అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

18 Aug 2023

అమెరికా

హవాయి కార్పిచ్చు : మౌయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి రాజీనామా

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రకృతి విపత్తు సంభవించింది. ఈ మేరకు హవాయి ద్వీప సమూహం మంటల్లో కాలిబూడిదైంది. ఇప్పటికే రూ.50 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.

Texas: ఆకాశంలో ఉండగా ఇంజిన్‌లో సమస్య .. టేకాఫ్ అయిన చోటే అత్యవసరంగా లాండింగ్ 

ఆకాశంలో ఉండగా ఓ విమానానికి అత్యవసర పరిస్థితి ఎదురైంది.దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

18 Aug 2023

అమెరికా

అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థి రేసులో భార‌తీయుడు.. వివేక్ రామ‌స్వామిపై ఎల‌న్ మ‌స్క్ ప్ర‌శంస‌లు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నిక‌లు అంటే ప్రపంచదేశాల్లో చాలా ఆసక్తి నెలకొంటుంది.

పాకిస్థాన్‌: తాత్కాలిక ప్రధాని అన్వర్‌ ఉల్‌ హక్‌ కకర్‌ మంత్రివర్గంలో ఉగ్రవాది భార్య

పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేశాక తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమైన సంగతి తెలిసిందే.

కొలంబియా రాజధానిలో భారీ భూకంపం.. తీవ్ర భయాందోళనలో ప్రజలు 

కొలంబియా రాజధాని బొగోటాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

17 Aug 2023

అమెరికా

అమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి!

అగ్రరాజ్యం అమెరికాలో కొత్త రకం బ్యాక్టీరియా ప్రజలను హడలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని మాంసాన్ని తినేస్తున్న బ్యాక్టీరియాతో ఇప్పటికే న్యూయార్క్, కనెక్టికట్‌లో ముగ్గురు మృతి చెందారు.

17 Aug 2023

అమెరికా

విమానంలో విషాదం.. ఫ్లైట్ గాల్లో ఉండగా బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌

లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌ లో విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు ఫ్లైట్ గాల్లో ఉండగానే పైలెట్ హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఎగురుతున్న విమానంలో పైలెట్ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

అరేబియా సముద్రంలో రాత్రి చైనీయుడికి గుండెపోటు.. సాహసోపేతంగా రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

అరేబియా సముద్రంలో భారత కోస్ట్‌ గార్డ్‌ సాహసోపేతమైన చర్యను నిర్వహించింది. ఈ మేరకు నడిసముద్రంలో గుండెపోటుకు గురైన ఓ చైనీయుడ్ని రక్షించింది.

17 Aug 2023

అమెరికా

డొనాల్డ్ ట్రంప్ కేసులో సంచలనం.. జడ్జీని చంపేస్తానన్న టెక్సాస్ మహిళ అరెస్ట్

అమెరికా మాజీ ప్రెసిడెంట్ క్రిమినల్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. వాషింగ్టన్‌లో డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన క్రిమినల్ కేసును పర్యవేక్షిస్తున్న ఫెడరల్ న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి.

Pakistan: పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు; 4చర్చిలు ధ్వంసం 

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. నాలుగు చర్చిలు, వాటి చుట్టూ ఉన్న కొన్ని భవనాలు ధ్వంసం చేసి, అక్కడ అందినకాడికి దోచుకెళ్లారు.

జాతివివక్ష వల్లే అమెరికా సైనికుడు మా వద్దకు వచ్చాడు: ఉత్తర కొరియా 

కటిక దరిద్రం, కఠిన ఆంక్షలు నేపథ్యంలో నిత్యం ఉత్తర కొరియా నుంచి వందలాది మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తుంటారు. అయితే తాజాగా అందుకు విరుద్ధమైన, అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది.

16 Aug 2023

అమెరికా

అమెరికాలో ఘోరం.. భార్య సవాల్ చేసిందని మద్యం మత్తులో తుపాకీతో కాల్చిన జడ్జి

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోరం జరిగింది.తాగిన మత్తులో ఓ న్యాయమూర్తి తన భార్యపైనే కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Imran Khan: పాపం ఇమ్రాన్ ఖాన్.. బ్యాగ్ పెట్టడానికి కూడా స్థలం లేని ఇరుకు సెల్‌లో జైలు శిక్ష 

తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ మూడేళ్ల జైలు శిక్ష పడి అటాక్ జైల్లో ఉన్నారు.

