అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Earthquake: మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంప బీభత్సం.. 700కి పైగా మృతి
మయన్మార్, థాయ్‌లాండ్‌లో శుక్రవారం సంభవించిన రెండు భారీ భూకంపాలు ఈ దేశాలను తీవ్రంగా వణికించాయి. ఈ భూకంపాల ధాటికి మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
Earthquake: థాయ్‌లాండ్‌లో భూకంపం కలకలం.. భారతీయుల కోసం అత్యవసర నంబర్ ఏర్పాటు
థాయిలాండ్ లోని బ్యాంకాక్ సహా పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది.
Earthquake: భూకంపం బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు, బాధితుల ఆర్తనాదాలు (వీడియో)
మయన్మార్, థాయ్‌ల్యాండ్‌లలో సంభవించిన భూకంపం (Earthquake) తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది.
Earthquake: థాయిలాండ్, మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత
మయన్మార్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది.
Canada: అమెరికాతో పాత బంధానికి తెరపడింది.. కెనడా ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పొరుగుదేశమైన కెనడా (Canada)తో తరచూ వివాదాలు సృష్టిస్తున్నారు.
Putin: ఉక్రెయిన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే యుద్ధానికి ముగింపు : పుతిన్
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
King Charles III: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌కు మరోసారి అస్వస్థత
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III (King Charles III) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. క్యాన్సర్ చికిత్స సమయంలో ఏర్పడ్డ కొన్ని సైడ్ ఎఫెక్ట్‌ల కారణంగా ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది.
Putin: భారత్ పర్యటనకు రానున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు.
America: యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థిని అరెస్ట్.. బేడీలు వేసి తీసుకెళ్లిన వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
US visa: ఏజెంట్ల మోసాలపై అమెరికా కఠిన చర్యలు.. వేలాది వీసా అపాయింట్‌మెంట్లు రద్దు!
భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించి 2,000 వీసా (US Visa) అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు బుధవారం ప్రకటించింది.
USA war plan leak: హూతీల క్షిపణి నిపుణుడు గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్లగానే దాడి చేశాం: అమెరికా యుద్ధ ప్లాన్లు
యెమెన్‌లో హూతీ తిరుగుబాటు గ్రూపుపై మార్చి 15న జరిగిన దాడులకు సంబంధించిన కీలక యుద్ధ ప్రణాళికలను అట్లాంటిక్ పత్రిక బయటపెట్టింది.
Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం.. విదేశీ తయారీ కార్లపై 25% సుంకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
India-USA: సుంకాల విషయంలో భారత్‌పై మా వైఖరి చైనా, కెనడాలా ఉండదు: అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాల విధింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.
India: భారత నిఘా సంస్థ 'రా'పై ఆంక్షలు విధించాలని అమెరికా మత స్వేచ్ఛా కమిటీ సిఫార్సు
భారతదేశానికి (India) చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) పై అమెరికా (USA) ఆంక్షల కత్తి వేలాడుతోంది
Southkorea: దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి
దక్షిణ కొరియాలో తీవ్రంగా కార్చిచ్చు వ్యాపిస్తోంది. ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానిక అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
National Institutes of Health: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా జే భట్టాచార్య.. ధృవీకరించిన అమెరికా సెనేట్
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నత పదవులను సాధిస్తున్నారు.
Mehul Choksi: బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ.. నిర్ధారించిన యూరోపియన్ దేశం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారతదేశం మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలో ఉన్నట్లు యూరోపియన్ దేశం అధికారికంగా ధృవీకరించింది.
Trump: భారత్‌ను ఉదాహరణగా చూపుతూ..అమెరికా ఎన్నికల ప్రక్రియలో ట్రంప్ భారీ మార్పులు..ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం
అగ్రరాజ్య అధిపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా ఫెడరల్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్'లో తిరుగుబాటు.. మీడియాలో వదంతులు: ముహమ్మద్ యూనస్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటు జరుగబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు మంగళవారం నివేదించాయి.
Viral Video: 'ఎవరూ సహాయం చేయలేదు': కెనడాలో భారతీయ యువతిపై దాడి.. వైరల్ అయిన వీడియో..
కెనడాలో భారత వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా, ఖలిస్తానీ వేర్పాటువాదులు గతంలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు?
ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే.
Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఆంక్షలు,ఇమ్రాన్ ఖాన్ విడుదలపై.. అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్‌లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు.
