క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

28 Mar 2023

ఐపీఎల్

IPL 2023: ఐపీఎల్‌లో కొత్త రూల్స్ ఇవే

ఐపీఎల్ మాజా ఇంకా మూడురోజులలో ప్రారంభ కానుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లో చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోటీపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో బీసీసీఐ కొన్ని మార్పులను తీసుకొచ్చింది. పోయిన ఏడాది నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు పోటీ పడుతున్నాయి.

28 Mar 2023

ఐపీఎల్

కెప్టెన్‌గా నితీష్ ఎంపికపై కేకేఆర్ తప్పు చేసిందంటూ ట్రోల్స్..!

ఐపీఎల్ లో రెండు సార్లు టైటిగ్ నెగ్గిన కోల్ కత్తా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గాయంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు.

28 Mar 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో రఫ్పాడించడానికి అండ్రీ రస్సెల్ రెడీ

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ అండ్రీ రస్సెల్ ఐపీఎల్‌లో రఫ్పాడించడానికి సిద్ధమయ్యాడు. 2014 నుంచి కోల్ కత్తా నైట్ రైడర్స్ తరుపున అడుతున్న అండ్రీ రస్సెల్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రస్సెల్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఈ ఐపీఎల్‌లో రస్సెల్ కొన్ని రికార్డులను బద్దలుకొట్టనున్నాడు.

పాకిస్థాన్ తొలి బౌలర్‌గా షాదాబ్ ఖాన్ సంచలన రికార్డు

పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ సంచలన రికార్డును నమోదు చేశాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20ల్లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. పాక్ తరుపున టీ20ల్లో 100 వికెట్లు తీసిన తీసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

బాబర్ కంటే కోహ్లీనే బెస్ట్ : పాక్ మాజీ ఆల్ రౌండర్

ప్రపంచ స్థాయి క్రికెట్లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఇద్దరు బెస్ట్ క్రికెటర్లుగానే కనిపిస్తారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్, ఫీల్లిండ్, కెప్టెన్సీ ఇలా చెప్పుకుంటూ అన్నింట్లో అత్యుత్తమంగా రాణిస్తాడు. ప్రస్తుతం విరాట్‌తో బాబర్ ను ఎక్కువగా పోలుస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి అరుదైన గౌరవం

లియోనల్ మెస్సీ.. ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాల్లో కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. ఎందకంటే అతడు సాధించిన ఘనతలకే అందుకు కారణం.

బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్‌లోకి వచ్చేనా..?

బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తోంది. స్వీస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రౌండ్ రౌండ్‌కే పరిమితమైంది. ప్రస్తుతం స్పెయిన్ మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు సమయం అసన్నమైంది. ఈ సీజన్లో టైటిల్ కొట్టాలని పీవీ సింధు పట్టుదలతో ఉంది.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ విజేత నిఖత్ జరీన్‌కు 'థార్' బహుమతి

ఢిల్లీ జరుగుతున్నప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

27 Mar 2023

ఐపీఎల్

2023 ఐపీఎల్‌లో సత్తా చాటే ఐదుగురు ఆల్ రౌండర్లు వీరే

గుజరాత్ టైటాన్స్ తరుపున హార్ధిక్ పాండ్యా బరిలోని దిగనున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్‌లలో ఒకడిగా నిలిచాడు.

ఐపీఎల్‌లో అందరి చూపులు మహేంద్ర సింగ్ ధోనిపైనే!

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఎల్లో ఆర్మికి నాలుగు టైటిళ్లను ధోని అందించాడు. ఈ సీజన్ ధోనికి చివరదని ప్రచారం జరుగుతుండటంతో అందరి కళ్లు అతనివైపే ఉన్నాయి. ధోని బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.2023 ఐపీఎల్‌లో పలు రికార్డులపై కన్నేశాడు.

టోటెన్‌హామ్ హాట్స్‌పుర్ నుండి వైదొలిగిన ఆంటోనియో కాంటే

ఉన్నత స్థాయి నిర్వాహకులలో ఒకరైన హెడ్ కోచ్ ఆంటోనియో కాంటే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. టోటెన్ హామ్ హాట్స్‌పుర్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. సోమవారం ఈ విషయాన్ని క్లబ్ అధికారిక ప్రకటన చేసింది.

