కర్ణాటక: వార్తలు

నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌‌ను ప్రకటించనుంది. దిల్లీలోని ప్లీనరీ హాల్ విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

అద్దెకు ఉండే బ్యాచిలర్ల కోసం బెంగళూరు సొసైటీ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలు

నివాసి సంక్షేమ సంఘాలు (RWA) ఫ్లాట్‌ల యజమానులు లేదా అద్దెకు ఉండే వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తరచుగా నియమాలు, నిబంధనలను ఏర్పరుస్తాయి.

27 Mar 2023

బీజేపీ

రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) అంతర్గత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సోమవారం శివమొగ్గ జిల్లాలో బంజారా, భోవి సంఘాల కార్యకర్తలు సోమవారం మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇల్లు, కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అనంతరం రాళ్లు రువ్వారు.

25 Mar 2023

బీజేపీ

బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని కర్ణాటక ప్రజలు నిర్ణయించినట్లు ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. కర్ణాటకలోని దావణగెరెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్నదని, 'సబ్ కా ప్రయాస్' ద్వారా ప్రతి ఒక్కరి కృషి ద్వారానే అది సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మరో నెలరోజుల్లో జరగనున్నారు. వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించింది.

అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు?

కర్ణాటకలో మరో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. 18వ శతాబ్దపు పాలకుడు టిప్పు సుల్తాన్‌పై తాజాగా వివాదం రాజుకుంది. టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారనే అంశాన్ని బీజేపీ ఎన్నికల అంశంగా మార్చింది.

21 Mar 2023

బీజేపీ

కాంగ్రెస్‌లోకి బీజేపీ ఎమ్మెల్సీ; ఎన్నికల వేళ కమలం పార్టీకి షాక్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావు చించన్‌సూర్ పార్టీని వీడారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం!

కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో ముగియనుంది. రాష్ట్రంలో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి.

గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా?

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన ప్రారంభించిన జాతికి అంకితం చేశారు. అయితే ప్రారంభించి వారం రోజుకు కూడా కాలేదు.. అప్పుడు హైవే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయి.

17 Mar 2023

ఎన్ఐఏ

శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్

శివమొగ్గ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కుట్ర కేసులో ఇద్దరు రాడికలైజ్డ్ బి.టెక్ గ్రాడ్యుయేట్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు

కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు.

కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృష్టి చేస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దక్షిణాదిన బీజేపీకి కీలకమైన కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని మోదీ భావిస్తున్నారు. అందుకే గత మూడు నెలల్లో ఇప్పటికే ఐదు సార్లు రాష్ట్రంలో పర్యటించగా, ఆదివారం మరోసారి కర్ణాటకకు రానున్నారు.

వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేసారు. 80ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులందరికీ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.

10 Mar 2023

హర్యానా

హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా రూపంలో మరో వైరస్ వణికిస్తోంది. దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

03 Mar 2023

బీజేపీ

బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు

అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ ఇంట్లో 6కోట్ల రూపాయల నగదును శుక్రవారం ఉదయం లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రశాంత్ మాదాల్‌ను అరెస్టు చేశారు.

ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య

బెంగళూరులో ఓ యువతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

పట్టపగలు, కత్తులతో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

నిత్యం రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో పట్టపగలు 26ఏళ్ల యువకుడిని దారుణంగా నరికి చంపారు. కర్ణాటక బీదర్ జిల్లాలోని త్రిపురాంత్ గ్రామంలో ఈ హత్య జరిగింది. హత్య దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి.

కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అన్ని రాజకీయ పక్షాలను ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంగళవారం ఉత్తర కన్నడ జిల్లాలోని బనవాసి మార్గంలో వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి.

అసెంబ్లీ ఎన్నికలు: కర్ణాకటపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్; శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం

మరో రెండు నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆ రాష్ట్రంపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయన కర్ణాటక‌లో పర్యటిస్తున్నారు. 2023లో ఇప్పటి వరకు రెండు నెలల్లోనే ఏకంగా ఐదు సార్లు మోదీ కర్ణాటకలో పర్యటించడం గమనార్హం.

శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు

రూ.1000 కోట్లకు పైగా పబ్లిక్ డిపాజిట్లను దుర్వినియోగం చేసిన కేసులో శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్ వీఆర్ రాజేష్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది.

హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ

హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించాలని, తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన విద్యార్థినుల బృందం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

'10మంది ముస్లిం బాలికలను ట్రాప్ చేయండి, భద్రత కల్పిస్తాం'; శ్రీరామ్ సేన అధ్యక్షుడు సంచలన కామెంట్స్

'లవ్ జిహాద్'ను ఎదుర్కొనేందుకు కర్ణాటకలో శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

20 Feb 2023

ఐఫోన్

ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ హత్య- నాలుగురోజులుగా బాత్‌రూమ్‌లోనే మృతదేహం

ఐఫోన్ కోసం ఒక వ్యక్తి డెలివరీ బాయ్‌ను హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

15 Feb 2023

ఎన్ఐఏ

ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలున్న వారే లక్ష్యంగా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.

2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ

2024-25 నాటికి రక్షణ ఎగుమతులను 5 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 8-9 సంవత్సరాల్లో భారతదేశం తన రక్షణ రంగాన్ని పునరుజ్జీవింపచేసిందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా 2023'ని బెంగళూరులో ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.

రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ దుర్రానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆదిల్ తనపై అత్యాచారం చేశారని మైసూరులో ఓ ఇరాన్ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇది లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.

కత్తులతో మార్కెట్‌లో వ్యక్తి వీరంగం, షూట్ చేసిన పోలీసులు

కర్నాటకలోని కలబురగిలో ఒక వ్యక్తి కత్తులతో వీరంగం సృష్టించారు. మార్కెట్ ప్రాంతంలో సాధారణ ప్రజలపై దాడి చేస్తానని బెదిరిస్తున్న అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు.

బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

బీజేపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను, కో-ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలైని అధిష్టానం నియమించింది.

Budget 2023: కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, బడ్టెట్‌లో భారీగా కేటాయింపులు

2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దేశం 'ఆజాదీ కా అమృత మహోత్సవం' జరుపుకుంటున్న వేళ, ఈ బడ్డెట్‌ను వందేళ్ల స్వతంత్య్ర భారతానికి బ్లూప్రింట్‌గా సీతారామన్ అభివర్ణించారు.

27 Jan 2023

విమానం

డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి రూ.10లక్షల జరిమానా

బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్‌' విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది.

కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ

మరికొన్ని నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ మళ్లీ రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది.

భద్రతలో వైఫల్యం: ప్రధాని మోదీపైకి దూసుకొచ్చిన యువకుడు

కర్ణాటకలో జరుగుతున్న జాతీయ యువజనోత్సవాల వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో ఘోర వైఫల్యం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు హుబ్బళికి మోదీ చేరుకోగా.. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు.

సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత

ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. బెంగళూరు సమీపంలోని నంది కొండల దిగువన ఆదియోగి విగ్రహావిష్కరణతో పాటు ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవంపై స్టే విధించింది.

మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం

బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులోని హెచ్‌బీఆర్ లేఅవుట్ వద్ద నిర్మాణలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య..

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. బీటెక్ చదవుతున్న విద్యార్థిని(19)పై ఆమె స్నేహితుడే దాడికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. ఏకంగా 10 సార్లు ఆమెపై దాడి చేసి.. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థినిని స్మితగా.. ఆమె స్నేహితుడిని పవన్ కల్యాణ్‌గా గుర్తించారు.

02 Jan 2023

తెలంగాణ

2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా..

2023 జనవరి 1 రాకతో.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టాయి. ఈ‌ఏడాది ఏకంగా 9రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే.. ఈ ఎలక్షన్స్‌ను సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

27 Dec 2022

కోవిడ్

కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స

చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ BF.7 వేరియంట్ దేశంలో వెలుగు చూడడంతోపాటు అంతర్జాతీయ ప్రయాణికుల్లో బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మునుపటి
తరువాత