అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

హవాయి: అమెరికా గగనతలంలో మరో 'స్పై బెలూన్'- చైనా పైనే అనుమానాలు

అమెరికా హవాయిలోని హోనోలులు గగనతలంలో పెద్ద తెల్లటి బెలూన్ కనిపించినట్లు కనిపించింది. ఇటీవల చైనాకు చెందిన పలు స్పై బెలూన్లను అమెరికా బలగాలు పేల్చేసిన కొద్దిరోజుల తర్వాత, ఇది తాజాగా దర్శనమివ్వడం గమనార్హం.

20 Feb 2023

విమానం

IATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు

ప్రపంచదేశాల్లో కరోనా ఆంక్షలు తొలగిపోయిన నేపథ్యంలో దేశీయ విమానాల ప్రయాణాలు గణనీయంగా పెరిగినట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో దేశీయంగా విమానాల్లో ప్రయాణించే సంఖ్య భారీగా పెరిగినట్లు పేర్కొంది.

ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ కష్టకాలంలో ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని నిర్ణయించారు. అలాగే ఉక్రెయిన్‌పై దమనకాండకు దిగిన రష్యాపై మరన్ని ఆంక్షలు విధించాలని జీ7 దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు.

పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి

పాకిస్థాన్‌లో పోలీస్ కార్యాలయంపై మరోసారి ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) శుక్రవారం రాత్రి దాడి చేసింది. దీని ఫలితంగా ఒక పౌరుడు, ఆర్మీ రేంజర్, ఇద్దరు పోలీసు అధికారులు సహా నలుగురు మరణించారు.

అమెరికా: మిస్సిస్సిప్పిలో తుపాకీ గర్జన; ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంటీలో శుక్రవారం వరుస కాల్పుల నేపథ్యంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులన్ని అర్కబుట్ల కమ్యూనిటీలోనే జరిగినట్లు వెల్లడించారు.

18 Feb 2023

భూకంపం

భూకంపం: 11రోజులుగా శిథిలాల కింద సజీవంగా ముగ్గురు; టర్కీ, సిరియాలో 45,000 దాటిన మరణాలు

టర్కీ, సిరియాలో 11రోజలు కింద సంభవించిన భారీ భుకంపాల ధాటికి ఇప్పటి వరకు 45,000 మందికి పైగా మరణించారు. 40కిపైగా వచ్చిన ప్రకంపనల వల్ల వేలాది భవనాలను నేలమట్టం అయ్యాయి. దాదాపు 2,64,000 అపార్ట్‌మెంట్లు పోయాయి. గడ్డకట్టే చలిలోనూ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

అమెరికా ప్రెసిడెంట్ బిడ్‌ కు సిద్దపడుతున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక ప్రత్యేకత సంతరించుకోనున్నాయి. ప్రెసిడెంట్ రేసులో భారత సంతతికి చెందిన కొందరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. వారిలో మిలియనీర్ వివేక్ రామస్వామి ఒకరు.

17 Feb 2023

ప్రపంచం

ఎయిర్ న్యూజిలాండ్ ప్లేన్: 16గంటలు గాల్లోనే ప్రయాణం చేసి వెనక్కి వచ్చేసిన ఫ్లైట్

ఎయిర్ న్యూజిలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన ఫ్లైట్ NZ2, న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుండి అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కి బయలు దేరింది.

17 Feb 2023

చైనా

చైనాకు సారీ చెప్పను.. అమెరికా అధ్యక్షుడు

ఇటీవల అమెరికా గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బెలూన్ ఘటన అమెరికా, చైనా సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద హైడ్రామా

లాహోర్‌లోని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద హై డ్రామా జరిగింది. అతన్ని అరెస్టు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారంటూ వందలాది మంది పిటిఐ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

రైలులో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి; ఉగ్రవాదుల పనేనా?

పాకిస్థాన్‌లోని క్వెట్టా వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం పేలుడు సంభవించడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు గాయపడినట్లు వెల్లడించారు. రైలు చిచావత్ని రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు.

పాక్‌లో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు; లీటరు పెట్రోల్ రూ.272, డీజిల్ రూ.280

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసింది ప్రభుత్వం.

16 Feb 2023

భూకంపం

సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదు

ఫిలిప్పీన్స్‌లో గురువారం భూకంపం సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో మాస్బేట్ ప్రాంతంలో భారీ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు

2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ నిలబడబోతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని కూడా ఇప్పటికే అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ క్రమంలో వైట్ హౌస్ కీలక ప్రకటన విడుదల చేసింది.

