సింగపూర్ ప్రభుత్వం ఉరితీసింది.

లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం

లండన్‌లో జగన్నాథుడి ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆలయాన్ని నిర్మాణం కోసం ఒడిశా మూలాలున్న ప్రవాస భారతీయుడు 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

తాలిబన్ చేతిలో కాబూల్‌ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం 

2021లో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక సూత్రదారి అయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాలిబాన్ హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా ధృవీకరించింది.

ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు 

ఇండోనేషియాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపానికి పశ్చిమాన 7.3తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చినట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) తెలిపింది.

సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు 

పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ అత్త మహ్ జబీన్ నూన్, ప్రతిపక్ష పార్టీ పీటీఐ న్యాయవాది ఖవాజా తారిఖ్ రహీమ్ భార్య రఫియా తారిక్ మధ్య జరిగిన ఫోన్ కాల్ లీకైంది.

24 Apr 2023

సూడాన్

సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ

సూడాన్ జరుగుతున్న సాయుధ పోరాటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆవేదన వ్యక్తం చేసింది. సూడాన్ వివాదంలో 413 మంది మరణించారని పేర్కొంది.

హైస్కూల్ పార్టీలో కాల్పులు; 9మంది యువకులకు గాయాలు 

అమెరికా టెక్సాస్‌లోని జాస్పర్‌లో జరిగిన ప్రోమ్ పార్టీలో కాల్పుల కలకలం రేగింది. ఈఘటనలో 9మంది యువకులు గాయపడ్డారు.

లక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా?

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించింది.

21 Apr 2023

అమెరికా

అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి 

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి తుపాకీ కాల్పులకు బలయ్యాడు.

21 Apr 2023

రష్యా

సొంత నగరంపైనే రష్యా యుద్ధవిమానం దాడి; డ్యామిట్ ఎలా జరిగింది? 

ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు వెళ్తున్న రష్యా యుద్ధవిమానం అనుకోకుండా సొంత నగరంపై దాడి చేసింది.

రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి 

యెమన్ రాజధాని సనాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 85మంది మరణించారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

19 Apr 2023

బ్రిటన్

యూకేలో భారతీయం; సంబల్‌పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ 

యూకేలో ఒడిశాకు చెందిన ఓ మహిళ చేసిన ఫీట్ ఆకట్టుకుంది. 41 ఏళ్ల మధుస్మిత జెనా దాస్ భారతీయ సంప్రదాయ సంబల్‌పురి చేనేత చీరను ధరించి మాంచెస్టర్‌లో 42.5కి.మీ మారథాన్‌లో నడిచింది.

సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు 

చైనా మిలిటరీ ధ్వని కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఎత్తైన గూఢచారి డ్రోన్‌ను త్వరలో మోహరించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ మంగళవారం రాసుకొచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు

ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి ముంబై, దిల్లీ, హైదరాబాద్‌కు చోటు దక్కింది.

18 Apr 2023

సిరియా

అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం

ఉత్తర సిరియాపై అమెరికా జరిపిన హెలికాప్టర్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతమయ్యాడు.

17 Apr 2023

అమెరికా

అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి

దక్షిణ అమెరికా రాష్ట్రమైన అలబామాలో 'స్వీట్ 16' పార్టీ మారణహోమంగా మారింది. పుట్టినరోజు వేడుకల్లో సామూహిక తుపాకీ కాల్పులు జరిగాయి.

14 Apr 2023

అమెరికా

అమెరికాలో దారుణం: టెక్సాస్‌ ఫామ్‌లో భారీ పేలుడు; 18,000పైగా ఆవులు మృతి 

అమెరికాలోని టెక్సాస్‌లో ఘోరం జరిగింది. సౌత్‌ఫోర్క్ డైరీ ఫామ్స్‌లో భారీ పేలుడు సంభవించింది.

జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా గురువారం జపాన్ తూర్పు సముద్రం వైపు పేరు తెలియని సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీని ధృవీకరించింది.

అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ 

భారతదేశం నుంచి అదనపు మానవతా సహాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ లేఖ రాశారు. ఈ విషయాన్ని బుధవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి

మయన్మార్ మిలిటరీ జుంటా పౌరులపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో పిల్లలు, విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు. మయన్మార్ మిలిటరీని 'జుంటా' పిలుస్తారు.

11 Apr 2023

రష్యా

బద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా 

రష్యాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన 'షివేలుచ్' మంగళవారం బద్ధలైంది. అగ్నిపర్వతం విస్ఫోటనానికి లావా ఎగిసిపోడుతుంది.

బ్యాంకులో తుపాకీతో రెచ్చిపోయిన ఉద్యోగి; ఐదుగురు దుర్మరణం 

అమెరికా కెంటుకీలోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు ఉద్యోగి తుపాకీతో రెచ్చిపోయాడు. బ్యాంకులో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు వెల్లడించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్; రూ.122.6 కోట్లకు అమ్మకం; గిన్నిస్ రికార్డు

ప్రతి కారుకు నంబర్ ప్లేట్ ఉంటుంది. ఇది వాహనం గుర్తింపును సూచిస్తుంది. అయితే రూ.వేలు వెచ్చించి తీసుకునే లైసెన్స్ ప్లేట్‌ను ఓ కారు యజమాని రూ.లక్షలు కాదు, కొన్ని రూ. కోట్లు వెచ్చించి దక్కించుకున్నారు.

08 Apr 2023

అమెరికా

'అబార్షన్ మాత్ర' వినియోగంపై అమెరికా కోర్టులు ఒకేరోజు వేర్వేరు తీర్పులు

అమెరికాలోని టెక్సాస్, వాషింగ్టన్‌లోని ఫెడరల్ న్యాయమూర్తులు 'అబార్షన్ మాత్ర'పై శుక్రవారం ఒకేరోజు భిన్న తీర్పులు ఇవ్వడం సంచలనంగా మారింది.

ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు

జెరూసలేంలోని అల్-అక్సా మసీదు వద్ద జరిగిన ఘర్షణల అనంతరం లెబనాన్‌, ఇజ్రాయెల్ దేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

వాతావరణ మార్పులతో విజృంభిస్తున్న డెంగ్యూ, చికున్‌గున్యా; 129 దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ

దోమల ద్వారా సంక్రమించే ఆర్బోవైరస్‌ల వల్ల కలిగే డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.

మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో భూమిపై ఉష్ణగ్రతలో నమైదైనట్లు ఈయూ వాతావరణ పర్యవేక్షణ ఏజెన్సీ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ గురువారం తెలిపింది.