కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్): వార్తలు
సెప్టెంబర్ 17పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటన
సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు 17న జాతీయ సమైక్యతా దినోత్సవంలో పాల్గొనాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
NAFFCO: తెలంగాణలో దుబాయ్ సంస్థ 'నాఫ్కో' రూ.700 కోట్ల పెట్టుబడులు
లైఫ్ సేఫ్టీ సొల్యూషన్స్‌లో ప్రపంచంలోనే ప్రముఖ తయారీదారు, సరఫరాదారుగా ఉన్న దుబాయ్‌కి చెందిన నాఫ్కో(NAFFCO) గ్రూప్ తెలంగాణలో తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుచొచ్చారు.
Steel bridge: హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరిట నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
సూట్ కేసు సత్యనారాయణ వ్రత పీఠాన్ని చూశారా.. వడ్రంగి కళా నైపుణ్యానికి మంత్రి కేటీఆర్ ఫిదా
తెలంగాణలో ఓ వడ్రంగి తన కళా నైపుణ్యంతో మంత్రి కేటీఆర్ అభిమానాన్ని చురగొన్నాడు. సూట్ కేసులో పట్టేంత మండపాన్ని తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు.
గ్రూప్-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్ తొలి వారంలోనే పరీక్షలు
టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయాలని భారీ ఎత్తున అభ్యర్థులు కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు.
తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో సంక్షేమం తప్ప సంక్షోభం లేదు; అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో సంక్షేమం తప్ప, సంక్షోభం లేదని తేల్చి చెప్పారు.
Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ శాసన మండలిలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మరోసారి దృష్టి సారించింది.
తెలంగాణ: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష.. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశం
హైదరాబాద్ మహానగరంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా?: కేటీఆర్
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి
తెలంగాణలో భాజపా, బీఆర్ఎస్ మధ్య మరోసారి అగ్గి రాజుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పుట్టుకను అవమానించారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వరంగల్ వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పిస్తూ సంచలన ప్రకటన చేసింది.
దేశంలోనే పొడవైన స్కైవాక్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
దేశంలోనే అత్యంత పొడవైన ఉప్పల్ స్కైవాక్ ను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నాలుగేళ్ల క్రితం దీని నిర్మాణం మొదలుపెట్టారు.
తెలంగాణలో రూ.3500 కోట్లతో మెగా పెట్టుబడులు.. త్వరలోనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం : లులూ సంస్థ
ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతుల రంగాల్లో మెగా పెట్టుబడికి తెలంగాణ వేదిక కానుంది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది.
నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు.
తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఎగుమతుల్లో తెలంగాణ 31.44 శాతం వృద్ధిని నమోదు చేసింది.
రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత రెండు వారాల్లో రెండు దేశాల్లో పర్యటనను పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మరో ఖ్యాతిని గడిచింది.
హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
గ్లోబల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోకు చాలా ప్రసిద్ధి.
రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయం : కేటీఆర్
దేశంలో రోబోటిక్ టెక్నాలజీ గేమ్ చేంజర్ గా అవుతుందని ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు.
నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో సోమవారం 'యువ సంఘర్షణ సభ' పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.
తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్
అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన ఒడిశాలోని బైలాదిలా మైనింగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని అన్నారు.
కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ
తెలంగాణ కూల్ రూఫ్ పాలసీని సోమవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్
ఎల్‌బీ నగర్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఎల్‌బీ నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీ రామారావు శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ.32 కోట్లతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది.
గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ల లీకేజీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలని కేటీఆర్ అన్నారు. పేపర్ల లీకేజీ వ్యవహారం బీజేపీ చేసిన కుట్రగా అభివర్ణించారు.
నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో
తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు
ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రైల్వే స్టేషల్ లేదా బస్టాండ్ వద్ద క్యాబ్ లేదా ఆటో ఎక్కే మహిళా ప్రయాణికుల భద్రత కోసం ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. అర్థరాత్రి నుంతి తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ
అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది.
తెలంగాణ లాంటి పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేయాలి: కేటీఆర్
2022 నాటికి అన్ని భారతీయ రాష్ట్రాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెంది ఉంటే భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించి ఉండేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
women's day 2023: 'ఉమెన్స్ డే' రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలందరికీ సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు
ఆపిల్‌తో సహా వివిధ బ్రాండ్‌లకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.
ఐటీ నిపుణుల నియామకంలో హైదరాబాద్ నంబర్ వన్
సాఫ్ట్‌వేర్ నిపుణులను నియమించుకోవడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు టెక్నికల్ హైరింగ్ ఏజెన్సీ అయిన 'కారత్' జాబితాను విడుదల చేసింది.
తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను రూ.20.5లక్షల కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: కేటీఆర్
ప్రపంచ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్‌గా మార్చడమే తమ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 నాటికి తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను 250 బిలియన్ డాలర్లకు (రూ.20.5 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస
సమకాలీన రాజకీయ నాయకులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టాక్ షోకి హాజరైన రాజకీయాలు, సినిమా, స్టూడెంట్ లైఫ్ లాంటి పలు విషయాలపై చంద్రబాబు మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీలో ఏఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. హైదరాబద్ అభివృద్ధి, ప్రభుత్వం పనితీరుపై అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
కస్టమర్లకు వేగంగా బుకింగ్ డెలివరీలను చేరవేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా హైదరాబాద్‌లో ఎయిర్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఎయిర్ సర్వీసులకు ప్రారంభించారు.
కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. గ్లోబల్ మల్టీ-బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' హైదరాబాద్‌లో సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్
రాష్ట్ర అభివృద్ధి భాగస్వాములు కావాలని, రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఉద్యోగాలు కల్పించాలనుకున్నా పూర్తి సహకారం అందిస్తామని హామీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు.
సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నాలుగు రోజలు పర్యటన నిమ్మితం భారత్‌కు వచ్చారు . నాలుగో రోజైన శుక్రవారం నాదెళ్ల హైదరాబాద్‌కు రాగా.. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.