కోతులే కదా అనుకుంది చిరుత.. పులినే దాడులతో గడగడలాడించిన కోతుల గుంపు

దక్షిణాఫ్రికాలోని ఓ మారుమాల ప్రాంతంలో అనూహ్యం చోటు చేసుకుంది. కోతుల గుంపు వద్దకు వచ్చిన ఓ చిరుతపై అవి భీకరంగా దాడి చేశాయి. సుమారు 50 బబూన్లు నడిరోడ్డుపై తిష్టవేసి హల్‌చల్ సృష్టించాయి.

నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి 

సెంట్రల్ నైజీరియాలో ఆదివారం బందిపోట్లు జరిపిన ఆకస్మిక దాడిలో నైజీరియా భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

15 Aug 2023

అమెరికా

డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఈనెల 18లోగా లోంగిపోవాలని కోర్టు ఆదేశం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కోసం రంగం సిద్ధమైంది. ఈ మేరకు ట్రంప్‌తో పాటు 18 మంది సహ-నిందితులకు జార్జియా న్యాయమూర్తి ఫణి విల్లీస్ అరెస్ట్ వారెంట్లను జారీ చేశారు.

మిచిగాన్ ఎయిర్ షోలో కుప్పకూలిన మిగ్-23 విమానం

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది.

14 Aug 2023

చైనా

చైనా: బురద జలాలు ముంచెత్తి 21 మంది మృతి.. ఆరుగురు గల్లంతు

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని జియాన్ ప్రాంతంలో భారీవర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం వరకు 21 మంది మరణించగా మరో ఆరుగురు అదృశ్యమైనట్లు గ్లోబల్ టైమ్స్ నివేదించింది.

13 Aug 2023

అమెరికా

న్యూయార్క్: విమానం ఎన్ఆర్ఐ వైద్యుడి అసభ్యకర చేష్టలు.. బాలిక ఫిర్యాదుతో అరెస్ట్

రోజురోజుకూ విమాన ప్రయాణం అంటేనే నరకంలా తయారువుతోంది. గత కొంతకాలంగా విమానాల్లోనూ లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. విమానాల్లో ప్రయాణాలు చేసేది విద్యావంతమైన సమాజమే అయినప్పటికీ మహిళలపై ఆకృత్యాలు ఆగట్లేదు.

13 Aug 2023

అమెరికా

100ఏళ్లలో చూడని విపత్తు.. ఆహుతవుతున్న లహైనా నగరం: 89కు చేరిన మృతుల సంఖ్య 

అమెరికాలోని హవాయిలో గత మంగళవారం నుంచి కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. మంటలు భారీ ఎత్తున వ్యాప్తిస్తున్నాయి.

13 Aug 2023

కెనడా

కెనడాలో మరో హిందూ దైవాలయంపై ఖలిస్థానీల దాడి

కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల శక్తులు మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకం 

పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత తాత్కాలిక ప్రధాన మంత్రిగా బెలూచిస్తాన్ అవామీ పార్టీ‌కి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమయ్యారు.

12 Aug 2023

అమెరికా

అమెరికా: లహైనా నగరాన్నికమ్మేసిన కార్చిచ్చు: 67కు చేరిన మృతుల సంఖ్య 

అమెరికాలోని హవాయి దీవులకు సుందర దీవులని పేరు. ఆ సుందర దీవుల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది. హావాయి దీవుల్లోని మౌయి దీవిలో కార్చిచ్చు కారణంగా ప్రజలకు ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి.

11 Aug 2023

చైనా

కుదేలైన చైనా దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. 57 వేల కోట్ల భారీ నష్టం

ప్రపంచంలోనే బలమైన దేశాల్లో ఒకటిగా నిలిచిన చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ మేరకు డ్రాగన్ దేశంలో స్థిరాస్తి రంగం కుదేలైంది.

11 Aug 2023

చైనా

చైనాను ముంచెత్తుతున్న భారీ వరదలు.. 29 మంది మరణం, 16 మంది మిస్సింగ్

చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల ధాటికి చైనాలోని హెబెయ్‌ ప్రావిన్స్‌లో భారీ వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరిగింది.

