క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
17 Mar 2023
గుజరాత్ జెయింట్స్WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జెయింట్స్ విజయం.. ఫ్లేఆఫ్ ఆశలు సజీవం
మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో సత్తా చాటింది. ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నమెంట్ లో రెండో విక్టరీని నమోదు చేసింది.
17 Mar 2023
బ్యాడ్మింటన్భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ విజయాలపై ఓ కన్నేయండి
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. సైనా నెహ్వాల్ నేడు 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె సాధించిన విజయాలను కొన్ని తెలుసుకుందాం. ఒలంపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత షట్లర్‌గా సైనాకు రికార్డు ఉంది.
17 Mar 2023
విరాట్ కోహ్లీవిరాట్ కోహ్లీ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ ప్లేయరే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని, ఇప్పుడు అతని బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు.
17 Mar 2023
చైన్నై సూపర్ కింగ్స్వామ్మో ధోని.. ఆ కండలతో కొడితే సిక్సర్ల వరదే..!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని నెట్స్ శ్రమిస్తున్నాడు. సీఎస్‌కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోని.. ఈ ఎడిషన్‌లో ఎలాగైనా టైటిల్ తో కెరీర్ ఘనంగా ముగించాలని తహతహలాడుతున్నాడు.
16 Mar 2023
క్రికెట్వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీతో యూఏఈ ఆటగాడు ఆసిఫ్ ఖాన్ రికార్డు
కీర్తిపూర్‌లో నేపాల్‌తో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో యుఏఈ ఆటగాడు ఆసిఫ్ ఖాన్ చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
16 Mar 2023
విరాట్ కోహ్లీఆస్ట్రేలియాపై కోహ్లీ సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి
ఇటీవల వన్డేల్లో సూపర్ ఫామ్ ను అందుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో సత్తా చాటాడు. దీంతో తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ప్రస్తుతం కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.
16 Mar 2023
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుఆర్సీబీకి గట్టి ఎదురుబెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం
ఐపీఎల్ 2023 ప్రారంభానికే ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో విల్ జాక్స్ గాయపడ్డారు. దీంతో ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్లిపోయాడు.
16 Mar 2023
సన్ రైజర్స్ హైదరాబాద్సన్ రైజర్స్‌కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 ప్రారంభం కావడానికి సమయం అసన్నమైంది. ఈనెల 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచేజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నారు.
16 Mar 2023
రోహిత్ శర్మవన్డేల్లో ఆస్ట్రేలియాపై రోహిత్‌కు మెరుగైన రికార్డు
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఈనెల 17న ప్రారంభం కాబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మొదటి వన్డేకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవ్వగా..రెండు, మూడు వన్డేలకి అందుబాటులో ఉండనున్నాడు. దీంతో మొదటి వన్డేకి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు.
16 Mar 2023
కలకత్తా నైట్ రైడర్స్ఐపీఎల్కు శ్రేయాస్ అయ్యర్ దూరం.. కెప్టెన్సీ రేసులో ముగ్గురు ఆటగాళ్లు..!
మార్చి 31న ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ఆహ్మదాబాద్‌లో జరిగిన చివరి టెస్టులో అయ్యర్ గాయపడటంతో బ్యాటింగ్ కూడా దిగలేదు.
16 Mar 2023
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుWPL: యూపీ వారియర్స్‌పై కనికా ఆహుజా సునామీ ఇన్నింగ్స్
2023 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఎట్టకేలకు బోణి కొట్టింది. యూపీ వారియర్స్ జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
16 Mar 2023
టీమిండియాటీమిండియా, ఆస్ట్రేలియా వన్డే సమరానికి సర్వం సిద్ధం
భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను ఓడిన ఆస్ట్రేలియా.. టీమిండియాతో వన్డే సమరానికి సిద్ధమైంది. శుక్రవానం నుంచి మొదటి వన్డేలో టీమిండియాను ఆస్ట్రేలియా ఢీకొట్టనుంది. ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1 భారత్ కైవసం చేసుకుంది. టీమిండియాకు హార్ధిక్ పాండ్యా, ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
16 Mar 2023
రోహిత్ శర్మఅత్యంత అరుదైన రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ ముంబై వేదికగా శుక్రవారం జరగనుంది. మొదటి వన్డేకి కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం లేదు. ఈ వన్డే సిరీస్‌లో హిట్ మ్యాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకొనే అవకాశం ఉంది.