టెక్సాస్‌ షాపింగ్ మాల్‌లో కాల్పులు; ఒకరు మృతి

అమెరికా టెక్సాస్‌లోని సీలో విస్టా మాల్‌లో బుధవారం సాయంత్రం దుండగులు తుపాకీతో రెచ్చిపోయాడు. నలుగురిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు.

న్యూజిలాండ్ తీరంలో భారీ భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదు

సైక్లోన్ సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోకముందే న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రత నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ధృవీకరించింది. ఈ భూకంపం వెల్లింగ్‌టన్ సమీపంలోని లోయర్ హట్‌కు వాయువ్యంగా 78 కి.మీ దూరంలో సంభవంచినట్లు వెల్లడించింది.

15 Feb 2023

కెనడా

కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

కెనడాలోని మిస్సిసాగాలోని రామమందిరంపై కొందరు దుంగడులు దాడి చేశారు. దీంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యతిరేక భావం జాలం ఉన్న వారే ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఉక్రెయిన్ మిత్రదేశం 'మోల్డోవా'పై తిరుగుబాటుకు పుతిన్ ప్లాన్; అమెరికా ఆందోళన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోల్డోవా దేశంపై తిరుగుబాటుకు కుట్ర పన్నారని వచ్చిన ఆరోపణలపై అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎబోలాను పోలిన వైరస్: ఈక్వటోరియల్ గినియాలో 9మంది మృతి; డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్

సెంట్రల్ ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియా దేశంలో ఎబోలాను పోలిన మార్బర్గ్ వైరస్ సోకి తొమ్మిది మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ప్రాణాతకమైన ఈ వైరస్ సోకడం వల్ల జ్వరంతోపాటు రక్తస్రావమై వారు మరణించినట్లు తెలిపింది.

లీటరు పాలు రూ.210, కేజీ చికెన్ రూ.1,100; ధరల పెరుగుదలతో అల్లాడుతున్న పాక్

ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల్లోనే పాల ధరలు రూ. 30 వరకు పెరిగాయి. దీంతో పాక్‌లో లీటరు పాల ధర రూ. 210కి చేరింది.

'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు

రష్యాలో నివసిస్తున్న లేదా ప్రయాణించే అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని మాస్కోలోని యూఎస్ రాయబార కార్యాలయం తెలిపింది. కొత్తగా వెళ్లే వారు కూడా రష్యాకు వెళ్లవద్దని సూచించింది. అక్రమ నిర్బంధాల కారణంగా అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా

గత కొన్నిరోజులుగా అమెరికాలో గగనతల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా గగనతలంలో అనుమానాస్పదంగా కనిపించిన గుర్తు తెలియని వస్తువును అమెరికా దళాలు కూల్చివేశాయి.

13 Feb 2023

టర్కీ

టర్కీలో 4.7 తీవ్రతతో మరో భూకంపం, 34,000 దాటిన మృతుల సంఖ్య

టర్కీలో ఆదివారం మరో భూకంపం సంభవించింది. టర్కీ, సిరియాలో సరిహద్దులో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భయంకరమైన భూకంపం వచ్చిన వారం తర్వాత ఇది సంభవించింది.

13 Feb 2023

భూకంపం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత

అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెప్పారు.

ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ఎవరు ముందుకొచ్చిన స్వాగతిస్తామని అమెరికా పేర్కొంది. అయితే భారత ప్రధాని మోదీకి మాత్రం యుద్ధాన్ని ఆపే శక్తి ఉందని వైట్ హౌస్ చెప్పింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఒప్పించగలరని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు.

11 Feb 2023

భూకంపం

టర్కీలో 8ఏళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 24వేలు దాటిన మృతులు

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీఆర్‌ఎఫ్) శుక్రవారం టర్కీ ఆర్మీ సమన్వయంతో మరొక బాలికను కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న 8ఏళ్ల బాలికను సిబ్బంది రక్షించారు.

'స్పై బెలూన్' ఎపిసోడ్: ఆరు చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన అమెరికా

చైనా 'గూఢచారి' బెలూన్ వ్యవహారాన్ని అమెరికా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా 'స్పై బెలూన్‌'‌ను కూల్చేసిన అగ్రరాజ్యం, తాజాగా ఆ దేశ కంపెనీలకు షాకిచ్చింది.