White House: వైట్‌హౌజ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. జర్నలిస్టుతో పంచుకున్న యుద్ధ ప్రణాళిక..
వైట్‌హౌస్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో ఈరోజు ఉదయం భూమి కంపించిందని సమాచారం.
India-Canada: మా ఎన్నికల్లో భారతదేశం జోక్యం చేసుకునే అవకాశం.. కెనడా గూఢచారి సంస్థ
భారత్-కెనడాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న సందర్భంలో,ఒట్టావా మరోసారి న్యూదిల్లీపై ఆరోపణలు చేసింది.
Japan wild fire: జపాన్‌లో కార్చిచ్చుల బీభత్సం.. వందలాది ఇళ్లు ఖాళీ
జపాన్ పశ్చిమ ప్రాంతంలో రెండు భారీ కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ కార్చిచ్చుల కారణంగా పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి, వేలాది చెట్లు కాలిపోయాయి.
Reciprocal tariffs: ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ 'రీసిప్రోకల్ టారిఫ్‌లు'.. అమెరికా వాణిజ్య విధానంలో కీలక మార్పులు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రీసిప్రోకల్ టారిఫ్‌లు (Reciprocal Tariffs) అనే పేరుతో కొత్త వాణిజ్య విధానాన్ని ఏప్రిల్ 2, 2025 నుంచి అమలు చేయనున్నారు.
Donald Trump: 'నా చిత్రం చెత్తగా ఉంది'.. ఆ ఆర్టిస్ట్ వృద్ధురాలైపోయింది: ట్రంప్ ఆగ్రహం
బిజినెస్ టైకూన్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన వ్యక్తిగత ప్రతిష్టను, హావభావాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు.
Elon Musk: ట్రంప్ సమక్షంలో మస్క్ విన్యాసం.. వైరల్ అవుతున్న వీడియో!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) తాజాగా చేసిన ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Tiger Woods: ట్రంప్ మాజీ కోడలితో టైగర్‌వుడ్స్ ప్రేమాయణం.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కోడలితో తాను సంబంధంలో ఉన్నానని ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ (Tiger Woods) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Canada: వాణిజ్య యుద్ధం, ట్రంప్ విలీన బెదిరింపులు.. ముందస్తు ఎన్నికలకు కెనడా ప్రధాని పిలుపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య విధానాలు, పొరుగు దేశాలపై చూపుతున్న ఒత్తిడి, కెనడాపై పెరుగుతున్న విలీన బెదిరింపుల నేపథ్యంలో, కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Canada: కెనడాలో ముందస్తు ఎన్నికలు.. ఏప్రిల్ 28న పోలింగ్?
కెనడా (Canada) ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) త్వరలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యే సూచనలున్నాయి. ఏప్రిల్ 28న ఫెడరల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Israel-Hamas: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత సలాహ్ అల్-బర్దావీల్ హతం
గాజా (Gaza)పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ (Hamas) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని టెల్‌అవీవ్ తీవ్ర దాడులకు దిగుతోంది.
Hamas-Israel: హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతం
హమాస్ ఉగ్రవాద సంస్థను పూర్తి స్థాయిలో సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ తీవ్రమైన వైమానిక దాడులు కొనసాగిస్తోంది.
Houthis: ఇజ్రాయెల్-హూతీల మధ్య ఉద్రిక్తతలు.. విమానాశ్రయంపై దాడికి ప్రయత్నం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
India - Canada: ట్రూడో హయాంలో తీవ్రవాదులకు ప్రోత్సాహం: భారత్
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ (Mark Carney) ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో భారత్-కెనడా సంబంధాలపై కీలక ప్రకటన వెలువడింది.
US Immigration: వలసదారులకు కఠిన షాక్.. 5 లక్షల మందికి తాత్కాలిక హోదా రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం
అగ్రరాజ్య అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానంపై అమెరికా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
Pakistan: పాకిస్థాన్ లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
London: సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. లండన్ హీథ్రో ఎయిర్‌పోర్టు మూసివేత
లండన్‌లోని హీథ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Badar Khan Suri: హమాస్‌తో సంబంధాల ఆరోపణలతో అరెస్టయిన భారతీయ విద్యార్థి.. బహిష్కరణను నిలిపేసిన అమెరికా న్యాయస్థానం
హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారత విద్యార్థి బదర్ ఖాన్ సురి అమెరికాలో అరెస్టయిన విషయం తెలిసిందే.