క్రీడలు వార్తలు | పేజీ 4

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

లెజెండ్స్ క్రికెట్ లీగ్ వచ్చేసిందోచ్..!

లెజెండ్స్ లీగ్ క్రికెట్ కొత్త సీజన్ మార్చి 10 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ ఇండియా మహరాజాస్, ఏసియా లయన్స్ మధ్య జరగనుంది. ఈసారి ఈ టోర్నీ ఖతార్ లోని దోహాలో జరగనుంది.

German Open 2023లో నిరాశ పరిచిన లక్ష్యసేన్

ఎన్నో అంచనాలతో జర్మన్ ఓపెన్ వరల్డ్ టూరు సూపర్-300 బ్యాడ్మింటన్ బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్యసేన నిరాశ పరిచాడు.

IND vs AUS : మొదటి రోజు సెంచరీతో కదం తొక్కిన ఉస్మాన్ ఖావాజా

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.

పాక్ గడ్డపై జాసన్ రాయ్ విధ్వంసకర శతకం

పీఎస్ఎల్‌లో సరికొత్త సంచలన రికార్డు నమోదైంది. జాసన్ రాయ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 63 బంతుల్లో 145 పరుగులు చేశారు. దీంతో పెషావర్ జాల్మీ జట్టు విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా చేధించింది.

పీఎస్‌ఎల్‌లో సెంచరీతో చెలరేగిన బాబర్ ఆజమ్

షెషావర్ జల్మీ, క్వెటా గ్లాడియేటర్స్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఫెషావర్ జల్మీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పెషావర్ జెల్మీ కెప్టెన్ బాబార్ ఆజమ్ సెంచరీతో చెలరేగిపోయాడు.

09 Mar 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో కొన్ని జట్లకు బ్యాడ్ న్యూస్

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో కొన్ని జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు.

టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆకరి టెస్టు అహ్మదాబాద్‌లో జరుగుతోంది. తొలి మూడు టెస్టులో రెండింటిలో నెగ్గిన భారత్ 2-0తో అధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా అడుగు పెట్టనుంది.

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అండర్సన్ దూసుకొచ్చినా అశ్వినే నెంబర్ వన్

టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ప్రభావం చూపలేకపోయిన అశ్విన్ ఆరు రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. దీంతో బుధవారం ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 859 పాయింట్లతో అశ్విన్, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ నెంబర్ వన్ స్థానంలో సమానంగా నిలిచారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బోణి కొట్టిన గుజరాత్ జెయింట్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా మూడోసారి రాయల్ బెంగళూర్ ఛాలెంజర్స్ ఓటమిపాలైంది. బుధవారం రాత్రి జరిగిన 6వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు 11 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై విజయం సాధించింది.

IND vs AUS : చివరి టెస్టుకు హజరైన ప్రధానమంత్రులు మోడీ, ఆంటోని ఆల్బనీస్

భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన చివరి టెస్టుకు ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ హజరయ్యారు.

బేయర్స్ మ్యానిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్తైన్ పరాజయం

అలియాంజ్ ఎరీనాలో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్‌లో పారిస్ సెయింట్-జర్మైన్‌ను బేయర్న్ మ్యునిచ్ ఓడించింది. 2-0తేడాతో బేయర్న్ మ్యునిచ్ చేతిలో పారిస్ సెయింట్-జర్మైన్‌ ఓటమి పాలైంది.

IND vs AUS: బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

రవిశాస్త్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ

ఇండియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా మూడో టెస్టులో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. ముఖ్యంగా అతి విశ్వాసమే టీమిండియా ఓటమికి కారణమని శాస్త్రి అన్నారు.

IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ

RPSG గ్రూప్ యాజమాన్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ మంగళవారం తమ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది. ఈ టోర్నమెంట్ తాజా ఎడిషన్ మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది .

బస్సులో టీమిండియా క్రికెటర్ల హోలీ సెలబ్రేషన్స్

అహ్మదాబాద్ టెస్టును గెలవాలని టీమిండియా శ్రమిస్తోంది. ఇండోర్‌లో ఓటమి తర్వాత అహ్మదాబాద్ టెస్టులో విజయం సాధించి ఐసీసీ టెస్టు చాంఫియన్ షిప్‌కు అర్హత సాధించాలని టీమిండియా భావిస్తోంది. కాగా, టీమ్ భారత టీం బస్సులోనే హోలీ సంబరాలు చేసుకున్నారు.

ODI Tickets: 10 నుంచి విశాఖ వన్డే టికెట్ల అమ్మకం

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 19న జరిగే రెండో వన్డే టికెట్ల అమ్మకం ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్‌లో ఈనెల 13 నుంచి టికెట్లు విక్రయాలు జరగనున్నాయి. ఆఫ్ లైన్ లో టికెట్ల అమ్మకాల కోసం నగరంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

క్రీడారంగంలో నారీమణుల సేవలకు సెల్యూట్

భారత క్రీడారంగంలో పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. బాక్సింగ్ నుంచి క్రికెట్ దాకా భారత మహిళలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో భారత తొలి మహిళలు ఎవరో ఓసారి చూద్దాం.

సంచలన రికార్డును బద్దలుకొట్టనున్న రవిచంద్రన్ అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టాడు. మార్చి 9న ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే చివరి టెస్టులో మరో అరుదైన రికార్డుపై అశ్విన్ కన్నేశాడు.

జర్మన్ ఓపెన్‌కు మాజీ వరల్డ్ నెంబర్ వన్ దూరం

మాజీ వరల్డ్ నెంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ జర్మన్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్మమెంట్ నుంచి తప్పుకున్నాడు. మంగళవారం నుంచి ఈ టోర్నీ క్వాలిఫయర్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి.

టెన్నిస్ స్టార్ జొకోవిచ్‌కు మరోసారి 'వాక్సిన్' షాక్

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో ఈనెల 19 నుంచి జరగనున్న ఇండియన్ వెల్స్‌తో పాటు మయామి టోర్నిల్లో జొకోవిచ్ పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా టీకా తీసుకోని టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ మరోసారి టోర్నికి దూరం కావాల్సి వచ్చింది. టీకా వేసుకోని విదేశీయులను తమ దేశంలోకి అమెరికా అనుమతించడం లేదు.

సోషల్ మీడియా సన్సేషన్‌గా హార్ధిక్ పాండ్యా.. నాదల్, ఫెదరర్‌ను వెనక్కినెట్టాడు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టీమిండియా స్టార్ హార్ధిక్ పాండ్యా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు టీమిండియాకు నాయకత్వం వహించి అద్భుత విజయాన్ని అందించారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడల్లా జట్టు పగ్గాలను అందుకుంటున్నాడు. సోషల్ మీడియా ఫ్టాంట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుడిగా రికార్డుకెక్కాడు.

IND vs AUS: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా రెడీ

ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కాలంటే టీమిండియా చివరి టెస్టు నెగ్గాల్సిందే. మార్చి 9 ఆస్ట్రేలియా-ఇండియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో టీమిండియా ఉంది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

IND vs AUS: ఆహ్మదాబాద్ టెస్టులో రాహుల్-గిల్‌ని ఆడించాలి : రికి పాటింగ్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియా వెళ్లాలంటే నాలుగో టెస్టును తప్పక గెలవాలి. అయితే తుది జట్టుపై టీమిండియా తర్జనభర్జనలను పడుతోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 9న నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులో విఫలమైన రాహుల్‌ను తప్పించి, యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కి అవకాశం కల్పించింది. మూడో టెస్టులో గిల్ పూర్తిగా నిరాశపరిచాడు.

వన్డేల్లో షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డు

వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డును సృష్టించారు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షకీబ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. 71 బంతుల్లో 75 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లను తీశాడు. దీంతో వన్డే క్రికెట్లో 300 వికెట్లు పూర్తి చేసిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్‌గా షకీబ్ చరిత్రకెక్కాడు.

బాబర్‌ను విడిచే ప్రసక్తే లేదు : షోయబ్ అక్తర్

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్న పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు సారిథి బాబర్ ఆజమ్‌కు ఇంగ్లీష్ రాదని, ఆతడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని, అందుకే బ్రాండ్ కాలేకపోయాడనికి గతంలో షోయబ్ చేసిన విమర్శలు మరోసారి పెద్ద దూమారం అయ్యాయి.

WPL: మహిళలందరికీ ఉచిత ప్రవేశం.. బీసీసీఐ బంపరాఫర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బీసీసీఐ బంపరాఫర్ ప్రకటించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా మార్చి 8 నాటి మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అరుదైన అవకాశాన్ని కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరగనుంది.

ఎరిన్ హాలండ్‌‌ను చంకన ఎత్తుకున్నన్యూజిలాండ్ మాజీ క్రికెటర్

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన అద్భుత బౌలింగ్‌తో మేటీ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఐపీఎల్‌ టోర్నిలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్యాతలలో కూడా డానీ ఒకరు. అలాంటి డానీ ఒక్కోసారి తన వింత ప్రవర్తనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాడు

WPL: ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని అందించిన నాట్ స్కివర్ బ్రంట్

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై 9 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. ముంబై స్టార్ ఓపెనర్ హేలీ మాథ్యూస్ (77), నాట్ స్కివర్ బ్రంట్ (55) చెలరేగడంతో బెంగళూర్‌కు మళ్లీ నిరాశ తప్పలేదు. వీరిద్దరూ విధ్యంసకర బ్యాటింగ్‌తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు. నటాలీ స్కివర్-బ్రంట్ బౌలింగ్‌లో రెండు వికెట్లతో సత్తా చాటింది.

WPL 2023: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబాయి ఇండియన్స్

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన ముంబాయి ఈసారి బెంగళూరును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబాయి, ఆర్సీబీపై 9 వికెట్ట తేడాతో ఘన విజయం సాధించింది.

ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి చివరి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను చూడటానికి తొలి రోజు నరేంద్ర మోదీతోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ రానున్నారు.

BAN vs ENG: అర్ధ సెంచరీతో చెలరేగిన షకీబుల్ హసన్

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. షకీబ్ 71 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో తన కెరీర్‌లో వన్డేలో 52 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్న శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (11), లిట్టన్ దాస్ (0) నిరాశ పరిచారు.

తక్కువ రోజుల్లో పూర్తియైన టెస్టు మ్యాచ్‌లపై ఓ లుక్కేయండి

ఈ మధ్య కాలంలో ఐదురోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్‌లు.. మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. ఇలాంటి మ్యాచ్‌లతో ఫలితం తేలుతున్నా.. క్రికెట్ అభిమానులకు మాత్రం మాజా రావడం లేదు.

Ind Vs Aus: నాలుగో టెస్టుకు స్టార్ బౌలర్ షమీ రీ ఎంట్రీ

భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 9న నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇండోర్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. ప్రస్తుతం చివరి టెస్టుపై దృష్టి సారించింది. నాలుగో టెస్టు కోసం మహ్మద్ షమీని మళ్లీ జట్టులోకి తీసుకోబోతున్నారు. మూడో టెస్టులో షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ వచ్చాడు. ప్రస్తుతం షమీ కోసం ఎవరిని రిజర్వ్ బెంచ్ పై కుర్చోబెడతారో వేచి చూడాల్సిందే.

18 సంవత్సరాలకే వన్డేలోకి ఇంగ్లండ్ కుర్రాడు ఎంట్రీ

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌కు చెందిన ఆల్ రౌండర్ రెహాన్ అహ్మద్ కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లోకి ఇంగ్లండ్‌ తరుపున అత్యంత పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసిన ఆటగాడిగా రెహాన్ అహ్మద్ రికార్డు సృష్టించాడు.

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్

మార్చి 17 నుంచి టీమిండియాతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది. వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. వన్డే జట్టుకు ఎంపికైన స్టార్ బౌలర్ జై రిచర్డర్ సన్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.

ఇండియన్ వాలీబాల్ అభివృద్ధికి ప్రైమ్ వాలీబాల్‌ సహకారం

ఇండియన్ వాలీబాల్ అభివృద్ధికి ఫైనల్‌కు ముందు ప్రైమ్ వాలీబాల్ లీగ్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ జనరల్ డైరెక్టర్ ఫాబియో అజెవెడో ప్రకటించారు. పివిఎల్ ఫైనల్ ప్రారంభానికి ముందు, ఎఫ్‌ఐవిబి జనరల్ డైరెక్టర్ మాట్లాడారు. భారతదేశంలో వాలీబాల్ అభివృద్ధికి కృషి చేయడానికి పివిఎల్‌తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.

ప్రీమియర్ లీగ్‌లో మొహమ్మద్ సలా అరుదైన రికార్డు

ప్రీమియర్ లీగ్‌లో లివర్‌పూల్ తరుపున మొహమ్మద్ సలా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. మాంచెస్టర్ యూనైటడ్ 7-0 తేడాతో లివర్ పూల్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ సలా ఓ రికార్డును సృష్టించాడు.

IND Vs AUS : స్టీవ్ స్మిత్‌కే చివరి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు

మార్చి 9న ఆహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా జట్టుని కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ పగ్గాలను అందుకోనున్నాడు. ఢిల్లీ టెస్టు ముగియగానే స్వదేశానికి వెళ్లిపోయిన పాట్ కమిన్స్.. ఇంకా ఇండియాకి తిరిగి రాలేదు. భారత్‌తో జరిగే నాలుగో టెస్టు ఆడలేనని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పినట్లు సమాచారం.

WPL 2023 : ఐదు వికెట్లతో చెలరేగిన కిమ్ గార్త్

మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ చేతిలో పరాజయం పాలైంది. మొదటి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయిన గుజరాత్.. రెండో మ్యాచ్ లో యూపీ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. గుజరాత్ జెయింట్స్ తరుపున కిమ్ గార్త్ ఐదు వికెట్లతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది.