అంతర్జాతీయం వార్తలు | పేజీ 2

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా

అమెరికా మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా 'గూఢచారి' బెలూన్‌‌ను శనివారం అగ్రరాజ్య బలగాలు కూల్చేశాయి. అయితే ఆ బెలూన్ శిథిలాలను తిరిగి చైనాకు అప్పగించేది లేదని తాజాగా అమెరికా ప్రకటించింది.

07 Feb 2023

టర్కీ

టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం

టర్కీ, సిరియాలో భూకంపం ప్రళయం సృష్టించింది. శక్తిమంతమైన భూకంపాల ధాటికి 4300మందికిపైగా మృతి చెందినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.

బంగ్లాదేశ్‌లో 12హిందూ దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం

ప్రపంచ దేశాల్లో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.

06 Feb 2023

టర్కీ

టర్కీలో 7.8 తీవ్రతతో భారీ భూకంకం, భవనాలు నేలకూలి 90 మంది మృతి

టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు చెప్పారు. శక్తిమంతమైన ప్రకంపనాలకు గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని అనేక భవనాలు నెలమట్టం కాగా, 53మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1'

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' వెల్లడించింది. ఈ సంస్థ 'గ్లోబల్ లీడర్ అప్రూవల్' పేరుతో చేసిన సర్వేలో 78 శాతం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీని ఆమోదించినట్లు పేర్కొంది.

వికీపీడియాను బ్యాన్ చేసిన పాకిస్థాన్, కంటెంట్‌పై అభ్యంతరాలు

దాయాది దేశం పాకిస్థాన్ వికీపీడియాను బ్లాక్ చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉన్నందునే బ్యాన్ చేస్తున్నట్లు పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) వెల్లడించింది.

మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను గుర్తించిన అమెరికా, డ్రాగన్ వ్యూహం ఏంటి?

మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను అమెరికా గుర్తించింది. లాటిన్ అమెరికా గగన తలంలో ఈ బెలూన్ కనిపించిందని పెంటగాన్ తెలిపింది.

అమెరికా అణు ప్రయోగ కేంద్రంపై చైనా 'గూఢచారి' బెలూన్‌, పెంటగాన్ అలర్ట్

అమెరికాలో చైనా భారీ సాహసానికి ఒడిగట్టింది. మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగన తలంలోకి 'గూఢచారి' బెలూన్‌‌ను పంపి చైనా అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయాన్ని అమెరికా సీనియర్ రక్షణ అధికారి ఒకరు నిర్ధారించారు.

02 Feb 2023

కెనడా

కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని పార్లమెంట్‌లో ఖండించిన భారత సంతతి ఎంపీ చంద్ర

కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అంశాన్ని కెనడా పార్లమెంట్‌లో లేవనెత్తారు.

పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు

పాకిస్థాన్‌లో పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతను దాటి, బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడంటే ఇందులో ఇంటి దొంగల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా చారిత్రాక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా 5డాలర్ల నోటుపై బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II బొమ్మను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆమె ఫొటో స్థానంలో దేశ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త డిజైన్‌తో కరెన్సీ నోటు తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు!

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులో నిఘా కోసం అమెరికా నుంచి అత్యాధునిక 30 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసే అంశంపై భారత్ కొంతకాలంగా అగ్రరాజ్యంతో చర్చలు జరుపుతోంది.

ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ క్రమంలో రష్యా సేనలను ధీటుగా ఎదుర్కోవడానికి, ఉక్రెయిన్ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఆధునిక ట్యాంకులు, యుద్ధ విమానాలను సాయం చేయాలని మిత్ర దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.

Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి

పాకిస్థాన్‌‌లో దారుణం జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగి 25మంది మృతి చెందగా, మరో 120 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని వాయువ్య నగరం పెషావర్‌లో మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ సంఘటన జరిగింది.

30 Jan 2023

బ్రిటన్

నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను చంపేస్తానని బెదిరించారని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. యూకేపై క్షిపణిని వదలడానికి తనకు ఒక నిమిషం మాత్రమే పడుతుందని పుతిన్ హెచ్చిరినట్లు జాన్సన్ వెల్లడించారు. బీబీసీ రూపొందించిన 'పుతిన్ v ది వెస్ట్' అనే మూడు భాగాల డాక్యుమెంటరీలో ఈ సంచలన విషయాలను వెల్లడయ్యాయి.

28 Jan 2023

చైనా

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విమానాల విన్యాసాలు

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌక కదలికలతో చైనా మండిపడుతోంది. రెండు వారాల క్రితం దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా అతిపెద్ద యుద్ధనౌక 'నిమిట్జ్‌' వచ్చింది. తాజాగా డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లను దక్షిణ చైనా సముద్రంలో ఆగ్రరాజ్యం ప్రదర్శించింది. దీంతో చైనా అగ్గిలం మీద గుగ్గిలం అవుతోంది.

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జనవరి 12 నుంచి 23 మధ్య మెల్‌బోర్న్‌లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. భారత్‌పై వ్యతిరేక భావజాలంతో 74వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడులు చేశారు.

అమెరికా దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ సీనియర్ లీడర్ సహా 11మంది హతం

ఉత్తర సోమాలియా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఐసీస్ సీనియర్ లీడర్‌తో పాటు మరో 10మంది మృతి చెందారు.

న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం

లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్కిన్స్ న్యూజిలాండ్ 41వ ప్రధానమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జెసిండా ఆర్డెర్న్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో క్రిస్ హిప్కిన్స్‌కు అవకాశం వచ్చింది.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం!

రష్యాతో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ వీరోచితంగా పోరాడుతోంది. పుతిన్ సేనలను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అధునాతన భారీ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా, జర్మనీ దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికా, జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయం రష్యాతో యుద్ధాన్ని పునర్మిస్తుందని ఉక్రెయిన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

బీబీసీ డాక్యుమెంటరీ: 'భారత్- అమెరికా భాగస్వామ్య విలువలు గురించి మాత్రమే తెలుసు'

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ విషయం ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే దీనిపై యూకే స్పందించగా, సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించారు.

కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ

కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ దేశాలకు సూచించింది. 2022లో కలుషితమైన దగ్గు సిరప్‌లు తాగి అనేక మంది చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరిక జారీ చేసింది.

అమెరికా: మరో మూడు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు, 9మంది మృతి

తుపాకీ గర్జనలతో మరోసారి అమెరికా ఉలిక్కి పడింది. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే మరో మూడు ప్రాంతాల్లో తుపాకుల మోత మోగింది.

ఉద్యోగులు చేసిన తప్పిదం వల్లే విమానాలు నిలిచిపోయాయి: ఎఫ్ఏఏ

జనవరి 11న అమెరికా వ్యాప్తంగా వేలాది విమానాలు నిలిచిపోవడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తీవ్ర విమర్శలను ఎందుర్కొంది. ఈ పరిణామంపై విచారణ చేపట్టిన ఎఫ్ఏఏ, ఆరోజు మిమానాలు నిలిచిపోవడానికి గల కారణాలను తాజాగా వెల్లడించింది.

కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో తుపాకీ మోత, 10 మంది మృతి

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌ మాంటెరీ పార్క్‌లో జరిగిన చైనీస్ లూనార్ న్యూ ఇయర్ పార్టీలో ఓ 72 ఏళ్ల వృద్ధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఈ కాల్పుల్లో 10మంది అక్కడిక్కకడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

21 Jan 2023

బ్రిటన్

సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా

సీటు బెల్ట్ లేకుండా కారులో ప్రయాణించినందుకు ప్రధానమంత్రి రిషి సునక్‌కి యునైటెడ్ కింగ్‌డమ్ పోలీసులు జరిమానా విధించినట్లు బీబీసీ తెలిపింది. కదులుతున్న కారులో సీటుబెల్టు ధరించనందుకు అతనికి 50ఫౌండ్ల జరిమానా విధించారు. ఈ సందర్భంగా రిషి సునక్‌కు క్షమాపణలు చెప్పారు. జరిమానా చెల్లిస్తానని పేర్కొన్నారు.

న్యూజిలాండ్ కొత్త ప్రధాని: జెసిండా ఆర్డెర్న్ స్థానంలో 'క్రిస్ హిప్‌కిన్స్' ఎన్నిక

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా ప్రస్తుతం ఆ దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్న క్రిస్ హిప్‌కిన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. పోటీలో హిప్‌కిన్స్ ఒక్కరే ఉండటం వల్ల ఆయన ఎంపిక దాదాపు ఖరారైనట్లే. అధికార లేబర్ పార్టీ సమావేశంలో హిప్‌కిన్స్‌ను అధికారంగా ప్రకటించనున్నారు.

అబ్దుల్ రెహ్మాన్ మక్కీ: 'అల్-ఖైదాతో సంబంధాలు లేవు, బిన్ లాడెన్‌ను ఎప్పుడూ కలవలేదు'

ఐఎస్‌ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(యూఎన్ఎస్సీ) ఇటీవల గుర్తించింది. అయితే దీనిపై తాజాగా అబ్దుల్ రెహ్మాన్ మక్కీ స్పందించారు. అల్-ఖైదాతో గాని, ఇస్లామిక్ స్టేట్‌తో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని మక్కీ చెప్పారు. ఈ మేరకు ఒక వీడియోలో విడుదల చేశారు.

అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం

హైదరాబాద్‌లో జన్మించిన కాట్రగడ్డ అరుణా మిల్లర్ అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. నవంబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలిగా అరుణ చరిత్ర సృష్టించారు.

సింగపూర్: భారతీయ సంతతి మహిళ ఛాతిపై తన్ని, జాతి వివక్ష వ్యాఖ్యలు

సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మహిళ జాతి వివక్షకు గురైంది. అయితే అది ఇప్పుడు కాదు. 2021లో ఈ ఘటన జరిగింది. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

జెసిండా ఆర్డెర్న్: న్యూజిలాండ్ ప్రధాని సంచలన ప్రకటన, వచ్చే నెలలో పదవికి రాజీనామా

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెలలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మళ్లీ తాను ప్రధాని రేసులో ఉండనని ఈ సందర్భంగా ప్రకటించారు.

అప్ఘానిస్థాన్: దొంగతనానికి పాల్పడిన నలుగురి చేతులను నరికేసిన తాలిబన్లు

అప్ఘానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం దారుణానికి ఒడిగట్టింది. దొంగతనాలతో పాటు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలను అమలు చేస్తోంది. తాజాగా కాందహార్‌లో దొంగతనానికి పాల్పడిన తొమ్మిది మందికి కఠిన శిక్షను అమలు చేసింది.

బ్రేకింగ్ న్యూస్: ఉక్రెయిన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్, మంత్రి సహ 16మంది మృతి

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. కిండర్ గార్టెన్ సమీపంలో ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ మంత్రితో పాటు మొత్తం 16మంది మృతి చెందారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు.

భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా

భారతీయులకు వీసాలను ఎక్కువ సంఖ్యలో, వేగంగా జారీ చేసేందుకు అమెరికా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దౌత్య కార్యాలయాల్లో నియామకాలను రెట్టింపు చేయాలని భావిస్తోంది. అది కూడా భార్య భర్తలను నియమించాలని అమెరికా కృషి చేస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.

సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ప్రముఖ ఫ్రెంచ్ నన్ లూసిల్ రాండన్ మంగళవారం కన్నుమూశారు. ఫ్రాన్స్‌లోని టౌలాన్ నగరంలో 118 సంవత్సరాల వయస్సులో వయసు సంబంధిత సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు రాండన్ కుటుంబ సభ్యులు తెలిపారు.

భారత్‌తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంపై ఇప్పుడు పొరుగుదేశంతో శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

17 Jan 2023

నేపాల్

నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం

నేపాల్‌ విమాన ప్రమాదం నేపథ్యంలో మృతదేహాల కోసం అన్వేషిస్తున్న క్రమంలో రెండు బ్లాక్ బాక్స్‌లను సిబ్బంది గుర్తించారు. వాటిని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులకు అప్పగించారు. ఈ విషయాన్ని యతి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. బ్లాక్ బాక్స్‌లోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ప్రమాదానికి గల కారణాలను గుర్తించడంలో ఉపయోగపడుతాయి.

17 Jan 2023

చైనా

ఆరు దశబ్దాల తర్వాత మొదటిసారి తగ్గిన చైనా జనాభా

1961 తర్వాత అంటే.. గత ఆరు దశాబ్దాల కాలంలో మొదటిసారి చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది. 2021తో పోలిస్తే.. 2022లో జనాభా తగ్గినట్లు ఆ దేశ గణాంకాల విభాగం పేర్కొంది. చైనాలో ప్రస్తుతం 141.75కోట్ల జనాభా ఉన్నట్లు ప్రకటించింది.

మార్టిన్ లూథర్ కింగ్ డే: ఇరువర్గాలు పరస్పరం కాల్పులు, 8మందికి గాయాలు

అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్ పియర్స్‌లో 'మార్టిన్ లూథర్ కింగ్ డే' ఈవెంట్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇరు వర్గాలు మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(యూఎన్ఎస్సీ) గుర్తించింది. ఐఎస్‌ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో ఐరాస చేర్చింది.