క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

జో రూట్ సూపర్ సెంచరీ

టెస్టులో ఇంగ్లండ్ జట్టు స్పీడ్‌ను పెంచుతోంది. గతేడాది నుంచి బజ్ బాల్ విధానంలో టెస్టు స్వరూపాన్నే ఇంగ్లండ్ మార్చేసింది. తాజాగా న్యూజిలాండ్ జరుగుతున్న టెస్టులో కూడా అదే జోరును కొనసాగిస్తోంది.

బార్సిలోనాను ఓడించిన మాంచెస్టర్ యునైటెడ్

UEFA యూరోపా లీగ్ ప్లే ఆప్ టై లో బార్సిలోనాపై మాంచెస్టర్ యునైటెడ్ విజయం సాధించింది. 2-1 తేడాతో బోర్సాలోనాను మంచెస్టర్ యునైటెడ్ ఓడించింది. మొదటి లెగ్‌లో 2-2తో డ్రా అయిన తర్వాత, రాబర్ట్ లెవాండోస్కీ పెనాల్టీ గోల్ చేయడంతో బార్సిలోనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

Womens T20 World Cup 2023 Semisలో భారత్ కెప్టెన్ పోరాటం వృథా

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2023 ICC మహిళల T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో అద్భుతంగా పోరాడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల చేసి సత్తా చాటింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా మహిళలు విజయం సాధించడంతో ఆమె పోరాటం వృథా అయింది.

Womens T20 World Cup 2023 Semisలో భారత్ పరాజయం

మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. లక్ష్య చేధనలో టీమిండియా బ్యాటర్స్ రాణించనప్పటికీ.. ఉత్కంఠ పోరులో కేవలం 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఓటమిపాలైంది.

మరో రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులో అత్యంత వేగంగా 25వేలు పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

మూడో టెస్టుపై గురి పెట్టిన టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్ వర్సస్ ఆస్ట్రేలియా మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-0లో అధిక్యంలో నిలిచింది. మార్చి 1 ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుంది.

రోహిత్ మరీ లావుగా కనిపిస్తున్నాడు.. మాజీ లెజెండ్ కామెంట్

రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ కొనసాగుతూనే ఉంది. రోహిత్ బ్యాటింగ్ విఫలమైన ప్రతిసారీ రోహిత్ ఫిటె‌నెస్‌పై సోషల్ మీడియాలో ట్రోల్ తెగ వైరల్ అవుతుంటాయి. ఏదో ఒక సందర్భంలో రోహిత్ బాడీ షేమింగ్‌పై వార్తలు వస్తుంటాయి. తాజాగా మాజీ లెజెండ్ కపిల్ రోహిత్ ఫిటెనెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగ సత్తా

హసరంగా టీ20 ఫార్మాట్‌లో సంచలనం సృష్టించాడు. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ సత్తా చాటాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న అప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను హసరంగ వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ఇదే విషయాన్ని ప్రకటించింది.

టెస్టు సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్

టెస్టుల్లో ఇంగ్లండ్ సంచలనాత్మక మార్పులను తీసుకొస్తోంది. ప్రధాన కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలను తీసుకున్నప్పటీ నుంచి ఇంగ్లండ్ అద్భుతంగా రాణిస్తోంది.

నేడు సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న ఇండియా

మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో నేడు కీలక పోరు జరగనుంది. టీమిండియా మహిళలు సెమీస్‌లో ఆస్ట్రేలియా మహిళలతో తలపడనున్నారు.

సన్ రైజర్స్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ప్రకటించింది. మాయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నా చివరికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ వైపే సన్ రైజర్స్ యాజమాన్యం మెగ్గు చూపింది. మార్క్రమ్ ఇటీవలే సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్‌ జట్టుకు కెప్టెన్‌గా వహించి టైటిల్ అందించిన విషయం తెలిసిందే.

ఛాంపియన్స్ లీగ్‌లో ఓడిన మాంచెస్టర్ సిటీ

UEFA ఛాంపియన్స్ లీగ్‌లో మాంచెస్టర్ ఓటమిపాలైంది. లిప్ జిగ్ చేతిలో మాంచెస్టర్ సిటీ ఓడిపోయింది. మాంచెస్టర్ సిటీ తరుపున రియాద్ మహ్రెజ్ మొదటి గోల్ చేసి సిటీకి ఆధిక్యాన్ని అందించింది. లీప్‌జిగ్ డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ 70వ నిమిషంలో ఈక్వెలైజర్ గోల్ చేశాడు. సిటీ వారి చివరి రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

ఇంగ్లండ్ జోరుకు న్యూజిలాండ్ బ్రేకులు వేసేనా..?

టెస్టులో ఇంగ్లండ్ దుమ్ము దులుపుతోంది. న్యూజిలాండ్ పై మొదటి టెస్టులో ఇంగ్లాండ్ 267 ప‌రుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసింది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్ తొలి విజయాన్ని అందుకొని చరిత్రను సృష్టించింది.

మాక్స్‌వెల్, మార్ష్ వచ్చేశాడు, టీమిండియాతో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక

మార్చి 17 నుంచి టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఆ దేశ క్రికెట్ టీం ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

23 Feb 2023

ఐపీఎల్

దేశం కంటే ఐపీఎల్ ముఖ్యం కాదన్న బెన్ స్ట్రోక్స్

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేళ్ల తరువాత ఐపీఎల్ అడునున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ఇక నెల కంటే ఎక్కువ సమయం లేదు. ఈ సమయంలో చైన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ సీజన్ మధ్యలో జట్టును విడిచిపెట్టనున్నాడు.

దీప్తిశర్మకు షాక్.. యూపీ వారియర్స్ కెప్టెన్‌గా అలిస్సాహీలీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ ఎంపికైంది. ఈ మేరకు యూపీ వారియర్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మను రూ.2 కోట్ల 60లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.

కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించడంపై చాట్ జీపీటీ సమాధానం

సాంకేతిక ప్రపంచంలోకి విప్లవాత్మకంగా దూసుకొచ్చిన చాట్ జీపీటీ ఎన్నో సంచనాలను సృష్టిస్తోంది. ఈ కొత్త తరం సెర్చ్ ఇంజిన్ నెటిజన్లను బాగా అకట్టుకుంటోంది. ఈ టూల్ తో మాట్లాడేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. టీమిండియా రాహుల్ పేలవ ఫామ్‌ గురించి సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ప్రపంచ నెం.1 టెస్టు బౌలర్‌గా జేమ్స్ అండర్సన్

40 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్‌తో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంచలన రికార్డును సాధించాడు. తాజాగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. జేమ్స్ అండర్సన్ 886 పాయింట్లతో టెస్టులో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించని స్టీవెన్ స్మిత్

టీమిండియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ రాణించడం లేదు. ఢిల్లీలో జరిగిన టెస్టులో 0, 6 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు.

ప్లీజ్.. అలసిపోయాను సార్ : జస్ప్రిత్ బుమ్రా

ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్టార్ పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. అలాంటి పేసర్ సేవలను కొన్ని నెలలుగా టీమిండియా కోల్పోయింది.

T20 World Cup Semi final లో తలపడనున్న భారత్- ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్ కప్ సెమీ‌ఫైనల్ జట్లు ఏవో తెలిసిపోయాయి. గురువారం కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్-1 మ్యాచ్‌లో భారత్ జట్టు తలపడనుంది. శుక్రవారం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్ 2లో ఢీకొట్టనున్నాయి.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ భారీ రికార్డు

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ భారీ రికార్డు సాధించింది. మంగళవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో గెలిచింది.

రియల్ మాడ్రిడ్ చేతిలో లివర్‌పూల్‌పై ఓటమి

UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 రౌండ్‌లో లివర్‌పూల్‌ ఓటమిపాలైంది. రియల్ మాడ్రిడ్ చేతిలో 5-2తేడాతో లివర్‌పూల్ ఓడిపోయింది.

టీ20ల్లో పాకిస్తాన్ మహిళా ప్లేయర్ అదరిపోయే రికార్డు

పాకిస్తాన్ మహిళా స్టార్ ప్లేయర్ నిదాదార్ అరుదైన రికార్డును సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిదాదార్ చరిత్రకెక్కింది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ఓ వికెట్ నిదాదార్ పడగొట్టి.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

టెస్టు క్రికెట్లో రికార్డుకు చేరువలో టామ్ లాథమ్

టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. టెస్టులో 5వేల పరుగులు పూర్తి చేయడానికి టామ్ లాథమ్ 80 పరుగుల దూరంలో ఉన్నాడు.

బుమ్రా ఐపీఎల్ ఆడకపోతే ప్రపంచం ఆగిపోతుందా : మాజీ క్రికెటర్

గాయం కారణంగా కొన్ని నెలలుగా టీమిండియాకు జస్ప్రిత్ బుమ్రా దూరమయ్యాడు. ఆస్ట్రేలియా‌తో జరిగే చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్‌కు కూడా అతన్ని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

కేఎల్ రాహుల్‌ విశ్రాంతి తీసుకోవాలి: దినేష్ కార్తీక్

టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కొంతకాలంగా ఏ మాత్రం రాణించడం లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతని అటతీరు అధ్వాన్నంగా మారింది. శుభ్‌మన్ గిల్ వంటి యంగ్ ప్లేయర్లను కాదని జట్టులోకి తీసుకుంటే రాహుల్ అశించిన స్థాయిలో ఆడడం లేదు.

ఓటమితో టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన 20 ఏళ్ల కెరీర్‌కి గుడ్‌బై చెప్పింది. చివరి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆటకు పుల్‌స్టాప్ పెట్టింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లోనే భారత్‌కి చెందిన సానియా, అమెరికాకి చెందిన మాడిసన్‌ కీస్‌ జోడీ ఓటమిని చవిచూసింది.

కొత్త జెర్సీతో దర్శమివ్వనున్న టీమిండియా ఆటగాళ్లు..!

టీమిండియా జెర్సీ మరోసారి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూరోప్ బ్రాండ్ అడిదాస్ రూపొందించనున్న కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అడిడాస్‌తో ఐదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఐసీసీ ఉమెన్స్ టీ20 ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన రిచా ఘోష్

భారత క్రీడాకారిణి రిచా ఘోష్ కెరీర్లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించింది. ఐసీసీ ఉమెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో టీమిండియా మహిళా ప్లేయర్ రిచా ఘోస్ సత్తా చాటింది.

పృథ్వీషాపై రివర్స్ కేసు.. అసభ్యంగా తాకాడని ఆరోపణ

భారత్ క్రికెటర్ పృథ్వీ షా సెల్పీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ కేసులో నిందితురాలైన యూట్యూబర్ సప్నా గిల్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో మెస్సీ, నాదల్

క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే లారస్ స్పోర్ట్స్ అవార్డు రేసులో పుట్‌బాల్ సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ, టెన్నిస్ స్టార్ నాదల్ ఉన్నారు. గతేడాది డిసెంబర్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో లియోనల్ మెస్సీ అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపి, గోల్డెన్ బాల్ అవార్డును దక్కించుకున్నాడు.

మేజర్ లీగ్ క్రికెట్ ఆడనున్న స్టీవెన్ స్మిత్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ వచ్చే ఏడాది అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ ను ఆడనున్నారు. స్మిత్ అమెరికన్ T20 టోర్నమెంట్, మేజర్ లీగ్ క్రికెట్ యజమానులతో ఇప్పటికే రహస్య చర్చలు జరిపినట్లు సమాచారం.

ధోని రికార్డును సమం చేసిన హిట్‌మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే రోహిత్ శర్మ ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఎంఎస్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. రోహిత్ శర్మ గత వారం టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా నాలుగో విజయాన్ని అందుకున్నాడు.

అరుదైన రికార్డుకు చేరువలో కేన్ విలియమ్సన్

టెస్టులో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డులను బద్దలు కొట్టాడు. వెల్లింగ్టన్ లోని ఇంగ్లండ్ జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు సంచలన రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.

ఆ ఇద్దరు ఉంటే టీమిండియాను ఓడించడం ఆసాధ్యం

స్వదేశంలో టీమిండియాను ఓడించడం విదేశీ టీమ్ లకు ఓ కలగా మారుతోంది. భారత్ ను ఓడించాలని దిగ్గజ టీంలు, లెజెండరీ ఆటగాళ్లు కలలు కన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. 1996లో మొదలై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2004 లో మాత్రమే టీమిండియా స్వదేశంలో ఓడిపోయింది.

వెస్టిండీస్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన గాబ్రియెల్

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వన్డే, టీ20 జట్టులను ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డేలకు సారథిగా సాయ్ హోప్, టీ20లకు కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ ఎంపికయ్యాడు.

ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. గాయల బెడద కారణంగా స్టార్ ప్లేయర్స్ జట్టుకు దూరమయ్యాడు. రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిన ఆస్ట్రేలియాకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాడు. ఇప్పటికే పేసర్ జోష్ హేజిల్ వుడ్ మిగతా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కామిన్స్ సిడ్ని వెళ్లాడు. ఇక హెయిర్ లైన్ ఫ్రాక్చర్‌తో బాధపడుతున్న డేవిడ్ వార్నర్ మిగతా మ్యాచ్‌లు ఆడటం సందేహంగా మారింది.

రాహుల్‌ను వైస్ కెప్టెన్ నుంచి తప్పించడంపై హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన ఫెయిల్యూర్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన ఆటతీరుతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. నాగ్ పూర్ టెస్టులో 20 పరుగులు, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకే ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ వైస్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా

ఐర్లాండ్‌పై ఇండియా ఉమెన్స్ టీమ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఇండియా గెలిచింది. టీ20 వరల్డ్ కప్‌లలో వరుసగా మూడోసారి ఇండియా సెమీస్ చేరడం విశేషం.