అగ్రదేశాల్లో మరోసారి కరోనా కలకలం.. వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

అంతర్జాతీయంగా కొవిడ్ వ్యాప్తి మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎరిస్ కరోనా వేరియంట్ మరోసారి విజృంభిస్తోంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

10 Aug 2023

అమెరికా

అమెరికా హవాయి ద్వీపంలో కారుచిచ్చు .. సముద్రంలోకి దూకేస్తున్న ప్రజలు, 36 మంది మృత్యువాత

అగ్రరాజ్యం అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు దావాగ్నిలా వ్యాప్తి చెందింది. అడవుల్లో చెలరేగిన అగ్ని జనావాసాల్లోకి వ్యాపిస్తున్నాయి. గాలులు వేగంగా వీస్తుండటంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.

ఇండోనేషియాలో 5.2, ఫిలిప్పీన్స్‌లో 4.7 తీవ్రతతో భూకంపం

ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 7.30గంటలకు ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 5.2 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ధ్రువీకరించింది.

ఉత్తర కొరియా టాప్ జనరల్ తొలగింపు.. యుద్ధానికి సిద్ధం కావాలని కిమ్ జోంగ్ పిలుపు

ఉత్తర కొరియా టాప్ జనరల్‌ను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ తొలగించారు.

10 Aug 2023

అమెరికా

అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ కలకలం.. కొవిడ్ కేసుల్లో ఈజీ5ది 17 శాతం 

అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ మళ్లీ కలకలం రేపుతోంది. మొత్తం కేసుల్లో ఈజీ 5 వేరియంట్ 17 శాతం కారణమని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ (USCDC) ప్రకటించింది.

10 Aug 2023

అమెరికా

చైనాపై అమెరికా ఆంక్షలు.. సాంకేతిక పెట్టుబడులపై నిషేధాజ్ఞలు

అగ్రరాజ్యం అమెరికా చైనాపై కన్నెర్ర చేస్తోంది. ఈ మేరకు డ్రాగన్ దేశంపై తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది.

పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు.. ప్రధాని షరీఫ్ సూచనతో అధ్యక్షుడు అరీఫ్ నిర్ణయం

పాకిస్తాన్ 15వ నేషనల్ అసెంబ్లీ రద్దు అయ్యింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సూచనల మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ సభను రద్దు చేశారు. 3 నెలల్లో పాక్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఈక్వెడార్ లో ఘోరం.. ప్రెసిడెంట్ అభ్యర్థి ఫెర్నాండో దారుణ హత్య 

ఈక్వెడార్ దేశంలో ఘోరం చోటు చేసుకుంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ సాక్షాత్తు దేశ అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థి దారుణ హత్యకు గురవడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

పాక్ ప్రధాని మరో కీలక నిర్ణయం.. తోషాఖానా బహుమతులను వేలం వేస్తున్నట్లు ప్రకటన 

పాక్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ మరో కీలక నిర్ణయం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని తీర్మానించుకున్నారు.

09 Aug 2023

ఇటలీ

ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి 

ఇటలీలోని లాంపెడుసా ద్వీపం సమీపంలోని సెంట్రల్ మధ్యదరా సముద్రంలో గత వారం ఓడ ప్రమాదంలో 41మంది వలసదారులు మరణించారని అన్సా వార్తా సంస్థ బుధవారం నివేదించింది.

పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఇవాళ రాజీనామా చేయనున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

పాకిస్థాన్‌లో 2023 ఆఖర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అదనపు సమయాన్ని పొందేందుకు పాక్ ప్రభుత్వం యోచిస్తోంది.

అమెరికా అధ్యక్షుడినైతే వారందరినీ దేశం నుంచి బహిష్కరిస్తా: ట్రంప్ సంచలన ప్రకటన 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2024అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారీ మార్పులకు శ్రీకారం చుడుతానని చెప్పారు.

08 Aug 2023

జర్మనీ

జర్మనీ: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు: అధికారులు అలర్ట్ 

జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌లోని అధికారులు రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును గుర్తించారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు కుట్ర; మహిళ అరెస్టు 

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ హత్యకు రష్యా కుట్ర చేసినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్(ఎస్‌బీయూ) వర్గాలు వెల్లడించాయి.

పాకిస్థాన్‌: బలూచిస్థాన్‌‌లో బాంబు పేలుడు; ఏడుగురు మృతి

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.