క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ను ట్రోల్ చేసిన హిట్ మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా యువ క్రికెటర్లతో జోకులేస్తూ, నవ్వుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఆటగాళ్లతో అప్పుడప్పుడు స్టెప్పులేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు.

మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం

ఐపీఎల్ 16వ ఎడిషన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే గుజరాత్ జట్టుకు కీలక ప్లేయర్ దూరమయ్యాడు.

IPL 2023: గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్..!

టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ఈ ఏడాది కారు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో 2023 ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. అతను మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలంటే కనీసం ఓ 5-6 నెలలు సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు.

31 Mar 2023

శ్రీలంక

సిరీస్ ఓటమితో వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించని శ్రీలంక

న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో శ్రీలంక పరాజయం పాలైంది. హామిల్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో 2-0తో వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావించిన లంక ఆశలు అవిరయ్యాయి.

31 Mar 2023

ఐపీఎల్

IPL 2023: కేకేఆర్‌ను మట్టికరిపించడానికి పంజాబ్ సిద్ధం

ఐపీఎల్ సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.

తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ మార్పు

తొలి మ్యాచ్‌కు ముందే సన్ రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది. నెదర్లాండ్‌తో సౌతాఫ్రికా వన్డే సిరీస్ ఆడుతోంది. దీంతో మొదటి మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ ఐడెన్ మార్ర్కమ్ దూరమయ్యాడు. అతని స్థానంలో టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

IPL 2023 : టైటిల్‌ను గెలవడానికి లక్నో సూపర్ జెయింట్స్ రెడీ

గత సీజన్‌లో తొలిసారిగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లో అడుగుపెట్టింది. తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యంలో జట్టు టాప్ 4లో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించి టైటిల్‌ను పట్టేయాలని లక్నో చూస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు బలబలాలను తెలుసుకుందాం

IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్‌ను చూస్తే వణుకు పుట్టాల్సిందే..!

ఐపీఎల్ 2023లో బలమైన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ కనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఈ జట్టు.. ఐపీఎల్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.

IPL 2023 : అహ్మదాబాద్ పిచ్‌పై మొదటి విజయం ఎవరిదో..!

అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభ కానున్నాయి. నేడు ఈ వేదికపై డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి టైటిల్‌ను ముద్దాడేనా ..?

2016లో చివరిసారిగా ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. హేమాహేమీలు జట్టులో ఉన్నప్పటికీ బలమైన జట్లతో పోటీలో చతికిలా పడుతూ వస్తోంది.

సన్ రైజర్స్ ఆటగాళ్ల బలాబలాలపై ఓ లుక్కేయండి..!

గత ఐపీఎల్ సీజన్‌లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈసారి వేలంలో కొందరు కీలకమైన ఆటగాళ్లను తీసుకొని కాస్త పటిష్టంగా కనిసిప్తోంది.

30 Mar 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో ట్రోఫీలు సాధించిన జట్ల వివరాలు

2008 ధనాధన్ లీగ్ ఐపీఎల్ సీజన్ మొదలై.. అభిమానులు ఎంతగానో అకట్టుకుంది. ప్రస్తుతం విజయవంతంగా 16వ సీజన్ లోకి ఐపీఎల్ అడుగుపెడుతోంది. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ ఏ జట్లు ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ సాధించాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

30 Mar 2023

ఐపీఎల్

IPL 2023: పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్

మరికొద్ది గంటల్లో ధనాధన్ లీగ్ ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారీ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. టోర్ని ప్రారంభానికి ముందే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.

చైన్నై సూపర్ కింగ్స్ బలాలు, బలహీనతలు ఇవే

గతేడాది ఐపీఎల్‌లో అభిమానులను చైన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా నిరాశపరిచింది. ఐపీఎల్ చరిత్రలో చైన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ట్రోఫిని గెలుచుకొని, 5 సార్లు రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం ఐదో ట్రోఫీని నెగ్గి ముంబై రికార్డును సమం చేయాలని చైన్నై భావిస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు బిగ్ షాక్

ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే కొన్ని జట్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యారు. తాజాగా బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

BAN vs IRE: టీ20 సిరీస్‌ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేల సిరీస్‌ని 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్.. తాజాగా టీ20 సిరీస్ ని కూడా 2-0తో కైవసం చేసుకుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. రికార్డులు

ఐపీఎల్ గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అంచనాల్ని అందులేకపోయింది. ఈసారీ భారీ మార్పలతో ఐపీఎల్‌లో అందరి లెక్కలను తేల్చాలని సన్ రైజర్స్ గట్టి పట్టుదలతో ఉంది.

టెన్త్ క్లాస్ మార్క్ షీట్‌ను షేర్ చేసిన విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.

IPL2023: ధోనితో పోటిపడానికి సై అంటున్న హార్ధిక్ పాండ్యా

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2023 ప్రారంభ కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు విజేత అయిన చైన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

వరల్డ్ కప్ కోసం సర్జరీని వాయిదా వేసుకున్న శ్రేయాస్ అయ్యర్

టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడలేకపోయిన అయ్యర్.. నాలుగో టెస్టులో సభ్యుిడగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ కు దిగలేదు.

