అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

02 Jun 2023

అమెరికా

అమెరికా స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి జయకేతనం

అగ్రరాజ్యం అమెరికాలో 95వ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీలు నిర్వహించారు. ఈ కాంపిటిటీషన్ లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా 230 మందిని తోసిరాజని అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.

దివాళ గండం తప్పించుకున్న అగ్రరాజ్యం.. కీలక బిల్లుకి ఉభయ సభల ఆమోదం

బాగా డబ్బున్న దేశంగా పేరుగాంచిన అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు దివాలా గండం నుంచి తప్పించుకుంది. అప్పుల పరిమితి పెంపునకు సంబంధించిన కీలక బిల్లుకి యూఎస్ ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయి.

02 Jun 2023

అమెరికా

మరోసారి స్లిప్పై కిందపడ్డ అమెరికన్ ప్రెసిడెంట్.. నవ్వులు పూయించిన జో బైడెన్ 

యూనిటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కాళ్లు తట్టుకుని తూలి కిందపడ్డారు. ఈ క్రమంలో తన కాలికేదో తగిలి కిందపడ్డానని నవ్వులు పూయించారాయన. అనంతరం ఎవరి సహకారం లేకుండానే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు బైడెన్.

కిమ్‌ను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు; బరువు 140కిలోలు, మద్యపానం, నిద్రలేమితో అవస్థలు!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆరోగ్యంపై దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కీలక విషయాలను వెల్లడించింది.

పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి 

తూర్పు పెన్సిల్వేనియాలోని ఓ ఇంటి బయట తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

31 May 2023

భూకంపం

న్యూజిలాండ్‌: ఆక్లాండ్ దీవుల్లో 6.2తీవ్రతతో భూకంపం 

న్యూజిలాండ్‌‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ తీరంలో ఎక్కువగా జనావాసాలు లేని ఆక్లాండ్ దీవులకు సమీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే బుధవారం నివేదించింది.

29 May 2023

టర్కీ

టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక 

టర్కీ అధ్యక్షుడిగా రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ఎన్నికయ్యారు.

రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు 

యూకే ప్రధానమంత్రి రిషి సునక్ అధికారిక నివాసం లండన్‌లోని 10డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఒక వ్యక్తి హల్‌చల్ చేశాడు. కారుతో ఇంటి గేట్లను వేగంగా వచ్చి ఢీకొట్టాడు.

25 May 2023

బ్రిటన్

లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం 

లండన్‌లో నిర్వహించిన వేలంపాటలో 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కత్తి భారీ ధరను పలికింది.

25 May 2023

చైనా

చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం

చైనాలో జూన్ చివరి నాటికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌ XBB విజృంభిస్తుందని, తద్వారా కేసులు భారీగా పెరుగుతాయని ఓ సీనియర్ ఆరోగ్య సలహాదారుడు చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన

ఉక్రెయిన్-రష్యా యుద్ధం గత 15నెలలుగా భీకరంగా సాగుతోంది. అయితే ఈ యుద్ధాన్ని ముగించేందుకు అండగా నిలబడాలని, తమ శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపాలని ప్రధాని మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు.

ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం 

న్యూయార్క్ నగరం ఆకాశహర్మ్యాల బరువు కారణంగా పాక్షికంగా మునిగిపోతోందని, సముద్ర మట్టం పెరుగుదలతో పాటు వరద ముప్పు వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉందని 'ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్‌'లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలింది.

మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది, ప్రపంచం సిద్ధమవ్వాలి: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక 

కరోనా కంటే ప్రమాదకర మహమ్మారి పొంచి ఉందని, ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు.

24 May 2023

అమెరికా

వైట్‌హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్ 

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వద్ద ఓ తెలుగు కుర్రాడు హల్ చల్ చేశాడు.

ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ 

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.

నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రధానికి విశేష ఆదరణ లభిస్తోంది.

భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ 

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిడ్నీలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

సిడ్నీలో ప్రధాని మోదీ అరుదైన స్వాగతం; 'వెల్‌కమ్ మోదీ' అంటూ ఆకాశంలో సందేశం

ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన స్వాగతం లభించింది.

ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే

ఆస్ట్రేలియా సిడ్నీలోని పర్రమట్టా కౌన్సిల్ లార్డ్ మేయర్‌గా భారత సంతతికి చెందిన సమీర్ పాండే కొత్త లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు.