టీ20 సిరీస్‌‌లకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా టామ్ లాథమ్

శ్రీలంక, పాకిస్థాన్‌తో త్వరలో న్యూజిలాండ్ జట్టు టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు.

పొలిటికల్ కెరీర్‌పై శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది మయాంక్ అగర్వాల్ స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇప్పటికే పంజాబ్ టీం కలిసి తమ గ్రౌండ్ మొహలీల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

2023 ఐపీఎల్‌లో రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డులివే

ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా 4 రోజులే సమయం ఉంది. ఈ ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులకు చేరువలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌ని 5 సార్లు టోర్నీ విజేతగా నిలపడటంతో రోహిత్ సక్సస్ అయ్యాడు.

టీ20ల్లో ఆప్ఘనిస్తాన్ ప్లేయర్ అద్భుత ఘనత

పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్తాన్ తొలి అంతర్జాతీయ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20ల్లో పాక్‌పై ఆప్ఘనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండానే అప్ఘన్ సిరీస్‌ను సాధించింది.

ఆప్ఘనిస్తాన్ విజయంపై షోయబ్ ఆక్తర్ హర్షం

పాకిస్థాన్ జట్టుపై ఆప్ఘనిస్తాన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మొదటి, రెండో టీ20ల్లో పాక్‌ను ఆప్ఘన్ చిత్తు చేసింది. దీంతో 2-0తో టీ20 సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆప్ఘన్ కైవసం చేసుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.

పాక్ క్రికెటర్‌కు ఘోర అవమానం.. బాడీ షేమింగ్‌ చేస్తూ..!

పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20ల్లో చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20ల్లో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో అఫ్గాన్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో పాక్ సీనియర్ల ఆటగాళ్లకు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది.

PAK vs AFG : పాక్‌ను మళ్లీ చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సిరీస్ కైవసం

పాక్‌తో జరిగిన తొలి టీ20ల్లో విజయం సాధించిన ఆప్ఘన్.. రెండో టీ20ల్లోనూ సత్తా చాటింది. ఏడు వికెట్ల తేడాతో ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది. దీంతో పాక్‌పై తొలి టీ20 సిరీస్‌ను ఆప్ఘన్ కైవసం చేసుకుంది.

27 Mar 2023

జడేజా

జడేజాకు బంఫరాఫర్ ప్రకటించిన బీసీసీఐ

2022-23 సంవత్సరానికి ఆటగాళ్ల వార్షిక ఒప్పందాన్ని బీసీసీఐ ప్రకటించింది. సంజు శాంసన్, కేఎస్ భరత్ ఆటగాళ్లకు తొలిసారిగా ఇందులో ప్రవేశం లభించింది.

ఈసారీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆట మారేనా..?

గతేడాది ఐపీఎల్ సీజన్‌లో ముంచై ఇండియన్స్ చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ముంబై 2008 తర్వాత పాిిియింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం గతేడాది మొదటిసారి. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ ఛాంపియన్ విజేతగా ముంబై ఇండియన్స్ తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది.

IPL 2023: గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి!

గతేడాది మొదటి సీజన్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఏ మాత్రం అంచనాలు లేకపోయినా ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గతేడాది ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ కప్‌ను సొంతం చేసుకుంది.

నిఖత్ జరీన్ గోల్డన్ పంచ్.. రెండోసారి టైటిల్ కైవసం

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్‌లతో దుమ్ములేపింది. ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి టైటిల్ ను ముద్దాడింది.

సూర్యకుమార్‌కు అవకాశమిస్తే.. ప్రపంచకప్‌లో దుమ్మురేపుతాడు : యూవీ

టీ20ల్లో ప్రత్యర్థి బౌలర్లకు టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చుక్కలు చూపిస్తాడు. అయితే వన్డేల్లో మాత్రం విఫలమవుతూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

శ్రీలంకను చిత్తును చేసిన న్యూజిలాండ్

శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు భారీ నమోదు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ షిప్లే 5 వికెట్లతో విజృంభించాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..?

తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆప్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. టీ20ల్లో పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్తాన్ విజయం సాధించడం ఇదే తొలిసారి. అయితే మ్యాచ్‌లో ఓడిపోయిన పాక్.. రెండో టీ20ల్లోనే ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

WPL: ఫైనల్‌లో ఢిల్లీ, ముంబై ఇండియన్స్.. గెలుపు ఎవరిదో..!

ఉమెన్స్ ప్రీమిమర్ లీగ్‌లో చివరి దశకు చేరుకుంది. తొలి కప్పును ఎలాగైనా కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాలని ఢిల్లీ, ముంబై జట్లు భావిస్తున్నాయి.

హెన్రీ షిఫ్లీ దెబ్బకు తోకముడిచిన శ్రీలంక

శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ షిప్లే విశ్వరూపం ప్రదర్శించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో శ్రీలంక బ్యాటర్లను దెబ్బ కొట్టాడు.

అరుదైన ఘనతను సాధించిన అఫ్గాన్ బౌలర్

టీ20ల్లో ఆప్ఘనిస్తాన్ బౌలర్ ముబీర్ ఉర్ రెహ్మాన్ అరుదైన ఘనతను సాధించారు. శుక్రవారం షార్జా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.

25 Mar 2023

శ్రీలంక

మొదటి వన్డేలో విజృంభించిన చమిక కరుణరత్నే

న్యూజిలాండ్ జరిగిన తొలి వన్డేలో రైట్ ఆర్మ్ పేసర్ చమిక కరణరత్నే బౌలింగ్‌లో విజృంభించాడు. కరుణరత్నే తొమ్మిది ఓవర్లలో 4/43తో చెలరేగాడు. దీంతో న్యూజిలాండ్ 49.3 ఓవర్లకు 274 పరుగులు చేసి ఆలౌటైంది.

ఫిన్ అలెన్ వన్డేలో ఐదో హాఫ్ సెంచరీ

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 49 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో వన్డే క్రికెట్‌లో ఐదు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు.

శ్రేయస్ అయ్యర్ గాయంపై టీమిండియా మాజీ ప్లేయర్ కామెంట్స్

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను సంబంధిత సమస్యతో భాదపడుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఆడలేకపోయిన అయ్యర్.. నాలుగో టెస్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో వెన్నుముక సమస్యకు సర్జరీ చేయించుకోవాలని శ్రేయాస్‌కు బీసీసీఐ సూచించింది.

25 Mar 2023

ఐపీఎల్

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రేసులో రసెల్..?

ఐపీఎల్ సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో పలు స్టార్ ఆటగాళ్లు గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. కోల్‌కత్తా రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి దూరమయ్యే అవకావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘాన్ విక్టరీ

పాకిస్థాన్ జట్టుకు ఆప్ఘనిస్తాన్ షాకిచ్చింది. శుక్రవారం షార్జా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ ఓడించింది. ఆఫ్ఘన్ బౌలింగ్ ధాటికి పాక్ బ్యాటర్లు విలవిలలాడారు. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 92 పరుగులను మాత్రమే చేశారు.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో

ప్రతిష్టాత్మక మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్లో భారత బాక్సర్ల హావా కొనసాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా అమ్మాయిలు అదరగొడుతున్నారు.

ఐపీఎల్‌ల్లో ఆడకపోయినా పంత్‌కు అరుదైన గౌరవం

ఢిల్లీ క్యాపిటల్స్ టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఇస్తున్న గౌరవం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న రిషబ్ పంత్ ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

విరాట్ కోహ్లీ న్యూ లుక్ అదుర్స్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. టీమిండియా రన్‌మెషీన్ కోహ్లీ కొత్త లుక్‌తో అభిమానులకు దర్శనమిచ్చారు.

24 Mar 2023

ఐపీఎల్

ఐపీఎల్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్‌షాక్

ఐపీఎల్-2023 సీజన్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కి మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, స్టార్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.

ఐపీఎల్ టైటిల్ పై గురిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారీ ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాలని చూస్తోంది.

స్టార్ ఆటగాళ్లతో పట్టిష్టంగా సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. గతేడాది చెత్త ప్రదర్శనతో ఎనిమిదో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. రెండు సీజన్లు వరుసగా విఫలం కావడంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సహా 12 మంది ఆటగాళ్లు ఫ్రాంఛేజీ వదలుకుంది.