H-1Bపై అమెరికా కొత్త నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు లాభం

H-1B వీసాపై అమెరికా కొత్త ప్లాన్ అమలు చేస్తుంది దీనితో H-1B, L1 వీసాలపై వేలాది మంది విదేశీ సాంకేతిక ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో వేలాది మంది భారతీయ టెక్కీలకు ప్రయోజనం చేకూరుతుంది. పైలట్ ప్రాతిపదికన "దేశీయ వీసా రీవాలిడేషన్" కేటగిరీలు పెట్టి తర్వాత కొన్ని సంవత్సరాలలో దానిని పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.

10 Feb 2023

భూకంపం

టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ

టర్కీలో వరుసగా సంభవించిన భూకంపాల తర్వాత మూడు రోజులపాటు శిథిలాల కింద కూరుకుపోయిన 6 ఏళ్ల బాలికను స్నిఫర్ డాగ్స్ రక్షించాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్‌లో భాగమైన రోమియో, జూలీ, శిథిలాల కింద 6 ఏళ్ల నస్రీన్ ఆచూకీని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి.

ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయన్ను బ్యాన్ చేశారు. అయితే రెండేండ్ల తరువాత ఆయన అకౌంట్లకు యాక్సిస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల మాతృసంస్థ మెటా ప్రకటించింది.

10 Feb 2023

భూకంపం

పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు

సిరియాలో సోమవారం సంభవించిన భూకంపం తర్వాత జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఒక ఇంటి శిథిలాల కింద దొరికిన అప్పుడే పుట్టిన పసికందుకు పేరుతో పాటు ఒక ఇల్లు దొరికింది..

10 Feb 2023

భూకంపం

టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు

సోమవారం భారీ భూకంపం కారణంగా సిరియా, టర్కీలో 21,000 మందికి పైగా మరణించారు. విరామం లేకుండా 24 గంటలూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కానీ మంచు, వర్షం కారణంగా వారి పనికి ఆటంకం కలుగుతుంది.

10 Feb 2023

ఐఎంఎఫ్

పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐఎంఎఫ్

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మరోసారి షాకిచ్చింది. ఇప్పటికే మిత్రదేశాలు అప్పు ఇవ్వలేమని చెప్పడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్‌తో పది రోజుల నుంచి పాక్ చర్చలు జరుపుతోంది. తాజాగా ఐఎంఎఫ్‌తో పాక్ చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.

09 Feb 2023

రష్యా

రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా

రష్యా నుంచి ముడి చమురును భారత్ కొనుగోలు చేయడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్‌పై ఆంక్షలు విధించే ఉద్దేశం తమకు లేదని అమెరికాకు చెందిన ఐరోపా, యురేషియా వ్యవహారాల సహాయ కార్యదర్శి కరెన్ డాన్‌ఫ్రైడ్ తెలిపారు.

09 Feb 2023

చైనా

చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే?

చైనాలో ఇటీవల కొత్త వేరియంట్ల కారణంగా కరోనా కేసులు ఏ స్థాయిలో పెరిగాయో అందరకీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఏమైనా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయా? అనే అంశంపై ఒక పరిశోధన జరిగింది. 'ది లాన్సెట్‌'లో ఆ పరిశోధన ప్రచురితమైంది.

09 Feb 2023

భూకంపం

టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు

టర్కీ, సిరియాలో భూకంపం మరణ మృదంగాన్ని మోగిస్తోంది. గత 24గంటల్లో శిథిలాల కింద చిక్కుకున్న 7వేలకుపైగా మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. దీంతో రెండు దేశాల్లో మృతుల సంఖ్య 15,383కు చేరుకున్నట్లు టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

08 Feb 2023

చైనా

'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా

ఇటీవల అమెరికా గుర్తించిన చైనా గూఢచారి బెలూన్లపై 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన విషయాలను బయపెట్టటింది. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలే లక్ష్యంగా గూఢచారి బెలూన్ల ద్వారా చైనా రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొంది.

08 Feb 2023

టర్కీ

భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు

వరుస భూకంపాల ధాటికి టర్కీ, సిరియాలో మరణాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి 8,000 మందికిపైగా మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నారు.

టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు

టర్కీ

టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు

టర్కీలో మరో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.

కిమ్‌కు ఏమైంది? 40రోజులుగా కనపడని ఉత్తర కొరియా అధ్యక్షుడు!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై మళ్లీ ఉహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన దాదాపు 40రోజులుగా బహిరంగంగా కనిపంచకపోవడంతో అనేక అనుమానాలు రేకేత్తుతున్నాయి.