అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

06 Apr 2023

కెనడా

కెనడాలో మరో దేవాలయంపై హిందూ వ్యతిరేకుల అక్కసు

కెనడాలోని విండ్సర్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి ఘటన సంఘటన వెలుగులోకి వచ్చింది.

ట్రంప్‌కు 1,20,000 డాలర్లు చెల్లించాలని పోర్న్‌స్టార్ డేనియల్స్‌‌ను ఆదేశించిన అమెరికా కోర్టు

పోర్ట్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు మంగళవారం కాలిఫోర్నియాలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు షాకిచ్చింది. పరువు నష్టం కేసులో ఓడిపోయినందున డొనాల్డ్ ట్రంప్‌కు 1,20,000డాలర్లు చెల్లించాలని డేనియల్స్‌ను ఆదేశించింది.

'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు హష్ మనీ చెల్లింపులతో సహా 36 నేరారోపణలలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం( అమెరికా కాలామానం ప్రకారం) అరెస్టు అయ్యారు.

04 Apr 2023

అమెరికా

భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన

భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న కంటి చుక్కల మందు(ఐడ్రాప్స్‌)పై అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నేడు కోర్టుకు హాజరుకానున్న ట్రంప్; న్యూయార్క్‌లో హైటెన్షన్

'హష్ మనీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ లోని మాన్‌హట్టన్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన నేతల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ 1

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌లను వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవతరించారు.

Hush money case: న్యూయార్క్ జడ్జి నన్ను ద్వేషిస్తున్నారు: డొనాల్డ్ ట్రంప్

'హష్ మనీ' కేసులో ఆరోపణలను ఎందుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత 'ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్' వేదికగా డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ కోర్టు జడ్జిపై సంచలన కామెంట్స్ చేశారు.

స్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి?

స్టార్మీ డేనియల్స్ ఒకప్పటి పాపులర్ పోర్న్ స్టార్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమెకు రహస్య సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో స్టార్మీ డేనియల్స్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. అసలు స్టార్మీ-ట్రంప్ వ్వవహారం ఏంటి? ఇద్దరు శారీరకంగా ఎక్కడ కలుసుకున్నారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి చూద్దాంం.

'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి

'హష్ మనీ' కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉచ్చు బిగుస్తోంది. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

30 Mar 2023

అమెరికా

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవ ఎన్నిక!

ప్రపంచ బ్యాంక్ తదుపరి చీఫ్‌గా మాస్టర్‌కార్డ్ మాజీ సీఈఓ, భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖారారైంది.

30 Mar 2023

వీసాలు

వేలాది మంది భారతీయ టెక్కీలకు గుడ్‌న్యూస్; H-1B వీసాపై అమెరికా కోర్టు కీలక తీర్పు

వేలాది మంది భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభించింది. H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు యునైటెడ్ స్టేట్స్‌లో పని చేయవచ్చని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో హెచ్-1బీ వీసా హోల్డర్లు సంతోషం వ్యక్తం చేశారు.

30 Mar 2023

చిలీ

53ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్; చిలీలో మొదటి కేసు గుర్తింపు

బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకదనే అపోహ ఇన్నాళ్లూ ఉండేది. అయితే అది తప్పని తేలింది. తాజాగా చిలీ దేశంలో ఓ మనిషిలో బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించారు.

కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి!

భారత్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కోవిడ్-19 వ్యాక్సిన్ సిఫార్సులను సవరించింది. కరోనా కొత్త దశను అరికట్టడంతో పాటు అధిక జనాభాలో రోగనిరోధక శక్తిని పెంపొందేలా ఈ సవరణలను ప్రతిపాదించింది.

29 Mar 2023

భూకంపం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు

అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో బుధవారం ఉదయం భూకంపం సభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

'అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలి'; సైన్యానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు

ఇప్పటికే వరుస బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలతో హడలెత్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, తన సైన్యానికి మంగళవారం కీలక ఆదేశాలు చేశారు. అణ్వాయుధాల నిల్వలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించనట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) పేర్కొంది.

రాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్టు కేసును తాము నిశితంగా పరిశీలిస్తోందని, అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు.

28 Mar 2023

అమెరికా

తుపాకులతో స్కూల్‌పై విరుచుకుపడ్డ యువతి; ఆరుగురు మృతి; బైడెన్ విచారం

అమెరికాలో దారుణం జరిగింది. ఓ యువతి మూడు అత్యాధునిక తుపాకులతో టేనస్సీ రాష్ట్రం నాష్‌విల్లేలోని ఒక ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్‌లో విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా మొత్తం ఆరుగురు మరణించారు.

న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్

ఇజ్రాయెల్‌లో రక్షణమంత్రి యోవ్ గల్లంట్‌ను తొలగించడం, న్యాయ విధానంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డేక్కారు.

27 Mar 2023

బ్రిటన్

'రాహుల్ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికం'; లండన్‌లో కాంగ్రెస్ నిరసన

లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం!

ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఏడాది దాటినా ఉక్రెయిన్‌ను రష్యా దళాలు స్వాధీనం చేసుకోలేకపోయాయి. ఈ క్రమంలో త్వరలో మాస్టర్ ప్లాన్‌తో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రష్యా భావిస్తోంది.

25 Mar 2023

అమెరికా

శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం ప్రవాస భారతీయులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కాన్సులేట్‌ భవనం వెలుపల గుమిగూడి భారత్‌కు సంఘీభావంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.

25 Mar 2023

అమెరికా

భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం

లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెట్టి భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా నియమితులయ్యారు. అమెరికా కాలామానం ప్రకారం శుక్రవారం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సమక్షంలో కొత్త రాయబారిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్, అతని మద్దతుదారులపై నమోదైన కేసులు విచారణకు ఉన్నత స్థాయి సంయుక్త దర్యాప్తు బృందం(జేఐటీ)ను ఏర్పాటు చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

22 Mar 2023

భూకంపం

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి పాకిస్థాన్‌లో 11మంది మృతి చెందినట్లు ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

AIని ఉపయోగించి గతం నుండి సెల్ఫీలను రూపొందించిన కళాకారుడు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందిన చిత్రాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఇప్పుడు ఒక కళాకారుడు ఈ టెక్నాలజీని గతంలో ఉన్నవారితో సెల్ఫీలను సృష్టించడానికి ఉపయోగించారు.

అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా నాలుగు దేశాల్లో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలు

ఖలిస్థానీ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్‌కు కోసం పంజాబ్ పోలీలులు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నాలుగు రోజులుగా అమృతపాల్ సింగ్‌ కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో అమృతపాల్‌కు మద్దతుగా ఖలిస్థానీ సానుభూతిపరులు వివిధ దేశాల్లో ఆందోళనలు చేస్తున్నారు.

ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'

గ్లోబల్ వార్మింగ్‌(ఉపరితల ఉష్ణోగ్రతలు)పై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ప్రపంచదేశాలను హెచ్చరించింది. వాతావరణ మార్పులపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఐపీసీసీ పెంపొందిస్తుంది.

20 Mar 2023

బ్రిటన్

లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం

ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ అరెస్టు కోసం పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన గాలింపునకు నిరసనగా లండన్‌లో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్థానీ మద్దతుదారులు వీరంగం సృష్టించారు.

19 Mar 2023

భూకంపం

ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం

శనివారం ఈక్వెడార్, ఉత్తర పెరూ తీరప్రాంతాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో కనీసం 14 మంది చనిపోయారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం (USGS) 6.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం గుయాస్ ప్రావిన్స్‌లోని బాలావో నగరానికి 10 కిమీ (6.2 మైళ్లు) దూరంలో 66.4 కిమీ (41.3 మైళ్లు) దగ్గర సంభవించింది.

ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌కు ప్రమాదం; పాక్ మాజీ ప్రధాని కారు సేఫ్

ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్‌లోని వాహనం శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. అయితే ఇమ్రాన్ వెళ్తున్న కారు సురక్షితంగా ఉండటంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని పాకిస్థాన్ మీడియా తెలిపింది.

వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వబోతున్నారని వైట్‌హౌస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఐసీసీ వారెంట్: పుతిన్ ఎప్పుడు అరెస్టు అవుతారు? నిపుణులు ఏం అంటున్నారు?

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పుతిన్ నిజంగా అరెస్టు అవుతారా? ఒకవేళ అరెస్టు అయితే ఎవరు అరెస్టు చేస్తారు?

పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్

ఉక్రెయిన్- రష్యా యుద్ధం భీకరంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా తిరుగుబాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌తో పాటు మరో రష్యా అధికారికి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

17 Mar 2023

కోవిడ్

ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు

ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ఏ దేశంలో కూడా ఈ కొత్త వేరియంట్‌ కేసులు నమోదు కాలేదు.

16 Mar 2023

ప్రపంచం

మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం

తుఫాను, వరదలు ఆగ్నేయ ఆఫ్రికా దేశం మలావిని కుదిపేసిన తరువాత ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచ దేశాల మద్దతు కోసం విజ్ఞప్తి చేశారు. తుఫాను మూడు వారాల కంటే తక్కువ వ్యవధిలో రెండవసారి ఆఫ్రికన్ తీరంలో విధ్వంసం సృష్టించింది. రెండు వారాల జాతీయ సంతాప దినాలుగా అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటించారు మా వద్ద ఉన్న వనరుల కంటే ఇక్కడ మేము ఎదుర్కొంటున్న విధ్వంసం స్థాయి చాలా ఎక్కువని ఆయన తెలిపారు.

వెనుదిరిగిన పోలీసులు; గ్యాస్ మాస్క్ ధరించి బయటకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్

తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో లాహోర్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారు. అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడాటానికి ఇమ్రాన్ జమాన్ పార్క్ ఇంటి నుంచి బయటికు వచ్చారు. ఆయిన గ్యాస్ మాస్క్ ధరించి బయటకు రావడం గమనార్హం.

15 Mar 2023

అమెరికా

నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేసిన రష్యా ఫైటర్ జెట్లు

అమెరికా నిఘా డ్రోన్ ప్రొపెల్లర్‌ను నల్ల సముద్రంపై రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టింది. దీంతో తమ MQ-9 రీపర్ డ్రోన్‌ నీటిలో కూలిపోయినట్లు అగ్రరాజ్యం తెలిపింది

'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం

అరుణాచల్‌ప్రదేశ్-చైనా మధ్య సరిహద్దుపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని అగ్రరాజ్యం పేర్కొంది.

రణరంగంగా మారిన ఇమ్రాన్ ఖాన్ ఇల్లు; మద్దతుదారులపై బాష్పవాయువు ప్రయోగం

తోషాఖానాతో పాటు జడ్జిని బెదిరించిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు, బలగాల మధ్య పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తల మధ్య కొన్ని గంటలుగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌: హెలికాప్టర్‌పై వేలాడుతూ ఒక నిమిషంలో 32 పుల్ అప్స్

ఆర్మేనియాకు చెందిన అథ్లెట్ అరుదైన ఘనత సాధించాడు. హమాజాస్ప్ హ్లోయన్ అనే వ్యక్తి హెలికాప్టర్‌ స్కిడ్‌లపై వేలాడుతూ 1నిమిషంలో 32 పుల్ అప్స్ సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.