23 May 2023

గయానా

గయానా: పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం; 19మంది విద్యార్థులు మృతి

గయానాలోని సెకండరీ స్కూల్ డార్మిటరీలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 19మంది పిల్లలు మరణించారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం 

పసిఫిక్ ద్వీప దేశాలైన ఫిజీ, పపువా న్యూ గినియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అరుదైన గౌరవం లభించింది.

మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి 

ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది రేసర్లు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.

20 May 2023

జపాన్

జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ 

జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు జపాన్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై పంజాబ్ పోలీసులు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి.

18 May 2023

అమెరికా

26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్ 

2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన వ్యాపారి తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియాలో కోర్టు తీర్పునిచ్చింది.

18 May 2023

ఇటలీ

ఉత్తర ఇటలీని ముంచెత్తిన వరదలు; 9మంది మృతి; ఫార్ములా వన్ రేసు రద్దు

ఉత్తర ఇటలీలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి 9మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ 

2023-2027 మధ్య కాలంలో అంటే వచ్చే ఐదేళ్ల కాలంలో రికార్డుస్థాయిలో ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.

సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు 

సిడ్నీలో నిర్వహించనున్న క్వాడ్ సమ్మిట్ రద్దు అయినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అలాగే క్వాడ్ నాయకుల తదుపరి చర్చలు జపాన్‌లో చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు.

17 May 2023

భూమి

ఆ మంచు కరిగిందా అంతే సంగతులు; ప్రమాదంలో మానవాళి

భూమిపై ఉన్న మానవాళి, జంతుజాలం ఎదుర్కొనే ప్రమాదకర పరిస్థితులను వివరించే పరిశోధనాత్మక కథనాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌ ప్రచురించింది.

భారతీయ వంటకానికి మస్క్ ఫిదా; ప్రశంసిస్తూ ట్వీట్ 

భారతీయ వంటకాలు, రుచులకు వేలఏళ్ల నాటి చరిత్ర ఉంది. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారడంతో విదేశాల్లోని ఫుడ్ లవర్స్ భారతీయ వంటకాలకు అభిమానులుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ కూడా చేరిపోయాడు.

విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్

జమాన్ పార్క్ వెలుపల హింస, ప్రభుత్వ సంస్థలపై ఆయన ఇచ్చిన విద్వేష పూరిత ప్రసంగానికి సంబంధించిన కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జూన్ 8, 2023 వరకు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

 అమెరికా: ట్రంప్-రష్యా వ్యవహారంలో ఎఫ్‌బీఐ ఆరోపణలను తప్పబట్టిన ప్రాసిక్యూటర్ 

2016 అమెరికాలో ఎన్నికల ప్రచారం సమయంలో అప్పటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ -రష్యా కుమ్మక్కైనట్లు ఎఫ్‌బీఐ చేసిన ఆరోపణలపై అమెరికా స్పెషల్ ప్రాసిక్యూటర్ న్యాయవాది జాన్ డర్హామ్ తన నాలుగేళ్ల విచారణను ముగించారు.

న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి 

అమెరికా న్యూ మెక్సికోలోని మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు వెల్లడించారు.

నన్ను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు 

దేశద్రోహ చట్టం కింద తనను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు పాకిస్థాన్ ఆర్మీ కుట్ర పన్నిందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు 

సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినప్పటికీ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తు అంధకారంగానే ఉందని పాకిస్థాన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

11 May 2023

ఇటలీ

ఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు 

ఉత్తర ఇటలీలోని మిలాన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అనేక వాహనాలు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి.

పాకిస్థాన్: ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులు విసిరిన ఇమ్రాన్‌ మద్దతుదారులు 

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి.

10 May 2023

బ్రిటన్

యూకే: ముగ్గురు వ్యక్తుల DNAతో శిశువు జననం

బ్రిటన్‌(యూకే)లో మొదటిసారిగా ముగ్గురు వ్యక్తుల DNAతో ఒక శిశువు జన్మించినట్లు సంతానోత్పత్తి నియంత్రణ సంస్థ ధృవీకరించింది.

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పార్టీ నాయకులు, మద్దతుదారులు ఆందోళకు దిగారు.

10 May 2023

అమెరికా

ట్రంప్‌కు ఎదురుదెబ్బ; లైంగిక వేధింపుల కేసులో కారోల్‌కు 5మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ తీర్పు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 1990లలో మ్యాగజైన్ రచయిత జీన్ కారోల్‌(79)పై ట్రంప్ లైంగికంగా వేధించాడని, ఆపై ఆమెను అబద్ధాలకోరుగా ముద్ర వేసి పరువు తీశారని అమెరికా జ్యూరీ మంగళవారం నిర్ధారించింది.