క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్

టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యకంగా పరిచయం అక్కర్లేదు. క్రీజులోకి దిగితే బౌండరీ వర్షం కురింపించే సెహ్వాగ్.. బ్యాటింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.

క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్, సాక్షి చౌదరి

ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సోమవారం భారత బాక్సర్లు ఫర్వాలేదనిపించారు. సాక్షి చౌదరి (52 కేజీలు), లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లి సత్తా చాటారు.

WPL: 9ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఇది యుద్ధాల సమయం కాదు.. పాక్‌కు టీమిండియా రావాలి : షాహిద్ అఫ్రిది

ఆసియా కప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సూమారు ఆరు నెలలగా ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది.బీసీసీఐ కార్యదర్శి జైషా 2023 లో పాకిస్థాన్ లో జరగాల్సిన ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశం వెళ్లదని ఇఫ్పటికే స్పష్టం చేశారు.

లెజెండ్ లీగ్ 2023 విన్నర్‌గా ఆసియా లయన్స్

లెజెండ్ లీగ్ క్రికెట్ సమరంలో ఆసియా లయన్స్ విజేతగా అవతరించింది. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో వరల్డ్ జెయింట్స్‌ను ఆసియా లయన్స్ ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

20 Mar 2023

శ్రీలంక

టీమ్ ఓటమి కారణంగా కెప్టెన్సీకి రాజీనామా

న్యూజిలాండ్ చేతిలో 2-0తేడాతో సిరీస్ కోల్పోయిన తరుణంలో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 18) తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ ప్రకటించారు . ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు కరుణ్ రత్నే తెలియజేశాడు.

ATP ర్యాంకింగ్స్‌లో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ అగ్రస్థానం

ATP ర్యాంకింగ్స్‌లో కార్లోస్ అల్కరాజ్ మళ్లీ విజృంభించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

WPL : టాస్ నెగ్గిన గుజరాత్.. గెలిస్తే ఫ్లేఆఫ్స్ బెర్త్ ఖరారు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 17వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని కైవసం చేసుకోవాలని యూపీ వారియర్స్ భావిస్తోంది.

రాహుల్‌ను విమర్శించిన మాజీ ప్లేయర్స్‌కి మాసాలా కావాలి : గౌతమ్ గంభీర్

టీమిండియా ప్లేయర్ కేఎల్‌ రాహుల్‌కి టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌పై కొంతకాలంగా మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, రాహుల్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు.

రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు విఫలం.. సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్

రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేయడంతో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుది. న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ డబుల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇండియా జెండాపై షాఫిద్ అఫ్రిదీ ఆటోగ్రాఫ్

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది అభిమానుల మనుసుల మనషుల్ని గెలుచుకున్నాడు. 2018 లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు.

20 Mar 2023

శ్రీలంక

టెస్టుల్లో ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టులో శ్రీలంక ఆటగాడు ధనంజయ డి సిల్వా అద్భుత ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 185 బంతుల్లో 98 పరుగులు చేసి అరుదైన ఫీట్‌ను సాధించాడు.

20 Mar 2023

శ్రీలంక

శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగ రికార్డును అధిగమించిన దినేష్ చండిమాల్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో వెటరన్ శ్రీలంక బ్యాటర్ దినేష్ చండిమాల్ అర్ధ శతకంతో చెలరేగాడు. కేవలం 92 బంతుల్లో 62 పరుగులు చేశాడు.

ఇండియన్ వెల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఎలెనా రైబాకినా

ఎలైనా రైబాకినా 2023 సీజన్‌లో దుమ్ములేపింది. ఇండియన్ వెల్స్ టైటిళ్లను గెలుచుకొని సత్తా చాటింది. తన కెరీర్‌లో తొలి WTA 1000 టైటిల్‌ను, BNP పారిబాస్ ఓపెన్ ఇండియన్ వెల్స్‌తో ఆమె రికార్డు సృష్టించింది.

IPL: చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందే చైన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2023 మినీ వేలంలో అతన్ని సీఎస్కే కోటీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

బార్సిలోనా చేతిలో రియల్ మాడ్రిడ్ చిత్తు

సొంతగడ్డపై రియల్ మాడ్రిడ్‌ను బార్సిలోనా ఓడించింది. లా లిగా 2022-23 ఎల్ క్లాసిక్ పోరులో రియల్ మాడ్రిడ్‌ను 2-1 తేడాతో బార్సినాలో చిత్తు చేసింది. 9వ నిమిషంలో రొనాల్డ్ అరౌజో రియల్ మాడ్రిడ్‌కు అధిక్యాన్ని అందించారు.

ఇంటర్ మిలాన్‌ను ఓడించిన జువెంటస్

సెరీ A 2022-23 సీజన్‌లో 27వ మ్యాచ్‌లో ఇంటర్‌ మిలాన్‌పై జువెంటస్ 1-0 తేడాతో విజయం సాధించింది. 23వ నిమిషలో జువెంటస్ తరుపున ఫిలిప్ కోస్టిక్ గోల్ చేసి విజృంభించాడు.

సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్‌లో విజేతగా నిలిచిన సెర్గియో పెరెజ్

సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్‌లో ఆదివారం రెడ్‌బుల్ డ్రైవర్ సెర్గియో పెరెజ్, డిఫెండింగ్ ఫార్ములా 1 ఛాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్ ఈ సీజన్‌లో రెంోవ వరుస రేసు కోసం మరోసారి అధిపత్యం చెలాయించింది.

మార్ష్, హెడ్ సూపర్ ఇన్నింగ్స్, ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ

భారత్ తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకే ఆలౌటైంది.

PHL: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌కు హ్యాండ్‌బాల్ ఆసియా ఫెడరేషన్ మద్దతు

భారత్ వేదికగా నిర్వహిస్తున్న ప్రీమియర్ హ్యాండ్ బాల్ లీగ్ కు ఆసియా హ్యాండ్ బాల్ ఫెడరేషన్ మద్దతు తెలపడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

FA కప్ సెమీ-ఫైనల్స్ ఎప్పుడంటే..?

FA కప్ 2022-23 సెమీ-ఫైనల్స్ మార్చి 19 జరగనుంది. ఇప్పటికే ఎనిమిది ఇంగ్లీష్ ఫుట్ బాల్ జట్లు క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం ట్రోఫీ కోసం ఆ జట్లు పోటీ పడనున్నాయి.

నెదర్లాండ్స్ తరుపున ఆడనని స్పష్టం చేసిన డచ్ బాక్సర్

WWCH 2023లో నెదర్లాండ్స్ తరుపున ఆడడం లేదని డచ్ బాక్సర్ మేగాన్ డి క్లెర్ స్పష్టం చేసింది. అయితే తాను ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

WPL: ముంబై ఇండియన్స్‌ జోరుకు యూపీ వారియర్స్ కు బ్రేకులు వేసేనా..?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది.

IPL : ఆర్బీబీలోకి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఎంట్రీ.. ఖుషీగా ఆర్సీబీ ఫ్యాన్స్

గాయం కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు ఇంగ్లాండ్ స్టార్ ఆలౌరౌండర్ విల్ జాక్స్ దూరమైన విషయం తెలిసిందే.

రెండో వన్డేలో పరువు కోసం ఆసీస్.. సిరీస్ కోసం భారత్

ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో వన్డేలో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.

NZ vs SL: డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ మామా, హెన్రీ నికోల్స్

సొంతగడ్డపై శ్రీలంకపై జరుగుతున్న రెండు టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్ అదిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి టెస్టులో గెలిచిన కివీస్.. రెండో టెస్టుల్లోనూ తన జోరును కొనసాగిస్తోంది.

టెస్టుల్లో డబుల్ సెంచరీని బాదేసిన హెన్రీ నికోల్స్

వెల్లింగ్టన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాళ్లు విజృంభించారు. ఫలితంగా కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది.

సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. ఆరు గంటల్లో 29 వీడియోలు అప్‌లోడ్..?

సన్ రైజర్స్ హైదారాబాద్ టీంకి సైబర్ నేరగాళ్లు గట్టి షాక్‌నిచ్చారు. ఏకంగా సన్ రైజర్స్ యూట్యూబ్ ఛానల్ కి హ్యాక్ చేసి ఝలక్ ఇచ్చారు. ఆరు గంటల్లో ఏకంగా 29 వీడియోలను అప్‌లోడ్ చేయడంలో అభిమానులు షాక్ కు గురయ్యాడు.

వామ్మో.. రన్నింగ్‌లో బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తిన కోహ్లీ

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలో చురుగ్గా ఫీల్డింగ్ చూస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీని పలువురు క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుంటుంటారు.

డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ విలియమ్సన్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అతిథ్య న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. 123 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 580 పరుగులు చేసింది . ఈ స్కోర్ వద్ద న్యూజిలాండ్ డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.

భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్ అతిథ్యం

ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ ఆతిథ్యమివ్వనుంది. ఆగస్టు 18 నుంచి 23 వరకు జరిగే ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

తొలి వన్డేలో టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్

టీ20, టెస్టులో వరుసగా విఫలమవుతూ టీమ్‌లో చోటు కోల్పోయిన టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ వన్డేల్లో సత్తా చాటాడు. 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాని అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకొని.. కేఎల్ రాహుల్ ఘన విజయాన్ని అందించాడు. 91 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తా చాటాడు.

పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ సిరాజ్

వన్డేలో టీమిండియా తరుపున హైదరాబాద్ స్టార్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలను చూపిస్తున్నాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్లను రాబడుతున్నాడు.

నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 189 పరుగులు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. మొదటగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు.

వన్డే మ్యాచ్‌లు చాలా డల్‌గా ఉన్నాయి : సచిన్ టెండూల్కర్

గడుస్తున్నా కాలం కొద్దీ క్రికెట్‌లో చాలా మార్పులొస్తున్నాయి. ఐదు రోజుల టెస్ట్ ఫార్మాట్ నుంచి 60 ఓవర్ల వన్డే ఫార్మాట్ రాగా.. దానిని 50 ఓవర్లకు కుదించారు. 2000 సంవత్సరంలో ధనాధన్ క్రికెట్ ను ప్రవేశపెట్టడంతో సక్సస్ అయింది.

టీ20ల్లో సరికొత్త మైలురాయిని అందుకున్న బాబర్ ఆజం

టీ20ల్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఎలిమినేటర్ 1లో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆ ఫీట్ ను సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 9వేల పరుగుల చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా సత్యనాదేళ్ల

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఫ్రాంచేజీలు విశ్వవాప్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించిన ఫ్రాంచేజీలు తాజాగా ఆమెరికాపై దృష్టి పెట్టాయి.

క్రికెట్ గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అన్ని ఫార్మట్లకు కొన్నేళ్లుగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సెక్సెటింగ్ కుంభకోణం కారణంగా నవంబర్ 21లో అతను టెస్టు కెప్టెన్‌గా అప్పట్లో వైదొలిగాడు. తాజాగా అన్ని ఫార్మట్లకు రిటైర్మెట్ ప్రకటిస్తున్నట్లు టిమ్ పైన్ ప్రకటించాడు.

విరాట్ కోహ్లీని లెగ్ స్పిన్నర్ అడమ్ జంపా ఔట్ చేస్తాడా..?

ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానముంది. కోహ్లీ దేశం సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో మైలురాళ్లను ఒకటోకటిగా బద్దలుకొడుతూ రికార్డులను సృష్టించాడు. ప్రస్తుతం నేటి నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్‌లో తలపడనుంది.

స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తొలి 'పంచ్' అదుర్స్

ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ లో తెలంగాణ స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. 50కేజీల విభాగంలో అజర్ బైజాన్‌కు చెందిన ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసింది.