క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

14 Mar 2023

ఐపీఎల్

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. అందుబాటులో స్టార్ ప్లేయర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 ఎడిషన్ మార్చి 31న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. చాలామంది ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో ఫ్రాంచైజీల్లో అందోళన మొదలైంది. తాజాగా కొన్ని టీంలకు గుడ్ న్యూస్ అందింది.

అక్షయ్‌కుమార్ మూవీ సీన్‌పై టీమిండియా క్రికెటర్ల ఫన్నీ వీడియో

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' గా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం సాధించిన తర్వాత అక్షయ్ కుమార్ మూనీ సీన్‌పై ఓ వీడియో చేశారు. ఈ వీడియోను రవిచంద్రన్ అశ్విన్ తన ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో పోస్టు చేశాడు.

WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీకి ఇది వరుసగా ఐదో పరాజయం. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

IND vs AUS:: ప్లేయర్స్ ఆఫ్ ది సిరీస్‌గా అశ్విన్, జడేజా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో దక్కించుకుంది.

13 Mar 2023

ఐసీసీ

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా హ్యారీ బ్రూక్

అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతి నెలా క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నెలా పురుషుల, మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సోమవారం ప్రకటించింది.

IND vs AUS: పాపం ట్రావిస్ హెడ్.. సెంచరీ మిస్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో బాగా రాణించాడు. హెడ్ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర పటేల్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టులో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర పటేల్ చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్‌ను ఔట్ చేసి ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు. భారత్‌ తరుపున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అక్షర్ పటేల్ రికార్డు క్రియేట్ చేశాడు.

NZ vs SL: హాఫ్ సెంచరీతో చెలరేగిన డారిల్ మిచెల్

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఐదో రోజు హాఫ్ సెంచరీతో డారిల్ మిచెల్ రాణించి సత్తా చాటాడు.

NZ vs SL: సెంచరీతో న్యూజిలాండ్‌ను గెలిపించిన కేన్ విలియమ్సన్

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఐదో రోజు అజేయ శతకం బాదిన కేన్ విలియమ్సన్ శ్రీలంకపై న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 177 బంతుల్లో సెంచరీ చేసి, టెస్టులో తన 27వ సెంచరీని కేన్ విలియమ్సన్ నమోదు చేశాడు.

యూపీ వారియర్స్‌పై హర్మన్‌ప్రీత్ కౌర్ సునామీ ఇన్నింగ్స్

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. కేవలం 33 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 53 పరుగులు చేసింది.

గుడ్‌న్యూస్.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో ఫలితం లేకుండానే టీమిండియా గుడ్‌న్యూస్ అందింది. క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకను న్యూజిలాండ్ ఓడించడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించింది.

WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. మొదటి నాలుగు మ్యాచ్‌లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది. వరుస పరాజయాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్‌కి శ్రేయాస్ అయ్యర్ దూరం..!

టీమిండియా స్టార్ బ్యాట్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి గాయం కారణంగా ఆఖరి రోజుకు ఆటకు దూరమయ్యాడు. మూడో రోజు ఫీల్డింగ్ చేస్తూ వెన్నునొప్పితో పెవిలియన్ చేరిన శ్రేయాస్ అయ్యర్‌ని అఖరి టెస్టు ఆఖరి రోజు నుంచి తప్పినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ

ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని కొట్టినందుకు భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీకి నటి అనుష్క శర్మ అతిపెద్ద చీర్‌లీడర్‌గా మారారు. అతను నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై తన చివరి టెస్టు సెంచరీని సాధించాడు.

WPL 2023 : చెలరేగిన కెప్టెన్.. ముంబై ఇండియన్స్‌కు నాలుగో విజయం

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో ముందుకెళ్తోంది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ అదరగోట్టారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీవారియర్స్ 20 ఓవర్లలో 159/6 స్కోరు చేసింది.

IND vs AUS: గిల్ సెంచరీ, కోహ్లీ హాఫ్ సెంచరీ.. రాణిస్తున్న బ్యాటర్లు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు.

సానియా చాలామందికి స్పూర్తినిచ్చిందన్న ప్రధాని మోదీ

భారత్ మహిళ టెన్నిస్ కు వెలునిచ్చిన సానియా మీర్జా ఇటీవలే తన రిటైర్మెంట్ ప్రకటించింది. గడిచిన దశాబ్దన్నర కాలంగా భారత టెన్నిస్‌కి ఎనలేని సేవలను హైదరాబాద్ స్టార్ సానియా మీర్జా చేసింది. అయితే ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించిన సానియా.. ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌తో శాశ్వితంగా టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది.

ఆస్ట్రేలియాపై మరో ఫీట్‌ను సాధించిన పుజారా

భారత వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ మైలురాయిని అందుకున్నాడు.

PSL: టీ20ల్లో అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సంచలన రికార్డులు నమోదవుతున్నాయి. మ్యాచ్ స్కోర్లు 200 ప్లస్ దాటినా చేజింగ్ జట్లు అవలీలగా టార్గెట్‌ను చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీల మధ్య జరిగిన మ్యాచ్‌లో చరిత్రాత్మక రికార్డు అవిష్కరించబడింది.

INDvsAUS : ఆస్ట్రేలియాపై గిల్ సూపర్ సెంచరీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విజృంభించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న అతను.. తన కెరీర్‌లో రెండో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు.

అభిమానిని కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశేణి ఆల్ రౌండర్లలో ఒకరు. ప్రస్తుతం టీ20లు, టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మైదానంలో, వెలువల ఒక్కొసారి షకీబ్ వింతగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో తరుచూ సమస్యల్లో చిక్కుకుంటాడు.

అంతర్జాతీయ క్రికెట్లో హిట్‌మ్యాన్ కొత్త రికార్డు

అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ కొత్త రికార్డును సృష్టించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో 17000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.

SL vs NZ: అర్ధ సెంచరీతో రాణించిన మాట్ హెన్రీ

న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మాట్ హెన్రీ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 75 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 373 పరుగులకు అలౌటైంది. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

NZ vs SL: సెంచరీతో విజృభించిన డారిల్ మిచెల్

క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో డారిల్ మిచెల్ సెంచరీతో విజృంభించాడు. తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న శ్రీలంకను న్యూజిలాండ్ గట్టి ఎదుర్కొంటొంది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు అలౌటైంది.

పాకిస్తాన్ లీగ్‌లో దంచికొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్ రూసో

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ రూసో విధ్వంసం సృష్టించాడు. కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. శుక్రవారం పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

WPL : యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ వీర బాదుడు

మహిళల ప్రీమియర్ లీగ్‌లో వరుసగా నాలుగోసారి ఆర్సీబీ ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అనంతరం యూపీ వారియర్స్ 13 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగోసారి పరాజయం పాలైంది. శుక్రవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోరంగా విఫలమైంది. సీజన్ ప్రారంభం నుంచి ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని బెంగళూరు మరోసారి ఓటమిపాలైంది.

అండర్సన్ రికార్డును సమం చేసిన రవిచంద్రన్ అశ్విన్

భారత్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును బ్రేక్ చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్ల వేట కొనసాగించిన అశ్విన్ అండర్సన్ రికార్డును సమం చేశారు. 32సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ చరిత్ర సృష్టించారు.

IND VS AUS: ఉస్మాన్ ఖావాజా వీర విజృంభణ

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో ఉస్మాన్ ఖావాజా చెలరేగిపోయాడు. 422 బంతుల్లో 180 (21 ఫోర్లు) పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 450 మార్కును దాటింది.

IND vs AUS:విరాట్ కోహ్లీ క్యాచ్‌ల్లో 'ట్రిపుల్ సెంచరీ'

అహ్మదాబాద్‌ వేదికగా ఇండియా- ఆస్ట్రేలియా నాలుగో టెస్టు రికార్డులకు వేదికగా మారింది. రెండు రోజుల్లోనే బోలెడు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు.

IPL 2023 : ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ విడుదల

ఐపీఎల్ మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వచ్చే ఐపీఎల్ నుంచి కొత్త జెర్సీలో దర్శనమివ్వనుంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 16వ సీజన్‌కు ముందు ముంబై కొత్త నిర్ణయం తీసుకుంది. ఏకంగా తమ జట్టు జెర్సీనే మార్చేసింది.

IND vs AUS: సెంచరీతో మెరిసిన కామెరాన్ గ్రీన్

భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు చక్కగా రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే.

10 Mar 2023

శ్రీలంక

NZ vs SL: తొలి టెస్టులో పట్టు బిగించిన శ్రీలంక

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 355 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కరుణరత్నే 50 పరుగులు చేయగా కుశాల్ మెండిస్ 87 పరుగులతో రాణించారు.

భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డ ధోని.. చైన్నై ఫ్యాన్స్ హ్యాపీ

చాలారోజుల తర్వాత మళ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్సర్ చూసే భాగ్యం చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులు లభించింది. ఐపీఎల్ స్వదేశానికి తిరిగొచ్చిన వేళ.. అన్ని టీమ్స్ తమ హోమ్ గ్రౌండ్స్‌లో ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలు పెట్టాయి. అందులో భాగంగా చైన్నైసూపర్ కింగ్స్ జట్టు కూడా చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది.

డేనియల్ వెటోరీని దాటేసిన కివీస్ కెప్టెన్ టీమ్ సౌథీ

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనతను సాధించాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో 5వికెట్లు పడగొట్టిన సౌథీ న్యూజిలాండ్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కి మాతృవియోగం

ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మరియా ఈ రోజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సిడ్నీలో తుదిశ్వాస విడిచారు.

టెస్టుల్లోకి హార్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ.. బీసీసీఐ క్లారిటీ..!

టీమిండియా స్టార్ ఆలౌరౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్ధిక్ వన్డేలు, టీ20లను మాత్రమే ఆడతున్నాడు.

WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బోణి కొట్టేనా..?

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఉసూరుమనిపిస్తూ అభిమానులకు తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తుంది. పేరులో రాయల్, జట్టు నిండా స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇంతవరకు ఖాతా తెరవలేదు.

యూరోపా లీగ్‌లో రియల్ బెటిస్‌ను మట్టికరిపించిన మాంచెస్టర్ యునైటెడ్

యూరోపా లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ సత్తా చాటింది. రియల్ బెటిస్‌ను 4-1తో మాంచెస్టర్ యునైటెడ్ మట్టికరిపించింది. లివర్‌పూల్ చేతిలో 7-0తో ఓడిపోయిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ పుంజుకొని విజృంభించింది.

ఆస్ట్రేలియా మీడియాపై మండిపడ్డ సునీల్ గవాస్కర్

ఇండియా పిచ్‌ల గురించి ఆస్ట్రేలియా మీడియా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. భారత్ పిచ్‌లను 'పిచ్ డాక్టరింగ్' అంటూ కాస్త కఠినంగా ఆస్ట్రేలియా మీడియా వ్యవహరిస్తోంది.