అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

పాకిస్థాన్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు రంగం సిద్ధం; నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహిళా జడ్జిని బెదిరించినందుకు ఇమ్రాన్ ఖాన్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు లాహోర్ చేరుకున్నారు.

13 Mar 2023

చైనా

వచ్చే వారం రష్యాకు జిన్‌పింగ్; జెలెన్‌స్కీ- పుతిన్ మధ్య సంధి కుదురుస్తారా?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ మాస్కోకు వెళ్లనున్నట్లు సమాచారం.

ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి

దిల్లీ నుంచి దోహా‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన 6ఈ-1736 మెడికల్ ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. అయితే విమానం విమానాశ్రాయానికి చేరుకునే లోపే నైజీరియన్‌కు చెందిన ప్రయాణికుడు మరణించినట్లు వైద్య బృందం ప్రకటించింది.

13 Mar 2023

అమెరికా

అమెరికాలో మరో బ్యాంకు మూసివేత; బాధ్యులను వదిలి పెట్టబోమని బైడెన్ ప్రకటన

అమోరికాలో మరో బ్యాంకు మూతపడింది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభాన్ని మరువకముందే సిగ్నేచర్ బ్యాంకును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

11 Mar 2023

అమెరికా

కరోనా మూలాల గుట్టు విప్పే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం; బైడెన్ వద్దకు ఫైల్

పదిలక్షల కంటే ఎక్కువ మంది అమెరికన్లను పొట్టనపెట్టున్న కరోనా వైరస్ మూలాలను తెలుసుకునే కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

10 Mar 2023

భూమి

భూమిపై సూర్యుడి పుట్టుకకంటే ముందే నీరు ఆవిర్భావం

సౌర వ్యవస్థలో సూర్యుడు ఏర్పడక ముందు నుంచి నీటి మూలాలు ఉన్నట్లు అమెరికాలోని నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

10 Mar 2023

జర్మనీ

చర్చిలో తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు- ఏడుగుగు దుర్మరణం

జర్మనీలోని హాంబర్గ్‌లోని ఓ చర్చిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

10 Mar 2023

చైనా

చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ 3వ సారి ఎన్నిక- పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం

షీ జిన్‌పింగ్ శుక్రవారం చైనా అధ్యక్షుడిగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిన్‌పింగ్‌ను చైనా అధ్యక్షుడిగా కొనసాగించేందుకు పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుపడ్డ రష్యా- ఆరుగురు పౌరులు మృతి

ప్రజలు నిద్రిస్తున్న సమయంలో గురువారం రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణుల ధాటికి కీవ్ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రష్యా దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందారు.

09 Mar 2023

ప్రపంచం

దాతృత్వం కోసం 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించిన జాక్సన్

ఆస్ట్రేలియన్ ఫిట్‌నెస్ అభిమాని జాక్సన్ ఇటాలియన్ ఒక స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లను పూర్తి చేయడం ద్వారా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పారు. వ్యాయామాలలో కష్టమైనవి పుల్-అప్‌లు. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడానికి వ్యాయామం చేయడానికి చాలా శక్తి అవసరం. ఎలాంటివారైనా 100 చేయగలరు. అయితే, 24 గంటల్లో 8,008 పుల్-అప్‌లు చేయడం అనేది మామూలు విషయం కాదు.

పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్

పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ధరమ్ దేవ్ రాతి అనే డాక్టర్ మంగళవారం తన ఇంట్లోనే అతని డ్రైవర్ చేతిలో హత్యకు గురయ్యాడు. డ్రైవర్ కత్తితో డాక్టర్ గొంతు కోశాడని పోలీసులు పాకిస్థాన్ వార్తా సంస్థ ది నేషన్‌కు తెలిపారు.

ఇంట్లో నిర్బంధించి, తిండి పెట్టకుండా 1000 కుక్కలను చంపేసిన వృద్ధుడు

తిండి పెట్టకుండా, కడుపు మాడ్చి దాదాపు 1000 కుక్కుల చావుకు కారణమయ్యాడు ఓ వృద్ధుడు. దక్షిణ కొరియాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లోని ఓ ఇంట్లో వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.

07 Mar 2023

రష్యా

భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా

భారతదేశం-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంత దృఢమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం వీసా విధానాన్ని సడలించి, సరళీకృతం చేయబోతున్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో రష్యా వెళ్లాలలనుకునే భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

టీవీ ఛానళ్లలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని నిషేధించిన పాకిస్థాన్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ

పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చింది. ఆయన ప్రసంగాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

06 Mar 2023

ఇరాన్

50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం

ఇరాన్‌లో పాఠశాల విద్యార్థినులపై జరుగుతున్న విషప్రయోగాలు దేశంలో కలకలం రేపుతున్నాయి.

హౌస్ పార్టీలో కాల్పులు: ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

జార్జియాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. డగ్లస్ కౌంటీలో 100మందికిపైగా యువకులు గుమిగూడిన హౌస్ పార్టీలో కాల్పులు జరపడంతో శనివారం ఇద్దరు వ్యక్తులు, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

04 Mar 2023

రష్యా

Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య

రష్యన్ కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో విశేషంగా కృషి చేసిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. అతడిని బెల్ట్‌తో గొంతుకోసి హత్య చేసినట్లు రష్యా మీడియా కథనాలు శనివారం తెలిపాయి.

04 Mar 2023

చైనా

మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా

చైనా తన రక్షణ వ్యయాన్ని భారీగా పెంచవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఆ దేశ పార్లమెంటు ప్రతినిధి శనివారం స్పందించారు. చైనా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాంగ్ చావో పేర్కొన్నారు.

04 Mar 2023

అమెరికా

'క్యాపిటల్‌'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్

జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో మద్దతు పలికారు. ఈ మేరకు నిరసనకారులకు సపోర్టు చేస్తూ ట్రంప్ 'జస్టిస్ ఫర్ ఆల్' అనే పాటను పాడటం గమనార్హం.

కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు

చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్టీ డిపార్ట్‌మెంట్ ఆరోపించిన నేపథ్యంలో బీజింగ్ దాన్ని తిరస్కరించింది. శుక్రవారం ఈ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్ చికిత్స; ఛాతి నుంచి చర్మం తొలగింపు

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఛాతి వద్ద క్యాన్సర్ సోకినట్లు శుక్రవారం వైట్‌హౌస్ వైద్యులు ప్రకటించారు. ఫిబ్రవరిలో అధ్యక్షుడి ఛాతీ నుంచి క్యాన్సర్ కణజాలాన్ని తొలగించనట్లు వైట్ హౌస్ వైద్యుడు కెవిన్ సీఓ కానర్ చెప్పారు. దీన్ని బేసల్ సెల్ కార్సినోమా అని అంటారని, ఇది ఒక రకమైన క్యాన్సర్ వెల్లడించారు.

ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన

జెనీవీవ్ లెర్మిట్ అనే మహిళ ఫిబ్రవరి 28, 2007న తన ఐదుగురు కన్న బిడ్డలను హత్య చేసిన ఘటన అప్పట్లో బెల్జియంలో సంచలనం రేపింది. దాదాపు 16ఏళ్ల ఆ మహిళ అనాయాసంగా(కారుణ్య) మరణించారని ఆమె తరఫు న్యాయవాది గురువారం వెల్లడించారు.

03 Mar 2023

దుబాయ్

ఒక రాత్రికి రూ.1కోటి; ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రిసార్ట్ విశేషాలను తెలుసుకుందామా

లగ్జరీ కట్టడాలకు పేరుగాంచిన దుబాయ్ మరో అత్యద్భుత రిసార్టును అందుబాటులోకి తెచ్చింది. అందులో ఒక రాత్రి గడపాలంటే రూ.లక్షలు కూడా సరిపోవంటే అది ఎంత లగ్జరీగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.

సిడ్నీ: ఆస్ట్రేలియాలో పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి

ఆస్ట్రేలియాలో సిడ్నీలో పోలీసుల కాల్పుల్లో ఓ భారతీయుడు మృతి చెందాడు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో క్లీనర్‌ను కత్తితో పొడిచి, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను బెదిరించినందుకు భారతీయుడిని ఆస్ట్రేలియా పోలీసులు కాల్చి చంపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అతను బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ చెప్పింది.

01 Mar 2023

గ్రీస్

రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు

గ్రీస్‌లోని టెంపేలో కార్గో రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 26 మంది మరణించారు. ఈ ప్రమాదంలో దాదాపు కనీసం 85 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. మంగళవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షలకు ముగింపు పలికిన హాంకాంగ్‌

ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షల నుంచి బంధ విముక్తులవుతున్నాయి. సుదీర్ఘ కరోనా కాలానికి ఇక ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో తమ దేశంలో సుదీర్ఘ కాలంగా అమలు చేస్తున్న మాస్క్ ఆంక్షలను తొలగిస్తున్నట్లు హాంకాంగ్‌ ప్రకటించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్‌ను హతమార్చిన తాలిబాన్ దళాలు

అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్ భద్రతా దళాలు ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. మూడో వ్యక్తిని అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.

27 Feb 2023

కోవిడ్

The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి చైనాలో జరిగిందని మరో పరిశోధన తేల్చి చెప్పింది. చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు రిపోర్డును 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించింది.

26 Feb 2023

కెనడా

Ontario Gurudwara Committee: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడుల వెనుక భారత నిఘా సంస్థల హస్తం: ఓజీసీ

కెనడాలో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన విషయంలో అంటారియో గురుద్వారా కమిటీ(ఓజీసీ) సంచలన ఆరోపణలు చేసింది.

రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి శుక్రవారం(ఫిబ్రవరి 24) నాటికి ఏడాది పూర్తయ్యింది. ఈ క్రమంలో ఇప్పటికైనా రష్యా యుద్ధాన్ని ఆపేసి ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానించారు. అయితే రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఓటింగ్‌లో భారత్- చైనా దూరంగా ఉన్నాయి.

పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి

పాలస్తీనాలోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఫ్లాష్‌పాయింట్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు బుధవారం జరిపిన దాడిలో కనీసం నలుగురు ముష్కరులు, నలుగురు పౌరులతో సహా 11మంది పాలస్తీనియన్ల చనిపోయారు. 100మందికిపైగా గాయపడినట్లు అధికారులు చెప్పారు.

భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోంది: బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన బ్లాగ్ 'గేట్స్ నోట్స్'లో భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంత పెద్ద సమస్యలు ఉత్పన్నమైనా పరిష్కరించగలదని భారత్ నిరూపించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న వేళ, భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోందని చెప్పారు.

23 Feb 2023

భూకంపం

వరుస భూకంపాలతో అల్లాడిపోయిన తజికిస్థాన్‌; విరిగిపడ్డ కొండచరియలు

వరుస భూకంపాలతో తజకిస్థాన్ వణికిపోయింది. తూర్పు తజికిస్థాన్‌లో 6.8, 5.0, 4.6 తీవ్రతలతో వెంట వెంటనే భూమి కంపించడంతో ప్రజలు అల్లాడిపోయారు.

స్వలింగ జంటకు హక్కులను గుర్తిస్తూ హైకోర్టు సంచలన తీర్పు

దక్షిణ కొరియా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆ దేశంలో తొలిసారిగా స్వలింగ సంపర్కానికి చట్టబద్ధతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

22 Feb 2023

నేపాల్

నేపాల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం; కూలిన భవనాలు

నేపాల్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేపాల్‌లోని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మానిటరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఎన్ఈఎంఆర్‌సీ) పేర్కొంది. బజురా జిల్లాలోని బిచియా చుట్టూ భూమి కంపించినట్లు వెల్లడించింది.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి వక్తి వివేక్ రామస్వామి

భారతీయ సంతతికి చెందిన మల్టీ-మిలియనీర్ బయోటెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి (37) 2024 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించారు.

22 Feb 2023

వీసాలు

వీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యత: అమెరికా

భారతీయులకు వీసాలు జారీ అంశంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. వీసాల జారీ విషయంలో భారత్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పింది. కరోనా తర్వాత దేశవ్యాప్తంగా వీసా ప్రాసెసింగ్‌ సుమారు 36 శాతం పెరిగినట్లు పేర్కొంది.

21 Feb 2023

రష్యా

'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రహస్య పర్యటనపై రష్యా స్పందించింది. బైడెన్ తమ నుంచి భద్రతా పరమైన హామీని అందుకున్న తర్వాతే ఉక్రెయిన్‌కు బయలుదేరినట్లు రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ చెప్పారు.

ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన

యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని సందర్శించి ప్రపంచదేశాలను ఆశ్చర్యపరిచారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఆయన ఉక్రెయిన్‌కు ఎప్పుడు వెళ్లారు? ఎలా వెళ్లారు? అనేది ఎవరికీ తెలియదు. అంతా రహస్యంగానే సాగింది. రష్యా కళ్లుగప్పి ఆ రహస్య పర్యటన ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

21 Feb 2023

భూకంపం

టర్కీలో మరోసారి వరసుగా రెండు భూకంపాలు; అదనపు సాయానికి ముందుకొచ్చిన ఐక్యరాజ్య సమితి

టర్కీలోని దక్షిణ హటే ప్రావిన్స్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల ధాటికి ముగ్గురు మృతి చెందగా, 213 మంది గాయపడినట్లు టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని సులేమాన్ తెలిపారు.