క్రీడలు వార్తలు | పేజీ 5

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

IND vs AUS: మూడో టెస్టులో అర్ధ సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజ

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 47 పరుగుల అధిక్యంలో నిలిచారు.

SA vs WI: తొలి టెస్టులో ఐదు వికెట్ల తీసి సత్తా చాటిన అల్జారీ జోసెఫ్

సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ బౌలర్ అల్లారీ జోసెఫ్ అద్భుతంగా రాణించాడు. తన టెస్టు క్రికెట్‌లో మొదటి సారిగా ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో తొలి టెస్టులో 2వ రోజు దక్షిణాఫ్రికా 342 పరుగులకు ఆలౌటైంది.

INDvsAUS : మళ్లీ నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. నిరుత్సాహంలో ఫ్యాన్స్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేసిన టాడ్ మార్ఫీ తొలి టెస్టులోనే ఆకట్టుకున్నాడు. ఢిల్లీ టెస్టులో ఫర్వాలేదనిపించాడు. నిన్నమెన్నటి వరకు ఆస్ట్రేలియా క్రికెట్ లో పెద్దగా ఎవరికి తెలియని పేరు టాడ్ మార్ఫీ. ఇప్పుడు విరాట్ కోహ్లీని వరుసగా మూడుసార్లు అవుట్ చేసిన మర్ఫీ ఆసీస్‌లో స్టార్ ప్లేయర్ అయిపోయాడు.

IND vs AUS: ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు 109 పరుగులకే టీమిండియా ఆలౌట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది. వరుసగా రెండు టెస్టులో ఆసీస్ ను ఓడించిన భారత్.. మూడో టెస్టులో మాత్రం తేలిపోయింది.

ఐసీసీ నెంబర్.1 టెస్టు బౌలర్‌గా అశ్విన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. గతవారం ఐసీసీ నెంబర్ వన్ 1 టెస్టు బౌలర్ గా అవతరించిన జేమ్స్ అండర్సన్ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రాణించలేకపోయాడు. దీంతో రెండో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 864 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Ben Stokes: ఐపీఎల్‌లో మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా

చైన్నై సూర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి, అభిమానులకు గుడ్ న్యూస్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్సోక్ ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. జూన్ 1 నుంచి ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ టెస్టు నేపథ్యంలో ఐపీఎల్ చివరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అతనికి ఇంగ్లండ్ యాజమాన్యం ఐపీఎల్ ఆడటానికి ఎన్ఓసీ ఇచ్చింది.

ఆస్ట్రేలియా దిగ్గజానికి దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన రవిశాస్త్రి

టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ స్పిన్నర్లు విజృంభించారు. ఇండోర్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. ఆరో ఓవర్లో బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించిన ఆసీస్‌ స్పిన్నర్‌ మాథ్యూ కుహ్నెమన్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(12) వికెట్‌తో ఖాతా తెరిచాడు.

ఫిఫా అవార్డులలో రోనాల్డ్ ఓటు వేయకపోవడానికి కారణం ఇదేనా..?

ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డ్ సౌదీ ప్రొ లీగ్‌లో ఆడుతున్నాడు. గతేడాది ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్‌కి నాయకత్వం వహించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌ తెగదెంపులు చేసుకున్న అనంతరం.. రొనాల్డ్ దుబాయ్‌కు చెందిన అల్‌నజర్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Ind Vs Aus: షేన్‌వార్న్ రికార్డును బద్దలు కొట్టిన నాథన్ లియోస్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. పేస్‌కు అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై స్పిన్ బౌలర్లు చెలరేగుతున్నారు. మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్ వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు.

IND vs AUS: మూడో టెస్టులో అశ్విన్‌ను ఊరిస్తున్న నెం.1 రికార్డు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ల నడ్డి విరిచిన అశ్విన్ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

IND vs AUS: 3వ టెస్టులో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

SA vs WI: ఐడెన్ మార్ర్కమ్ సూపర్ సెంచరీ.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అదరగొట్టిన ఐడెన్ మార్ర్కమ్ టెస్టులోనూ తన జోరును కొనసాగుతున్నాడు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. 174 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో 115 పరుగులు చేశాడు.

SA vs WI: అర్ధ సెంచరీతో అదరగొట్టిన ఎల్గర్

వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో ధక్షిణాఫ్రికా ఓపెనింగ్ స్టార్ బ్యాటర్ ఎల్గర్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. 118 బంతుల్లో 71 పరుగులు చేశాడు. తొలి వికెట్ కు మార్క్‌రమ్, ఎల్గర్ కలిసి 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్‌కు బుమ్రా దూరం

ఐపీఎల్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కి భారీ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయయాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా ఎనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దక్షిణాఫ్రికా తరుపున టెస్టులో అరంగేట్రం చేసిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టోనీ డి జోర్జి, గెరాల్డ్ కోయెట్జీ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల దేశవాళీ క్రికెట్లు ఇద్దరు బాగా రాణించడంతో వాళ్లు తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. బ్యాట్‌మెన్‌గా డిజోరి, రైట్ ఆర్మ్ పేసర్ గా కోయెట్టీ జట్టులో రాణించనున్నారు.

ఇంగ్లండ్‌తో పోరుకు బంగ్లాదేశ్ సై

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తలపడేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. మార్చి 1 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోపక్క ఇంగ్లండ్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. అయితే ఇరు జట్లు వన్డే సిరీస్ పై కన్నేయడంతో సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉండనుంది.

ఇరానీ కప్‌లో తలపడనున్న మధ్యప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా

గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో మార్చి 1 నుంచి మధ్య ప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా టీం మధ్య ఇరానీ కప్ టోర్నీ జరగనుంది. రంజీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన మిగిలిన జట్ల ప్లేయర్లను ఓ టీమ్‌‌గా చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌గా, రంజీ ట్రోఫీ విజేతతో ఇరానీ కప్ జరుగుతుంది

Novak Djokovic: టెన్నిస్‌లో జకోవిచ్ ప్రపంచ రికార్డు

ప్రపంచ టెన్నిస్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ప్రపంచ పురుషుల ర్యాకింగ్స్‌లో ఏ ప్లేయర్ కు సాధ్యం కాని రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

pakistan super league: ధోనీలాగా షాట్ కొట్టిన రషీద్ ఖాన్

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 లో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై లాహోర్ ఖలందర్స్ భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 20 ఓవర్లలో 200/7 స్కోరు చేసింది. అబ్దుల్లా షఫీక్ 24 బంతుల్లో 45 పరుగులు చేశాడు.

క్రికెట్ దేవుడు సచిన్ కోసం భారీ విగ్రహం.. ఫ్యాన్స్‌కు పండుగే

క్రికెట్‌లో అభిమానులందరూ సచిన్‌ను దేవుడితో కొలుస్తారు. ధోని నుంచి కోహ్లీ వరకూ అందరూ సచిన్‌ను ఆరాధిస్తుంటారు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ ఎంతోమంది స్ఫూర్తిధాయకంగా నిలిచాడు. మాస్టర్ బ్లాస్టర్ గా కీర్తి గడించిన సచిన్ కు ప్రస్తుతం అరుదైన గౌరవం దక్కనుంది. సచిన్ త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసుకోనునడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది.

IND vs AUS : ముగ్గురు స్పిన్నర్లతో ఆడించడం అనవసరం

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు వార్ ఫ్యాన్స్‌కు మజానిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రోఫీలో భాగంగా రెండు టెస్టులో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో టీమిండియా 2-0 అధిక్యంలో నిలిచింది.

Best FIFA Football Awards: ఉత్తమ ఆటగాడిగా లియోనెల్ మెస్సీ

పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్ బాల్ అవార్డ్స్ వేడుక వైభవంగా జరిగింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ కి బెస్ట్ మెన్స్ ప్లేయర్ కిరీటం వరించింది.

కోహ్లీ, బాబర్‌ను అవుట్ చేయాలి : పాక్ స్టార్ పేసర్

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం తమ డ్రీమ్ అని ఎంతోమంది బౌలర్లు చెబుతుంటారు. కోహ్లీ క్రీజులో నిల్చుకుంటే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు, అందుకే ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లీ వికెట్ కీలకం. ఎలాగైనా కోహ్లీ వికెట్ తీయాలని బౌలర్లు శ్రమిస్తుంటారు. ప్రస్తుతం కోహ్లీ వికెట్ తీయడం తన లక్ష్యమని పాకిస్తాన్ యువ స్టార్ పేసర్ హారిస్ పేర్కొన్నారు.

టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ రికార్డు.. ఒక పరుగు తేడాతో విజయం

బజ్‌బాల్ విధానంతో దూసుకెళ్తున్న ఇంగ్లండ్‌కు టెస్టులో మొదటిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 258 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లండ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. కివిస్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకొని పరువును నిలబెట్టుకుంది.

NZ Vs Eng: వారెవ్వా.. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బకు బిత్తిరిపోయిన బ్యాటర్లు

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ జాకోలీచ్ అద్భుత బౌలింగ్‌తో అకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌కు జాక్ క్రాలే, బెన్ డకెట్ ఘనమైన ఆరంభాన్ని అందించారు. కేన్ విలియమ్సన్ మెరుపు సెంచరీతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

మార్చి 15 నుంచి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్

టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ తో , ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఐబిఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో బరిలోకి దిగనున్నారు.

కేన్ విలియమ్సన్ ఘనత; న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు

స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వెల్లింగ్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 2వ టెస్టులో 4వ రోజున అతను రాస్ టేలర్‌ను అధిగమించాడు. అంతేకాదు విలియమ్సన్ తన 26వ సెంచరీని కూడా ఈ ఫార్మాట్‌లో పూర్తి చేసుకున్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం

కేప్‌టౌన్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయ దుందుభిని మోగించింది. దక్షిణాఫ్రికాను 19పరుగుల తేడాతో ఓడించి ఏకంగా ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Tim Southee: ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేసిన టిమ్ సౌథి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. 2వ రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 138/7 వద్ద కొట్టుమిట్టాడుతోంది.

Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ

మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కేప్‌టౌన్‌ వేదికగా ఆదివారం జరగనుంది. నిర్ణయాత్మక పోరులో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మహిళల జట్లు తలపడనున్నాయి.

Eng vs Nz Test: కేన్ మామను తొమ్మిదోసారి ఔట్ చేసిన జేమ్స్ అండర్సన్

న్యూజిలాండ్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జేమ్స్ ఆండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో కేన్ విలియమ్సన్‌ను ఏకంగా తొమ్మిదోసారి ఔట్ చేశాడు. ఈ ఫార్మాట్‌లో విలియమ్సన్‌‌ను ఆరు సార్లకు మించి ఏ బౌలర్ కూడా ఔట్ చేయలేదు. ఆండర్సన్ ఒక్కరే తొమ్మిసార్లు కేన్ మామను తొమ్మిది సార్లు పెవిలియన్‌కు పంపాడు.

South Africa World Cup Final: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి

కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20ప్రపంచ కప్ 2023లో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. న్యూలాండ్స్‌లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సఫారీ టీమ్ ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్.. మూడో టెస్టుకు కామెరాన్ గ్రీన్ సిద్ధం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాయంతో మొదటి రెండు మ్యాచ్ లకు కామెరాన్ గ్రీన్ దూరమయ్యాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. మూడో టెస్టు కోసం తాను వందశాతం ఫిట్‌గా ఉన్నానని ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ చెప్పాడు.

క్లబ్ గోల్స్‌తో రికార్డు సృష్టించిన లెవాండోస్కీ

యూరోపియన్ క్లబ్ ఫుట్‌బాల్‌లో రాబర్ట్ లెవాండోస్కీ అరుదైన రికార్డును సృష్టించాడు. 2022-23లో UEFA యూరోపా లీగ్ ప్లేఆఫ్ 2వ-లెగ్ టైలో మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరపున 25వ గోల్ చేసి రికార్డుకెక్కాడు.

అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన సెర్గియో రామోస్

స్పానిష్ స్టార్ ఆటగాడు సెర్గియో రామోస్ గురువారం తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రామోస్ 2010 FIFA ప్రపంచ కప్, 2008, 2012లో యూరోపియన్ ఛాంపియన్ షిప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2005లో అరంగేట్రం చేసిన సెర్గియో రామోస్ అత్యధిక క్యాప్‌లు సాధించిన ఆటగాడి చరిత్రకెక్కాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన సూఫియా సూఫీ

భారత్ ఆల్ట్రా రన్నర్ సుఫియా సూఫీ ఖాన్ మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది . ఖతార్‌లో వేగవంతమై నరన్నింగ్ పూర్తి చేసి ఈ ఘనతను సాధించింది. తన కెరియర్‌లో నాల్గొసారి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించడానికి ఎన్నో అడ్డంకులను ఆమె అధిగమించింది.

PSL 2023: అర్ధ సెంచరీతో చెలరేగిన బాబార్ ఆజం

ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2023 పోరులో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజామ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో తన కెరియర్‌లో 73వ టీ20 హాఫ్ సెంచరీని నమోదు చేయడం గమనార్హం.

Womens T20 World Cup 2023 Finalలోకి ఏడోసారి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా

ఐసీసీ టీ20 మహిళల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతోంది. ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ఏడోసారి వరల్డ్ కప్ టీ20 ఫైనల్లోకి చేరుకుంది. ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ పోరులో విజేతతో తలపడనుంది. ఫైనల్ ఫిబ్రవరి 26న న్యూలాండ్స్‌లో జరుగుతుంది.

ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్.. పాట్ కమిన్స్ దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్ తగిలింది. వ్యక్తిగత పనిమీద విదేశాలకు వెళ్లిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్ మూడో టెస్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.

ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన హ్యారీ బ్రూక్

ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ టెస్టులో చేలరేగిపోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన బ్రూక్.. రెండో టెస్టులో సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో కేవలం 109 బంతుల్లోనే తన సెంచరీని మార్క్ ను అందుకున్నాడు.