ఈసారీ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తగ్గేదేలే..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఈసారీ ఐపీఎల్ లో అందరికి లెక్కలను తేల్చనుంది.

ఐపీఎల్‌లో నన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన రికార్డులివే

మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ లీగ్ 16వ సీజన్ కోసం అంతా సిద్ధమైపోయింది.

ఐపీఎల్‌లో చెలరేగేందుకు సన్ రైజర్స్ ఆల్ రౌండర్లు రెడీ..!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్ లో ఫ్యాన్స్‌లో అలరించడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. కొన్నేళ్లుగా నిరాశపరుస్తున్న సన్ రైజర్స్ ఈ సారీ భారీ మార్పులతో బరిలోకి దిగనుంది.

టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న రీజా హెండ్రిక్స్

టీ20ల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ రీజా హెండ్రిక్స్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20ల్లో ఆ ఫీట్ ను అధిగమించాడు.

IPL: ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడానికి దీపక్ చాహర్ రెడీ

గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ స్పీడ్‌ స్టార్ దీపక్ చాహర్ ఐపీఎల్ 16వ సీజన్ లో ఆడనున్నాడు. సీఎస్కే తరుపున 2018 నుంచి అడుతున్న చాహర్ నాణ్యమైన బౌలింగ్‌తో అకట్టుకున్నాడు.

29 Mar 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో డాన్స్‌తో రచ్చచేయనున్న తమన్నా

మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా దక్షిణాదితో పాటు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనుంది

ఐపీఎల్‌లో ధోని మరో రెండు, మూడేళ్లు ఆడతాడు: రోహిత్ శర్మ

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది.

SA vs WI : సౌతాఫ్రికాపై వెస్టిండీస్ ఘన విజయం

జోహన్నెస్ బర్గ్‌లో జరిగిన 3వ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేశారు.

అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ హ్యాట్రిక్ గొల్స్‌తో రికార్డు

అర్జెంటీన్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ కురాకోతో జరిగిన ఫెండ్లీ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన మెస్సీ అర్జెంటీనా తరుపున వంద అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ముంబై ఫ్యాన్స్‌ కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ దూరం!

ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కి గట్టి షాక్ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.

ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డులను సృష్టించనున్నాడు. ప్రత్యర్థుల వికెట్లను తీయడంలో చాహెల్ ముందు ఉంటాడు. చాహల్ బౌలింగ్‌లో ఆడటానికి విధ్యంసకర బ్యాటర్లు కూడా వెనకడుగు వేస్తారు.

వరుస వైఫల్యాలతో తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయిన పీవీ.సింధు

భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తోంది. తాజాగా బిడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్‌లో 2016 తర్వాత తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయింది. గతవారం ముగిసిన స్విస్ ఓపెన్ లో సింధు మహిళల సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి ఫ్రిక్వార్టర్‌లో నిష్ర్కమించింది.

టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌లో విజృంభించనున్న భువనేశ్వర్ కుమార్

టీమిండియా విజయాల్లో ఒకప్పుడు భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన భువనేశ్వర్.. అనూహ్యంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు.

కొత్త కుర్రాళ్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాజిక్ చేస్తుందా..?

2013లో ఐపీఎల్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 2016లో టైటిల్ సొంతం చేసుకుంది. గత రెండేళ్లుగా కనీసం ఫ్లేఆఫ్ కూడా క్వాలిఫై కాకుండా అభిమానులను నిరాశపరిచింది.

సూపర్ ఫామ్ లో మార్ర్కమ్ మామా.. ఇక సన్‌రైజర్స్ కప్పు కొట్టినట్లే..!

దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఐడెన్ మార్ర్కమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల అతను సూఫర్ ఫామ్‌లో ఉండటంతో కచ్చితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.

ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఆడబోతున్నాడు. 2012 లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన జోరూట్.. 2023 ఐపీఎల్‌ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడనున్నాడు.

టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్

అప్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడిని పెంచగలడు.

క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత కష్టపడి పైకొచ్చాడో చాలామందికి తెలియదు. రోహిత్‌శర్మ నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి టీమిండియా కెప్టెన్‌గా ఎదిగాడు.

28 Mar 2023

శ్రీలంక

వరల్డ్ కప్ రేసు నుంచి తప్పుకున్న శ్రీలంక..!

న్యూజిలాండ్ గడ్డపై వన్డేలు, టీ20 సిరీస్ లు ఆడేందుకు అడుగుపెట్టిన శ్రీలంకకు గట్టి షాక్ తగిలింది. న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలని భావించిన శ్రీలంకకు న్యూజిలాండ్ చావు దెబ్బ కొట్టింది.

కోహ్లీ ఓ అహంభావి.. డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్

విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లో ఒకరని గట్టిగా చెప్పొచ్చు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్.. ఎంతో శ్రమించి తిరుగులేని ఆటగాడిగా రికార్డులను సృష్టించాడు.