16 Mar 2023
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుWPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు వరుస పరాజయాలకు చెక్ పెడుతూ ఆర్సీబీ ఎట్టకేలకు ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం రాత్రి యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.
16 Mar 2023
శ్రేయస్ అయ్యర్ఆసీస్తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టులో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్.. ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కి దూరమయ్యాడు.
16 Mar 2023
టీమిండియా'నాటు నాటు' పాటకు స్టేప్పులేసిన సురేష్ రైనా, హర్భజన్
చిత్రం ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఎంతోమంది ఈ పాటకు స్టెప్పులు లేస్తూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి టీమిండియా క్రికెటర్లు కూడా చేరారు.
16 Mar 2023
బ్యాడ్మింటన్ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకి చేదు అనుభవం
బర్మింగ్‌హామ్‌లో బుధవారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు చేదు అనుభవం ఎదరైంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, రెండు సార్లు ఒలంపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిరాశ పరిచింది.
16 Mar 2023
ఢిల్లీ క్యాపిటల్స్‌ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో ఉన్నదెవరు..?
మార్చి 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. 2023 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచేజీ నూతన కెప్టెన్‌ను ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది చివర్లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 2023 ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.
15 Mar 2023
టీమిండియాWTC: వికెట్ కీపర్ ఎంపికపై డైలామాలో టీమిండియా
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా జూన్ 7న తలపడనున్నాయి. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 2-1తో టీమిండియా ఓడించింది.
15 Mar 2023
విరాట్ కోహ్లీఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో సెంచరీతో సత్తా చాటిన టీమిండియా స్టార్ ఆటగాడు కింగ్ కోహ్లీ (705) ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకున్నాడు.
15 Mar 2023
వెస్టిండీస్SA vs WI : సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి వెస్టిండీస్ సిద్ధం
ఇటీవల వెస్టిండీస్‌ను సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో 2-0తో ఓడించింది. వన్డేలో కూడా వెస్టిండీస్‌ను ఓడించి సత్తా చాటాలని సౌతాఫ్రికా భావిస్తోంది. టెస్టు సిరీస్‌లో ఓడిన వెస్టిండీస్ ఎలాగైనా సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
15 Mar 2023
క్రికెట్2023లో వన్డేలకు ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గుడ్‌బై..!
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో సీనియర్లుగా మారుతున్న స్టార్ ఆటగాళ్లు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి మిగతా ఫార్మాట్లో రాణించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ స్టార్ ఆటగాళ్ల దృష్టి ఫ్రాంఛేజీల వైపు మళ్లుతోంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఆడి రిటైరయ్యే యోచనలో ఆ స్టార్ ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం.
15 Mar 2023
రవిచంద్రన్ అశ్విన్ఐసీసీ ర్యాకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్‌గా రవిచంద్రన్ అశ్విన్
అంతర్జాతీయ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను తాజాగా అంతర్జాతీయ కౌన్సిల్ విడుదల చేసింది. గతంలో టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటు ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ అండర్సన్ ఇద్దరు 859 పాయింట్లతో సమానంగా నిలిచారు.
15 Mar 2023
ఆస్ట్రేలియాభారత్తో జరిగే వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. కెప్టెన్‌గా స్మిత్
భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. టీమిండియా చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా ప్రస్తుతం వన్డే సమరానికి సిద్ధమైంది. టెస్టుల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.
15 Mar 2023
భారత జట్టుగంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ ఏడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. దీనికి సంబంధించిన వన్డే టికెట్లు గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాడు.
15 Mar 2023
బ్యాడ్మింటన్ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్ శుభారంభం
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్స్ లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభాన్ని అందించారు. మంగళవారం బర్మింగ్ హామ్ లో జరిగిన పురుషుల సింగ్స్ లో లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు.
15 Mar 2023
బాక్సింగ్World Boxing Championships: మహిళల బాక్సింగ్ పోరుకు వేళాయే
ప్రతిష్టాత్మక మహిళల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు వేళయైంది. న్యూఢిల్లీలోని కేడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్‌కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తియ్యాయి. మూడోసారి ఈ పోటీల నిర్వహణకు భారత్ సిద్ధమైంది.
15 Mar 2023
టీమిండియామైఖేల్ వాన్‌కు వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్
టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అనేక సార్లు మాటల యుద్దానికి దిగారు.
15 Mar 2023
మంచెస్టర్ సిటీరికార్డు బద్దలు కొట్టిన ఎర్లింగ్ హాలాండ్
ఎతిహాద్‌లో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ రౌండ్ 16 సెకండ్-లెగ్ టైలో మాంచెస్టర్ సిటీ సత్తా చాటింది. లీప్‌జిగ్‌ను 7-0తేడాతో మాంచెస్టర్ సిటీ చిత్తు చేసింది. దీంతో సిటీ క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది.
15 Mar 2023
గుజరాత్ జెయింట్స్ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో విజృంభిస్తున్న బ్రంట్, మాథ్యూస్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ తరుపున నాట్ స్కివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్ మూడు కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
15 Mar 2023
ముంబయి ఇండియన్స్WPL : వరుసగా ముంబై ఐదో విజయం.. ప్లేఆఫ్‌లో బెర్త్ ఖరారు
ప్రత్యర్థితో సంబంధం లేకుండా ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయఢంకా మోగించింది. ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో సగర్వంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో మరో మూడు మ్యాచ్‌లు మిగిలుండగానే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
14 Mar 2023
ఇండోర్ఇండోర్ పిచ్‌పై ఐసీసీకి బీసీసీఐ అప్పీల్
ఇండోర్ స్టేడియానికి ఇచ్చిన పిచ్ రేటింగ్‌పై ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ఐసీసీ పేలవమైన పిచ్ అంటూ గతంలో ఈ స్టేడియానికి మూడు డీమెరిట్ పాయింట్లను విధించింది.
14 Mar 2023
రవిచంద్రన్ అశ్విన్బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన అశ్విన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో దక్కించుకుంది. ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను సృష్టించాడు. సిరీస్ మొత్తం 25 వికెట్లు పడగొట్టి, 86 పరుగులు చేశాడు.
14 Mar 2023
కెఎల్ రాహుల్డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాహుల్‌ని ఆడించాలి : గవాస్కర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. అటు శ్రీలంకను తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓడించడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌కు టీమిండియా క్వాలిఫై అయింది. ఇప్పుడు ఫైనల్లోనూ ఆస్ట్రేలియాతోనే టీమిండియా టైటిల్ కోసం పోరాడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశారు.
14 Mar 2023
రవిచంద్రన్ అశ్విన్ఇలా అయితే బౌలింగ్ జాబ్ వదిలేస్తానన్న అశ్విన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా వరుసగా నాలుగోసారి గెలుచుకుంది.
14 Mar 2023
పాకిస్థాన్పాక్ జట్టును ఇండియాకు పంపిస్తే భద్రతా సమస్యలు: పీసీబీ ఛైర్మన్
ఆసియా కప్ 2023 టోర్ని వేదిక విషయంలో రేగిన సందిగ్ధత ఇప్పట్లో తెగేలా లేదు. పాకిస్తాన్ లో ఆసియా కప్ 2023 టోర్ని జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో నిర్వహిస్తే అక్కడికి టీమిండియా వెళ్లదని, తటస్థ వేదికపై టోర్నిని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పిన విషయం తెలిసిందే.
14 Mar 2023
ఆస్ట్రేలియాఆస్ట్రేలియాకు వన్డే సారిథిగా స్టీవ్ స్మిత్
మార్చి 17 నుంచి టీమిండియాతో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
14 Mar 2023
ఢిల్లీ క్యాపిటల్స్ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు పెంచుతున్న శిఖా పాండే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో శిఖాపాండే శివంగిలా దుమ్ములేపుతోంది. తన బౌలింగ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై మూడు కీలక వికెట్లు పడగొట్టింది.
14 Mar 2023
రోహిత్ శర్మడబ్య్లూటీసీ ఫైనల్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా నాలుగోసారి టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌పై శ్రీలంక ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.
14 Mar 2023
టీమిండియాకోల్కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న కెప్టెన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.